‘12వ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘12వ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి’

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్‌సీని ప్రకటించాలని, ఐఆర్‌ 30 శాతం అమలు చేయాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దనరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ కార్యాలయ ఆవరణలో సంఘం అధ్యక్షులు సురవరపు సిమ్మినాయుడు ఆధ్వ ర్యంలో ఆదివారం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బొడ్డేపల్లి జనార్ధనరావును ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా బొడ్డేపల్లి మోహనరావు, కోశాధికారిగా హెచ్‌వీ సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పేడాడ భానుజీరావు, పేడాడ వైకుంఠరావు, నైనపాత్రుని చంద్రశేఖరరావు, బెండి సూర్యనారాయణ ,బొడ్డేపల్లి వెంకటరమణ, బెండి గోవిందరావు, కూర్మాన షణ్ముఖరావు, పొన్నాడ వరాహ నరసింహులను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా దన్నాన శ్రీరామమూర్తి, కర్నేని జనార్ధనరావు, కాగితాపల్లి సంజీవరావు, బెండి నారాయణరావు, నాయనపాత్రుని వాసుదేవరావు, బుడుమూరు సత్యనారాయణ, పేడాడ అప్పారావు, కేవీ రాజారావును ఎన్నుకోగా కార్యవర్గ సభ్యులుగా బెండి చిట్టయ్య, తాండ్ర కృష్ణకుమార్‌, తమ్మినేని సూర్యనారాయణ, పప్పల వెంకటేశ్వరరావు, నూక సూర్యనారాయణ, అంపోలు సూర్యారావు, పూజా రి ధనుంజయరావు, బలివాడ వెంకటరమణ ,బి.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి, డాక్టర్‌ అన్నెపు ,విష్ణుమూర్తి ఎస్‌.వి. రమేష్‌ లను ఎన్నుకున్నారు. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా లోలుగు విశ్వేశ్వరరావుతో పాటు గురుగుబెల్లి కృష్ణమూర్తి, సంబాన అమ్మారావు లను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement