కవిటి: మండలంలోని బొరివంకలో కళింగ సీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వానిత నాటిక కళా పరిషత్ పోటీలు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణ మూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాటిక పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పేరొందిన నాటక సమాజాలకు చెందిన ప్రదర్శన బృందాలు ఈ పోటీల్లో పాల్గోనున్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించనున్న పోటీల్లో ఏడు ప్రదర్శనలతో పాటు ఒక ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నాటక సమాజాలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


