మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల ఆందోళన

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కొత్త కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారని, వాటిని తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు జరిమానా విధించడం దారుణమైన విషయమని, దీన్ని తక్షణం విరమించుకునేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడాలని వారు కోరా రు. ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో మధ్యా హ్నం 12 గంటల తర్వాత మూల్యాంకనం ప్రారంభమైంది. తొలి రోజున సుమారు 15000 జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశా రు. ఎలాంటి పొరపాటు వచ్చినా ఉపాధ్యాయులపై జరిమానాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునే హెచ్చరికలు ఉండడంతో అంతా జాగ్రత్త పడ్డారు. చాలామంది ఉపాధ్యాయులు నల్ల బ్యా డ్జీలతోనే మూల్యాంకన కేంద్రంలో కనిపించారు. డీఈవో రవిబాబు పరిశీలించారు.

మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement