breaking news
Amaravati
-
పథకం ప్రకారమే బీ‘పచ్చ’ కాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడంలేదు. దాడిని అడ్డుకోకపోగా.. నిందితులను గుర్తించి కనీసం కేసు నమోదు చేయలేదు. పాలకవర్గ సేవకే భక్షక భటవర్గం పరిమితమైదన్న విమర్శలను నిజం చేశారు. గుడివాడలో జరగాల్సిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు యత్నించారు. వివాదాస్పద పోస్టర్లతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను రాకుండా అడ్డుకొనే యత్నం చేశారు. సభకు వచ్చే మార్గాల్లో ముందుగానే టీడీపీ కిరాయి గూండాలు, గంజాయి, మద్యం తాగి కాపు కాసి వీరంగం సృష్టించారు. ఇందులో భాగంగానే సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న బీసీ మహిళ, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై గుడివాడ నాగవరప్పాడు వద్ద దాడికి తెగబడ్డారు.కారు అద్దాలు పగలగొట్టి, మారణాయుధాలతో హతమార్చేందుకు యత్నించారు. రాయలేని భాషలో జిల్లా ప్రథమ మహిళపై బండబూతులతో రెచి్చపోయారు. హారిక దంపతులు గంటన్నరకుపైగా కారులోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. టీడీపీ నాయకులు, కిరాయి గూండాలు గంజాయి, మద్యం సేవించి వచ్చి దాడికి కుట్ర పన్నినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారే తప్ప, కనీసం పచ్చ గూండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మాత్రం అటువైపు రాకుండా భారీ బందోబస్తుతో నిలువరించారు. గుడివాడలో దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. దీనిని బట్టి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కనుసన్నల్లో దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తొలుత పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని, లేకపోతే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు తీసుకోకపోతే ఎలాగని జెడ్పీ చైర్పర్సన్ దంపతులు నిలదీయటంతో చివరకు పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. భగ్గుమన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గుడివాడలో ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మహిళా నేతలు భగ్గుమన్నారు. జెడ్పీటీసీలు సభ్యులు, ఎంపీపీలు పెడన మండలం కోడూరులోని ఉప్పాల హారిక స్వగృహంలో ఆమెను కలిసి దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందచేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక స్వగృహానికి పార్టీ నాయకులూ వెళ్లి ధైర్యం చెప్పారు. శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, గుడివాడ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చి ఉప్పాల హారికకు సంఘిభావం తెలిపి పరామర్శించి ధైర్యం చెప్పారు. తరలివచ్చిన మహిళా నేతలు ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ హోం మంత్రి తానేటి వనిత, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్షి్మ, చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు శీలం భారతి, విజయవాడ డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గతోపాటు పలు మహిళా సంఘాల నేతలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆమెను పరామర్శించారు. నిందితులపై చర్యలేవీ? దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటే పోలీసులు ఏ విధంగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే దాడి చేసిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు అధికార పార్టీ నాయకులు స్టేటస్‌లుగా పెట్టుకుని ఆనంద పడుతున్నా కనీసం పోలీసులు వాటి గురించి ఆరా తీయకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, గూండాలు, రౌడీలను తప్పించేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నట్టు సమాచారం. అమాయకులను ఇందులో ఇరికించే యత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో తెలుగు యువత నేత గోవాడ శివ ఉన్నట్టు వీడియోలు ఉన్నా.. పోలీసులు చర్యలకు వెనుకాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు∙జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన జెడ్పీటీసీ సభ్యులు ∙జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా హారికపై హత్యాయత్నాకి పాల్పడిన టీడీపీ, జనసేన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు ఆమె భర్త రాముపై దాడికి పాల్పడ్డ నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ఎస్పీ గంగాధరరావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి నేతలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. జరిగిన దాడిపై ఉప్పాల రాము గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాఇ కళ్యాణి, కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జీవోలతో పనేంటి.. వెబ్ ఆప్షన్లు ఇచ్చేయండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రవేశాల వేళ గందరగోళాన్ని సృష్టిస్తోంది. డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ విద్య వరకు ప్రవేశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు డిగ్రీ విద్యా విధానంపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కార్, 2025–26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో కోర్సుల ఫీజులు, సీట్లకు అనుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంలో దోబూచులాడింది. వాస్తవానికి ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు నిర్వహించే క్రమంలో కౌన్సెలింగ్‌కు ముందే కళాశాలల ఫీజులు, వాటి సీట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. తద్వారా ప్రజా క్షేత్రంలో సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి వీలుంటుంది. కానీ, కూటమి ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు దిగజారినట్టే పరిపాలనా ప్రమాణాలను కూడా గాలికొదిలేసింది. ఏపీ ఈఏసీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్‌లో భాగంగా 13వ తేదీ (ఆదివారం) నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు వీలుకల్పించింది. అయితే ఆదివారం ఉదయం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించడంపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్యా మండలి ఆలోచనలో పడింది. ఉదయం నుంచి మల్లగుల్లాలు పడిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారిక ఉత్తర్వులు వారికి చేరకుండానే వెబ్ ఆప్షన్లను మధ్యాహ్నం నుంచి ప్రారంభించింది. ఇక్కడ అధికారిక ఉత్తర్వులు చేరే వరకు వేచి చూడాల్సి ఉండగా వెబ్ ఆప్షన్లు వాయిదా వేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భావించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తీరిగ్గా సాయంత్రం అప్లోడ్కౌన్సెలింగ్కు ముందు రావాల్సిన ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, సీట్ల వివరాలు వెబ్ ఆప్షన్లు ప్రారంభమైన తరువాత, అంటే ఆదివారం సాయంత్రం 8 గంటల అనంతరం ప్రభుత్వ జీవోఐఆర్ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. ఇందులో 212 ప్రైవేటు అన్ ఎయిడెడ్ సాంకేతిక విద్యా సంస్థలకు, 24 ప్రభుత్వ వర్సిటీ ఇంజనీరింగ్, వాటి అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. వీటిల్లో ప్రైవేటు కాలేజీల్లో సగటున ఫీజు రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.1.05 లక్షలుగా నిర్ణయించారు. వెబ్సైట్లో ఫీజులు.. సీట్ల వివరాలుప్రభుత్వ అనుమతులతో ఉత్తర్వులు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ వెబ్సైట్లో కళాశాలల వారీగా ఫీజుల వివరాలు, సీట్ల సంఖ్యను పొందుపరుస్తారు. ఇక్కడ ఎక్కడా అధికారిక ఉత్తర్వులు బయట పెట్టకుండానే వెబ్సైట్లో ఫీజులు, సీట్ల సమాచారాన్ని బహిరంగపరిచారు. కళాశాలలకు ఫీజులు నిర్ణయించే అధికారం ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు మాత్రమే ఉంటుంది. కమిషన్ నిర్ణయించిన మేరకు ఫీజులు ఉంచారా? ముందుగా ఫీజుల వివరాలు అప్లోడ్ చేసి తీరిగ్గా కమిషన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఫీజు వివరాలకు.. ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని ఫీజులకు వ్యత్యాసం ఉంది. అంటే ముందుగా ఫీజు వివరాలు, సీట్ల అనుమతులు తెలపకుండానే కౌన్సెలింగ్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది.ఉదాహరణకు నరసరావుపేటలోని ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వార్షిక ఫీజు రూ.43 వేలుగా కౌన్సెలింగ్ వెబ్సైట్లో ఉంటే.. జీవోలో మాత్రం రూ.40 వేలుగా చూపించారు. ఇలా చాలా కళాశాలల ఫీజులు వెబ్సైట్లో అధికంగాను.. జీవోల్లో తక్కువగా కనిపించాయి. ప్రభుత్వ విభాగాల్లో ఇలా పరస్పర విరుద్ధంగా ఫీజులు ఉండటం విద్యార్థులను కలవరపెడుతోంది. వర్సిటీలను నడపలేక ఫీజుల పెంపుచంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చే ప్రాధాన్యం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఇవ్వట్లేదనేది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వ యూనివర్సిటీలను ఆర్థికంగా, అకడమిక్స్‌గా బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కోర్సుల ఫీజులను పెంచింది. రూ.18 వేలు–రూ.30 వేలుగా ఉండే ఫీజులను రూ.45,000గా ప్రభుత్వ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులను ఖరారు చేసింది. వీటితో పాటు సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ కింద రూ.లక్షల ఫీజులను పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయకుండా సీట్లు కేటాయిస్తోంది. ఈ ఏడాది కొత్తగా జేఎన్టీయూ కాకినాడలో సీఎస్ఎం (ఏఐ–ఎంఎల్)కు రూ.75 వేలు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో సీఎస్ఈకి రూ.1.62లక్షలు, జేఎన్టీయూ అనంతపురంలో ఈఎస్‌ఈకి రూ.1.50 లక్షలు, ఈసీఈకి రూ.1.25 లక్షలు ఫీజులు విధించింది. ఆయా వర్సిటీల్లో ఈ ఏడాది నుంచి సెల్ఫ్ సపోర్టు సీట్లను కన్వీనర్ కోటా (ఫీజు రీయింబర్స్మెంట్) ద్వారా భర్తీ చేయనుంది.డీమ్డ్ వర్సిటీకి ఫీజు ఖరారా?విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల గతేడాది యూజీసీ నుంచి ‘డీమ్డ్’ విశ్వవిద్యాలయం హోదా పొందింది. ఆ వర్సిటీ సొంత కరిక్యులమ్, సొంత ఫీజులు, సొంత అజెండాపై నిర్వహణ ఉంటుంది. అయితే, తాజాగా ఈ కళాశాలకు కూడా 2025–26కి రూ.1.05లక్షల ఫీజును నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. అసలు ప్రభుత్వ చట్ట పరిధిలోకి రాని ఓ డీమ్డ్ వర్సిటీకి ఫీజు ఎలా నిర్ణయిస్తారనేది ఇక్కడి ప్రశ్న. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య పనితీరుకు ఇది అద్దం పడుతోంది. -
పైన స్టోన్ డస్ట్.. కింద ఇసుక
నగరి: సినీఫక్కీలో స్టోన్ డస్ట్ ముసుగులో ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఆదివారం వేకువజామున నగరి పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. నగరి సీఐ విక్రమ్, తహశీల్దార్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కొంతకాలంగా స్టోన్ డస్ట్ ముసుగులో రాజంపేట నుంచి నగరి మీదుగా అక్రమంగా ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. ఆదివారం వేకువజామున నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డులో తమిళనాడు సరిహద్దు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. డస్ట్ స్టోన్ పేరుతో వెళుతున్న ఏడు టిప్పర్లను ఆపి తనిఖీలు చేశారు. టిప్పర్లలో 90 శాతం ఇసుక నింపి, దానిపై పది శాతం స్టోన్ డస్ట్ వేసి పట్టాలు కప్పినట్లు గుర్తించారు. ఏడు టిప్పర్లను సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్లు వి.జయకృష్ణ(38), ఎస్.పాండియన్(42), ఎ.అజిత్‌కుమార్(29), ఎం.ప్రవీణ్‌కుమార్(28), ఏఎస్ శ్రీజిత్(26), ఎన్.అశోక్(31), నగరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామానికి చెందిన వి.దేవరాజులు(62)ను అరెస్టు చేశారు. చెన్నై నుంచి వచ్చి స్టోన్ క్వారీ లీజుకు తీసుకుని అరెస్ట్ చేసిన డ్రైవర్లను పోలీసులు విచారించగా, చెన్నై నుంచి భరత్ అనే వ్యక్తి నగరికి వచ్చి గుండ్రాజుకుప్పం వద్ద వేల్ అండ్ కో స్టోన్ క్వారీని లీజుకు తీసుకున్నాడని తెలిపారు. అతను తమిళనాడులోని కొంతమంది లారీ యజమానులను సిండికేట్ చేసి ఈ అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నాడని వివరించారు. తమిళనాడు నుంచి వచి్చన లారీలు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీచ్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని నగరిలోని వేల్ అండ్ కో క్రషర్ వద్దకు వస్తాయని చెప్పారు. అక్కడ ఇసుకపై కొద్దిగా స్టోన్ డస్ట్ నింపి పరదాలు కట్టి తమిళనాడుకు పంపిస్తున్నారని తెలిపారు. స్టోన్ డస్ట్ తరలింపునకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసిన ఏడుగురు డ్రైవర్లను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. క్రషర్ నిర్వాహకుడు భరత్‌ను, తెరవెనుక సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అధికార పార్టీ నేతల అండతోనే? స్థానిక అధికార పార్టీ నేతల అండతోనే ఈ ఇసుక దందా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ లేకుండా రాజంపేట నుంచి నగరికి, అక్కడి నుంచి తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలించడం, భరత్ అనే వ్యక్తి చెన్నై నుంచి నగరి వచ్చి క్రషర్ లీజుకు తీసుకుని దర్జాగా ఈ దందా సాగించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
భూ కేటాయింపుల్లో ప్రభుత్వ ‘ఇష్టా’రీతి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కేటాయింపుల్లో ప్రభుత్వ పెద్దల దమననీతికి మరో నిదర్శనమిది. జాతీయ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించిన సర్కారు.. అస్మదీయులకు చెందిన ప్రయివేటు సంస్థలకు ఎకరం రూ.10 లక్షల చొప్పున ఇచ్చేసింది. రాజధాని ప్రాంతంలో మంత్రుల బృందం సిపార్సుల మేరకు కొత్తగా ఏడు సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ.. ఆరు సంస్థలకు గతంలో చేసిన భూ కేటాయింపులను సవరిస్తూ.. గతంలో భూమి కేటాయించిన రెండు సంస్థలకు వాటిని రద్దు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. » సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సంస్థకు రాయపూడిలో గతంలో 3.50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు దాన్ని సవరిస్తూ రాయపూడిలో కేవలం 2 ఎకరాలను మాత్రమే అదీ ఎకరం రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. » జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ)కు గతంలో అంబరాజుపాలెం–రాయపూడి వద్ద ఎకరం కేటాయించింది. ఇప్పుడు దాన్ని సవరిస్తూ అదే ప్రాంతంలో 2 ఎకరాలను ఎకరం రూ.కోటి చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. » స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చదరపు మీటర్‌కు ఏడాదికి రూ.1 చొప్పున 5 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఆప్కాబ్‌కు గతంలో రాయపూడి వద్ద 3.095 ఎకరాలు కేటాయించిన సర్కార్.. ఇప్పుడు 0.495 ఎకరాలను ఎకరం రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. » అబ్బరాజుపాలెంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమికి 12 ఎకరాలు, ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమికి 12 ఎకరాలు ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించింది. » కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ఉద్దండరాయునిపాళెంలో ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2 ఎకరాలను 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఎస్ఐబీ(సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు పిచ్చుకలపాలెం వద్ద 0.50, వెలగపూడి వద్ద కెనరా బ్యాంక్‌కు 0.40, అనంతవరంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.5 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. » నిడమర్రులో కిమ్స్ వైద్య కళాశాలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయించింది. పిచ్చుకలపాలెంలో బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 2 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. -
విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర
ప్రత్తిపాడు: అక్రకటిత విద్యుత్ కోతలపై మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకటో వార్డులోని పూల బజారులో కొద్ది నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్య నెలకొంది. లో వోల్టేజీ సమస్యతో పాటు ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు కోత విధించడంతో స్థానిక మహిళలు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశి్నంచారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోండని చులకన చేసి మాట్లాడుతున్నారు.దీంతో మహిళలు, స్థానికులు ఆదివారం రాత్రి గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? అందరిలానే తాము నెల నెలా వేలకు వేలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదా? అంటూ మండిపడ్డారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయారు. ఇంట్లో వృద్ధులు, పసి పిల్లల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతమద్రాసు రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగేంద్ర రోడ్డు మీద ఆందోళన విరమించాలని కోరారు. ఏఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని మహిళలు పట్టుబట్టారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడతామని పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
నౌకాదళానికి నూతన శక్తి నిస్తార్
సాక్షి, విశాఖపట్నం: భారత్–పాక్ యుద్ధ సమయంలో విశాఖపట్నం సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి దూసుకొచ్చిన పీఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామిని ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌక ధ్వంసం చేసింది. దాయాది దేశంతో జరిగిన యుద్ధంలో చారిత్రక విజయాన్ని అందించిన ఆ నిస్తార్ 1989లో సేవల నుంచి ని్రష్కమించింది. ఇప్పుడు.. ఆ ప్రతిష్టాత్మక విజయానికి ప్రతీకగా, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌక భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరనుంది. హిందూస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించిన ఈ డైవింగ్ సపోర్ట్ వెసల్¯ విశాఖపట్నం కేంద్రంగా సేవలను అందించనుంది. భారత రక్షణ రంగం నిస్తార్ నిర్మాణంతో కీలక మైలురాయిని అధిగమించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 15 సార్లు సీ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షణ నౌక.. నౌకాదళ అమ్ములపొదిలో చేరి సేవలందించనుంది.నిస్తార్ క్లాస్ నౌకల రూపకల్పన, సామర్థ్యాలను ధ్రువీకరించేందుకు పలు సార్లు హార్బర్ ట్రయల్స్, సీ ట్రయల్స్ నిర్వహించారు. ‘యార్డ్–11190’ పేరుతో రూపొందించిన ఈ నౌకలో ఏర్పాటు చేసిన ఎయిర్/మిక్స్డ్ డైవింగ్ కాంప్లెక్స్ షిప్ 75 మీటర్ల లోతు వరకు డైవింగ్ చేయడానికి వీలు కలి్పస్తుంది. నీటి అడుగున డైవింగ్ సర్వేలు, తనిఖీలు నిర్వహించేందుకు ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువును ఎత్తేందుకు వీలుగా నౌకలో మెరైన్ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు.18న జాతికి అంకితం చేయనున్న రక్షణ మంత్రిఇటీవలే అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన హిందూస్థాన్ షిప్‌యార్డ్.. నిస్తార్‌ను భారత నౌకాదళానికి అప్పగించింది. ఈ నెల 18న విశాఖపట్నం వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం నుంచి నిస్తార్ తన సేవలందిస్తుంది. నిస్తార్ క్లాస్‌లో మరో యుద్ధనౌక ఐఎన్ఎస్ నిపుణ్ కూడా షిప్‌యార్డ్‌లో సిద్ధం అవుతోంది. దీన్ని వచ్చే ఏడాది ఇండియన్ నేవీకి అప్పగించేలా పనులు చురుగ్గా నిర్వహిస్తున్నారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఒక నౌక తయారు కాగా.. ఇంకొకటి సిద్ధమవుతోంది.సాధారణంగా ప్రతి యుద్ధనౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. ఇప్పటివరకు 2 మెగావాట్ల డీజిల్ జనరేటర్లు మాత్రమే వార్‌షిప్స్‌లో వినియోగించారు. కానీ నిస్తార్‌కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నిస్తార్ 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాలు నిర్వహించగలదు. డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్తో అమర్చబడి, నిస్తార్ క్లాస్ షిప్ ఆపదలో ఉన్న జలాంతర్గాములకు కూడా సహాయం చేయగలదు. సముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు నిస్తార్ కీలకంగా మారనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
ఈ లైనింగ్ దండుకునేందుకే!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద హంద్రీృనీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కిలోమీటర్ల నుంచి 341 కిలోమీటర్ల మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్ చేసి), ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తున్నారు. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. లైనింగ్ పనుల్లో ఇదో వింత అని ఇంజినీరింగ్ అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ఠ స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనిజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాంతో పనులు నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగా చేస్తున్నా ప్రశ్నించడానికి వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు సాహసించలేక పోతుండటం గమనార్హం. ఫలితంగా ప్రవాహ వేగం, ప్రవాహ సామర్థ్యం పెంచాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. హంద్రీృనీవా కాలువ లైనింగ్ పనుల్లో జరుగుతోన్న అక్రమాలకు ఇదో మచ్చుతునక. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. పనులు వేగంగా పూర్తి చేయాలనే సాకు చూపి.. అడ్డగోలుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తున్నారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్‌కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీృనీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి/పుట్టపర్తి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో నాణ్యత ఎంత అంటే నేతి బీరలో నెయ్యంతే! టెండర్లో అధిక ధరకు అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించిన ముఖ్యనేత.. ఆ కాంట్రాక్టు విలువలో పది శాతం రూ.196.89 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించి.. నీకింత నాకింత అంటూ పంచుకుతిన్నారు. ఆ తర్వాత ఆ పనులను కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి నాసిరకం పనులు చేస్తున్నా,అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. కారణం..ఆ కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు అండదండలు ఉండటమేనని చెబుతున్నారు. భారీ వర్షం వచ్చినా, సామర్థ్యం మేరకు కాలువకు నీటిని విడుదల చేసినా నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కాలువకు సిమెంట్ లైనింగ్‌ను రైతులు వ్యతిరేకించినా, సీఎం పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు 5 ప్యాకేజీలుగా విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన 2 ప్యాకేజీల పనులు చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0–75వ కి.మీ వరకు పనులను 2 ప్యాకేజీల కింద విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు పనులను రూ.480.22 కోట్లతో ఆర్నెళ్లలో పూర్తి చేయాలనే నిబంధనతో సీఎం చంద్రబాబు సన్నిహితునికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.196.91 కోట్లతో అప్పగించారు.రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను రూ.1,968.92 కోట్లతో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల.. చిన్న పాటి వర్షం కురిసినా.. కాలువలో కనిష్ఠ స్థాయిలో ప్రవాహం ఉన్నా లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. దాని కోసం వెచ్చించిన ధనమంతా వృథా అవుతుందని జల వనరుల శాఖలో సుదీర్ఘ కాలం సేవలు అందించి, పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. లైనింగ్ చేస్తే భూగర్భ జల మట్టం అడుగంటిపోతుందని.. బోరు, బావులు ఎండిపోతే.. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్న పండ్ల తోటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ఎత్తిచూపారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని, లైనింగ్ చేయకుండా పిల్ల కాలువలు తవ్వడానికి రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే.. హంద్రీ–నీవా తొలి దశ, రెండో దశ కింద 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని మరో రిటైర్డు చీఫ్ ఇంజినీర్ చెప్పారు. ఆయకట్టుకు నీళ్లందించి ఉంటే రైతుల జీవన ప్రమాణాలు పెరిగేవని.. హంద్రీ–నీవా లక్ష్యం సాకారమయ్యేదన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యాంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చేసుకుంటూ ముఖ్య నేతతో కలిసి దోచుకుతింటున్నారు.లైనింగ్ పనులు జరుగుతున్నది ఇలా..⇒ ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. దాంతో మట్టి ఎక్కడికక్కడ జారిపోతోంది. ⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెస్తున్నారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేస్తున్నారు. ⇒ కాలువకు ఇరువైపులా మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మీకుల ద్వారా సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తున్నారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ క్షేత్ర స్థాయిలో అధికారులు పనులను సక్రమంగా పర్యవేక్షించడం లేదు. కొంత మంది అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నా, నాసిరకంగా ఇష్టారాజ్యంగా సబ్ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. వాళ్లు పెద్ద కాంట్రాక్టర్లు.. వాళ్లను ప్రశ్నిస్తే మా ఉద్యోగాలు పోతాయని తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో వాపోయారు. నాణ్యత, నియంత్రణ విభాగం అధికారులు ఆ పనుల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏఐతో లే‘ఆఫ్ సోపాలు’!
‘‘రానున్న ఐదేళ్లలో అన్ని ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) భర్తీ చేస్తుంది. అంటే సాధారణ ఉద్యోగులు కొలువులు కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కనీసం 10 శాతం నుంచి 20 వరకూ ఉండవచ్చు.’’ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యువతరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. 2029 నాటికి మానవ మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని ఎలన్ మస్క్ కూడా వ్యాఖ్యానించడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ సాంకేతికత వల్ల అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని, 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని తాజా అధ్యయనాల సారాంశం. అంతర్జాతీయంగా పలు కార్పొరేట్ సంస్థల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి ఊతమిస్తున్నాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయని సమాచారం.వెంటాడే ఏ ‘ఐ’:ప్రతి సంస్థలోనూ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ సర్వసాధారణం. అయితే కార్యాలయంలో పని గంటలు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రతి ఉద్యోగి కదలికలనూ ఏఐ ట్రాక్ చేయడం అనేది ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కొత్తగా మొదలైంది. పనితీరు మదింపు తర్వాత సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వారికి కృత్రిమ మేధ నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (డిస్మస్ ఆర్డర్) ఆదేశాలను యాజమాన్యంతో సంబంధం లేకుండానే వారి ఈ మెయిల్‌కు పంపిస్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.వాల్‌మార్ట్, డెల్టా, చెవ్రాన్, స్టార్‌బక్స్, అవేర్, టి–మొబైల్ వంటి ప్రముఖ సంస్థలూ ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణకు ఏఐని ఉపయోగిస్తున్నాయి. గూగుల్ క్లౌడ్ హెచ్ఆర్ బృందం వారి నియామక ప్రక్రియను మార్చడానికి, ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్‌ను వేగవంతం చేయడానికి ఏఐని వాడుతున్నారు. అయితే ఇలాంటి చర్యల వల్ల పనితీరు మెరుగుపడదు సరికదా ఉద్యోగులను మానసికంగా ప్రభావితం చేస్తాయని ‘కార్నెల్’ పరిశోధనలో తేలింది.జూనియర్లకు కష్టకాలంఏఐ ట్రాకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో జూనియర్ స్థాయి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు, అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025’ సర్వే ప్రకారం, ఏఐ టెక్నాలజీ పెరుగుదల వల్ల ప్రపంచంలోని దాదాపు 41 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో తమ ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి.సీఎన్ఎన్ టెలివిజన్‌లో పనిచేస్తున్న 200 మందిని తొలగించింది. స్టార్‌బక్స్ సిబ్బందిని తొలగించింది. ఇంజినీరింగ్, ఉత్పత్తి, కార్యకలాపాలు వంటి విభాగాలలో స్ట్రైప్ 300 మందిని ఇళ్లకు పంపనుంది. యూకే పెట్రోలియం కంపెనీ బీపీ సుమారుగా 7,700 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మెటా కూడా 5శాతం మంది వర్క్‌ఫోర్స్‌ని తగ్గించనుంది. బ్లాక్‌రాక్ 200 మందిని వద్దంటోంది.వాషింగ్టన్ పోస్ట్ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయనున్నాయి. కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని నియంత్రించడానికి ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. -
టీచర్లకు ‘గిన్నిస్’ తిప్పలు!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డు కోసం ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం–2.0) ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులైనా ఆన్లైన్లో వివరాలు, ఫొటోలు, వీడియోలు అప్లోడ్ కాకపోవడం, అప్లోడ్ చేసిన వాటిలో నాణ్యతలేదని చెప్పి మళ్లీ క్వాలిటీతో అప్లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమ వీడియోలు అప్పుడు వచ్చిన వారెవరైనా తీశారా అని ఆరాతీస్తూ ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.గిన్నిస్ రికార్డు కోసం ఏర్పాటుచేసిన ఈ పీటీఎం సమావేశాలు విఫలమవడంతో ఎలాగైనా లక్ష్యం సాధించేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో.. నాలుగు రోజులుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నిద్రహారాలు లేకుండా చేస్తున్నారు. పైగా.. ఆదివారం సెలవు అయినప్పటికీ ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చి పనిచేయాల్సి వచ్చింది. విట్నెస్ ద్వారా నింపాల్సిన గిన్నిస్ రికార్డు గూగుల్ డ్రైవ్ ఫారం ఎలా నింపాలో తెలీక కొందరు, నెట్వర్క్ పనిచేయక మరికొందరు పూర్తిచేయలేకపోయారు. -
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్
సాక్షి,కృష్ణాజిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనొద్దని నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్‌లో చెప్పా.నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. 8వ తేదీన మాట్లాడితే 12వ తేదీన టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో నాపై డిబేట్లు పెట్టారు. పచ్చ పార్టీ మహిళలతో నన్ను బూతులు తిట్టించారు.చీకట్లో నేను తలలు నరికేయమన్నానని టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరమా...అతని కొడుకు లోకేష్ తరమా?రోజులు లెక్కపెట్టుకో కొల్లు రవీంద్ర. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ కన్నీరు మీ పచ్చ సైకోలను ఇంటికి పంపించడం ఖాయం.ఓయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినడం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినడం లేదు.బందరు బీచ్‌లో ఇసుక తింటున్నావ్..నువ్వు అన్నం తినడం లేదు.తోట్ల వల్లూరులో ఇసుక తింటున్నావ్.. నువ్వు అన్నం తినడం లేదు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయలు లేదు. కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు కోట్ల రూపాయల డబ్బులెక్కడివి. కొల్లు రవీంద్ర నీ దోపిడీ బందరును దాటి కృత్తివెన్ను వరకూ పాకింది.ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’అని హెచ్చరించారు. -
చంద్రబాబు అండ్ కో దోపిడీ.. 10శాతం ఫినిషింగ్ పనులకే రూ.524 కోట్లు విడుదల
సాక్షి,అమరావతి: దోపిడీకి కాదేదీ అనర్హం అన్న రీతిలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ దోపిడీ రాజ్యంగా మారింది. కేవలం 10శాతం ఫినిషింగ్ పనులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లకు రూ.524కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఫినిషింగ్ పనుల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, ల్యాండ్ స్కాపింగ్,ఇతర పనులున్నాయి. 90శాతం ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు గతంలోనే పూర్తి కాగా కేవలం 10శాతం పనులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.524 కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఇది చంద్రబాబు అండ్ కో దోపిడీకి నిదర్శనమని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు. కేవలం మిగిలి పోయిన 10శాతం పనులకు రూ.524కోట్లు కేటాయించడం ఏంటని వారు వారు ప్రశ్నిస్తున్నారు. -
కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి,కృష్ణాజిల్లా: మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. ‘ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్ధించడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్రను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? తన భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త అయినా ఎలా స్పందిస్తాడో ఉప్పాల రాము కూడా అలాగే స్పందించాడు. హారిక కంట్లో కారిన ప్రతీ కన్నీటి చుక్కకు దేవుడు.. కాలమే సమాధానం చెబుతాడు. ఉప్పాల హారికకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం. మమ్మల్ని దాటుకునే ఎవరైనా మీ వరకూ రావాలి’అని స్పష్టం చేశారు. -
మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. మహిళల మీద మీ దాడి మీ శాడిజంకు పరాకాష్ట’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశారని బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీ వాళ్లను పంపి దాడులు చేయించారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘మహిళల మీద ఈ రోజు మీ దాడి, మీ శాడిజంకు పరాకాష్ట. వైఎస్సార్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు.. చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని.. చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెబితే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చ సైకోలతో మీరు దాడులు చేయించడం గొప్ప పనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు? పైగా పోలీసుల సమక్షంలోనే వారు దుర్భాషలాడుతూ దాడి చేశారు.చంద్రబాబూ.. దీన్ని పరిపాలన అనరు. శాడిజం అంటారు.. పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లను ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అని కూడా చూడకుండా, దుర్భాషలాడుతూ సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు. ఇది పైశాచికత్వం కాదా? అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడం లేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారు. దాడి చేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే కానీ, వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు.. అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తారా? చంద్రబాబూ.. మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారు. వీళ్లే కాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతో మంది అమాయకులను కేసుల్లో ఇరికించారు.. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.వైఎస్సార్సీపీకి చెందిన వందల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులపైన, వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టి వారిని హింసించారు.. తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచి్చన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన గూండాలు కలిసి జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి తెస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు? పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట కూటమి అధికారం చేపట్టాక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కూటమి రెడ్‌బుక్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంహారికపై టీడీపీ గూండాల దాడి హేయం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు గుడివాడలో దాడికి పాల్పడటం హేయమైన చర్య. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి అమానుష దాడులను సహించేది లేదు. – జోగి రమేష్, మాజీ మంత్రిరాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళా ప్రజాప్రతినిధులను సైతం మానసికంగా వేధించడమే కాకుండా భౌతికంగా దాడులకు కూడా బరితెగించడం అన్యాయం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఈ రకమైన దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ ఆటవిక పాలన సాగుతోంది రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారింది. జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై దాడి హేయం. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే.. అదే చివరి రోజవుతుందన్న చంద్రబాబు టీడీపీ గూండాలు రెచి్చపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి పోలీసులు చోద్యం చూస్తున్నారు మహిళా ప్రజాప్రతినిధి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేయడం దారుణం. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం అంటే.. ఆ హోం మంత్రి పదవిలో ఉండటం అనవసరం. పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి రాష్ట్రంలో సైకోపాలన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సైకో పాలన నడుస్తోంది. గుడివాడలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల మాటున పచ్చ సైకోలు బీసీ కులానికి చెందిన, ఉన్నత చదువులు చదువుకుని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిలో ఉన్న ఉప్పాల హారికపై దాడికి తెగబడటం దారుణం. ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు. – పేర్ని నాని, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడుదారుణమైన పాలన చంద్రబాబు ప్రజలకిచి్చన వాగ్దానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – విడదల రజిని, మాజీ మంత్రి పోలీసుల సాక్షిగా ఉన్మాద దాడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు? ఈ దాడికి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు? మహిళా హోం మంత్రి అనిత ఎందుకు నోరు మెదపడం లేదు? – ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి రాష్ట్రంలో రాక్షస పాలన సీఎం చంద్రబాబు రాక్షస పాలనలో వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేస్తోంది. బీసీ మహిళపై చేసిన దాడిని కచి్చతంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నరసేపు మీటింగ్‌కు రానివ్వకుండా రోడ్డుమీద ఆపేసి, కారు అద్దాలు పగులగొట్టడం అమానుష చర్య. జిల్లా ప్రథమ పౌరురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? – ఆరె శ్యామల, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిమహిళ దుస్థితికి ఈ ఘటన అద్దం పట్టింది కూటమి పాలనలో మహిళల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మహిళలపై దారుణాలకు కూటమి నేతలు తెగబడుతున్నారు. ఈ దాడికి కూటమి కార్యకర్తలను ఎగదోసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను బీసీ వర్గాలు క్షమించవు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్ -
ఎంబీబీఎస్ ప్రవేశాలకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. నీట్ యూజీ–2025 కౌన్సెలింగ్ ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) శనివారం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆలిండియా కోటా మొదటి దశ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. అందులో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ డేటా పరిశీలన చేయనుంది. అలాగే ఈనెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 12లోగా ఆయా కాలేజీల్లో చేరాలి. రెండో దశ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 12 నుంచి 20 వరకు, స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి 29 వరకు ఉంటుంది.సెప్టెంబర్్ 3 నుంచి 10వ తేదీ వరకు మూడో దశ ఆలిండియా కోటా, 9 నుంచి 18 వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్ట్రే వేకెన్సీ కింద సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు ఆలిండియా కోటా సీట్లను, 25 నుంచి 29 వరకు స్టేట్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఆలిండియా కోటాలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లు, ఎయిమ్స్, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు.సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలను ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. -
పోలీసులు చంపేసి.. చెరువులో వేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగంలో మాతంగి భరత్ అనే యువకుడి ప్రాణం పోయింది. కోర్టు వాయిదాకు హాజరు కాకపోవడంతో ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అతడిని పొట్టన పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్న భరత్ ఇంటికి బుధవారం రాత్రి త్రీ టౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భరత్, అతడి తమ్ముడు నవీన్, మరో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆటోలోంచి దిగిన ముగ్గురు పోలీసులు.. భరత్ అనుకుని మరొకరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు కూడా చెరువులోకి దిగి వెంబడించారు. భరత్ ఈదుకుంటూ మరోవైపు వెళ్లగా అక్కడ మాటువేసిన మరికొందరు పోలీసులు పట్టుకుని బైక్ మీద తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు.ప్యాంట్ లేకుండా.. తీవ్ర గాయాలతో విగతజీవిగా రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం భరత్ అదే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే, అతడు చెరువులో దూకే సమయంలో నల్ల ప్యాంట్, టి షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహంపైన మాత్రం ప్యాంట్ లేదు. కట్ డ్రాయర్, టి షర్ట్ మాత్రమే ఉన్నాయి. భరత్ తొడలు వాచిపోయాయి. తల, ముఖంపై తీవ్రంగా, శరీరంపై గాయాలున్నాయి. దీంతో పోలీసులే కొట్టి చంపి, చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తీవ్రస్థాయిలో బెదిరింపుల మధ్య అంత్యక్రియలు భరత్ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు 5 పోలీస్ జీప్‌లు, ఒక స్పెషల్ పార్టీ బస్సు అనుసరించాయి. గతంలో తెనాలిలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు వచ్చి.. భరత్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. పోలీసుల తప్పు లేకపోతే ఎందుకు ఈ తతంగం నడుపుతున్నారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వచ్చాయి. అంతేకాదు.. ‘‘ఎలాంటి హడావుడి చేయకుండా అంత్యక్రియలు జరిపించండి. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలిసింది. భరత్ శరీరంపై లాఠీదెబ్బలుంటే విచారించి న్యాయం చేస్తామని ఎలాంటి ఆందోళనలు చేయొద్దని కూడా కోరినట్లు సమాచారం. » భరత్‌పై గత నవంబరులో త్రీ టౌన్ స్టేషనులో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ నెల 14న వాయిదా కోసం తెనాలిలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పొద్దుపోయాక పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. కాగా, భరత్ తో పాటు ఇద్దరు పోలీసులు చెరువులో దూకినా కొంతసేపటి తర్వాత అతడు దొరకలేదంటూ తిరిగివెళ్లారని చెబుతున్నారు. అయితే, భరత్ విగతజీవిగా తేలేవరకు పోలీసులు చెరువు వైపు చూడకపోవడం అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. భరత్ వారి వద్ద ఉన్నందునే పోలీసులు చెరువు వద్దకు మళ్లీ రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్‌లో తెనాలి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెనాలిలో వరుస ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని డీఎస్పీపైనా నిప్పులు చెరిగినట్లు సమాచారం.పోలీసులు చిత్రహింసలు పెట్టి నా బిడ్డను చంపేశారు మావాడు ఎంతసేపైనా ఈదగలడు. అలాంటివాడు చెరువులో మునిగి ఎలా చనిపోతాడు? పోలీసులే పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులను ఏమార్చి పారిపోయి ఉంటాడని అనుకున్నాం. శవమై తేలతాడని ఊహించలేదు. భరత్‌పై పోక్సో కేసు కూడా బూటకమే. పోలీసులకు ఎప్పుడేది అనిపిస్తే ఆ కేసు పెట్టడం, లోపల వేయడం అలవాటైంది. అబ్బాయిని తీసుకుని స్టేషన్‌కు రమ్మంటే తీసుకెళ్లేదాన్ని. చంపేయడం ఎందుకు? –భరత్ తల్లి సుశీల బీర్జాల మీద కొట్టారు.. ఒంటిపైన లాఠీదెబ్బలు ఉన్నాయి మా అన్నను ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ మరో పదిమంది కానిస్టేబుళ్లు కలిసి పట్టుకుని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అతడి ఒంటిపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. బీర్జాల మీద కొట్టడంతోనే మరణించాడు. తర్వాత తెచ్చి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులు వెళ్లాక రాత్రంతా చెరువు చుట్టూ వెదికాం. కానీ, విగతజీవిగా కనిపించాడు. ఇది పోలీసులు చేసిన హత్యే. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. తెనాలిలో పనిచేసిన నరసింహారావు అనే పోలీసు వచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. –భరత్ తమ్ముడు నవీన్ పోలీసులు చేసిన హత్యగా కనిపిస్తోంది భరత్ మృతి పోలీసులు చేసిన హత్య అని స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు బలమైనవే. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చాలి. పోలీసుల ప్రమేయం ఉన్నందున, స్థానిక అధికారులు విచారిస్తే న్యాయం జరగదు. బయటి పోలీసులు లేదా సీఐడీతో విచారణ చేయించాలి. –జి.శాంతకుమార్, అధ్యక్షుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ -
ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై 'టీడీపీ గూండాయిజం'
గుడివాడ రూరల్/గుడివాడ టౌన్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్సీపీ శ్రేణులపై రివాల్వర్ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఉప్పాల హారికతో ఫోన్లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది. -
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని.. వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక నియంతృత్వంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని సందేహం కలిగే స్థాయికి అది చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ కూడా ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి.. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు.. పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చి యార్డు ‘దారుణంగా ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చి యార్డును సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా కేసు పెట్టారు. జూన్ 11, 2025. ప్రకాశం జిల్లా పొదిలి ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే మూడు కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. ఐదు కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జూలై 9, 2025. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా ఐదు కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. టార్గెట్ పెట్టుకున్న వారందరిపై కేసులు ప్రతి కేసుకు సంబంధించి ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్బంధం విధిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. అలాంటి మా పార్టీని.. సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అణిచి వేసే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్ పీపుల్ వాయిస్‌ను నొక్కేస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు.. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు.. అన్న విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ దాస్తోంది: మేరుగు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిలరీల నిర్వాహకులంతా టీడీపీ వారేనని.. మద్యం తయారీకి యథేచ్ఛగా స్పిరిట్‌ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.‘‘ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ మద్యమే. టీడీపీ నాయకుల ధన దాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు...కల్తీ మద్యం తాగి ఇటీవల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు. -
మీ లైఫ్‌స్టైలే కొంప ముంచుతుంది!
మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడిపోయారనే! మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్‌స్టెయిల్ ఇన్ఫ్లేషన్’ అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’! – సాక్షి, స్పెషల్ డెస్క్జీవనశైలి ద్రవ్యోల్బణంతో సామాన్యుల తిప్పలు జీతం పెరిగితే ఖర్చులూ పెంచేసుకుంటున్నారు అప్పులతో సతమతమవుతున్న సగటు ఉద్యోగి పొదుపు, ఆర్థిక క్రమశిక్షణలే అసలైన మందు..సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.‘పెరగటం’నిజం కాదు! మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుండి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని. ఏఐ భయం పొంచి ఉంది! జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏ.ఐ. (కృత్రిమ మేధస్సు). ఏ.ఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోల్చుకోవటం జీతానికి చేటు.. తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్‌గ్రేడ్’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.ముందస్తు హెచ్చరిక సంకేతాలు..మొదటి హెచ్చరిక మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. రెండో హెచ్చరిక జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్ వేసుకోవటం మానేయటం. మూడో హెచ్చరిక జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్‌ను పెంచేయటం.నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి–తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం. అయిదో హెచ్చరిక ఇంటర్నెట్, ఓటీటీల సబ్్రస్కిప్షన్లు పెరగటం.చిక్కుకోకుండా ఉండాలిజీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయట పడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్టులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుండీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీవితం పెరిగీ ప్రయోజనం ఉండదు.బయట పడే మార్గం ఉంది..జీవన శైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్‌కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కల్పించండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ. -
సర్కారు తీరుపై డీజీల గుస్సా
సాక్షి, అమరావతి: క్రమశిక్షణకు మారుపేరుగా భావించే పోలీసు శాఖలో ముసలం పుట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారులే చంద్రబాబు ప్రభుత్వ ఒంటెత్తు పోకడలపై తిరుగుబాటు బావుటా ఎగుర వేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా డైరెక్టర్ జనరల్ (డీజీ) స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులు దీనికి నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా హరీశ్ కుమార్ గుప్తాను రెగ్యులర్ డీజీపీగా నియమించడంతో పోలీసు శాఖలో అసంతృప్తి భగ్గుమంది. దాంతో ప్రస్తుతం డీజీ స్థాయి అధికారులు నలుగురుతో పాటు తర్వాత బ్యాచ్‌లకు చెందిన మరో నలుగురు అధికారులకు డీజీపీ పోస్టు దక్కకుండా పోయింది. ఇక పోలీసు శాఖలో కీలక విభాగాలకు ఇన్‌చార్‌్జగా ఐజీ స్థాయి అధికారులను నియమించి, వాటని్నంటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న డీజీపీ గుప్తా ఎత్తుగడ సీనియర్ ఐపీఎస్ అధికారుల అసంతృప్తికి ఆజ్యం పోసింది. రెడ్‌బుక్ కుట్రను అమలు చేస్తున్నందుకే డీజీపీ గుప్తా నియంతృత్వ పోకడలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వత్తాసు పలుకుతున్నారని యావత్ పోలీసు శాఖ ఆగ్రహంతో రగిలి పోతోంది. ఈ పరిణామాలతో డీజీ స్థాయి అధికారులు ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహిస్తుండటం బట్టబయలైంది. లెవల్ 17 పే స్కేల్ కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించడం పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రెడ్‌బుక్ కుట్ర కోసం గుప్తాకు వత్తాసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిటైరవ్వాల్సిన హరీశ్ కుమార్ గుప్తా (1992 బ్యాచ్)ను అంతకు రెండు నెలల ముందు రెగ్యులర్ డీజీపీగా నియమించడమే అందుకు కారణం. దాంతో గుప్తా మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగేందుకు అవకాశం లభించింది. ఆయన కంటే సీనియర్లు అయిన అంజనీ కుమార్ (1990 బ్యాచ్), మాదిరెడ్డి ప్రతాప్ (1991) డీజీపీ అయ్యే అవకాశం కోల్పోయారు. పైగా 1993 బ్యాచ్‌కు చెందిన మహేశ్ దీక్షిత్, అమిత్ గార్్గలకు కూడా డీజీపీగా అవకాశం లేదని స్పష్టమైపోయింది. 1994 బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్ అయ్యన్నార్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలాకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 1995 బ్యాచ్‌కు చెందిన అతుల్‌సింగ్, 1996 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ మీనా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేవలం తాము చెప్పినట్టుగా రెడ్‌బుక్ కుట్రలను అమలు చేస్తారనే ఉద్దేశంతోనే చివరి నిమిషంలో నిబంధనలకు విరుద్ధంగా హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించడంతో ఇంత మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు అవకాశాలను కోల్పోయారు.డీజీలను డమ్మీలు చేస్తున్న డీజీపీ డీజీపీ పోస్టు దక్కకపోయినా పోలీసు శాఖలో గౌరవం అయినా ఉందా అంటే అదీ లేకపోవడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదాతో ఉన్న వారిలో నళినీ ప్రభాత్, మహేశ్ దీక్షిత్, అమిత్ గార్గ్ కేంద్ర సర్వీసులో ఉన్నారు. కానీ రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, బాలసుబ్రహ్మణ్యం, రవి శంకర్ అయ్యన్నార్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజేలా, అతుల్‌సింగ్, రాజీవ్ కుమార్ మీనా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.వారికి పోలీసు శాఖలో కనీస గౌరవం లభించడం లేదు. ఇప్పటికే డీజీపీ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న ఆర్టీసీ ఎండీ పదవిలో రిటైర్డ్ డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావును నియమించారు. దాంతో రాష్ట్ర సర్వీసులో ఉన్న డీజీ స్థాయి అధికారులు ఓ అవకాశాన్ని కోల్పోయారు. మరోవైపు హరీశ్ కుమార్ గుప్తా కీలక పోలీసు విభాగాలను తన గుప్పిట్లోనే పెట్టుకోవాలని భావిస్తుండటం వారికి తీవ్ర అవమానకరంగా మారింది. కీలకమైన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న గుప్తా.. తర్వాత రెగ్యులర్ డీజీపీగా నియమితులయ్యారు. దాంతో మరో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారిని ఆ విభాగం డీజీగా నియమించాలి. కానీ ఇప్పటి వరకు గుప్తానే ఆ విభాగం చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఒక ఐజీ స్థాయి అధికారిని విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం చీఫ్‌గా నియమించి, ఆ విభాగాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్నది గుప్తా ఆలోచన అని తెలుస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా పేరును ఇందుకోసం పరిశీలిస్తున్నారు. తద్వారా డీజీ స్థాయి అధికారికి దక్కాల్సిన కీలక పోస్టు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో ఏ డీజీపీ ఇలా చేయలేదని వారు గుర్తు చేస్తున్నారు.అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ కన్నుప్రస్తుతం కేంద్ర నిధులు ఎక్కువగా ఉన్న అగ్నిమాపక శాఖపై కూడా డీజీపీ గుప్తా కన్ను పడింది. ఆ విభాగం డీజీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ను మరో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసి, ఐజీ శ్రీకాంత్‌ను నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకు హోమ్ మంత్రి అనిత ద్వారా సిఫార్సు చేయిస్తున్నారని పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. తద్వారా అగ్ని మాపక, పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాలు కూడా డీజీపీ గుప్తా గుప్పిట్లోనే ఉంటాయి. నిబంధనల ప్రకారం సీఐడీ చీఫ్ ఆ విభాగాన్ని స్వతంత్రంగా నిర్వహించాలి. రోజువారీ వ్యవహారాల్లో డీజీపీ జోక్యం చేసుకోకూడదు. కానీ అందుకు విరుద్ధంగా సీఐడీ విభాగాన్ని డీజీపీ గుప్తానే స్వయంగా సమీక్షిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వీర విధేయ అధికారి, విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబును సిట్ చీఫ్‌గా నియమించి సీఐడీ విభాగాన్ని గుప్తా గుప్పిట్లో పెట్టుకున్నారు. విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్, అగ్ని మాపక, సీఐడీ, ఏసీబీ విభాగాల చీఫ్లుగా జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించేలా బదిలీల ప్రతిపాదనలను ప్రభుత్వానికి డీజీపీ గుప్తా సమర్పించినట్టు తెలుస్తోంది. తద్వారా కీలకమైన ఆ విభాగాలన్నీ పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుని డీజీ స్థాయి అధికారులను డమ్మీలను చేయాలన్నది డీజీపీ గుప్తా ఎత్తుగడ అని ఇట్టే అర్థమవుతోంది.రెండు డిమాండ్లను లేవనెత్తుతున్న డీజీలు» పోలీసు శాఖలో తమకు జరుగుతున్న అవమానాలపై డీజీ స్థాయి అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పలువురు డీజీ స్థాయి అధికారులు ఇటీవల తరచూ డిన్నర్ సమావేశాల్లో తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారు ప్రధానంగా రెండు డిమాండ్లను లేవనెత్తుతున్నారు.» ‘విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, అగ్నిమాపక, సీఐడీ విభాగాల చీఫ్లుగా డీజీ స్థాయి అధికారులనే నియమించాలి. ఆ విభాగాలను తాము స్వతంత్రంగా నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించాలి. ఐజీ స్థాయి అధికారులను నియమించి, మమ్మల్ని అవమానించడం ఏమాత్రం సరికాదు’ అన్నది తొలి డిమాండ్. అందుకు విరుద్ధంగా ఐజీ స్థాయి అధికారులను నియమిస్తే రాజీనామా చేస్తానని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి స్పష్టం చేసినట్టు సమాచారం.» తమకు రెగ్యులర్ డీజీపీగా అవకాశం లేకుండా పోయింది కాబట్టి కనీసం రెగ్యులర్ డీజీ పే స్కేల్ అయిన లెవల్ 17 పే స్కేల్‌ను అమలు చేయాలని రెండో డిమాండ్ లేవనెత్తారు. ఈ మేరకు ఓ డీజీ ఇప్పటికే లిఖిత పూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతోపాటు నలుగురు డీజీలు తమకు లెవల్ 17 పే స్కేల్ వర్తింప జేయాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధపడినట్టే.» సీఐడీ మినహా మిగిలిన డీజీ స్థాయి అధికారులు డీజీపీ కార్యాలయం ఉన్న రాష్ట పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతున్నారు. గతంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు అప్పటి డీజీ స్థాయి అధికారిగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా విముఖత చూపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయన పట్టుబట్టి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.» ప్రస్తుతం తమకు కూడా అదే రీతిలో పోలీసు ప్రధాన కారాలయంలో కాకుండా, ఇతర చోట్ల నుంచి డీజీ హోదాలో విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరూ డీజీపీ గుప్తా ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు సుముఖతగా లేరన్నది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డీజీ స్థాయి అధికారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
బాబూ.. జవాబియ్యండి..!
‘‘విజయవాడ నగరంలో ఓ రేషన్ దుకాణంలో 600 కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా అధికారులు ఆ కార్డులకు సరిపడా బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న అసలు కార్డుదారులకు బియ్యం సరిపోవడం లేదు. వాస్తవానికి ప్రతి దుకాణానికి 10 శాతం కోటా అదనంగా ఇవ్వాలి. కానీ, కూటమి సర్కారు వచ్చాక ఇండెంట్ పెట్టినా పంపని దుస్థితి. ’’.సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నోటిదగ్గర కూడు లాగేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆహార భద్రత చట్టం లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. ఫలితంగా చౌక దుకాణాల్లో నిత్యావసరాలు దొరక్క.. పేదలు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల్లో ఏడాదిగా సబ్సిడీ కందిపప్పు, ఫోరి్టఫైడ్ గోధుమపిండి పంపిణీ ఆగిపోయింది. చిరుధాన్యాలు, పంచదార సరఫరా నామ మాత్రమే. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నే కూటమి ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేస్తోంది. ఎన్నికల ముందు చౌక దుకాణాల ద్వారా 18 రకాల సరుకులు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన సరుకుల పంపిణీకి కూడా మంగళం పాడడంతో పేదల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అదనంగా బియ్యం ఇవ్వం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ వాహనాలు)పై కక్షగట్టి రద్దు చేసింది. ఈ క్రమంలో ఆర్భాటంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా ప్రారంభించింది. ఒకటో తేదీ వచ్చిందంటే పేదలు రేషన్ కోసం క్యూలైన్లలో కుస్తీలు పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చాలా మంది కూటమి నాయకుల సిఫారసులతో డీలర్షిప్ దక్కించుకున్న డీలర్లు పంపిణీలో అక్రమాలకు పాల్పడడంతో పీడీఎస్ వ్యవస్థ గాడి తప్పుతోంది. దుకాణాలు సరిగా తెరవడం లేదు. రోజుల తరబడి షాపుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. చాలా మంది దుకాణాల చుట్టూ తిరిగి విసిగివేసారి సరుకులు తీసుకోకుండా ఉండిపోతున్నారు. దీంతో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంత నిల్వలను సరఫరా చేయనట్టు చూపిస్తున్నారు. దీనిని సాకుగా చూపి ప్రభుత్వం అదనంగా సరఫరా చేయాల్సిన పదిశాతం బియ్యం ఇవ్వబోమని చెబుతోంది. కందిపప్పు ఎగ్గొట్టి.. కందిపప్పు సరఫరాకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. వాస్తవానికి చౌక దుకాణాల్లో సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కు ఇవ్వాల్సి ఉంది. కానీ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయని, రేట్లు పెరిగినప్పుడు మాత్రమే సబ్సిడీపై కందిపప్పు ఇస్తామని చెబుతోంది. వాస్తవానికి ఇప్పుడు మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతోంది. దీనిని సబ్సిడీపై చౌకదుకాణాల్లో ఇస్తే లబ్దిదారులపై సగానికి సగం ఆర్థికభారం తగ్గుతోంది. ఈ దిశగా సర్కారు ఆలోచించడం లేదు. మొత్తం కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 15వేల టన్నులు అవసరం. కానీ, ఏడాదిగా అడపాదడపా కేవలం 38వేల టన్నుల కందిపప్పు మాత్రమే కూటమి సర్కారు సరఫరా చేసింది.బేరం కుదర్లేదని టాక్.. సుమారు రూ.500 కోట్ల బకాయిలు సర్కారు చెల్లించకపోవడంతో కందిపప్పు పంపిణీదారులు చౌకదుకాణాలకు సరుకు సరఫరాకు ముందుకు రావడం లేదు. వచ్చినవాళ్లు కాస్త బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ ధర కంటే ఎక్కువకు కోట్ చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ కచ్చితంగా అమాత్యులకు కప్పం కట్టాలనే నిబంధన పెట్టడంతోనే పంపిణీదారులు అధిక ధర కోట్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి విరుగుడుగా అమాత్యులే కొంత మంది వ్యాపారులను ప్రోత్సహించి టెండర్లు వేయించినట్టు సమాచారం. అయితే ఈసారి కప్పం రెట్టింపు ఇవ్వాలని తెగేసిచెప్పడంతో ఖంగుతిన్న సదరు కాంట్రాక్టర్లు మాకెందుకులే ఈ బాధ అని వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఫలితంగా పౌరసరఫరాల సంస్థలో కందిపప్పు కొనుగోళ్లు కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్లకే పరిమితమైందని సమాచారం.ఎమ్మెల్యేను దుమ్ముదులిపిన మహిళ‘‘రేషన్ చూస్తే బియ్యం సరిగారావు. డీలరు బియ్యం లేవు.. కోటా లేదు..అయిపోయిందంటాడు. కందిపప్పు ఇయ్యడు. ఇంకెట్లా సార్..? మాకు బతుకు దెరువు ఎలా..? మాకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటే మేము ఎట్టా బతికేది? నేను రోజంతా కూలి చేస్తే రూ.200 ఇస్తారు. కందిపప్పే కిలో రూ.150 పలుకుతోంది. ఇదేంది సారూ!! జవాబియ్యండి’’ అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని గోవిందమ్మ అనే మహిళా కూలి దుమ్ముదులిపేసింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే ఎదుట ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
జూలైలోనూ వేసవే.!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వెళ్లిపోయింది. వేసవి కాలం ముగిసింది. వర్షాలు దండిగా కురవాల్సిన సమయం.. కానీ భానుడి భగభగలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ సారి నైరుతి ముందుగానే పలకరించినా జూలైలో ముఖం చాటెయ్యడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొడిగాలుల కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో అత్యధికంగా 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జంగమహేశ్వరపురంలో 39.2, కావలి, మచిలీపట్నంలో 38.9, తిరుపతిలో 38.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 14 వరకూ ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని, 15వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
గోదావరికి పెరుగుతున్న వరద
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద క్రమేపీ పెరుగుతోంది. వారం రోజులుగా సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో గోదావరి, శబరి నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి గురువారం 2,86,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం వరద తీవ్రత ఎక్కువైంది. భద్రాచలంలో నీటి మట్టం 37.20 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శని, ఆదివారాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, శనివారం సాయంత్రానికి 7.50 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ముంపు మండలమైన వేలేరుపాడు, కోయిదా రహదారిపై ఉన్న ఎద్దుల వాగు వంతెన పైకి వరద నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రికి వంతెన పూర్తిగా మునిగే పరిస్థితి ఉంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. -
డెత్ ‘స్పిరిట్’.. కబళిస్తున్న కల్తీ మద్యం...!
అప్పటిదాకా అలవాటైన ‘సరుకే’..! కాస్త పడగానే ‘కిక్’ ఇచ్చేదే..! కానీ.. ఇప్పుడెందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం.. ఏమైందో తెలుసుకునేలోపే మృత్యు కౌగిట్లోకి!!ఇదేదో కోవిడ్ మహమ్మారి కాదు... కొత్త వైరస్ అంతకంటే కాదు..!!టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మందు ఎఫెక్ట్ ఇదీ!ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు!రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది..కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే ఉండటంతో వెనకడుగు వేస్తోంది!(సాక్షి, అమరావతి): బాటిల్ మీద ఏసీ బ్లాక్ విస్కీ అని ఉంటుంది... లోపల సరుకు మాత్రం కల్తీ..! సీసా మీద ఓల్డ్ అడ్మిరల్ అని అందంగా కనిపిస్తుంది... మూత తీస్తే కల్తీ మద్యం గుప్పుమంటుంది..! ఏస్పీవై 999 అనే ఆకర్షణీయమైన బ్రాండ్... అది తాగితే కల్తీ నరనరాల్లోకి పాకుతుంది...! రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమే అన్నది నిఖార్సైన నిజం! దీనికి సూత్రధారులు టీడీపీ కీలక నేతలు అన్నది నగ్న సత్యం...!! మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది!రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. అత్యంత హానికరమైన స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయించేస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో కల్తీ మద్యం రాకెట్ వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పి మద్యం ప్రియుల ప్రాణాలను హరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలను వక్రీకరిస్తూ బరి తెగించి స్పిరిట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న దుకాణాలు, బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రాణాలను బలిగొంటున్న వైనం ఇదిగో ఇలా ఉంది..! కేంద్రం ఆదేశాల వక్రీకరణ.. భారీగా స్పిరిట్ అక్రమ సరఫరా కల్తీ మద్యం రాకెట్ నిర్వహణకు టీడీపీ సిండికేట్ వేసిన పన్నాగం విస్మయపరుస్తోంది. కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శానిటైజర్ల తయారీ కోసం అవసరమైన ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు) భారీగా కొనుగోలు చేసేందుకు అప్పట్లో డిస్టిలరీలను అనుమతించారు. సాధారణంగా స్పిరిట్ కొనుగోలుపై నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్‌ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల కుటుంబాలకు చెందినవే కావడంతో కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు.. సిండికేట్ దుకణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి దందా కొనసాగిస్తోంది. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్‌ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తోంది. యానాంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కల్తీ సరుకును బ్రాండెడ్ మద్యంగా విక్రయించేందుకు టీడీపీ సిండికేట్‌కు అధికారిక నెట్వర్క్ఉండటం కలసి వస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను కూడా సిండికేట్ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాదిలో రూ.5,280 కోట్ల దందా 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్ల విక్రయం..! కల్తీ మద్యం దందాను టీడీపీ సిండికేట్ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. డిస్టిలరీలు, కల్తీ మద్యం తయారీ యూనిట్లు, దుకాణాలు, బెల్ట్ షాపులు.. అన్నింటినీ సిండికేటే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా బ్రాండెడ్ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని బరితెగించి విక్రయిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. అత్యంత హానికరం... ఇటీవల పలువురు హఠాన్మరణం.. టీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ దందా మద్యం ప్రియులకు ప్రాణాంతకంగా మారింది. కల్తీ మద్యం తాగడం అత్యంత హానికరం, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (స్పిరిట్)లో వంద శాతం ఆల్కహాల్ ఉంటుంది. అది మనుషులు వినియోగించకూడదు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల (ఆహార ఉత్పత్తులు కాదు) తయారీలో ఉ్రత్పేరకంగా మాత్రమే వాడతారు. స్పిరిట్‌ను బాగా డైల్యూట్ చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గించాలి. అనంతరమే బ్రాండెడ్ మద్యం తయారీలో వాడాలి. అంతకంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉంటే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న కల్తీ మద్యం యూనిట్లలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. అది తెలియని పేద, సామాన్య వర్గాలకు చెందినవారు ఆ కల్తీ మద్యాన్ని సేవించడంతో వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలువురు మద్యం ప్రియులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలే దీనికి నిదర్శనం. టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ ఈ చావులకు కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. సిండికేట్‌కు స్పిరిట్ సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో బయటపడిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతోపాటు కడప, అనంతపురంలో కల్తీ మద్యం తయారీ యూనిట్లపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్‌శాఖ దాడులు జరిపింది. కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రిని జప్తు చేసి కొందరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు అటకెక్కింది. కల్తీ మద్యం సిండికేట్‌కు అక్రమంగా స్పిరిట్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారన్నది ఈ కేసులో అత్యంత కీలకం. దీన్ని ఛేదిస్తే మొత్తం సిండికేట్ దందా బయటపడుతుంది. టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల గుట్టు రట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దర్యాప్తునకు బ్రేకులు వేశారు. టీడీపీ నేతల డిస్టిలరీల జోలికి వెళ్లకుండా ఈ కేసును పక్కదారి పట్టించాలని హకుం జారీ చేశారు. కల్తీ మద్యం తయారీ ఇలా... భారీగా స్పిరిట్ తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం తయారీ చేపడుతోంది. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా వ్యవస్థను నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది. కల్తీ మద్యంతో తీవ్ర దుష్ప్రభావాలు ఇలా... » కల్తీ మద్యంలో ఉండే మెటబాలిజ్డ్ యాసిడ్ మిథనాల్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. న్యూరోసిస్ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడటంతోపాటు కంటి నరాలు దెబ్బతిని అంధత్వం సోకుతుంది. » ఉదర సంబంధిత జబ్బుల పాలవుతారు. » శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. » హృద్రోగ సమస్యల బారిన పడతారు. » కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. » తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కల్తీ మద్యం దందా సూత్రధారుల పాత్రపై ష్...గప్‌చుప్» ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్ శాఖ వెనకడుగు » గుడ్లూరు కేంద్రంగా మూడు జిల్లాల్లో రాకెట్.. » ఎక్సైజ్‌శాఖ దాడుల్లో ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు లభ్యం.. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ బట్టబయలైంది. టీడీపీ సిండికేట్ సభ్యుడైన వీరాంజనేయులు గుడ్లూరులోని మిట్టపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మిషన్, ఇతర సామగ్రితో పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేశాడు. చీరాలలో స్వాదీనం చేసుకున్న కల్తీ మద్యం కేసులో కూపీ లాగితే గుడ్లూరు కేంద్రంగా సాగుతున్న దందా డొంక కదిలింది. ఎక్సైజ్‌శాఖ అధికారుల దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్‌తో పాటు 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుళ్లు బయటపడ్డాయి. కల్తీ మద్యం క్వార్టర్ బాటిల్‌ను రూ.120 చొప్పున విక్రయిస్తూ ఏడాదిగా ఈ రాకెట్ భారీగా కొల్లగొట్టింది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్లు వెల్లడైంది. అందుకోసం 400 లీటర్ల స్పిరిట్‌ను తెప్పించడం గమనార్హం. వీరాంజనేయులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ మద్యం రాకెట్ అసలు సూత్రధారుల గురించి దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం. టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్అనకాపల్లి కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబం దీనికి రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి డిస్టిలరీల వ్యాపారంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్‌ను సరఫరా చేస్తూ కల్తీ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరవాడలో ఇటీవల కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ గుట్టు రట్టైంది. టీడీపీ నాయకుడు రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావు నుంచి 72 లీటర్ల స్పిరిట్, 180 మిల్లీ లీటర్ల 455 ఖాళీ బాటిళ్లు, 1,389 మూతలు, బాటిళ్లపై అతికించేందుకు ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని టీడీపీ సిండికేట్‌కు చెందిన బెల్ట్ దుకాణాల ద్వారా క్వార్టర్ బాటిల్ రూ.130 చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. కల్తీ మద్యం దందాకు రింగ్ లీడర్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సాహసించకపోవడం గమనార్హం. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా సాగుతున్న దందాపై దృష్టి పెట్టలేదు. గోదావరి జిల్లాల్లో పాలకొల్లు స్థావరంగా... నాలుగు జిల్లాల్లో యథేచ్ఛగా సరఫరా.. గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం రాకెట్ పాలకొల్లును స్థావరంగా చేసుకుంది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పారిస్తోంది. ఇటీవల పాలకొల్లులో కల్తీ మద్యం తయారీ యూనిట్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాల ద్వారా ఏకంగా 25 శాతం వరకు కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతతోపాటు ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలియడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పులి శీతల్ అరెస్టుతో సరిపెట్టారు. -
అ‘సమ్మె’తి గళం
సాక్షి, అమరావతి/ఏలూరు(టూటౌన్)/భీమ వరం: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీవో ఎంఎస్ నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని, కేటగిరీల నిర్ణయంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, గతంలో జరిగిన సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైనట్టు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగభూషణ, కె.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు శాంతియుతంగా నిరసన తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వివరించారు. వెంటనే సర్కారు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే వీరికి మద్దతుగా జూలై 16 నుంచి పారిశుద్ధ్య కార్మికులూ సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు కాగా, రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ధర్నాలు, మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. దీంతో పట్టణాలు, నగరాలు హోరెత్తాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ర్యాలీలో విశాఖ నగర యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి అధ్యక్ష, కార్యదర్శులు, టి.నూకరాజు, ఉరుకూటి రాజు పాల్గొన్నారు. మార్కాపురం, నంద్యాల, తాడిపత్రి, బాపట్ల, కడప, ప్రొద్దుటూరు, నందిగామ తదితర ప్రాంతాల్లో కార్మికులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఏఐటీయూసీ, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎ.అప్పలరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద కూడా కార్మికులు ధర్నా చేశారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారి మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్మికులు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. -
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం.. హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది. -
బాబోరు మళ్లీ ఏసేశారు..!
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్‌కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు).ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్. నారా లోకేష్‌కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.-సిమ్మాదిరప్పన్న -
పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పోలీసులకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఎలా పెడతారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఆవేదనతో 7వ తేదీ రాత్రి వేంపల్లి వాసులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. తోపులాటలో పోలీసు స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టులు చేస్తున్నారు.హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల పోలీసుల తీరుపై మండిపడిన హైకోర్టు.. స్టేషన్‌ను చుట్టుముడితే హత్యాయత్నం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఆ సెక్షన్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దాడికి పాల్పడి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి.. ఆ తర్వాత 41ఏ నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు తెలిపింది. నిన్నటి నుంచీ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పటికీ దాదాపు 70 మందిని వరకూ అరెస్ట్ చేశారు. -
హెరిటేజ్ వాళ్లు మోసం చేశారు..
సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన హెరిటేజ్ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్ ఆరోపించాడు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ ఏడాది ఫిబ్రవరి నెల 23న అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా కర్నూలు–వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారుని హెరిటేజ్ కంటైనర్ ఢీ కొందని తెలిపాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని ఆరోజు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదని బాలునాయక్ వివరించాడు.న్యాయం చేయమని వెళితే గెంటేశారు..‘వైఎస్సార్ కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను కలిశా. విషయం చెప్పాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా హెరిటేజ్ యాజమాన్యం న్యాయం చేయలేదు. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేశ్ చాంబర్ కి వెళ్లి మరోసారి విన్నవించా. అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ, హెరిటేజ్ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబసభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలం, ట్రాక్టర్ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని బాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్ యాజమాన్యం, టీడీపీ న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. -
అయిననూ.. మీరు నాన్‌లోకల్!
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్‌లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. పదో తరగతి వరకు ఏపీలోనే చదివి.. తెలంగాణలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను నాన్‌లోకల్ (స్థానికేతరులు)గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలులేకుండా వారి భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.ఏడాదంతా ఏం చేసినట్టు?భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీనిద్వారా తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించాలనేది దీని ఉద్దేశం. దీనినే 2014 రాష్ట్ర విభజన సమయంలోనూ మరో పదేళ్లపాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీవెంకటేశ్వర (ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను (లోకల్ 85 శాతం, నాన్‌లోకల్ 15శాతం) ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15 శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి.. ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావుడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం గమనార్హం.న్యాయస్థానంలో సవాల్?ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానంలో సవాల్ చేస్తే.. పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని.. దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్‌లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు వర్తిస్తుంది.కానీ, ఒక్క ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాత్రమే స్థానికతను మార్పుచేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్లపాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ,్థ తల్లిదండ్రులకు నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుంటే.. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అధికారులు చెబుతున్నారు. చదువు లేని తల్లిదండ్రులున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఈఏపీ సెట్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు
సాక్షి, అమరావతి: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో గురువారం రాష్ట్రస్థాయి ఎంఎస్ఓ–లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీవో) అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్, ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తరఫున రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లతో పాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే విజయవాడలో భారీ నిరసన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం గాందీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. ఎవరేమన్నారంటే.. » సాక్షి టీవీ ఆపేయడం వల్ల కస్టమర్లు డీటీహెచ్‌లకు వెళ్లిపోతున్నారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ టు ఎయిర్ ఛానళ్లను ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. » పే ఛానళ్ల వ్యవస్థ, ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. » ఏపీలో పే ఛానళ్ల రేట్ల పెంపుదలతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. ట్రాయ్‌లో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడ్ కాస్టర్ల వ్యవస్థ ఎంఎస్ఓలను సైతం బ్లాక్ మెయిల్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బ్రాడ్ కాస్టర్లు దిగిరాకపోతే పే ఛానళ్లను అవసరమైతే నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం త్వరలోనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడనుందని, విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణపత్రాలను సిద్ధం చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణపత్రాల తాత్కాలిక జాబితాను యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఈ పత్రాలను విద్యార్థులు ముందుగానే సమకూర్చుకుంటే నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. తద్వారా చివరి నిమిషంలో రద్దీ, ఆన్లైన్ దరఖాస్తుల ప్రాసెసింగ్, ధ్రువీకరణలో జాప్యాన్ని నివారించడానికి వీలుంటుందని పేర్కొన్నారు.విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు⇒ నీట్ యూజీ–2025 ర్యాంక్ కార్డు⇒ జనన ధ్రువీకరణపత్రం (ఎస్ఎస్సీ మార్కుల మెమో)⇒ ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమో⇒ 6 నుంచి 10వ తరగతి, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్⇒ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ లేదా 10+2)⇒ కుల, మైనారిటీ ధ్రువీకరణపత్రం⇒ ఎకనమిక్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) కోసం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత జారీ చేసిన ఆదాయ, అస్సెట్స్ సర్టిఫికెట్⇒ తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణపత్రం/రేషన్ కార్డు⇒ ఆధార్ కార్డు, విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో⇒ టస్పోర్ట్స్, ఎన్సీసీ, 15 శాతం అన్–రిజర్వ్డ్ సీట్లను క్లెయిమ్ చేసుకునే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలను సమకూర్చుకోవాలి. -
బాబు కళ్లల్లో ఆనందం కోసం.. రైతులపై కుళ్లు రాతలా?
నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి, అయిన ఖర్చుకు, ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధరలేక కడుపు మండి మా గోడు వైఎస్ జగన్‌కు చెప్పుకుందామని వెళితే మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్‌గా, సైకోలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులంటే అంత అలుసా? అధికార పారీ్టపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబుకు భజన చేసుకోవాలి. – ఉమాపతి, బట్టికండ్రిగ, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా ‘‘ఏడాదిగా పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. దిక్కుతోచక రోడ్డెక్కి అనేకమార్లు ఆందోళనలు చేశాం. ఏనాడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మా సమస్యలను సమాజం దృష్టికి తీసుకువెళ్లలేదు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ పర్యటనకు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. జగన్ రాకతోనే మా కష్టాలు సమాజానికి తెలిశాయి.అందువల్లే కూటమి పాలకులు జీర్జించుకోలేకపోతున్నారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పచ్చపత్రికలు బాధ్యతను మరిచి రైతులపై కుళ్లు రాతలు రాశాయి. కల్లాకపటం ఎరుగని రైతులను కరుడుగట్టిన నేరస్తులైన దండుపాళ్యం బ్యాచ్‌తో పోలుస్తారా? అసలు చంద్రబాబే తన అక్కసును ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తల రూపంలో వెళ్లగక్కుతున్నారు. వెంటనే రైతులపై దుర్మార్గపు రాతలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం..’’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. - చిత్తూరు అర్బన్ ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయిరైతు పొలంలో కాలు పెడితేనే ఎంత ధనవంతుడికైనా తిండి నోట్లోకి వెళుతుంది. అలాంటి అన్నదాతలు ఆ పచ్చ పత్రికలకు దండుపాళ్యం బ్యాచ్‌లా కనిపిస్తున్నారా? ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయి. అందుకే ఇంత నీచమైన పదజాలం వాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట వల్ల నష్టాలు వస్తే, కోత కోసే కూలీకి కూడా గిట్టుబాటు లేక తోటలోనే పంటను వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇలాంటి పిచ్చిరాతలు రాసే వారికి ఏం తెలుసు? – కృష్ణయ్య, చిన్నబ్బనాయుడు కండ్రిగ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లాఇంత నీచంగా వర్ణిస్తారా?పత్రికలు రైతుల పక్షాన నిలవాలి. లేకుంటే ఊరకుండాలి. ఇలా రైతులను ఆడిపోసుకోవడం మంచి సంప్రదాయం కాదు. రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఎల్లో మీడియా అభివర్ణించడం ముమ్మాటికీ సభ్యసమాజం తలదించుకునే చర్యే. రైతులపై ఆ పత్రికలకు అంత కక్ష ఎందుకో? నాకు 30 ఎకరాల పొలం ఉంది. మామిడి తోట సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చి అమ్మకాలకు వెళితే ధర పడిపోయింది. తీవ్రంగా నష్టపోయాం. వైఎస్ జగన్‌కు మా బాధను తెలియజేసేందుకు వెళ్లాం. అంతమాత్రాన రైతుల్ని ఇంత నీచంగా వర్ణిస్తారా? – రామకృష్ణమ రాజు, నారపరాజు కండ్రిగ, విజయపురం మండలం, చిత్తూరు జిల్లాఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మా కష్టాలను గుర్తించి, పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. రైతు సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేము వెళితే దండుపాళ్యం బ్యాచ్‌గా చిత్రీకరించడం బాధాకరం. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోండి. – రంగనాథ్, యువ రైతు, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లాకూటమి నేతలే అసలైన దండుపాళ్యం బ్యాచ్దేశానికి అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం బాచ్‌తో పోల్చడం బాధాకరం. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన జగనన్నను కలిస్తే తప్పా? ఆయనపై అభిమానంతో స్వచ్ఛందంగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నింది కూటమి ప్రభుత్వమే. వైఎస్ జగన్ రాకతోనే మామిడి రైతుల కష్టాలు సమాజానికి తెలిశాయి. అసలైన దండుపాళ్యం బాచ్ కూటమి నేతలే. – మనోహర్‌రెడ్డి, పెరుమాళ్లపల్లి, యాదమరి, చిత్తూరు జిల్లాఈనాడులో పిచ్చివ్యాఖ్యలు దారుణం ఈనాడు సహా ఎల్లో పత్రికల్లో పిచ్చి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మామిడి రైతులను ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు లేకుండా నట్టేట్లో ముంచటంతోపాటు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనటం పద్ధతికాదు. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ వస్తే నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాయటం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను దారి పొడవునా పెట్టి స్వచ్ఛందంగా వస్తున్న రైతులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించింది.. దీన్ని ఏమంటారు? చంద్రబాబు రైతులకు ఎప్పుడూ మేలు చేయరు. మేలు చేసే వారిని చూసి ఓర్వలేడు. చంద్రబాబు తన అక్కసును పచ్చ పత్రికల ద్వారా తీర్చుకుంటున్నారు. – లోకనాథరెడ్డి, ఐరాల, చిత్తూరు జిల్లారైతులకు క్షమాపణ చెప్పాలిమామిడి రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ దుష్ప్రచారం చేసిన పచ్చ పత్రిక యాజమాన్యం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ అనుకూల దినపత్రిక రైతులపై విషం చిమ్మడం తగదు. – నారాయణప్ప, పుంగనూరు, చిత్తూరు జిల్లారైతులను నేరస్తులతో పోలుస్తారా?నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. దానిలో నాలుగు ట్రక్కులు మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు టోకెన్లు లేక తరలించలేకపోయాను. మేం పడుతున్న కష్టాలను మా నాయకుడు వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు ఎంతో ఆశతో వెళితే మాకు పోలీసులు నిరాశ మిగిల్చారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కరుడుగట్టిన నేరస్తులతో పోల్చడం దుర్మార్గం. అసలు రైతు లేకపోతే మీరు ఏం తింటారు? – యుగంధర్ నాయుడు, దిగువ కండ్రిగ, చిత్తూరు జిల్లా.ఎన్నడూ ఇలాంటి రాతలు చూడలేదునా సొంత తోటతోపాటు కొన్ని మామిడి తోటలు కౌలుకు తీసుకున్నా. సుమారు 50 ట్రక్కుల వరకు మామిడి ఉంది. ఇప్పటివరకు 30 ట్రక్కుల వరకే ఫ్యాక్టరీకి తరలించాను. ప్రస్తుతం ఉన్న కాయలను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం మద్దతు ధర కూడా లేదు. మా బాధలను వైఎస్ జగన్‌కు చెప్పుకొనేందుకు వస్తే కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. ఎన్నడూ మామిడి రైతులు ఇలాంటి కష్టాలు పడలేదు. ఎప్పుడూ పత్రికలు ఇలా రైతులను చులకన చేసి నీచంగా వార్తలు రాయడం చూడలేదు. – ధనుంజయరెడ్డి, కలికిరిండ్లు, చిత్తూరు జిల్లారైతులను అవమానించడం సిగ్గుచేటుఆంధ్ర అంటే అన్నపూర్ణ అని దేశవ్యాప్తంగా అంటారు. దీనికి కారణం అన్నదాతలు కష్టపడి పంటసాగు చేయడమే. అటువంటి రైతులను కూటమి నాయకులు, పచ్చ మీడియా కలిసి దండుపాళ్యం బ్యాచ్ అని అవమానపరచడం సిగ్గుచేటు. దండుపాళ్యం బ్యాచ్ అనేవారు ఒక్కరోజు పొలంలో పని చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నదాత కష్టం, ఆవేదన. – మునికృష్ణయ్య రైతు, మెట్టు, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లారైతుల ఉసురు తగులుతుందిఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆక్రందనతో రోడ్డెక్కితే పచ్చ పత్రికల్లో రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ అవమానించడం అత్యంత దుర్మార్గం. రైతుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం, ఆ పత్రిక బంగాళాఖాతంలో కలవడం ఖాయం. – శంకర్‌రెడ్డి, గురవరాజుపల్లి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లాఓర్వలేకే ఈనాడు ఉన్మాదపు రాతలు... రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నిరాదరణకు గురై అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన విజయవంతం కావటంతో ఓర్వలేని కూటమి పాలకులు ఈనాడు, తోకపత్రిక చేత రైతులను దండుపాళ్యం బ్యాచ్‌గా అభివర్ణిస్తూ ఉన్మాదపు రాతలు రాయించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి, ఆ పత్రికకు రైతులు తగిన బుద్ధి చెబుతారు. – హేమలత, చెంగారెడ్డి పట్టెడ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా -
పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ నియామక మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పోలీసు కానిస్టేబుల్ –సివిల్ (పురుషులు, మహిళలు), పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ–పురుషులు) మెయిన్ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరవ్వగా, 33,921 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 29,211 మంది, మహిళలు 4,710 మంది ఉన్నారు. ఈ మేరకు గురువారం పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.slprb.ap.gov.in వెబ్సైట్లోఉంచినట్టు వివరించారు. తుది కీలో అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యర్థనలను పరిశీలించి దిద్దుబాటు చేసినట్టు ప్రకటించారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 12వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రూ.వెయ్యి రుసుము చెల్లించి ఆన్లైన్లో రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
మధ్యాహ్న భోజనం అధ్వానం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం గురువారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం (మెగా పీటీఎం 2.0) విఫలమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు, అధికారులకు చాలాచోట్ల తల్లిదండ్రులు షాకిచ్చారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉందని.. మీ పిల్లలకు ఇలాగే పెడతారా అంటూ నిలదీశారు. ‘గోరుముద్ద’గా పేరు మారిస్తే సరిపోదని.. అంతే గొప్పగా అందించాలన్నారు. పాఠశాలల్లో పెట్టే భోజనం తినలేక పిల్లలు ఇబ్బందిపడుతున్నారని, ఒక్కరోజు తింటే అరగక ఆస్పత్రి పాలవుతున్నారని విజయవాడలో తల్లులు అధికారులను ఘెరావ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ‘మెగా పీటీఎం’లో అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మొత్తం 61,135 విద్యా సంస్థల్లో తలపెట్టిన ఈ మెగా పీటీఎం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకే పరిమితమైంది. 70 శాతానికి పైగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా తరగతులు నిర్వహించాయి. మెగా పీటీఎంలో 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు, దాతలు తదితరులు మరో 1,49,92,456 మంది కలిపి మొత్తం 2,28,21,454 మంది పాల్గొంటారని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, అందులో సగం మంది కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. ఇది గిన్నిస్ రికార్డుపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాల్లో ఎలా జరిగిందంటే..» వైఎస్సార్ కడప జిల్లాలోని చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చెన్నుపల్లె ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన పిల్లలను ఎస్. వెంకటాపురం పాఠశాలలో విలీనం చేశారు. తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపబోమంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. » చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతున్నా కూడా ఉడకని అన్నం, గుడ్లను పెట్టడంతో విద్యార్థులు పడేయగా దీనిపై తల్లిదండ్రులు ఎంఈఓ నటరాజరెడ్డికి ఫిర్యాదుచేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తేనే తమ పిల్లలను స్కూల్‌కు పంపుతామని.. లేదంటే టీసీలు ఇవ్వాలని డిమాండు చేశారు. » తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకుల కండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల విలీనంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలలకు తాళాలు వేసి ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఉపా«ద్యాయులను వెనక్కు పంపారు. »పల్నాడు జిల్లా నకరికల్లు పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని.. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనమే పెడతారా అంటూ తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. » ఈ సమావేశం రోజు కూడా విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం పెట్టడంతో ప్రకాశం జిల్లా మర్రిపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మండిపడ్డారు. పెద్దదోర్నాల కస్తూరిబా పాఠశాలలో పారిశుధ్యం లోపించిందని.. పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఫిర్యాదుచేశారు. » ప్రభుత్వం అందించిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తండ్రి ఆరోపించారు. » అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల మెగా పేరెంట్స్ మీటింగ్ రసాభాసగా సాగింది. జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో ఉపాధ్యాయుల్లేని సమావేశాలెందుకని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. -
రైతులు అసాంఘిక శక్తులా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతుల పక్షాన మేం నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు రాతలు రాయడం ఏమిటి? అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా... వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, సంబరాలు చేసుకుంటున్నట్టు రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబూ ..! రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు’ అని ప్రశ్నించారు. బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ గురువారం స్పందించారు. చంద్రబాబు సర్కారుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మామిడి రైతులపై పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలిసీఎం చంద్రబాబూ...! మీరు, మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సహా మీకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయాయి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వందల మందిని నోటీసులతో నిర్బంధించినా.. అణచివేతలకు దిగినా.. చివరకు లాఠీఛార్జీ చేసినా వెరవకుండా తమ గోడు చాటుతూ బుధవారం బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటనకు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వం తీరుపట్ల రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్లుగా.. తమ కష్టాలు చెబుతున్న రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడటం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజాన మోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న చులకన భావానికి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు! ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబూ..! పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి! పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి!సమాధానం చెప్పలేక తప్పుడు రాతలావైఎస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజూ ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25 – 29 మధ్య ధర లభించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయాయి? ఏటా మే 10 – 15 మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఎందుకు తెరవలేదు? నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబూ? ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్లు కాదా?మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్.. ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అసలు మీరు ఇస్తానన్న కిలోకి రూ.4 ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? నిరుడు వైఎస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29 రేటు? ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి రూ.2.5 – రూ.3 ఎక్కడ? ప్రతిపక్ష నేతగా, రైతుల పక్షాన బుధవారం బంగారుపాళ్యంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?రైతులు నష్టపోయినట్లు ఒప్పుకుంటూనే దౌర్భాగ్యపు మాటలు, రాతలా?నిజంగానే మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే.. రైతులు పంటను తెగనమ్ముకోకపోతే.. మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయాన్ని పక్కనపెడితే.. కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? పల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు? కర్ణాటకలో కిలో రూ.16 చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్లు ఒకవైపు మీరు అంగీకరిస్తూనే ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎలుగెత్తితే మళ్లీ ఈ దౌర్భాగ్యపు మాటలు, రాతలు ఏమిటి? ఈ ఆంక్షలు ఎందుకు?గల్లా, శ్రీని ఫుడ్స్‌కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా..?రైతాంగానికి అండగా నిలిస్తే రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలా..మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే... రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగీ, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీ దృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు...!! అంతేకదా చంద్రబాబూ...? వీరికి ఏ సమస్యా లేదని, అన్ని హామీలను మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకుని వీరంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం! కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా వీళ్లంతా అసాంఘిక శక్తులు కాబట్టి రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం? ఇదేం పద్ధతి? ఇదేం విధానం చంద్రబాబూ..?ఒక్క కిలో అయినా కొన్నారాగిట్టుబాటు ధరలు రావడం లేదని మిర్చి రైతులు గగ్గోలు పెట్టినా ఒక్క కిలో అయినా కొన్నారా చంద్రబాబూ..? మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి... ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు. మిర్చి రైతులు ధరలు రావడం లేదని ఆక్రోశిస్తే కేంద్రం చేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? పొగాకు రైతులు ఆందోళన చేస్తే ఇంకో డ్రామా చేస్తూ ప్రకటనలు చేయిస్తున్నారు. రైతుల సంక్షేమంపై మీరు ఏనాడైనా చిత్తశుద్ధితో వ్యవహరించారా?మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేలు ఇవ్వలేదుమీరు ఇస్తానన్న రైతు భరోసా (అన్నదాతా సుఖీభవ) రూ.20 వేలు ఇంతవరకూఇవ్వలేదు. గతేడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదీ ఇప్పటివరకు దిక్కులేదు. ఈ ఏడాది జూన్ 21కి ఇస్తానని చెప్పి, జూలై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ దాని గురించి ప్రస్తావించడం లేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్య గోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.రైతులు నష్టపోతున్నా ఆ పని ఎందుకు చేయడం లేదుమా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పని చేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే విషయంపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే సీఎం యాప్ ఏమైంది?ఇన్పుట్ సబ్సిడీ గాలికి వదిలేశారువరదలు వచ్చినా, కరువులు వచ్చినా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని మీరు గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారు. ఆర్బీకేలు, ఈ–క్రాప్ విధానం, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎండగడితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి. -
‘అమ్మఒడి’ దొంగలు!
మొన్నటి నిజం..‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ – ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటనేటి అబద్ధం..‘తల్లికి వందనం’ పథకం లోకేశ్ ఆలోచనే..!! – కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబుసాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్ కూర్చున్న టేబుల్ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్‌ను కూడా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్ జగన్ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పిదాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. సదుపాయాలన్నీ జగన్ సర్కారు సమకూర్చినవే..వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్‌పీలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. వైఎస్ జగన్ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్‌పీ స్క్రీన్ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ను తానే నిరి్మంచానని.. సెల్‌ఫోన్, కంప్యూటర్ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్ఈ సిలబస్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్ బోధనను చేరువ చేశారు. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్‌ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్ జగన్ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. ఈ విద్యా ప్రగతి మీది కాదు..కూటమి పాలనలో ఈవెంట్ ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులుమెగా పీటీఎంపై సోషల్ మీడియాలో విమర్శలు కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపోతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో గురువారం మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలనలో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన పాఠశాలలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్ కూర్చుని వేడుకలు చేసుకున్నారని సెటైర్లు వేశారు. ‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్‌పీ ప్యానల్ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాలలకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భాటపు పనికిమాలిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యాయులను ఈవెంట్ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీశారు. మీ ‘పేరెంట్ టీచర్ మీటింగ్’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్ షాప్‌లో, బుక్ షాప్‌లో, ఫ్లెక్సీ షాప్‌లో చూసినా అయ్యవార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధికారుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకా?
సాక్షి, అమరావతి :గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని బటర్‌ఫ్లై పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే, అతని వియ్యంకుడైన ఓ రాష్ట్ర మంత్రి తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, వారికి సంబంధించిన స్థలాన్ని భూమార్పిడి కింద తాము తీసుకునేందుకు అనుమతినిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని గతంలో ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టు గుర్తుచేసింది. అయినా ఇప్పుడు తిరిగి అదే పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు భూమార్పిడి కింద ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. భూ మార్పిడి విషయంలో పురపాలక శాఖ నియమించిన కమిటీ నివేదిక సైతం చాలా అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరుకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపుపై పిల్..జీవీఎంసీ వార్డు నెం.6లో ఉన్న బటర్‌ఫ్లై పార్కు స్థలాన్ని భూ మార్పిడి పద్ధతిన పోతిన అప్పారావు, పిళ్లా లక్ష్మణపాత్రుడికి కేటాయించేందుకు వీలుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది మే 13న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలుచేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. భూ మార్పిడి పేరుతో విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇదే వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు వ్యవస్థలను, అధికారులను మేనేజ్ చేసి విలువైన పార్కు స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని ఇవ్వకూడదని నిర్ణయించిన ప్రభుత్వం, రాజకీయ జోక్యంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి పొందిన పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే పనులు చేస్తున్నారని, హైకోర్టు జోక్యం చేసుకోకపోతే విలువైన స్థలం చేజారిపోతుందన్నారు. -
‘ఏపీ జల్‌జీవన్’ ద్వారా రూ.10వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్’ను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్‌జీవన్ మిషన్ ఇచ్చే నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ వాటా కోసం స్వయంప్రతిపత్తి సంస్థగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతి మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చిస్తుందని తెలిపారు. ఈ సమీకరణ ఎందుకన్నదీ వివరించిన తర్వాత ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, దీంతో రాజధాని మలి విడత భూ సమీకరణకు ఆమోదం వాయిదా పడింది.ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి పంట సేకరణ, కిలోకు రూ.4 చొప్పున చెల్లింపునకు రూ.260 కోట్ల మంజూరుకు అంగీకారం. రూ. 286.20 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ముందుభాగంలో ఇసుక తొలగింపునకు పరిపాలన అనుమతి. దీనిని లంప్సమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టేలా టెండర్లకు ఆహా్వనం. అన్ని అనుమతులతో పాటు ఇసుక తొలగింపు పనులను జల వనరుల శాఖ బదులు సీఆర్డీఏకు అప్పగింత.కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ధికి నిధుల కోసం, కుప్పం విమానాశ్రయానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్, అత్యవసర పెండింగ్ పనుల పూర్తికి హడ్కో నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం సమకూర్చుకునేందుకు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుమతి. అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సరీ్వసుల అధికారుల నివాస సముదాయం పనుల్లో వేగం పెంచాలని నిర్ణయం. మిగిలిన పనుల పూర్తికి రూ.524.70 కోట్ల మంజూరుకు ఆమోదం. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017 ప్రకారం సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను సమీక్షించే ప్రతిపాదనకు అంగీకారం. æ మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే అప్పు చేసిన రూ.6,700 కోట్లకు అదనంగా రూ.వెయ్యి కోట్లు అప్పు చేసేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం. రైతులకు ధాన్యం బకాయిల కోసం రూ.672 కోట్లు మంజూరు. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో జమ. కోకో గింజల సేకరణ కోసం రూ.14.88 కోట్లు మంజూరు. అమరావతిలో “వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఏపీ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్’ స్థాపనకు ఆమోదం. నీటి వనరుల శాఖలోని వివిధ చీఫ్ ఇంజనీర్ల ఆధీనంలో ఉన్న 71 పనుల కొనసాగింపు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు మధ్య తరహా ప్రాజెక్ట్ కింద కుడి ప్రధాన కాలువ స్లూయిస్ల అత్యవసర మరమ్మతులకు రూ.22.50 లక్షలు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దును మార్చడానికి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపునకు పరిహారంగా అదనంగా 790 ఎకరాల సేకరణ, మొత్తం 2001.80 ఎకరాలు బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు బదిలీకి, స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపునకు అనుమతి. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–2025–30కు ఆమోదం. నెల్లూరు జిల్లాలో పెట్రోలియం రిఫైనరీ–పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్ట్ రెండవ దశ, సంబంధిత లాజిస్టిక్స్ పారిశ్రామిక టౌన్íÙప్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణను పూర్తి చేయడానికి రెండేళ్ల కాలానికి కందుకూరు–కావలిలో స్పెషల్ కలెక్టర్ యూనిట్, ఐదు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ల ఏర్పాటు రాజధాని పరిధిలో 1,575 మంది భూమి లేని పేదలకు పెన్షన్ల పునరుద్ధరణకు ఆమోదం. 2022 జనవరి 13న హింసాత్మక దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం. -
భూసేకరణపై కూటమిలో వణుకు.. చంద్రబాబు రుసరుసలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి మలి విడత భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ భేటీలోనే.. మలి విడత కింద 20 వేల ఎకరాలకు పైగా సమీకరణకు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి కార్యరంగం సిద్ధమైంది. మున్సిపల్ మంత్రి నారాయణ సైతం భూ సమీకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.అయితే, రాజధాని రైతుల్లోనే ఆందోళన రావడం, తొలి విడత సమీకరణ చేసిన గ్రామాల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కలి్పంచకుండా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు తిరిగివ్వకుండా రెండో విడత సమీకరణ ఏమిటనే వాదన మొదలైంది. మలి విడత సమీకరణ ద్వారా రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు రాజధాని కడుతున్నారని ప్రస్ఫుటం అవుతోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అందుకే భూ సమీకరణకు ఆమోదం తెలపకుండా.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, రాజధాని మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చించడంతో పాటు ఎందుకు ఈ సమీకరణ చేస్తున్నదీ వివరించిన తరువాత ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు.దీంతోనే మలి విడత భూ సమీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తేలిపోయింది. ఇదంతాచూస్తే.. రాజధాని భూ సమీకరణలో ముందుకెళ్లాలని నిర్ణయించినా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సోలార్ ప్రాజెక్టు కోసం 8 వేల ఎకరాలను తీసుకోవడంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని, మనం తప్పు చేస్తున్నట్లు స్పష్టమైందని, ప్రజలు దీనిపైనే మాట్లాడుకుంటున్నారని మంత్రులు అన్నట్లు సమాచారం.దేనిపైనా సరిగా స్పందించడం లేదు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు భారీగా ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని ఆంక్షలు పెట్టినా అంతమంది ఎలా వచ్చారంటూ మంత్రులపై కోపం చూపించినట్లు తెలిసింది. మంత్రులు సరిగా పనిచేయడంలేదని, దేనిపైనా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారని సమాచారం. తోతాపూరి మామిడి కొనుగోలులో సంబంధిత శాఖల మంత్రులు బాధ్యతగా వ్యవహరించలేదని, ఇలాగైతే మంత్రులను మార్చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం.పనిచేయనివారి స్థానంలో కొత్త వారిని పెడతానని అన్నట్లు తెలిసింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విషయంలోనూ మంత్రులు చురుగ్గా వ్యవహరించలేదని, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు చేసినా మంత్రులు ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రజలను మేనేజ్ చేయలేని వారికి పదవులు ఎందుకని అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను నిలువరించడంలో మంత్రులు విఫలం అవుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోసోల్ భూముల విషయంలో వైఎస్ జగన్ వైఖరిపై మంత్రులు ఎవరూ సరిగా స్పందించలేదని అందువల్లే కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు జనంలోకి వెళ్లిందని అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ పర్యటనలు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్న అంశాలను వివాదాస్పదం, డైవర్షన్ చేయడంపై దృష్టిపెట్టాలని పరోక్షంగా సూచనలు చేసినట్లు తెలిసింది. -
ఇదేమి చిత్రం.. ఆచార్యా!
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే చాలా కోర్సులు మూతపడగా.. ఉన్న వాటిలోనూ చేరికలు తగ్గిపోయాయి. ఈ తరుణంలో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది నుంచి సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ–ఎంఎల్) కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్టు వర్సిటీ ప్రచారం చేస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ఫీజిబులిటీ రిపోర్టు కూడా సక్రమంగా లేకపోవడం, డీపీఆర్ సైతం నామమాత్రంగా ఉండటంతో అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు సమాచారం. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ వర్సిటీకి ప్రభుత్వం రూపాయి సాయం చేయట్లేదు. ఇలాంటి తరుణంలో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు భరోసా ఎక్కడ నుంచి లభిస్తుందో చెప్పలేని దుస్థితి. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో కోర్సులు అందించినప్పటికీ ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆర్థిక వనరులు తగ్గిపోయి నిర్వహణ ఖర్చు పెరిగిపోతుంది. వర్సిటీని ఆర్థికంగా బలోపేతం చేయకుండా ప్రభుత్వం కొత్తగా కళాశాలలను మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వర్సిటీలు ప్రభుత్వ సెట్స్ ద్వారా కాకుండా సొంత విధానంలో ఇంజినీరింగ్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేసుకోవడం చట్ట విరుద్ధమని విద్యావేత్తలు చెబుతున్నారు. అయ్యో.. ‘శ్రీనివాస వనం’ఇన్చార్జిల పాలనలో ఆర్థిక అరాచకత్వం, వనరుల విధ్వంసంతో యూనివర్సిటీ ప్రతిష్ట దారుణంగా దిగజారింది. ఇలాంటి సమయంలో వర్సిటీని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడియన్ వర్సిటీ ఉంది. టీటీడీ ప్రోత్సాహంతో వర్సిటీలో శ్రీనివాస వనం పేరుతో దశాబ్దాలుగా చెట్లను పెంచారు. ఇన్చార్జి పాలకులు అడ్డగోలు టెండర్లు పిలిచి చెట్లను నిలువునా కొట్టేశారు. సుమారు 100 ఎకరాల్లో చెట్లను నరికేశారు. దీనిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లగా ఎండిన చెట్లను తొలగించే క్రమంలో కొన్ని పచ్చని చెట్లపై పడటంతో వాటిని తొలగించాల్సి వచ్చిందని సమాధానం ఇవ్వడం.. దానికి సీఎంవో అధికారులు తలూపడంపై కుప్పంలో చర్చ నడుస్తోంది. టన్ను కట్టెలు రూ.5 వేలు ఉంటే.. కేవలం రూ.3 వేలకే విక్రయించినట్టు.. అది కూడా మూడు లోడ్లు సరుకు వెళితే రికార్డుల్లో ఒక్క లోడు మాత్రమే చూపించడం వంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. చెట్లను నేలకూల్చి విక్రయించగా వచ్చిన నగదులో ఈసీ అనుమతి లేకుండా రూ.25 లక్షలు వెచ్చించి రెండు వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ జీవో ప్రకారం వర్సిటీ అవసరాలకు కొత్త వాహనాల కొనుగోలు కంటే అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవాలని ఆదేశాలున్నాయి. కానీ, ఆ జీవోలను కాలరాస్తూ ద్రవిడియన్ వర్సిటీ ఇన్చార్జి పాలకులు విద్యార్థులకు అత్యవసర సేవల పేరిట వాహనాలు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల విలువ దాటితే తప్పనిసరిగా ఈసీలో అనుమతి తీసుకోవాలి. ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. -
బిల్లుకు మించి బాదుడు!
సాక్షి, అమరావతి: వినియోగించిన విద్యుత్‌కు బిల్లులు వసూలు చేయడం పరిపాటి. కానీ చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త విధానాన్ని తెచ్చింది. వాడని కరెంట్‌కు కూడా బిల్లులు బాదుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి తీసుకోకుండా, కమిషన్‌కు కనీసం చెప్పకుండా ఏడాదిగా జనం జేబులకు చిల్లు పెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024–25కి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) ప్రతిపాదనల ‘సాక్షి’గా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్లో భారీ రేటుకు.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా ఏడాదిలోనే రూ.3,500 కోట్లకుపైగా వెచ్చించడం గమనార్హం. యూనిట్ ఏకంగా రూ.6.78 చొప్పున బయట నుంచి కొన్నది. ఇలా కొన్న విద్యుత్‌కు వినియోగదారుల నుంచి ఎఫ్‌పీపీసీఏ చార్జీల రూపంలో అదనంగా రూ.2,376.94 కోట్లు వసూలు చేయాలని డిస్కమ్‌లు లెక్కగట్టాయి. యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటికే వసూళ్లు ప్రారంభించాయి. డిస్కమ్‌ల వద్ద ఇప్పటికే జనం డబ్బులున్నా.. ప్రతి నెలా బిల్లుల్లో అదనంగా చార్జీలు వేసి ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేశారు. అంటే నిర్దేశించిన దానికంటే రూ.410.25 కోట్లు అదనంగా వసూలు చేశారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) రూ.1,065.76 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఈ డిస్కమ్ వద్ద 2024 ఏప్రిల్ నాటికి రూ.161.04 కోట్ల మేర వినియోగదారుల డబ్బులున్నాయి. క్యారీయింగ్ కాస్ట్ (ఆదాయం) మరో రూ.65.47 కోట్లు నిల్వ ఉంది. అందువల్ల ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఈ డిస్కంకు లేదు. అయినా అకారణంగా జనం నెత్తిన భారం వేశారు. మొత్తంగా ప్రజల సొమ్ము రూ.1,292.27 కోట్లు ఈ డిస్కమ్ వద్ద ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) రూ.349.91 కోట్లు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఎస్పీడీసీఎల్) రూ.492.77 కోట్లు చొప్పున మొత్తం రూ.842.17 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీకి ప్రతిపాదించాయి. అంటే దాదాపు రూ.3,629 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది. ఈ లెక్కన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.19 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపినట్లైంది!గత ప్రభుత్వ ఆదాతో తగ్గిన భారం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంస్కరణలు, వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్స్) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4,434.50 కోట్ల మేర నిర్వహణ ఖర్చులను ఆదా చేసింది. 2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ రూ.1,974.75 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఇక 2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. గత ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లు మేర ఆదా అయింది. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రజలపై రూ.4,434.5 కోట్ల మేర భారం తగ్గింది. -
వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు.. దెబ్బకు దిగొచ్చిన కూటమి ప్రభుత్వం
సాక్షి,వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుకు కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో మెరిట్ విధానంలో అడ్మిషన్స్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.మంగళవార ఇడుపులపాయ సమీపంలోని వీరన్నగట్టుపల్లె వద్ద మంగళవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోందని విద్యార్థులు ఆయనకు వివరించారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ మేరకు ఈ ప్రభుత్వం నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను.. మేలుకో బాబూ’ అంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఇవాళ హడావిడిగా తప్పుల తడకలతో నేరుగా అడ్మిషన్స్ అంటూ ఆదేశాలు జారీ చేసింది. -
ఉచిత బస్సు జిల్లా వరకే..!
సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు హామీకి కూటమి ప్రభుత్వం ఆంక్షల బ్రేక్ వేస్తోంది. కేవలం జిల్లా వరకు మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై మంత్రులే లీకులిస్తున్నారు. గతంలో మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా హస్తిన పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా వరకే ఉచిత ప్రయాణమని చెప్పారు. దీనిపై రవాణాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఆగస్టు 15 నుంచి పాత జిల్లాల పరిధిలోనే ఉచిత బస్సు పథMý ం అమలు చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది మహిళలను మోసగించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే మంత్రుల ద్వారా లీకులు! ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉచిత బస్సుపై మంత్రుల ద్వారా లీకులు ఇప్పిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హామీ ఇచ్చేటప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. గతంలో మంత్రి సంధ్యారాణి జిల్లా వరకే ఉచిత బస్సు అని ప్రకటించి తాను అలా అనలేదని ఆనక మాట మార్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు పాత జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణ అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు వల్ల భారం పడుతుందని అనుకూల పత్రికల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హామీ ఇచ్చేటప్పుడు భారం పడుతుందని తెలీదా అంటూ అక్కచెల్లెమ్మలు మండిపడుతున్నారు. -
గుండె ‘కాయ’కు గాయం!
చిత్తూరు అర్బన్: మామిడి పంట చిత్తూరు జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు మామిడికి అనుకూలం కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఈదఫా 39,895 హెక్టార్లలో ఐదు లక్షల టన్నులకుపైగా తోతాపురి దిగుబడి వచ్చినట్లు అంచనా. విస్తారంగా కాసినా రైతన్నల ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలోకి రూ.12 మద్దతు ధర చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి రూ.4 ప్రోత్సాహకమూ దక్కలేదు. ర్యాంపుల వద్ద రూ.2–3 మాత్రమే పలుకుతున్నాయి.చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతులు రాత్రింబవళ్లు మామిడి కాయల లోడ్లతో నిరీక్షిస్తున్నారు. గుడిపాల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు కాయల లోడ్ ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోయాయి. దిక్కుతోచని రైతన్నలు రోడ్లపై పారబోస్తున్నారు.. ఉచితంగా పంచి పెడుతున్నారు... కూలీ, రవాణా ఖర్చులూ రాకపోవడంతో చెట్లకే కాయలను వదిలేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కడుపు రగిలిపోయిన పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు. రైతులపై కేసులు, జరిమానాలు.. రైతన్నలు కన్నెర్ర చేయడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నుతోంది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఆరుగురు రైతులపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో తోతాపురి కిలో రూ.23–25 సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2023–24లో తోతాపురి మామిడి కిలో రూ.23–25 వరకు పలికింది. కిలో రూ.15–20కి మించి ఎప్పుడూ తగ్గలేదు. గత ప్రభుత్వం పంట మార్కెట్‌కు వచ్చే ముందే కార్యాచరణ సిద్ధం చేసి కలెక్టర్ల నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం, రైతులు, ఉద్యాన, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీలు నియమించింది. గుజ్జు పరిశ్రమలతో సమీప తోటలను అనుసంధానం చేశారు. మార్కెట్లో డిమాండ్‌కు తగినట్టుగా దశల వారీగా కోతలు చేపట్టేలా అవగాహన కల్పించేవారు.దీంతో ఇతర మామిడి రకాలు సైతం 2019–24 మధ్య టన్ను రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పలికాయి. గత ప్రభుత్వంలో 10 లక్షల టన్నుల మామిడి గుజ్జుతో పాటు దాదాపు 2,500 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశారు. మామిడి రైతుల కోసం రూ.35 కోట్లతో ప్రత్యేకంగా 1,752 ప్యాక్ హౌస్‌లు, రూ.40 కోట్లతో 347 కలెక్షన్ సెంటర్లు నిర్మించారు. మరో రూ.22.50 కోట్లతో 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్లతో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మాణం చేపట్టగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలోనే నిలిపివేసింది.గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన పండ్ల దిగుబడుల కోసం రాయితీతో ఫ్రూట్ కవర్లు అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మామిడి రైతులు 21 వేల ఎకరాల్లో కొత్తగా తోటలను విస్తరించగా, మరో 20,585 ఎకరాల్లో తోటలను పునరుద్ధరించగలిగారు. కరోనా విపత్తులోనూ మామిడితో పాటు ఇతర పండ్ల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా గత సర్కారు చర్యలు తీసుకుంది.కిలో రూ.2.50.. చిత్రంలో కనిపిస్తున్న రైతు దామోదర్‌రెడ్డికి చిత్తూరు పరిధిలోని మాపాక్షి గ్రామంలో ఎనిమిది ఎకరాల మామిడిì తోట ఉంది. ఈసారి వంద టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు 60 శాతం పంట మాత్రమే అమ్ముడైంది. ర్యాంపు వద్ద కిలో రూ.2.50 చొప్పున అమ్మేశాడు. భారీగా నష్టం రావడంతో మామిడి చెట్లను కొట్టేసి కొబ్బరి సాగు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.ఒక్క కాయ కోస్తే ఒట్టు.. ఈ చిత్రంలో ఉన్న మహిళ కృష్ణవేణి సొంతూరు యాదమరి మండలం మార్లబండ. మూడెకరాల తోతాపురి మామిడి తోట ఉన్నా కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో ఒక్క కాయ కూడా కోయకుండా వదిలేసింది. కాయలన్నీ రంగు మారి రాలిపోయే దశలో ఉన్నాయి. ర్యాంపుల్లో అడిగితే రూ.2 అంటున్నారని.. అది కూడా డబ్బులు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారని కంటతడి పెడుతోంది.చెట్లపైనే కుళ్లిపోతున్నాయి ఐరాల మండలం కామినాయన పల్లెకి చెందిన సుధాకర్‌నాయుడు 25 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ధర లేకపోవడంతో కోత కోయకుండా అలాగే వదిలేశారు. దీంతో కాయలు చెట్లపైనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి.మానసికంగా కుంగిపోయి.. ఈ ఏడాది ఎక్కువ దిగుబడి రావడంతో సంతోషించా. కానీ పంటను కొనేవారు లేక కాయలు మాగి రాలిపోయాయి. ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఒక్క టోకెను సాధించలేకపోయా. ర్యాంపు దగ్గర ధరలు కూలీలకు, బాడుగలకు కూడా సరిపోదు. మానసికంగా కుంగిపోయి 45 ఏళ్ల వయస్సున్న 50 చెట్లను నరికేశా. – రమేష్, సరకల్లు గ్రామం.. తవణంపల్లె మండలం కోత ఖర్చులూ కరువు.. నాలుగు రోజులుగా రేయింబవళ్లు ఫ్యాక్టరీ ఎదుట పడికాపులు కాస్తున్నాం. దోమలు కుట్టి చేతులు కాళ్లు వాచిపోతున్నాయి. మాకు ఏడెకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది నాలుగు లోడ్లు పంట వచ్చింది. ఫ్యాక్టరీ వద్ద రోడ్ల మీదే సగం కుళ్లిపోతోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదు. – హేమంత్, గొల్లపల్లి గ్రామం,చిత్తూరు రూరల్ మండలం ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? ఐదు రోజులుగా జైన్ కర్మాగారం ఎదుట కష్టాలు పడుతున్నాం. కలెక్టర్ ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. మంచినీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నాం. అందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు లేవు. రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? – ముని రాజారెడ్డి, వేపంజేరి గ్రామం తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది.. కాయలు తోలుకొచ్చా. నేనొచ్చి రెండ్రోజులు అవుతా ఉండాది. ఇంటికి వెళ్లకపోయేసరికి నా భార్య ఏడుుస్తా ఉండాది. తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది. కాయలు దిగేకి రెండ్రోజులు పట్టేటట్టు ఉండాది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, పలమనేరు, చిత్తూరు జిల్లా కాయలు కొన్న వ్యాపారి రావట్లేదు.. కాపు వచ్చినప్పుడే తోటను ఓ వ్యాపారికి అమ్మేశా. రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. కలర్ కాయలు (టేబుల్ రకాలు) మాత్రమే కోశారు. తోతాపురి కోయలేదు. ఫోన్ చేస్తుంటే అదిగో.. ఇదిగో అంటున్నారు. – చంద్రన్, పచ్చనపల్లి గ్రామం, చిత్తూరు మండలం ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు... నాకు మూడెకరాల మామిడితోట ఉంది. ఇప్పటివరకు రెండు లోడుల కాయలు అన్లోడింగ్ చేయించా. ఇంకా మూడు నాలుగు లోడ్ల కాయలున్నాయి. రేటు ఎంతో చెప్పడం లేదు. ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు. – గోవిందస్వామి, చిత్తపార, గుడిపాల మండలంరేటు కూడా తెలియకుండా.. పదేళ్ల క్రితం ఏడెకరాల్లో 350 మామిడి మొక్కలు పెట్టా. నీళ్ల ట్యాంకులు, మందులకు రూ.80 వేల వరకు ఖర్చైనాది. ఫ్యాక్టరీ వద్దకు వెళితే టోకెన్లు దొరకలేదు. పది టన్నులు చెట్లపైనే వదిలేశా. 20 టన్నులు ఫ్యాక్టరీకు ఇచ్చేదానికి రెండు రోజులుగా ఇక్కడే ఉన్నా. పండిన పంటను రేటు తెలియకుండానే అమ్ముకుంటున్నది ఒక్క మామిడి రైతే అనుకుంటా..! – కె.మదన్మోహన్ నాయుడు, పెరుమాళ్ల కండ్రిగ, చిత్తూరు మండలం -
కొత్త హైవేలకు 'రెడ్‌సిగ్నల్'
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కొత్త జాతీయ రహదారుల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర జాతీయ రహదారుల శాఖ సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదనను తాము పరిశీలించడంలేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే 425 కి.మీ. మేర నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని మూడు ముఖ్యమైన రహదారులతోపాటు గోదావరి జిల్లాల్లోని ఓ రహదారిని ఆ జాబితాలో చేర్చింది. అవి.. ఎన్‌హెచ్‌లుగా చేయలేం.. అయితే, ఈ నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని.. ఈ నేపథ్యంలో.. కొత్తగా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించలేమని కేంద్రం స్పష్టంచేసింది. దీంతో.. కొత్త జాతీయ రహదారులుగా గుర్తింపు సాధించే ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 4,500 కి.మీ. అభివృద్ధి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడంలో సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్టరహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సాధించడంలో ఘోరంగా విఫలమైందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం (చెన్నై–కోల్‌కత జాతీయ రహదారి) నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మీదుగా పార్వతీపురం జిల్లా కేంద్రం నుంచి ఒడిశాలోని రాయగడ వరకు ఉన్న 145 కి.మీ. రోడ్డు..శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుంచి పార్వతీపురం జిల్లా కేంద్రం వరకు 151 కి.మీ. రోడ్డు..విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వరకు 71 కి..మీ. రోడ్డు.. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు 58 కి.మీ. రోడ్డు. ఈ నాలుగు రాష్టరహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తిస్తే తదుపరి దశ కింద మరో మూడువేల కి.మీ. మేర రాష్ట్ర రహదారుల జాబితాను కూడా రాష్ట ప్రభుత్వం రూపొందించింది. ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. గత ఏడాది డిసెంబరులో పంపిన ప్రతిపాదనలు ఆమోదం పొందిన తరువాత ఆ మూడు వేల కి.మీ. రాష్టరహదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని భావిస్తోంది. -
అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరోవైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఫోన్ చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా మార్కెట్ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్‌కు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
మీరు చెబుతున్నదానికి.. పరిస్థితులకు పొంతన లేదు కదా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట అన్నీ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ధ్రువీకరిస్తూ దాఖలు చేసిన నివేదికలపై హైకోర్టు సందేహాలు లేవనెత్తింది. పోలీసులు చెబుతున్నదానికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకీ పొంతన కనిపించడం లేదని తెలిపింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. ఈ ఠాణాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ధ్రువీకరించారని, ఇదే స్టేషన్‌కు సంబంధించి మరో కేసులో సంబంధిత మేజిస్ట్రేట్ ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉందని తమకు నివేదిక ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వాస్తవాలను తేల్చేందుకు న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ లోపల, బయట కనిపించేలా వాటిని ఏర్పాటు చేశారా? సక్రమంగా పనిచేస్తున్నాయా? తదితర వివరాలను న్యాయవాదుల కమిటీ ద్వారా తెప్పించుకుంటామని తెలిపింది. ఇప్పటికీ చాలా స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ఎందుకనేది వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ జగడం సుమతిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1,001 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారన్నారు. మిగిలిన స్టేషన్లలో కూడా ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అక్కడ తప్ప అన్నీ స్టేషన్లలో ఏర్పాటు చేశాంప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, లాకప్‌లు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లాకప్‌లు లేనిచోట పెట్టలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. చాలా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి లాకప్‌లు లేని కార్యాలయాలు, పోలీసు ట్రైనింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి హింసించిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనివి స్టేషన్ల నిర్వచనం పరిధిలోకి వస్తాయో రావో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పోలీసుల దర్యాప్తు తీరుపై సందేహం కలుగుతోందిఆటో డ్రైవర్ కస్టోడియల్ టార్చర్‌పై స్పందించిన హైకోర్టుసాక్షి, అమరావతి: టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వగానే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, ఎస్ఐ సౌందర్య రాజు చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. అరెస్ట్ సహా జరిగినదంతా గమనిస్తే పోలీసుల దర్యాప్తు తీరుపై ప్రాథమికంగా సందేహం కలుగుతోందని తెలిపింది. అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలంది. గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తంగేడు గ్రామం చెన్నయపాళెం క్రాస్‌రోడ్డు వరకు సీసీ కెమెరాల ఫుటేజీని సమర్పించాలని దాచేపల్లి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులిచ్చారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.దాచేపల్లి మండలం తంగెడకి చెందిన హరికృష్ణ ఎన్నికల సమయంలో తమపై బాంబులు వేశారని, తాజాగా హత్యాయత్నం చేశారంటూ టీడీపీ కార్యకర్త షేక్ హుస్సేన్ ఈ ఏడాది మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే తన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని హరికృష్ణ తండ్రి ఎల్లయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమారుడి అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సూరపురెడ్డి గౌతమి వాదించారు. -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్‌లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్‌కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
పేదల గుండెచప్పుడు డాక్టర్ వైఎస్సార్
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు దేశంలోనే ట్రెండ్‌ను సెట్ చేశాయని, అందుకే ‘పేదల గుండెచప్పుడు వైఎస్సార్’ అని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతలు అంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హనుమంతరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి వారు భారీ కేకును కట్ చేశారు. తర్వాత పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ దూరమయ్యి 15 ఏళ్లు గడిచినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికీ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా రైతులను రాజుగా నిలబెట్టారని చెప్పారు. పేదవాడికి ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయన్నారు. ప్రతి మనిషినీ సంతోషంగా నవ్వుతూ పలకరించడం వైఎస్సార్ నుంచే నేర్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడని, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన విజనరీ అని కొనియాడారు. మళ్లీ వైఎస్సార్ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జయంతినాడే వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ అధికారులు దారుణ ఘాతుకానికి తెగబడ్డారు. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్ జయంతి రోజునే ఉద్యోగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే యథాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తదుపరి పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
డేటా క్లీన్‌తో దుబారాకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిణతి చెందుతున్న కొద్దీ అధిక నాణ్యతతో కూడిన డేటా రూపకల్పనకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టంచేసింది. గత దశాబ్దంలో భారత్ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు సాధించిందని.. తద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్తో నెలకు ట్రిలియన్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తోందని తెలిపింది. అలాగే, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల డేటాను క్లీన్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నాణ్యతతో కూడిన కచ్చితమైన సమాచారంతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించింది. డేటా నాణ్యత బలోపేతంపై నీతి ఆయోగ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. డేటా పొరపాట్లతో భారీ మూల్యం.. డిజిటల్ పేమెంట్స్‌లో ఇప్పుడు డేటా నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే పౌరుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. డిజిటల్ యుగంలో ఒక తప్పు అంకె పెన్షన్‌ను ఆపగలదు లేదా ఆరోగ్య సంరక్షణను తిరస్కరించగలదు. డేటాలో చిన్నచిన్న తప్పులు భారీ ఖర్చులకు కారణమవుతుంది. అలాగే, ఆధార్ నమోదు సమయంలో ఒక తప్పు అంకె పెన్షన్‌ను బ్లాక్ చేస్తే.. నకిలీ మొబైల్ నంబరు ఆసుపత్రి క్లెయిమ్‌ను నిలిపివేయొచ్చు. భూమి రికార్డులో తప్పుగా నమోదైన పేరువల్ల పరిహారాన్నీ ఆలస్యం చేస్తుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకాలు, రాష్ట్ర కార్యక్రమాల్లో ఇలాంటి తప్పులను గుర్తించకపోతే జరిగే ఆర్థిక నష్టం ఊహించలేం. డేటాలోని తప్పులు నిజాయతీ క్లెయిమ్స్‌ను తిరస్కరించడమే కాదు.. అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. డేటా నాణ్యత విధానాన్ని తక్షణం సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో.. ప్రతీ మంత్రిత్వ శాఖ నుంచి సమిష్టి చర్యలు.. స్పష్టమైన జవాబుదారీతనం, నిబద్ధత అవసరం.డేటా క్లీన్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా.. » గత ఏడాది దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల డేటాను క్లీన్ చేయడం ద్వారా 1.71 కోట్ల మంది అనర్హుల పేర్లను తొలగించగా.. రూ.9,000 కోట్లు ఆదా అయ్యాయి. » గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్ల డేటాను క్లీన్ చేయడం ద్వారా 3.5 కోట్ల బోగస్ ఎల్పీజీ కనెక్షన్లను తొలగించగా రూ.21,000 కోట్లు ఆదా అయ్యాయి. » అలాగే, ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా రూ.10,000 కోట్లు ఆదా అయ్యాయి.డేటా నాణ్యత జాతీయ ఆవశ్యకత.. ప్రతి రికార్డ్ కచ్చితమైనదిగా ఉండాలి. డేటా నాణ్యత అనేది ఫ్రంట్‌లైన్ పాలనగా మారాలి. డిజిటల్ ఇండియాను నిర్మించడానికి డేటా నాణ్యతను బలోపేతం చేయడం ద్వారా మన ఆశయాలను సాకారం చేసుకోవాలి. డిజిటల్ పరిణామం తదుపరి దశను ప్రారంభించే సమయంలో డేటా నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఇది కేవలం ఆకాంక్ష కాదు.. జాతీయ ఆవశ్యకత. మరోవైపు.. క్రమం తప్పకుండా డేటా ఆడిట్లను నిర్వహించాలి. తరచూ సమీక్షల ద్వారా చిన్నచిన్న సమస్యలు సంక్లిష్టం కాకుండా నివారించాలి. -
నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసింది. వర్సిటీ అధికారిక వెబ్సైట్లో జాబితాను అందుబాటులో ఉంచారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర విద్యార్థులు సాధించిన ర్యాంక్‌లు, స్కోర్లలో భారీ వ్యత్యాసం నెలకొంది. గతేడాదితో పోలిస్తే...2024తో పోలిస్తే..మొదటి వందమంది లోపు విద్యార్థులు 681–710 స్కోర్ సాధించగా.. వందో విద్యార్థికి అప్పట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 6,488 వచ్చింది. ఈ దఫా వందలోపు విద్యార్థులు 593–669 వరకూ స్కోర్ సాధించగా, వందో విద్యార్థికి 1,946 ర్యాంక్ వచ్చింది. గతేడాది 500, ఆపైన స్కోర్ చేసిన విద్యార్థులు 7,261 మంది ఉండగా.. ఈసారి 1,813 మంది ఉన్నారు. గతంలో 400–499 స్కోర్ చేసిన వారు 4,517 మంది ఉండగా.. ఇప్పుడు 6,810 మంది ఉన్నారు.ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్రాష్ట్రస్థాయి అర్హుల జాబితా వెలువడిన దృష్ట్యా త్వరలో కన్వీనర్, యాజమాన్య కోటా ప్రవేశాలకు వేర్వేరుగా హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆధారంగా మెరిట్ జాబితాలు ఖరారు చేస్తారు. ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయిలో తొలుత కన్వీనర్, అనంతరం యాజమాన్య కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు. 2024–25 విద్యా సంవత్సరం ప్రకారం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, బీ, సీ కేటగిరి ఎంబీబీఎస్ సీట్లు 6,510 ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 4,521 సీట్లుండగా.. ప్రభుత్వ కళాశాలల్లోని 475 సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 4,046 సీట్లను రాష్ట్రస్థాయిలో కన్వీనర్ కోటా కింద వర్సిటీ భర్తీ చేస్తుంది. 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. బీడీఎస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 1,540 సీట్లుండగా.. ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు.దళారుల మాటలు నమ్మి మోసపోవద్దువిద్యార్థుల సమాచారం కోసం అర్హుల జాబితా విడుదల చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం వెల్లడించారు. వర్సిటీ, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు ఇప్పిస్తామనే దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపునకు సంబంధించిన ప్రతి సమాచారం వర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. నీట్ ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లను కేటాయిస్తామన్నారు. -
డీఎస్సీ అభ్యర్థులకు ‘చుక్కలే’ సమాధానం
కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మెగా డీఎస్సీ–2025 గందరగోళంగా మారింది. ఈ పరీక్షలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆన్లైన్లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో తీవ్రమైన తప్పులు జరిగాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాధానాలు గుర్తించినా తప్పుగా చూపుతోందని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొన్నింటినే ఆన్సర్ చేసినట్టు నమోదైందని ఆధారాలతో చూపుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా పాఠశాల డైరెక్టరేట్‌కు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సోమవారం రాత్రి డైరెక్టరేట్ ఎదుట అభ్యర్థులు ఆందోళనకు దిగారు.విద్యాశాఖ జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. వాటి ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్ల (జవాబులతో సహా అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలు)ను ఈ నెల 3వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో ఉంచారు. వాటిని చూసిన అభ్యర్థులు తాము గుర్తించిన జవాబులకు, రెస్పాన్స్ షీట్లలో ఉన్న వాటికి పొంతన లేదంటున్నారు. మొత్తం 16,437 పోస్టులకు గాను 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించగా.. 5,36,690 దరఖాస్తులకు సంబంధించి అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇందులో చాలామంది ఇప్పుడు ఒకే తరహా సమస్యతో డైరెక్టరేట్‌కు క్యూకట్టారు. – సాక్షి, అమరావతిరెస్పాన్స్ షీట్లు చూసి షాక్టెట్ పరీక్షల్లాగే డీఎస్సీ పరీక్షలను కూడా ఆన్లైన్లో నిర్వహించారు. పీఈటీ/పీడీ పరీక్షలకు 100 మార్కులకు గాను 200 బిట్లకు 3 గంటల సమయంలో, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు 80 మార్కులకు గాను 160 బిట్లకు 2.30 గంటల్లోను జవాబులు గుర్తించాలి. అభ్యర్థులు కంప్యూటర్లో కనిపించే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. జవాబు గుర్తించి సేవ్ చేస్తేనే ఆ ప్రశ్న నమోదవుతుంది. మైనస్ మార్కులు లేకపోవడంతో అభ్యర్థులు దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినట్టు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరీక్ష కోసం కసరత్తు చేయడం, డీఎస్సీకి ముందు కూడా ఆన్లైన్లో టెట్ నిర్వహించడంతో పూర్తిస్థాయి అనుభవంతో పరీక్ష రాసినట్టు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు రెస్పాన్స్ షీట్లు చూసి షాక్ తింటున్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా.. 20 నుంచి 60 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా ఉండటంతో కంగుతిన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఎస్జీటీ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను, 150కి జవాబులు గుర్తించగా.. కేవలం 10 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్టు చూపుతోంది. మిగిలిన 140 ప్రశ్నల జవాబులకు చుక్కలు నమోదయ్యాయి. పైగా ఆ పది జవాబులు మొత్తం ప్రశ్నపత్రంలో అక్కడొకటి.. అక్కడొకటి చూపడం గమనార్హం. ఇదే తరహాలో కాకినాడ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ మేథమేటిక్స్ పరీక్షలు రాయగా.. రెండు పరీక్షల్లోనూ 19 నుంచి 24 ప్రశ్నలకు అసలు సమాధానాలు చూపడం లేదు. తాము పెట్టిన జవాబుకు ఎంపిక వద్ద ఎక్కువ ప్రశ్నలకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్) కనిపిస్తోంది. ఇదే సమస్య వందలాది డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొన్నారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కుతోనే తలరాతలు మారిపోతాయని, ఇప్పుడు డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ జీవితాలు తల్లకిందులవుతున్నాయని అభ్యర్థులు విలపిస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నా సరిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆది నుంచీ వివాదాస్పదమేకూటమి అధికారంలోకి రాగానే 2024 జూన్‌లో సీఎంగా చంద్రబాబు తొలి సంతకం 16,437 పోస్టులతో డీఎస్సీ ఫైల్‌పై చేశారు. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఏడాది పాటు కాలయాపన చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్‌కు, పరీక్షకు 90 రోజుల గడువునిస్తామన్న హామీని పక్కనబెట్టి కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు ప్రారంభించారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో ఆప్షన్లు నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ఏకంగా అభ్యర్థులు గుర్తించిన జవాబులు కనిపించడం లేదు. ఈ నెల 25 నాటికి ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. డీఎస్సీ పరీక్షల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించకుండా ముందుకెళితే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది. 2018 డీఎస్సీ నిర్వహణలోనూ నాటి టీడీపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటీవల గ్రూప్–2 మెయిన్స్‌ను సైతం వాయిదా వేస్తామని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే ప్రకటించి అందుకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించడం చూస్తుంటే.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఒకటి రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే డీఎస్సీ నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.బ్యాకప్ తీస్తామంటున్న అధికారులుఅభ్యర్థులు చెబుతున్న విషయాలతో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. జవాబులు గుర్తించిన తర్వాత సేవ్ చేయలేదని.. దాంతో ఖాళీగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి సమస్య లేదంటున్నారు. అభ్యర్థులు రాసిన ఆన్లైన్ పరీక్షకు సంబంధించి ‘బ్యాకప్’ ఉంటుందని.. ఎన్నిసార్లు ప్రశ్నపత్రం తెరిచారు, ఎన్నిసార్లు సేవ్ చేశారు, ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారో సమయంతో సహా నమోదవుతుందంటున్నారు. డైరెక్టరేట్‌కు వచ్చిన అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు, రెస్పాన్స్ షీట్లు తీసుకుని పూర్తి వివరణ ఇస్తామంటున్నారు. అయితే, వారం రోజులుగా అభ్యర్థులు డైరెక్టరేట్‌కు తిరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవడంపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
లోప‘భూ’యిష్టం
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పులు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. భూ వివాదాల కంటే భూమి రికార్డుల్లో తప్పుగా నమోదవుతున్న వివరాల వల్లే ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ తప్పులు సరిదిద్దకపోవడం, సరిదిద్దే యత్నం చేసినా ఉన్నతాధికారుల లాగిన్లలో మారకపోవడంతో అవి అలాగే కొనసాగుతున్నాయి. ఫలితంగా పేదలు సంక్షేమ పథకాలు అందక అల్లాడుతున్నారు.ఇవిగో నిదర్శనాలుకాకినాడ జిల్లా కరప మండలం వేళంగికి చెందిన రాయుడు గిరిజకు ఎక్కడా భూమి లేదు. కానీ ఆమెకు యండమూరులోని 509/2, 505/1 సర్వే నెంబర్లలో 11.3 సెంట్ల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఈమెకు ఇద్దరు పిల్లలు. ఈమె పేరుపై భూమి ఉందని రికార్డవడంతో ఇటీవల తల్లికి వందనం పథకం వర్తింపజేయలేదు. ఈ విషయాన్ని వీఆర్వోకు చెప్పినా, కలెక్టరేట్‌కు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.తణుకు మండలం మందపాకకు చెందిన రాజేశ్వరికి ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కంకణంపాడు అగ్రహారంలోని సర్వే నంబర్ 273లో 27 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఆమె నివాసం ఉన్న చోటకు, భూమి ఉందని చూపిన గ్రామానికి సంబంధమే లేదు. ఈమెకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం పథకం వర్తింపజేయలేదు. అధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదు.జేసీ లాగిన్ నుంచి సరిచేయాలంట..! తప్పులను సరిదిద్దాలంటే జేసీ లాగిన్ నుంచి సరిచేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో తమకు పథకాలన్నా వర్తింపజేయాలి.. లేదా ఆ భూములన్నా స్వా«దీనం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్లు, ఎల్పీఎం నెంబర్లు, అనుభవదార్ల పేర్లు, విస్తీర్ణాలు, హద్దులు, కొలతలు, భూమి స్వభావాలు వంటి అనేక విషయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తప్పులు లెక్కలేనన్ని జరిగాయి. ఈ తప్పులపై తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాజధానిలో సీసీఎల్ఏ కార్యాలయంలోనూ కుప్పలుతెప్పలుగా అర్జీలు పేరుకుపోతున్నాయి. అయినా వీటి గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలోనూ భూములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేసినట్లు ప్రకటించారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం సమస్యలు అలాగే కొనసాగుతుండడం గమనార్హం. -
పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీæడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నకు వైఎస్ జగన్ ఫోన్..పచ్చమూకల దాడి సమాచారం తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. విమర్శలు జీర్ణించుకోలేకే దాడి..జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే.. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రం కోవూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండ్రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలను ప్రసన్నకుమార్‌రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. దీనిని టీడీపీ మూకలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది.ప్రశాంతిరెడ్డి అనుచరుల పనే?కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రశాంతిరెడ్డి అవినీతిని ప్రసన్నకుమార్‌రెడ్డి నిలదీస్తూ వచ్చారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం..నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే ప్రప్రథమం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తుండేవారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అణిచివేత ధోరణులకు బరితెగిస్తున్నారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టాలివైఎస్సార్సీపీ నేతల డిమాండ్ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించిన నెల్లూరు జిల్లా నేతలునెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అనిల్‌కుమార్ యాదవ్ పోలీసులను డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత పలువురు వైఎస్సార్సీపీ నేతలు పొదలకూరు రోడ్డులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరి తెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో బిహార్ సంస్కృతిని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. -
మళ్లీ ‘షాక్’!
సాక్షి, అమరావతి: నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనేమో..! ‘మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం... ఇంకా తగ్గిస్తాం..’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ అరిచి మరీ చెప్పారు చంద్రబాబు! కానీ అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికొదిలేశారు. చార్జీలు పెంచం అని నేనెప్పుడు చెప్పానంటూ నిస్సిగ్గుగా మాట మార్చేశారు. ఇప్పటికే ఏడాదిలోనే ఏకంగా రూ.15,485 కోట్లకుపైగా విద్యుత్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు. అయినా ఆయన శాంతించడం లేదు. రెండో ఏడాదిలో అడుగు పెడుతూనే మరోసారి జనం నెత్తిన చార్జీల పిడుగు వేస్తున్నారు. ఈసారి మరింత భారీగా వసూలుకు అనుమతి కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. ఓవైపు ‘సూపర్‌సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఇలా విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచేస్తోంది!! అవసరం లేకున్నా అడ్డదారిలో వసూలు.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి.. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీన్ని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున విధించి వసూలు చేయటాన్ని అడ్డదారిలో గతేడాదిలోనే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. అంతేకాదు అవసరం లేకపోయినా ఈ ఏడాది మార్చి వరకూ రూ.2,787.19 కోట్లు ఇప్పటికే జనం నుంచి లాగేశారు. అంటే రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేసేశారు. అయితే అది కూడా సరిపోనట్లుంది.. మరో రూ.842.68 కోట్లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే మొత్తం రూ.3,629.87 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది. వస్తూనే షాక్‌లు మొదలు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే విద్యుత్ చార్జీలను పెంచడం మొదలుపెట్టింది. గతేడాది చివరి నుంచే అంటే నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు సరికదా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వినియోగించిన విద్యుత్‌కు రెట్టింపు అదనపు చార్జీలు పడుతున్నాయి. అంతంత బిల్లులు కట్టలేక జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేమంటూ మండిపడుతున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా మరోసారి చార్జీలు వసూలు చేసేందుకే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపించింది. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలపై రూ.19,115.23 కోట్ల చార్జీల భారాన్ని మోపినట్లైంది. సంపద సృష్టిస్తాం అని పదేపదే చెప్పిన చంద్రబాబు, కూటమి నేతలు.. ఇలా తమ దగ్గర డబ్బులు లాక్కుని సృష్టిస్తారని తెలుసుకోలేకపోయామని జనం గగ్గోలు పెడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటే విద్యుత్ చార్జీలను డబుల్ చేయడమా బాబూ..? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బాబు పాలనంటే ఇంతే..! చంద్రబాబు పాలనలో అటు ప్రజలను, ఇటు విద్యుత్ సంస్థలను దోపిడీ చేయడం పరిపాటిగా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.6.99, పవన విద్యుత్‌కు రూ.4.84 చెల్లించి కొనుగోలు చేశారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి విద్యుత్ సరఫరా ధర సోలార్ రూ.5.90, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.63కి చేరింది. నిజానికి అప్పట్లో సోలార్ యూనిట్ రూ.2.44కు, పవన విద్యుత్ యూనిట్ రూ.2.43తో ఇతర రాష్ట్రాల్లో ఒప్పందాలు జరిగాయి. చంద్రబాబు నిర్వాకాల వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), నిర్లక్ష్యం కారణంగా 2014–19 మధ్య విద్యుత్ సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. విద్యుత్ సంస్థల అప్పులు, బకాయిల భారం 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే (2019 మార్చి 31) నాటికి రూ.86,215 కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా రూ.56,663 కోట్లకు ఎగబాకింది. డిస్కంల వార్షిక ఖర్చులకు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించలేదు. దీంతో ఐదేళ్ల టీడీపీ హయాంలో డిస్కంల నష్టాలు రూ.6,625.88 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు ఎగబాకాయి. జగన్ పాలనే బాగుంది... ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించడంతోపాటు గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ సరఫరా అందిస్తూ, అందుకుగానూ డిస్కంలకు దాదాపు రూ.50 వేల కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించింది. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున అందిస్తూ యూనిట్‌కు రూ.3.50 సబ్సిడీని భరించింది. 2,809 ఫీడర్లను బలోపేతం చేసి అదనపు సామర్ధ్యం కల్పించడం ద్వారా మొత్తం 6,663 ఫీడర్లతో పగటిపూట వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందచేసింది. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ నిరాటంకంగా అందించాలనే సంకల్పంతో అడుగులు వేసింది. ఇందుకోసమే ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్ కేవలం రూ.2.49 ధరతో సరఫరా చేసేలా, ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సామాన్య ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుచూపుతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకూ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో ఏకంగా రూ.8,19,815 కోట్లతో 25 ఇంధన రంగ ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో అన్నీ తారుమారవుతున్నాయి. ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల భారాలు పిడుగుల్లా పడుతున్నాయి. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్‌షో, పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని, వారికిచి్చన 9 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారం చేపట్టాక ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వారిని హీనాతిహీనంగా, దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వలంటీర్ల మాదిరిగా ఇంటింటికీ తిప్పుతూ పని చేయిస్తున్నారని, అంత పని చేయించుకుని ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తున్నారని తెలిపారు. పోలీసులపై కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, డీజీ స్థాయి అధికారులతో సహా అనేక మంది పోలీసులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనంత నీచస్థాయికి దిగజార్చారని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదన్నారు.మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇవ్వలేదని.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పీఆరీసీ కమిషన్‌ను నియమించలేదని రెప్పారు. ఏడాది గడిచినా ఐఆర్ ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే 27 శాతం ఐఆర్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.22 వేల బకాయిల్ని పట్టించుకోవడంలేదని, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు.ఆప్కాస్ కింద భద్రంగా ఉన్న అవుట్‌సోరి్సంగ్ ఉద్యోగులను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లో పెట్టి దోపిడీకి గురి చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఏకంగా వాళ్ల ఉద్యోగాలు తీసివేశారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వెంటనే ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాలని వెంకట్రావిురెడ్డి డిమాండ్ చేశారు. -
ఇక శత్రు డ్రోన్లు ఢమాలే..
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శత్రు దేశాల డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జలసమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాది దేశం పాకిస్థాన్ భారత్‌పై డ్రోనాస్త్రాలు సంధించగా వాటిని తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆదర్శంగా తీసుకుని సముద్ర జలాల్లో శత్రుదేశాల మానవ రహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి.. వాటిని జల సమాధి చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థని యుద్ధ నౌకల్లో ఏర్పాటుకు హిందూస్థాన్ షిప్‌యార్డు పెంటగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. షిప్‌యార్డు సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రీ నేతృత్వంలో పీఆర్ఎస్ సంస్థ ఎండీ డాక్టర్ స్వామినాథన్ మణికందన్, షిప్‌యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.30 కి. మీ దూరంలోనే పసిగట్టేలా..ప్రస్తుతం కొన్ని యుద్ధ నౌకల్లో షార్ట్ రేంజ్ కమ్యునికేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. వీటి ద్వారా నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని పసిగట్టి సమాచారాన్ని ప్రధాన కేంద్రానికి అందిస్తుంటాయి. కానీ.. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.యుద్ధ నౌకలకు డ్రోన్ ముప్పు ఉండదికసముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు ఈ ఒప్పందం ద్వారా సమగ్ర రక్షణ లభిస్తుంది. దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ వ్యవస్థని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం. రక్షణ రంగ సాంకేతికతలో షిప్‌యార్డు భాగస్వామ్యం మరింత పెరుగుతోంది. వచ్చే త్రైమాసికంలో ఇంటిగ్రేషన్ ట్రయల్స్‌ని ప్రారంభిస్తాం. తర్వాత తొలి విడతలో ఫ్రంట్‌లైన్ యుద్ధ నౌకల్లో ఈ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హెచ్ఎస్ఎల్యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రత్యేకతలివీ⇒ రియల్‌టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లనూ సులువుగా గుర్తించవచ్చు. ⇒ ఒక్క అడుగు కూడా కదలనియ్యకుండా ధ్వంసం చేయొచ్చు. ⇒ 400 ఎంహెచ్‌జెడ్ 6గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు, నౌకాదళ కేంద్రాలకు ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ శత్రుదేశాల సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది. -
మొహం చాటేసిన సర్కారు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొహం చాటేసింది. పల్లె వైద్యం బలోపేతం చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా అప్పట్లో నియమించారు. వీరంతా సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. గ్రామీణ వైద్యం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో చర్చలు జరిపిన ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించారు.స్పందన ఏదీ!?ఉన్నతాధికారులు మాటివ్వడంతో వీరంతా సమ్మె విరమించి విధుల్లో చేరారు. సమ్మె విరమించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో హెల్త్ ఆఫీసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైద్యశాఖ మంత్రితో సమావేశం కోసం కోరగా, నాడు హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరు సమ్మెలో ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఆరు నెలల ఇన్సెంటివ్ బకాయిలు రూ.77.33 కోట్లు విడుదలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ ఏడాది మే 8న ప్రొసీడింగ్స్ ఇచ్చినా నిధులు మాత్రం జమ చేయడం లేదు.మృతుల కుటుంబాలకు భరోసా లేదుసర్వీస్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస భరోసా కూడా లభించడం లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వీరందరికీ ఈపీఎఫ్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఏడాది నుంచి ఈ సౌకర్యాన్ని వైద్య శాఖ నిలిపేసింది. వీరి సమ్మె డిమాండ్స్‌లో ఈపీఎఫ్ పునరుద్ధరణ కూడా ఒకటిగా ఉంది. సాధారణంగా ఈపీఎఫ్ వాటాదారు మృతి చెందితే ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు బాధిత కుటుంబాలకు సాయం అందుతుంది.ఈపీఎఫ్ సౌకర్యం పూర్తిగా నిలిపేయడంతో ఆ భరోసా కూడా కరువైంది. ఏఎస్ఆర్ జిల్లా లోతుగెడ్డ పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గసాడి రమ్యశ్రీ ఈ ఏడాది ఏప్రిల్ 13న మృతి చెందారు. విలేజ్ క్లినిక్ పరిధిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)–3.0 సర్వే నిర్వహిస్తున్న సమయంలో రమ్యశ్రీని కుక్క కరిచింది. రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడింది. ఇలా ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా సర్వీస్‌లో ఉండగానే ఏడుగురు మృతి చెందినట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని వెల్లడించారు. -
సర్కారు ‘డబ్బుల్’ గేమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. ప్రైవేటు కళాశాలల నుంచి ముడుపుల కోసం ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల అకడమిక్ నిర్ణయాల్లో పదేపదే జోక్యం చేసుకుంటూ విద్యా సంవత్సరాన్ని మరింత జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సింగిల్ మేజర్’ను తప్పుపట్టిన కూటమి ప్రభుత్వం దాన్ని మార్పు చేయాలని భావించింది. అందుకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి డ్యూయల్ మేజర్‌ను ప్రతిపాదించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నెలలు తరబడి సాగదీసిన ప్రభుత్వం తాజాగా ‘సింగిల్ మేజర్’ వైపు మొగ్గు చూపుతోంది.విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల కిందట నిర్వహించిన సమీక్షలో సింగిల్ మేజర్‌లో స్వల్ప మార్పులు చేసి పాత డిగ్రీ విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం (ఉన్నత విద్యాశాఖ)నుంచి ఉన్నత విద్యా మండలికి రాత పూర్వకంగా ఎటువంటి ఆదేశాలూ రాలేదు. గతంలో ప్రతిపాదించిన డబుల్ మేజర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండానే మళ్లీ మీ ప్రతిపాదనలు పంపించండి అంటూ, ఏ ప్రతిపాదనలు పంపించాలో చెప్పకుండా ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి నోట్ ఇవ్వడంపై గందరగోళం నెలకొంది.ఉన్నత విద్యా మండలి నుంచి ప్రతి అంశం లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి చేరుతుంటే.. ప్రభుత్వం నుంచి మాత్రం నోటి మాటలు తప్ప.. రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణ అసాధ్యమని విద్యావేత్తలు భావిస్తున్నారు. కోర్సుల కన్వర్షన్‌కు ఆలస్యం.. డిగ్రీ విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు చేస్తే కళాశాలలు కొత్తగా కోర్సుల కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే డ్యూయల్ మేజర్ నోటిఫికేషన్ రావడంతో కన్వర్షన్‌కు దరఖాస్తు చేసి రుసుములు చెల్లించాయి. ఇప్పుడు మళ్లీ సింగిల్ మేజర్ విధానాన్ని ప్రతిపాదిస్తే జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం.. ప్రకారం అనుమతులు పొందాలి. ఇలా రాష్ట్రంలో 1,250కిపైగా కళాశాలల వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి.ఈ ప్రక్రియ పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం మరింత గందరగోళం సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు యూనివర్సిటీల నుంచి కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియా ప్రారంభంకాలేదు. పైగా కొత్త విధానంలో కోర్సులు, క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్, సిలబస్ రూపకల్పనలోనూ జాప్యమయ్యే ఆస్కారం ఉంది. ఆఫ్‌లైన్..ఆన్లైన్లో ఎలా సాధ్యం? గత ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాల నిర్వహణకు తీసుకొచ్చిన ఆన్లైన్ అడ్మిషన్లు(కన్వీనర్ కోటా) వ్యవస్థకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోంది. ఈ ఏడాది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక్కడ విద్యార్థి తాను చేరాలనుకున్న కళాశాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలలూ తాము చేర్చుకోవాలనుకున్న విద్యార్థి వివరాలను ఆఫ్‌లైన్ ద్వారా తీసుకుని ఆ తర్వాత ఆన్లైన్ చేయొచ్చట.ఇక్కడ కళాశాల నమోదు చేసిన విద్యార్థుల కంటే ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ప్రకారం సీట్లు సాధించినప్పుడు కళాశాలలను నమ్ముకుని వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది. కన్వీనర్ కోటాకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండగా తాము తీసుకొచ్చిన విద్యారి్థకి సీటు దక్కకుంటే కళాశాలలు ఏవిధంగా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరహా ప్రవేశాలు లేవు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాల్సి ఉంది. ఇందుకు కూడా సమయం పట్టనుంది.‘ప్రైవేటు’ ముడుపుల కోసమే ఈ సాగదీత..! సింగిల్ మేజర్ విధానానికే ముఖ్యంగా పెద్ద ప్రైవేటు కళాశాలలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ మేజర్ ప్రోగ్రామ్స్‌ను చేర్చుకునే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ప్రైవేటు కళాశాలలు డిగ్రీ విద్యలో రాణిస్తున్నాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దల కన్ను ప్రైవేటు కళాశాలలపై పడింది. వాటిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని తద్వారా ముడుపులు మూటగట్టుకోవాలని పథకం రచించారు. ఈ క్రమంలోనే సింగిల్ మేజర్‌ను మార్పు చేస్తామని, ఉన్నత విద్యా మండలి ద్వారా కమిటీ వేయించారు.ఆ తర్వాత డ్యూయల్ మేజర్‌ను తెరపైకి తెచ్చారు. అంతే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం సాఫీగా నడుస్తున్న సింగిల్ మేజర్‌లో మార్పులొస్తే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రాయబారాలు నడిపాయి. గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల యజమాని ద్వారా ప్రభుత్వ పెద్దలతో బేరసారాలు సాగించాయి. ఈ క్రమంలోనే మూటలు అందడంతో డ్యూయల్ మేజర్ విధాన ప్రతిపాదనను పక్కన పడేసి సింగిల్ మేజర్‌నే కొనసాగిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఉన్నత విద్యా మండలిని చాకచక్యంగా వాడుకోవడం గమనార్హం!. -
వైద్యుల మైండ్ ‘బ్లాక్’!
సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌ను తొలుత గుంటూరు వైద్య కళాశాలకు బదిలీ చేశారు. మళ్లీ రోజుల వ్యవధిలోనే ఆ ప్రొఫెసర్‌కు రాజమండ్రిలో రీపోస్టింగ్ ఇచ్చారు.గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌కు తొలుత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పోస్టింగ్ దక్కింది. ఆమెను రీపోస్టింగ్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో నియమించారు. ఈమెకు విజయవాడలో రీపోస్టింగ్ కోసం అక్కడ పనిచేస్తున్న వైద్యుడిని గుంటూరుకు పంపారు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి వైద్యశాఖలో చేపట్టిన సాధారణ బదిలీల తీరును చూసి వైద్యుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పెద్దలే జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలను సాకుగా చూపి కీలక ప్రాంతాల్లో పోస్టులను బ్లాక్ చేసి రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు అమ్మేశారని మండిపడుతున్నారు.ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఎన్ఎంసీ నిబంధనలను సాకుగా చూపి పాత వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి, తమతో డీల్ కుదుర్చుకున్న వారికి ఆ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత నెల 19వ తేదీతో వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. గడువు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతితో కొందరికి రీపోస్టింగ్‌లు ఇచ్చారు. అంతకుముందు కౌన్సెలింగ్‌లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వైద్యులు... రీపోస్టింగ్ కింద వారు ఇప్పటి వరకు పని చేసిన ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణలను రీపోస్టింగ్‌లలో చోటుచేసుకున్న చిత్రాలు బలపరుస్తున్నాయి.‘బ్లాక్’ దందాను బలపరుస్తున్న కొన్ని విచిత్రాలు..⇒ సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కర్నూల్లో పనిచేస్తున్న జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కింద కాకినాడ లేదా రాజమండ్రిలో పోస్టింగ్ కోరారు. అయితే, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఆ రెండు ప్రాంతాల్లో ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం ఇచి్చన రీపోస్టింగ్‌లలో రాజమండ్రిలో పనిచేస్తున్న వైద్యురాలిని కాకినాడకు, గుంటూరులోని వైద్యుడిని రాజమండ్రికి పంపించారు. ⇒ రాజమండ్రిలో పనిచేస్తున్న జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాకినాడకు బదిలీ చేయాలని కోరారు. ఇతని అభ్యర్థనను ఎన్ఎంసీ పేరు చెప్పి తిరస్కరించారు. కానీ, కాకినాడలో రెండు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ నెల్లూరులో పనిచేస్తున్న అనాటమీ ప్రొఫెసర్‌ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. అనంతరం సదరు ప్రొఫెసర్‌ను విజయనగరానికి, విజయనగరంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను మ్యూచువల్ కింద విశాఖకు మార్చారు. ⇒ ఆర్థోపెడిక్ విభాగంలోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను గుంటూరు, ఒంగోలుకు మ్యూచువల్ బదిలీలు చేశారు.⇒ అనంతపురంలో పనిచేస్తున్న పల్మనాలజీ ప్రొఫెసర్‌ను తొలుత విశాఖకు బదిలీ చేశారు. రీపోస్టింగ్‌లో ఆయనను విశాఖ నుంచి ఒంగోలుకు పంపారు. కాకినాడలో పని చేస్తున్న వైద్యురాలిని విశాఖలో నియమించారు. కాకినాడలోనే ఆప్తమాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ విశాఖలో ఉన్న రెండు ఖాళీల్లో ఒక దానిలో తనను నియమించాలని అభ్యర్థించినా తిరస్కరించారు. ⇒ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎన్ఎంసీ నిబంధనల పేరు చెప్పి కాకినాడ ఆర్థోపెడిక్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ కింద చూపించలేదు. అయినా విశాఖలో పనిచేస్తున్న వైద్యుడిని కాకినాడ ఆర్థోపెడిక్ విభాగానికి బదిలీ చేశారు. తొలుత ఖాళీ చూపకుండా, ఆ తర్వాత బదిలీల్లో ఆయన్ను ఎలా నియమించారనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో విశాఖలోనే పనిచేస్తున్న ఓ వైద్యుడు తనను కాకినాడకు పంపాలని కోరారు. కానీ, ఖాళీ లేదని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు.ఒక్కో పోస్టుకు రూ.20 లక్షలుబదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చాక, సీఎం ప్రత్యేక అనుమతులతో ఏకంగా 33 మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రీపోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు మ్యూచువల్ బదిలీలు చేశారు. సాధారణ బదిలీల్లో అడ్డగోలుగా తాము అనుకున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి కుదరదనే ఎన్ఎంసీని సాకుగా చూపి పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారని వైద్యవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవానికి సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో మ్యూచువల్ బదిలీలకు ఆస్కారం లేదు. బ్లాక్ చేసిన పోస్టుల్లో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర వసూలు చేసి పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. -
ఎలా... ఏ పాత్రలో.. వంట ఆరోగ్యకరం?
అల్యూమినియం వంట పాత్రలకూ ఎక్స్‌పెయిరీ ఉంటుందని.. వాటిని సుదీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని బ్యూరో ఆర్ ఇండియన్ స్టాండర్డ్స్ వెల్లడించింది. ఆరోగ్యదాయకమైన జీవనం కోసం ఏం తింటున్నాం అనే దానితో పాటు దాన్ని ఎలా వండుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యమైన విషయం. ఆహారోత్పత్తులను అధిక ఉష్ణోగ్రతలో వండితే పోషకాలు నష్టపోవటంతో పాటు, హానికారక పదార్థాలు ఏర్పడతాయని మీకు తెలుసా? వంట అనేక పద్ధతుల్లో చేస్తుంటాం. ఇంతకీ, ఏ పద్ధతిలో వండితే మంచిది? ఏయే పాత్రల్లో ఎలా వండితే మంచిదో తెలుసా? భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఏం చెబుతోందంటే..ముంబైలో 50 ఏళ్ల వ్యక్తికి మతిమరుపు విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైన అలసట, ఒళ్లంతా నొప్పులు ఎక్కువయ్యాయి. ఆసుపత్రిలో చేరిన అతడికి మెటల్ స్క్రీనింగ్ చేస్తే.. శరీరంలో సీసం స్థాయిలు భారీగా పెరిగిపోయాయని తేలింది. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అతడి భార్య ఇంట్లో 20 ఏళ్లుగా ఒకే ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తోందట! ఆమ్లగుణం ఉన్న ఆహార పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండేటప్పుడు అందులో సీసం, అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వంట చేసే పద్ధతితో పాటు ఏ పాత్రలో వండుతున్నాం అన్నదాన్ని బట్టి ఆహారంలో పోషకాల సాంద్రత, నాణ్యత ఆధారపడి ఉంటుంది.మట్టి పాత్రలు..: వంటకు ఇవే అత్యుత్తమం. ఇవి పర్యావరణహితమైనవే కాదు, వాటిల్లో వండే ఆహారంలో పోషకాలను చెక్కు చెదరకుండా ఉంచుతాయి. మట్టి పాత్రల గోడల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా అధిక వేడి బయటకు పోతుంది కాబట్టి ఉడికే ఆహారంలో పోషకాలకు నష్టం వాటిల్లదు.రాతి పాత్రలు..: గ్రానైట్ స్టోన్ పాత్రలు సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేస్తాయి. టెఫ్లాన్ పూతలు లేనివి వంటకు మంచివి. ఈ పాత్రలకు.. మంట మధ్యస్థానికి–అధికానికి మధ్యలోనే ఉంచాలి.లోహ పాత్రలుఅల్యూమినియం, ఇనుము, ఇత్తడి, కంచు, రాగి వంటి లోహ పాత్రల్లో ఆహారం వండినా, నిల్వ చేసినా ఆ లోహాలు ఆహారంలో కలుస్తాయి. ⇒ నిల్వ పచ్చళ్లు, చట్నీలు, సాంబారు వంటి ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను అల్యూమినియం, ఇనుము; లోపలి పూత లేని ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ చేయడం మంచిది కాదు.స్టీలు పాత్రలుఇవి వంటకు బాగా అనువైనవి. ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వంటకు స్టీల్ గిన్నెలు వాడుతున్నారు. ఎక్కువ కాలం మన్నిక, తుప్పు పట్టకపోవటం, ఆహార పదార్థాలు ఉంచినప్పుడు రియాక్షన్ లేకపోవటం వంటి సానుకూల అంశాలు ఉండటమే ఇందుకు కారణం. నాన్‌స్టిక్ పాత్రలుపాలీ టెట్రా ఫ్లోరో ఇథిలిన్ (పిటిఎఫ్ఇ/టెఫ్లాన్) అనే పదార్థంతో లేపనం చేసిన పాత్రలను నాన్ స్టిక్ పాత్రలు అంటారు. 170 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ పాత్రల్లో వంట చెయ్యకూడదు. అలా చేస్తే టెఫ్లాన్ కోటింగ్ ఊడి వచ్చేసి విషతుల్యమైన వాయువులు వెలువడతాయి. టెఫ్లాన్ పొర ఊడిపోతే ఇక ఆ పాత్రలను వాడకూడదు.ఎలా వండితే మంచిది?మూత పెట్టి/పెట్టకుండా వంట: మూత పెట్టకుండా వండితే పోషకాలు కొన్ని గాలిలో కలిసిపోతాయి. ఎంత తక్కువ సమయం వండితే పోషకాల నష్టం అంత తగ్గుతుంది. మూత పెట్టి వండితే త్వరగా పూరై్త, పోషకాల నష్టమూ తగ్గుతుంది.ఉడకపెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వంట:పప్పుల్లో జీర్ణం కాకుండా అడ్డుకునే యాంటీ–న్యూట్రిషనల్ ఎంజైములు ఉంటాయి. ఎక్కువ నీరు పోసి ఉడకబెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వండటం వల్ల ఇవి నశించి, జీర్ణమయ్యే గుణంతో పాటు మాంసకృత్తుల లభ్యత పెరుగుతుంది. ⇒ ధాన్యాలు, పప్పుల్లో ఫైటిక్ ఆమ్లాలు ఉంటాయి. ఎక్కువ నీటిలో ఉడికించినప్పుడు లేదా కుక్కర్లో వండినప్పుడు ఇవి చాలా వరకు తగ్గిపోతాయి. తద్వారా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మపోషకాలు మనకు ఎక్కువగా లభిస్తాయి.⇒ పప్పులను ఎక్కువ నీటితో ఉడకబెట్టి, ఆ నీటిని పారేస్తే ఫోలేట్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లను నష్టపోతాం. ఎక్కువ సేపు ఉడకబెడితే మాంసకృత్తుల నాణ్యత క్షీణిస్తుంది.ఆవిరిపై వంట: ఆకుకూరలు, కూరగాయలను ఆవిరిపై వండటం ఉత్తమం. ⇒ నీటిలో కరిగిపోయే విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఆవిరి వంట వల్ల బీటా కెరోటిన్, లుటీన్లు సులభంగా శరీరానికి వంటపడతాయి.నూనెలో వేపుడు: ఎక్కువ ఉష్ణోగ్రతపై, ఎక్కువ నూనెలో ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాల్లో మార్పులొస్తాయి. ⇒ నీరు ఆవిరైపోవటం వల్ల విటమిన్ సి వంటి నీటకరిగే పోషకాలు నష్టపోతాం. ⇒ అధిక ఉష్ణోగ్రత, గాలి, నూనె కలిసినప్పుడు విష పదార్థాలు ఉత్పత్తయ్యే ప్రమాదం ఉంది. ⇒ ఒకసారి వేపుడు కోసం వాడిని నూనెను మళ్లీ వేపుడుకు వాడటం గానీ, వాడని నూనెతో కలపటం గానీ ప్రమాదకరం.లోతు తక్కువ గిన్నెలో వేపుడు: తక్కువ లోతున్న గిన్నెలో తక్కువ నూనెతో, ఎక్కువ మంటపై ‘షాలో ఫ్రైయింగ్’ చేయటం వల్ల పోషకాల నష్టం ఎక్కువ. డీప్ ఫ్రైతో పోల్చితే.. ఎక్కువగా ఆక్సీకరణానికి గురైనందున కొవ్వులు, నూనెల నాణ్యత దెబ్బతింటుంది.వేగంగా తిప్పుతూ వేపటం: కూరగాయలు లేదా మాంసం ముక్కలను కొద్దిపాటి నూనె వేసి అధిక మంటపై వేగంగా తిప్పుతూ వేపటాన్నే స్టిర్ ఫ్రైయింగ్ అంటారు. ఎక్కువ నూనెలో వేపుడుతో పోల్చితే ఈ పద్ధతిలో పోషకాల నష్టం తక్కువే.మైక్రోవేవ్ కుకింగ్మైక్రోవేవ్లో చాలా తక్కువ సమయంలో, కొద్దిపాటి నీటితోనే వంట పూర్తవుతుంది. మిగతా పద్ధతులతో పోలిస్తే ఇందులో విటమిన్లు, ఖనిజాల నష్టం చాలా తక్కువ.నెమ్మదిగా వండటం: తక్కువ వేగంగా, తక్కువ వేడిపై వండే పద్ధతి ఇది. ఇలా నూనెలో మాంసాన్ని వేపినప్పుడు పోషకాల నష్టం చాలా తగ్గుతుంది. ⇒ టమాటాలు, మొక్కజొన్న, పాలకూర వంటి వాటిని ఇలా వండితే వాటి కణాల గోడలు ఛిద్రమై శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విడుదలై శరీరానికి ఎక్కువగా అందుతాయి.ఎయిర్ ఫ్రైయింగ్⇒ తక్కువ నూనెతో డీప్ ఫ్రైయింగ్ చేయడం. దీనివల్ల ఊబకాయం సమస్య రాదు. ⇒ బంగాళదుంపలు వంటి స్టార్చ్ ఎక్కువ ఉండే ఆహారానికి ఇది నప్పుతుంది. ⇒ అయితే, చేప ముక్కలను ఎయిర్ ఫ్రైయింగ్ చేస్తే వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తగ్గిపోతాయి. వాపు (ఇన్ఫ్లమేషన్) కలిగించే మూలకాలు పెరుగుతాయి. -
రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్‌కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్‌ను అర్ధ నగ్నంగా లాకప్‌లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్‌బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్‌కుమార్‌పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్‌ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్‌పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.పోసానిపై రెడ్‌బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ను హైదరాబాద్‌లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్‌కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్‌కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజధాని అప్పుల్లో రూ.991.06 కోట్లు మళ్లింపు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు. ‘పోలవరం’ నిధులు కూడా.. ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. ఇది తెలిసి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు. అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఇండోసోల్ పై కుట్ర
సాక్షి, అమరావతి: ఇండోసోల్ యూనిట్‌పై కూటమి సర్కారు కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుపై విషం కక్కిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అడ్డంకులు సృష్టించింది. ఇప్పటికే ఉత్పత్తికి అన్ని విధాలా సిద్ధమైన ఇండోసోల్ యూనిట్‌ను రైతుల ఆమోదయోగ్యం లేని మరో చోటుకు తరలించడం ద్వారా మొత్తం ప్రాజెక్టునే గందరగోళంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం చేవూరు, రావూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేని, పంటలు పండని 5,148 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేసి, రైతుల ఆమోదయోగ్యం లేని రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ద్వారా వివాదం రాజేసింది.గత ప్రభుత్వం ఇండోసోల్ కోసం రైతులను ఒప్పించి, ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూ సేకరణ పూర్తి చేస్తే, ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం ఇవ్వనంటోంది. దీనికి ప్రతిఫలంగా కారేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలను సేకరించి ఇస్తానంటోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి, రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. చేవూరు, రావూరు వద్ద భూసేకరణ కోసం గత ప్రభుత్వ హయాంలోనే ఇండోసోల్ రూ.500 కోట్లు చెల్లించింది. 114 ఎకరాల్లో తొలి దశ కింద ఒక గిగావాట్ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసి ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.విస్తరణ కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లతో డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులను కల్పించింది. ఇప్పుడు భూ మారి్పడితో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 114 ఎకరాల్లో ఉన్న యూనిట్‌ను ఇక్కడే కొనసాగిస్తూ మిగిలిన విస్తరణ పనులను కారేడు, ఉలవపాడులో కొనసాగించమని చెప్పడంపై పారిశ్రామికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎంపిక చేసుకున్న పనులు ప్రారంభించిన తర్వాత యూనిట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశి్నస్తున్నారు. రూ.76,033 కోట్ల పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.76,033 కోట్ల పెట్టుబడితో 13,200 మందికి ఉపాధి కల్పించేలా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్æ (జీఐఎస్)లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ.42,040 కోట్ల వ్యయంతో సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 20 గిగా వాట్ల పాలీసిలికాన్, 15 గిగావాట్ల వేఫర్స్, 10 గిగావాట్ల పీవీ మ్యాడ్యూల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా పరోక్షంగా మరో 8,000 మందికి ఉపాధి లభించనుంది.ఈ యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) కింద రూ.1,875 కోట్ల మేర అనుమతులు కూడా లభించాయి. దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకం ద్వారా యూనిట్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పుడు ఏకంగా పచ్చని పంట పొలాలను కేటాయించి కొత్త వివాదాన్ని సృష్టించింది. తద్వారా ప్రాజెక్టుకు పూర్తిగా అడ్డంకులు కల్పిస్తోంది. -
ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా!?: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) హోల్డర్లు ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను జతచేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బుగ్గన ఏమన్నారంటే..ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలేదనే ఆరోపణలు నిరంతరం వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఈ అంశంపై ప్రజలకు ఎటువంటి వివరణలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎన్సీడీ బాండ్ల జారీలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఆ తప్పును ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని లేదా వివరణ ఇస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయడంపై నోరుమెదపకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడానికి.. పారదర్శకతపై కరువైన చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. నిజానికి.. హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండు విడతలుగా ఎన్సీడీ బాండ్లు జారీచేసి రూ.9 వేల కోట్లు అప్పుచేసింది. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తుల (రుణదాతలు)కు రూ.1,91,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. అంతేకాదు.. ఆ అప్పును ఏపీడీఎంసీ కట్టలేకపోతే ఆర్బీఐలో రాష్ట్రానికి ఉన్న ఖాతా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్ర అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకునే అధికారం కల్పించింది. ఇలా రాష్ట్రంలో ఇంతముందెన్నడూ లేని రీతిలో ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇవ్వడం వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. -
ఏపీ జడ్జిపై ట్రోలింగ్.. న్యాయ వ్యవస్థపై దాడే!
సాక్షి అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను న్యాయవ్యవస్థపై దాడిగా రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) అభివర్ణించింది. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్‌ను, దూషణలను తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై కొద్ది రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ద్వారకానాథరెడ్డి అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం జరిగింది.కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు రామిరెడ్డి, ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ పలు తీర్మానాలు చేసింది. న్యాయమూర్తిగా నిష్పాక్షికంగా తీర్పులు వెలువరించిన జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాలు, ప్రజా వేదికల్లో ట్రోలింగ్ చేయటాన్ని, నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కౌన్సిల్ తన తీర్మానంలో పేర్కొంది. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదని హెచ్చరించింది. ఇలాంటివి పునరావృతం అవుతున్న నేపథ్యంలో దీన్ని తీవ్రంగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. చర్యలకు రిజిస్ట్రార్ నేతృత్వంలో యంత్రాంగం!న్యాయవ్యవస్థపై దూషణలు, ట్రోలింగ్‌పై చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్ నేతృత్వంలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ హైకోర్టును కోరింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వకంగా సాగించే దాడులు, దూషణలపై దర్యాపు చేసేందుకు డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయమూర్తులపై ప్రస్తుతం, గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన దాడుల ఘటనలపైనా దర్యాపు జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సుప్రీంకోర్టు, హైకోర్టు ను బార్ కౌన్సిల్ కోరింది. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని పేర్కొంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ పడేదే లేదని, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ సదా మద్దతు అందించాలని సమావేశంలో తీర్మానించారు.న్యాయమూర్తిపై నిందలా!జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వర్ల రామయ్య వ్యాఖ్యలుటీడీపీ మూకల ట్రోలింగ్‌కు ఆ పార్టీ నేతల వత్తాసుచంద్రబాబు సర్కారు అండదండలతో టీడీపీ సైకో మూకలు ఏకంగా న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తమకు నచ్చకుంటే ఎంతటి వారిపైన అయినా బురద జల్లుతాం..! సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం.. ! మానసికంగా వేధిస్తామనే రీతిలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా విభాగం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా విభాగమే కాదు.. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పోలీస్ అధికారి కూడా అయిన వర్ల రామయ్య సైతం జస్టిస్ శ్రీనివాసరెడ్డికి దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.తద్వారా న్యాయమూర్తిపై ట్రోలింగ్ తమ అధికారిక విధానమని టీడీపీ పరోక్షంగా వెల్లడించినట్లైంది. స్వయంగా న్యాయమూర్తి కొనకంటి శ్రీనివాసరెడ్డే తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వెల్లడించడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు సమయంలో ఆయన హైకోర్టులో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడంపై ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. టీడీపీ అధికారిక విధానమే..!ఎంతటివారిపైన అయినా సరే దుష్ప్రచారం చేయటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చంద్రబాబు ఏనాడో మార్చేశారు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తాను అడ్డదారిలో పీఠాన్ని అధిష్టించే వరకు అదే దుష్ప్రచార కుతంత్రాన్నే అస్త్రంగా చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో టీడీపీ దుష్ప్రచార కుతంత్రం వెర్రి తలలు వేస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సైతం ఉపేక్షించకపోవడం టీడీపీ మార్కు కుట్రకు నిదర్శనం. కొద్ది రోజులుగా టీడీపీ కార్యకర్తలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అవమానకర రీతిలో ట్రోలింగ్‌కు తెగబడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీకొని మృతి చెందారు.ఆ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీశ్ సైతం అధికారికంగా వెల్లడించారు. కానీ ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేయించారు. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారంటూ ఓ ఫేక్ వీడియోను వైరల్ చేశారు. అనంతరం ఆ వాహన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డితోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా చేరుస్తూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అసలు కారులో ప్రయాణిస్తున్నవారిపై కేసు ఎలా నమోదు చేస్తారు...? ఏ చట్టంలో అటువంటి నిబంధన ఉందని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.ఆ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి టీడీపీ సోషల్‌మీడియా ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో కల్తీ నెయ్యి కేసులో చాలా నెలలుగా జైలులో ఉన్న నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి తనపై ట్రోలింగ్ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఇచ్చిన తీర్పు సోషల్ మీడియా ట్రోలర్లకు ఓ అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. అంటే న్యాయమూర్తులను కూడా టీడీపీ సోషల్ మీడియా ఉపేక్షించడం లేదన్నది స్పష్టమవుతోంది. -
నేడు వైఎస్సార్ జిల్లాకు జగన్ రాక
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని రాత్రి అక్కడి నివాసంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.అక్కడ దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించారు.కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు. ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజ్జీవన్ రామ్ చేసిన కృషి నేటికీ అనుసరణీయం అని అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..జగజ్జీవన్‌రామ్ కోరుకున్న సమాజానికి బాటలు వేసిన వైఎస్ జగన్: లేళ్ళ అప్పిరెడ్డిఈ రోజు ప్రజా స్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ బాబూ జగజ్జీవన్‌రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గతంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, గత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ పాలనను చూస్తే ఎంతగా జగజ్జీవన్‌రామ్ వంటి మహనీయులు కోరుకున్న సమాజాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేశారో అర్థమవుతుంది. ఆనాడు బాబూ జగజ్జీవన్ రామ్ దేశంలోనే అత్యంత సమర్థ నాయకుడుగా అనేక శాఖలను పర్యవేక్షించడం ద్వారా తన పాలనకే వన్నె తీసుకువచ్చారు.నిత్యం ఆయన సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పును ఈ రాష్ట్రంలో వైయస్ జగన్ తన పాలనలో ఆచరణలో చూపించారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు వంటి వారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ బడుగు వర్గాలను కించపరిచేలా మాట్లాడారు. అటువంటి వారు కూడా దురదృష్టవశాత్తు నేడు పదవుల్లో ఉండి, జగజ్జీవన్ రామ్ పేరు స్మరిస్తున్నారు. నిజంగా వారికి ఆ మహనీయుడి పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదు.ఈ దేశంలో అనేక మంది సీఎంలుగా పనిచేశారు. కానీ చంద్రబాబు వంటి నీచమైన మనస్తత్వం ఉన్న సీఎంను ఎక్కడా చూడలేదు. పేదరికంలో ఉన్న అణగారిన వర్గాలపై ఆయనకు ఉన్న చులకన భావం పలు సందర్భాల్లో వెల్లడించారు. అసమానతలను లేని సమాజాన్ని చూడాలంటే తిరిగి వైయస్ జగన్ పాలనను తెచ్చుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.దళిత సమాజం చంద్రబాబును క్షమించదు: టీజేఆర్ సుధాకర్బాబుఈ దేశంలో దళితులను, అణగారిన వర్గాలను అభివృద్ధి వైపు నడిపించాలని బాబూ జగజ్జీవన్‌రామ్ వంటి మహనీయులు కృషి చేశారు. అటువంటి దేశంలోనే నేడు ముఖ్యమంత్రి వంటి పదవుల్లో ఉంటూ దళితులకు కనీసం ఒక మనిషిగా ఇచ్చే గౌరవం కూడా ఇవ్వని చంద్రబాబు వంటి వారు పాలన సాగిస్తున్నారు. కులాల మధ్య అంతరాలు తొలగించాలని, ఒక మంచి సమాజాన్ని సృష్టించాలని ఆనాడు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి వారు కాంక్షించారు.కానీ ఏపీలో దురదృష్టవశాత్తు చంద్రబాబు వంటి అహంకారపూరిత నేతల పాలనలో దళిత సమాజం ప్రతిరోజూ అవమానానాలను ఎదుర్కొంటూనే ఉంది. ఆయన కేబినెట్లో పనిచేసిన వారు సైతం దళితుల పట్ల ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలు అందరూ చూశారు. నిన్నకాక మొన్న దళితుడైన సింగయ్యను కుక్కతో పోల్చిన చంద్రబాబును దళిత సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. తన పాలనలో దళితుల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు, వారిని సమాజంలో అందరితో పాటు సగౌరవంగా నిలబెట్టేందుకు సీఎంగా వైయస్ జగన్ ప్రయత్నించారు. దళితులు గొప్ప చదువులు చదివేందుకు, ఉన్నత స్థానాల్లో నిలబడేందుకు వారికి అండగా నిలిచారని టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో బడుగుల హక్కులను కాల రాస్తున్న చంద్రబాబు: మేరుగు నాగార్జునదళిత జాతుల కోసం అవిరళంగా కృషి చేసిన బాబూ జగజ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఈ దేశంలో ఎక్కువ పోర్ట్ పోలియోలను సమర్థంగా నిర్వహించి, తన సామర్థ్యంతో ఈ దేశానికి గొప్ప సేవలు అందించిన నాయకుడు జగజ్జీవన్‌రామ్. ఈ దేశంలోని బడుగుల గురించి ఆలోచించిన నేత. సమాజంలో అసమానతలను రూపుమాపాలని ఆయన జీవితాంతం కృషి చేశారు.ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను ఈ రాష్ట్రానికి అందించిన ఘనత వైయస్ రాజశేఖర్‌రెడ్డి, తరువాత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అనే భేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో పేదరికం నుంచి ప్రతి ఒక్కరినీ విముక్తులను చేసేందుకు అయిదేళ్ళ పాలనలో వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు. నేడు చంద్రబాబు పాలనలో అణగారిన కులాలు మళ్ళీ చీకటిరోజుల్లోకి వెళ్ళిపోతున్నాయి.బడుగు వర్గాలకు అందించాల్సిన అన్ని పథకాలను రద్దు చేయడం, వారి హక్కులను కాలరాయాడం ద్వారా రాక్షస పాలనను సాగిస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుక్కతో పోల్చడం సిగ్గుచేటు. ఇదీ ఆయనకు దళితులంటే ఉన్న చులకన భావం. ఇటువంటి పాలనకు చరమగీతం పాడేందుకు బడుగువర్గాలు ఐక్యం కావాలి.జగజ్జీవన్‌రామ్ ఆలోచనలను కొనసాగించిన నేతలు వైఎస్సార్, జగన్: నందిగం సురేష్ఈ దేశానికి ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంంత కృషి చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్‌రామ్. ఆయన ఆశయాలను ఆచరణలో చూసిన వారు ఆనాడు మహానేత స్వర్గీయ వైఎస్సార్ అయితే నేడు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రగతివైపు నడిపించిన నాయకులు వారు. నేడు కూటమి పాలనలో ప్రతిరోజూ బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, వారికి అండగా నిలుస్తున్న నాయకుడు వైస్ జగన్. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ప్రజలు చూసిన ఎమర్జెన్సీని తిరిగి ప్రజలు చంద్రబాబు పాలనలో చూస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, తాడేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ వేమారెడ్డి, స్టేట్ స్పోక్స్ పర్సన్ వేల్పుల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్‌లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఆయన సందేశం విడుదల చేశారు. ‘‘మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Muharram— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
హవ్వ... బాబూ నవ్విపోతారు!
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు.. దేశాద్యంతం ఈ వ్యాఖ్యలకు నివ్వెరపోయి ఉండవచ్చు. గాంధీజీ.. అంబేద్కర్లతో పోల్చుకోవడం ఎంతవరకూ సమజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే చంద్రబాబు తీరే అంత. ఏమైనా అనగలరు. చేయగలరు. పోల్చుకోగలరు కూడా. వాస్తవం ఏమిటంటే... గాంధీజీ, అంబేద్కర్‌లో సామాన్య కుటుంబాల్లో పుట్టిన మాట నిజం. అయితే వారెవరూ అవకాశాలను అందిపుచ్చుకోలేదు.సామాజిక పరిస్థితులను ఎదిరించి ప్రజలకు ఒక దారి చూపడం ద్వారా నేతలుగా ఎదిగారు! దేశ స్వాతంత్ర్య సాధనలో అందరికంటే ముందున్న గాంధీజీ జాతిపితగా ఎదిగితే... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశారు. ఇద్దరూ అసత్యాలు చెప్పడాన్ని నిరసించారు. తిరస్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచారు.చంద్రబాబు విషయానికి వస్తే... ఈయన కూడా సామాన్య కుటుంబంలో జన్మించారు. సీఎం స్థానానికి ఎదిగారు. వాస్తవమే. కానీ ఈయన రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే గాంధీజీ, అంబేద్కర్ల ఆలోచనలు, ఆదర్శాలకు ఎంతో దూరంగా.. విరుద్ధంగా ఎన్నో మరకలు కనిపిస్తాయి. కాంగ్రెస్(ఐ)తో రాజకీయ ఆరంగేట్రం చేసి గ్రూపులు కట్టి, పైరవీలతో మంత్రిపదవి సాధించిన చరిత్ర చంద్రబాబుది. తరువాతి కాలంలో పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పేరుతో పార్టీ పెడితే.. మామపైనా పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అక్కడ ఏకు మేకు అయినట్లు మామనే పదవి నుంచి లాగిపడేశారు. పదవుల కోసం ఆరాటపడకపోవడం గాంధీజీ, అంబేద్కర్ల నైజమైతే.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డ చరిత్ర బాబు గారిది!చంద్రబాబు నిజంగానే వారిని ఆదర్శంగా తీసుకోదలిస్తే ముందుగా అసత్యాలు చెప్పడం మానుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులపై ద్వేష భావాన్ని వదిలించుకోవాలి. కుమారుడు లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలి. ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న హింసను నిలువరించాలి. ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగవేసి ప్రజలను మోసం చేస్తున్నారన్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలి. అయితే... గాంధీజీ, అంబేద్కర్లలతో పోల్చుకోవడానికి ప్రయత్నించిన సభలోనే ఆయన ఎంత పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడారో చూడండి.ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అప్పుల గురించి స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పేశారే. వెయ్యి రూపాయల అదనపు పెన్షన్ ఇవ్వడం కోసం మంచినీళ్లలా లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో పర్యటిస్తూ సభలు పెడుతున్నారే! కార్యకర్త కారు కింద పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై ఎంత దారుణమైన ఆరోపణ చేశారు! కారు ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్యను పిలిచి అంబులెన్స్‌లో ఏదో జరిగిందని చెప్పించారని సీఎం స్థాయి వ్యక్తి ఆరోపించడమా! చంద్రబాబు ఈ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఈనాడు దినపత్రిక దాన్ని బ్యానర్‌గా వండి వార్చడం చూస్తే వారు సింగయ్య మృతి విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని తెలిసిపోతోంది. ఏపీ హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కవర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కుట్రల అమలుకు ఎల్లో మీడియాను ఒక టూల్‌గా వాడుతున్నారన్నమాట.నిజానికి ఈ కేసులో ఎన్నో సందేహాలున్నాయి. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్తునప్పుడు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న జగన్‌కు ఎందుకు తగిన భద్రత కల్పించలేదు? వాహనాల వెంట ఉండవలసిన రోప్ పార్టీ ఎందుకు లేదో తెలియదు. కారు తగిలి సింగయ్య అనే వ్యక్తి గాయపడినప్పుడు వచ్చిన వీడియోలు గమనించిన వారెవరికైనా ఆయనకేమీ ప్రమాదం లేదన్నట్టుగానే అనిపించింది. కాని అంబులెన్స్‌లోనే ఆయన మరణించడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.ఇవన్నీ ఒక ఎత్తైతే... ఏదో గుర్తు తెలియని వీడియో ఆధారంగా పోలీసులు జగన్‌తో పాటు కొందరు వైసీపీ నేతలను నిందితులుగా చేసేశారు. కారు ప్రమాదానికి డ్రైవర్ కాకుండా... అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టి కొత్త ట్రెండ్ సృష్టించారు. హైకోర్టు ఇదే ప్రశ్న లేవనెత్తడంతో సమాధానాలు చెప్పలేని ప్రభుత్వ న్యాయవాదులు వాయిదాలు కోరారన్న భావన కలిగింది. దాంతో జగన్ తదితరులపై నేరారోపణకు ప్రాధమిక ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.అదే టైమ్ లో ప్రమాదంలో మరణించిన సింగయ్య భార్య లూర్దు మేరి చేసిన ప్రకటన మరింత సంచలనమైంది.తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, లోకేష్ మనుషులు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించారని ఆమె చెబుతున్నారు. ఒక సాధారణ మహిళగా ఉన్న ఆమె అంత ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు వచ్చిందంటే అందులో నిజం లేకపోతే అలా చేయగలుగుతుందా? అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సీనియర్ నేత దానిపై స్పందించడం ఏమిటి? అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పించారని అనడం ఏమిటి? అదే జగన్ పై ఆమె ఏదైనా ఆరోపణ చేసి ఉంటే సీఎం ఎంత తీవ్రంగా ప్రచారం చేసి ఉండేవారు. ఎల్లో మీడియా ఎంతగా ఇల్లెక్కి అరిచేది. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యేవారు! ఇప్పుడేమో ఆ ఆరోపణలపై విచారణ కాకుండా, ఆమె జగన్‌ను కలవడంపై విచారణ చేస్తారట. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్దతి?గాంధీజీ, అంబేద్కర్లతో పోల్చుకునే వారు ఎంత నిజాయితీగా ఉండాలి? ఒక ప్రమాదాన్ని జగన్‌కు పులమడం ద్వారా కుటిల రాజకీయం చేయడం ఏ తరహా నీతి అవుతుంది. గతంలో గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీసేందుకు ఒక్కసారిగా గేట్లు తెరచి తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నారు? రోడ్డు ప్రమాదాలు జరగడం లేదా? పూరి జగన్నాథ ఉత్సవాలలో తొక్కిసలాటలు జరగడం లేదా? కొందరు మరణించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలలో పదకుండు మంది మరణిస్తే, అదంతా పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేయలేదా?జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే మాత్రం ఆయనను నిందితుడుగా చేర్చుతారా? ఇది చిల్లర రాజకీయం కాదా? పైగా రాజకీయాలు, రౌడీలు, అంటూ నీతి సూత్రాలు వల్లిస్తే సరిపోతుందా? వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాలు, పేకాట క్లబ్లులు నడుపుతారు.. అంటూ గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరుకుతుందా?అదెందుకు అంగళ్లు వద్ద గతంలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబే ఎంతగా రెచ్చగొట్టారో వీడియోలు చెబుతాయి. పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్దం చేయడం, రాళ్ల దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరి కన్ను పోవడం ఇటీవలి చరిత్రే కదా? ప్రతిపక్షంలో ఉంటే ఏ అరాచకం చేసినా సమర్థించుకోవడం, అధికారంలోకి రాగానే శాంతి వచనాలు పలకడమే చంద్రబాబు ఇజమా! అని అంటే ఏమి చెబుతాం. ఏ నాయకుడైనా పదవుల కోసం సంకుచిత రాజకీయాలకు దిగకుండా ఉంటేనే మంచి పేరు వస్తుంది కానీ... రాజకీయ అవసరాలకు గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుని పోల్చుకుంటూ, స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రజలు తెలుసుకోలేకపోతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పురుగుల బియ్యం.. విషమే నయం
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటిని తినలేక విద్యార్థులు, ఆ బియ్యంతో భోజనం తయారుచేసి పెట్టలేక ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే.. అంతకంటే మంచివైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.మంచి బియ్యం కాదు కదా.. కనీసం పిల్లలు తినగలిగే బియ్యంతో కూడా భోజనం పెట్టడం లేదు. పురుగులతో ఉన్న ముక్కిపోయిన బియ్యాన్ని ప్రభుత్వం వండి పెడుతోంది. విద్యార్థులు ఆ భోజనం తినలేక ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం పేరుతో శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరిచిచూస్తే పురుగులు కన్పిస్తుండటమే కాకుండా బియ్యం మొత్తం ముక్కు వాసన వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంఅసలు సన్నబియ్యమేనా? జిల్లాలోని 2,676 ప్రభుత్వ పాఠశాలలు.. 131 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహాల కోసం జూలై నెలకు 12,087 బ్యాగులతో 301.95 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. పాఠశాలలకు 379 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. సన్నబియ్యమని చెప్పి అందజేశారు. వాటిని తెరిచి చూస్తే చీమలతో పాటు పురుగులు బయటకు వస్తున్నాయి. అన్ని బస్తాల్లోని బియ్యం ముక్కు వాసన వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన సన్నబియ్యం గుట్టురట్టు అవుతోంది. బియ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఇవి సన్నబియ్యం కాదని, పాలిషింగ్ చేసి పంపించిన నాసిరకం బియ్యమని చెబుతున్నారు. విద్యార్థుల భోజనం కోసమని గుంటూరు జిల్లా తెనాలి నుంచి సన్నబియ్యం తీసుకొచి్చనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఆ బియ్యాన్ని సింగన్నపాలెంలో మధ్యాహ్న భోజనం పథకం పేరుతో సంచుల్లో నింపి క్యూఆర్ కోడ్ కూడా వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో మోసం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి సన్నబియ్యం వస్తే వాటిని పక్కదారి పట్టించి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పెద్దల మిల్లుల్లో నిల్వ ఉన్న నాసిరకం బియ్యాన్ని మధ్యాహ్నం భోజనం పథకం సంచుల్లో ప్యాక్‌చేసి పాఠశాలలకు, హాస్టల్స్‌కు పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దల గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యానికి మూడు పాలిష్‌లు పెట్టి సన్నబియ్యంగా తోసేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. చర్యలేవీ.. సరఫరా అవుతున్న నాసిరకం బియ్యంపై పాఠశాలలు, వసతి గృహాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పురుగులున్న బియ్యం ఫొటోలు, వీడియోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కూడా పాఠశాలల నుంచి నివేదికలు రప్పించుకుని పురుగులు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఇంత జరిగినా కిమ్మనకుండా ఉండిపోతున్నారే తప్ప ఏం జరిగిందనే దానిపై విచారణ చేయడం లేదు. -
సచివాలయాల ఉద్యోగుల బదిలీ గడువు పెంపు
సాక్షి, అమరావతి: గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ గడువు గత 30వ తేదీన ముగియగా.. ఆ గడువును జూలై 5(శనివారం) వరకు పొడిగిస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలో శనివారం వరకు పొడిగిస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, అధికార నాయకుల సిఫార్సుల మేరకు అన్యాయంగా బదిలీలు చేశారంటూ గత నాలుగు రోజులుగా సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.గ్రామ వార్డు సచివాలయాల్లోపనిచేసే ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులుగా గుర్తించిన వారిలో 130 మందిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంటర్లలో నియమించేందుకు అనుమతి తెలుపుతూ ప్రభుత్వం శనివారం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా కేంద్రాల్లో వీరికి డిప్యూటేషన్ మీద ఈ నియామకాలు చేపట్టనున్నట్టు పేర్కొంది. -
దేశంలో 8 శాతం ఇన్ఫెక్షన్లకే సరైన చికిత్స
సాక్షి, అమరావతి: దేశంలో యాంటిబయోటిక్స్ అతి వినియోగం కొంప ముంచుతోంది. ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటిబయోటిక్స్ వాడకం పెరిగిపోయింది. దీంతో శరీరంలోని వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకొని తీవ్ర సమస్యగా మారుతున్నాయి. చివరకు వివిధ ఇన్ఫెక్షన్లు.. వైద్య చికిత్సలకు లొంగని పరిస్థితి తలెత్తింది. ఈ సమస్య భారత్ వంటి మధ్య ఆదాయ దేశాలను వేధిస్తోందని గ్లోబల్ యాంటిబయోటిక్ రీసెర్చ్,æ డెవలప్మెంట్ పార్టనర్షిప్(జీఏఆర్డీపీ) చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. భారత్‌లో 90 శాతానికి పైగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు తగిన చికిత్సలు అందడం లేదని తెలిపింది. 2019లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా ఎనిమిది మధ్య ఆదాయ దేశాల్లోని 15 లక్షల కార్బపెనెం–రెసిస్టెంట్ గ్రామ్–నెగిటివ్(సీఆర్జీఎన్) ఇన్ఫెక్షన్ కేసుల్లో.. చికిత్సలకు యాంటిబయోటిక్స్ వినియోగంపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో భారత్‌లో కేవలం 8 శాతం కేసుల్లోనే సరైన యాంటిబయోటిక్స్ కోర్సులతో కూడిన చికిత్సలు అందాయని గుర్తించింది. న్యూమోనియా, యూరిన్ ఇతర ఇన్ఫెక్షన్లు సీఆర్జీఎన్ విభాగంలోకి వస్తాయి. అడ్డుకట్ట వేయాలి.. ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారినపడి సరైన యాంటిబయోటిక్స్ మందులు అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని జీఏఆర్డీపీ డైరెక్టర్ డాక్టర్ జెన్నిఫర్ కోన్ ఆందోళన వ్యక్తం చేశారు. రోగులు అధునాతన మౌలిక సదుపాయాలున్న ఆస్పత్రుల్లో చేరకపోవడం, కచ్చితమైన రోగనిర్ధారణ లేకపోవడం వంటివి కారణాలుగా గుర్తించామన్నారు. అలాగే భారత్‌లో కొత్త యాంటి బయోటిక్స్ అందుబాటులోకి రాకపోవడం కూడా సవాల్‌గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న మందుల అతి వినియోగాన్ని కట్టడి చేసేలా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మందులకు లొంగని ఇన్ఫెక్షన్లు.. యాంటిబయోటిక్స్ అతిగా వినియోగించడం వల్ల శరీరంలోని వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటిబయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని గతేడాది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోప్లోక్సాసిన్, లెవోప్లాక్ససిన్ వంటి కీలక యాంటిబయోటిక్స్.. బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించింది. యాంటిబయోటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. -
ఆర్డర్.. ఆర్డర్ 'రిమాండ్లకీ రూల్సున్నాయ్'!
సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్‌లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్‌ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ⇒ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్‌లందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్‌లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్ జారీ చేసింది.చంద్రబాబు సర్కారుకు ఝలక్..! పోలీసు రాజ్యానికి చెక్!ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్‌బుక్ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లు కుదరదని వివరిస్తున్నారు.⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్‌మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది. పెద్దసంఖ్యలో అరెస్ట్‌లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ⇒ ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్లుఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్‌కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.ఇదీ అర్నేష్‌కుమార్ కేసు...బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి.4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. -
భూములివ్వం.. గోబ్యాక్.. గోబ్యాక్
తాడికొండ: ‘గోబ్యాక్ గోబ్యాక్.. మా భూములిచ్చేది లేదు.. గోబ్యాక్ గోబ్యాక్’.. అంటూ రాజధాని భూసమీకరణ గ్రామసభలలో రైతులు పార్టీలకు అతీతంగా శనివారం కూడా పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. సభ జరిగిన ప్రతీచోటా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రశ్నలతో హోరెత్తించారు. భూములిచ్చేందుకూ ఎవరూ సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారంటూ వారిపై విరుచుకుపడ్డారు.రాజధాని భూసమీకరణ సమాయత్త సభలలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో గ్రామసభ నిర్వహించిన అనంతరం తాడికొండ విచ్చేసిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, అధికారులు సభ మొదలు పెట్టేందుకు మైకు అందుకోగానే రైతులు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. భూసమీకరణ పేరుతో రైతుల పొట్టగొట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసలు మా ప్రాణ సమానమైన భూములు ఎందుకివ్వాలి’.. అని పలువురు సూటిగా ప్రశ్నించారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెళ్తే మంచిదని, అంతకుమించి మాట్లాడితే ఒప్పుకునేదిలేదని రైతులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చి న రైతులకు న్యాయం చేయలేదుగానీ.. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు మా భూములు ధారాదత్తం చేసి మమ్మల్ని రోడ్డున పడేసేందుకు వచ్చారా.. భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు. పైగా.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇప్పటికే రూ.6వేలు ఇస్తోందని.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తానని హామీ ఇచ్చి ందని.. ఇలా మొత్తం రూ.26 వేలు వస్తుందని.. కానీ, మీరిచ్చే రూ.30 వేలు కౌలు ద్వారా మాకు అదనంగా దక్కేది కేవలం నాలుగు వేలేనా అని ముక్తకంఠంతో రైతులు నిలదీశారు. పైగా.. భూమిపై వచ్చే పంట సాగు ఆదాయం కూడా తాము కోల్పోతామని వారు కుండబద్దలు కొట్టారు. దీంతో.. చేసేదిలేక సభ వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే, అధికారులు ప్రకటించి అక్కడ నుంచి జారుకున్నారు. పొన్నేకల్లు సభలోనూ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితర అ«ధికారులను రైతులు తరిమికొట్టి సభ జరగకుండా అడ్డుకున్నారు. నిడుముక్కలలోనూ ఉక్కిరిబిక్కిరి.. అనంతరం.. నిడుముక్కల గ్రామంలో నిర్వహించిన సభలోనూ రైతులు వారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామానికి చెందిన రైతు బండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మాకెలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మీరు మాకు భరోసా ఇస్తారా’.. అని సభా ముఖంగా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే, అధికారులు తెల్లముఖం వేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు యత్నిస్తాం తప్ప మాకేం సంబంధమని వారు మాట దాటవేశారు. దయచేసి మా భూములు వదిలేయండి.. ఈ సభలోనే ఓ మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినవన్నీ జరుగుతాయా? ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మీరు మాపై దయుంచి మాకు కూడా చట్టాలు వర్తించేలా జీఓ తీసుకురండి.. అప్పుడు రైతులకు న్యాయం జరగకపోతే మీపై చర్యలు తీసుకుంటాం.. అంతేగానీ, అధికారం ఉందని మీరు భూములు తీసుకెళ్లిపోతే తర్వాత మేం టెంట్లు వేసుకుని ధర్నాలు, నిరసనలు చేయలేం.. దయచేసి మా భూములు వదిలేయండి’.. అని తీవ్ర స్వరంతో చెప్పారు. భూములివ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు.. ఇక మండల టీడీపీ అధ్యక్షుడు తలశిల ప్రసన్న మాట్లాడుతూ.. గతంలో పూలింగ్ సమయంలో రూ.2 లక్షలు ఉన్న ముంపు పొలాలకు ఇచ్చి న ప్యాకేజీ.. ఇప్పుడు రూ.3 కోట్ల నుంచి రూ.7 కోట్లు పలుకుతున్న మా మెరక పొలాలు ఒకటేనా అని ప్రశ్నించారు. అప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. అప్పటి అదే ప్యాకేజీనే ఇప్పుడు మాకిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. మీరు హామీ ఉండి మా తరఫున పోరాటం చేస్తానంటే మీ హామీ మీద అయితే భూములిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ఇంతలో మరో రైతు మైకు అందుకుని.. ‘అందరి తరఫున నేను మాట్లాడుతున్నా.. ఇప్పుడు మా భూములకు ధరలు ఉన్నాయి. భూములివ్వడానికి రైతులెవరూ సుముఖంగాలేరు. ముందు 44 వేల ఎకరాలు అన్నారు.. ఆ గ్రామాల్లో సభలు పూర్తయ్యాక మళ్లీ అదనపు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. అసలు ఎంత సమీకరణ చేస్తారు.. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు’ అని ఆయన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతుల ఫైర్.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘గతంలో 33 వేల ఎకరాలు తీసుకుంటే దానికి రైతుల ప్లాట్లు ఇతర అవసరాలకు 60 శాతం భూమి పోగా మిగిలిన భూమిలో అభివృద్ధి చేస్తున్నారు.. అది చాలదు కనుక పెద్ద సంస్థలకు ఇచ్చేందుకు ల్యాండ్ బ్యాంక్ కోసం సమీకరణ చేస్తున్నాం’ అని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. దీంతో.. భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు బరితెగించి భూసమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు తమకు అనుకూలమైన వారితో సంతకాలు పెట్టించుకుంటూ నివేదికలు సిద్ధంచేస్తున్నారు. -
అమరావతిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో మరో 20,494 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడి, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూసమీకరణకు ఆమోదం తెలిపింది. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 50వ సమావేశం జరిగింది. ఏడు అంశాలను సీఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పీ(ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన)ను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది. రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన ఇసుకను ప్రకాశం బ్యారే జీ ఎగువన డిసిల్టింగ్ ద్వారా సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. ఇసుక డిసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకూ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి 2 ఎకరాలు, జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కి 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించింది. ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్‌కు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీకి 2 ఎకరాలు, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించింది. గెయిల్, అంబికా గ్రూప్‌కు గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేసింది. మంగళగిరి సమీ పంలో ఈ–15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామ రాజు, పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
సోషల్ మీడియా అరెస్టులు.. ఏపీ జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయించింది. ‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్‌లైన్స్ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు.. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి. మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్‌లో హైకోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
పేదల బియ్యం పక్కదారి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని తొలగించి, కూటమి ప్రభుత్వం తెచ్చిన పాత రేషన్ డీలర్ల వ్యవస్థలో తూకాల్లో మోసాలు చేసి పేదలను దోపిడీ చేస్తున్న వైనాన్ని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి బృందం బట్టబయలు చేసింది. అభినయ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం తిరుపతి నగరంలో పలు రేషన్ దుకాణాల్లో పేదలకు ఇచ్చిన బియ్యాన్ని తన బృందంతో కలిసి తనిఖీ చేసింది. ఒకే సమయంలో 12 రేషన్ దుకాణాల్లో పేదలు తీసుకున్న రేషన్ బియ్యాన్ని ఆ షాపుల వద్దే ఎలక్ట్రానిక్ కాటాపై తూకం వేయగా, 10 కిలోలకు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడైంది. 25 కిలోలకు 22.85 కిలోలే వచ్చింది. అంటే ఇక్కడా 2 కిలోలకు పైగా కోత పడింది. 50 కిలోలు తీసుకున్న వారికి 46 కిలోలే వచ్చినట్లు తేలింది. అంటే 4 కిలోలు తగ్గిపోయింది. దాదాపు అందరి బ్యాగుల్లో తక్కువ బియ్యం తూగింది. ఇలా కిలోలకు కిలోలు రేషన్ బియ్యం పక్కదారిపడుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డుదారుల ఎదుటే బియ్యం తూకం వేసి తక్కువగా ఉన్నట్లు చూపించడంతో అనేక మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం, డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో భారీ బియ్యం స్కాం: భూమన అభినయ్రెడ్డిఏపీలో పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందని, ఇదో పెద్ద స్కాం అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేసే బియ్యం సుమారు 300 కోట్ల కిలోలు అని చెప్పారు. ఇందులో 10–15 శాతం అంటే 30 నుంచి 45 కోట్ల కిలోల బియ్యం కూటమి ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోతోందని తమ తనిఖీల ద్వారా స్పష్టంగా తెలిసిందని వివరించారు. ఈ బియ్యం కిలోకి రూ.15 నుంచి రూ.20కి అమ్మితే, ఈ స్కాం విలువ రూ.500 కోట్లు నుంచి 900 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇది కేవలం అక్రమ వాణిజ్యం కాదని, పేదల ఆకలిపైన, వారి న్యాయమైన హక్కుపై జరుగుతున్న దాడి అని చెప్పారు.వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయంవైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన డోర్ డెలివరీ నిర్ణయం చారిత్రకమైనదన్నారు. ప్రతి ఇంటికీ నేరుగా బియ్యం చేరేలా చేసి, మధ్యవర్తుల మోసాలకు తాళం వేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను రద్దు చేసి, మళ్లీ రేషన్ దుకాణాలే తెచ్చి, వాటి ద్వారా పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కి పంపిస్తూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఆ కోట్ల కిలోల బియ్యం ఎవరి చేతిలో మాయమైందని ప్రశ్నించారు. పేదల తిండిని అమ్ముకునే స్థాయికి పాలకులు దిగజారిపోయారని మండిపడ్డారు. దీన్నేమంటావు పవన్..?కొన్ని నెలల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఓడపై ఎక్కి, ‘సీజ్ ద షిప్’ అంటూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి వీడియోలు, ఫొటోలు, ఫ్లెక్సీలతో రచ్చ చేశారని అభినయ్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం నిజంగా బియ్యం మాయం అవుతోందని, మరి దీని మీద పవన్ ఏం చెప్తారని ప్రశ్నించారు. పైగా ఈ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖకు పవన్ సొంత పార్టీ నేతే మంత్రిగా ఉన్న విషయాన్ని అభినయ్ గుర్తుచేశారు. -
ఇదేమి లెక్క?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో 40శాతం ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీకి 11సీట్లు వచ్చాయి. అదే దేశంలో 36శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఏకంగా 240సీట్లు వచ్చాయి. ఇదేమీ లెక్క? అసలు మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యాన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీపీఎం చేసిన సూచనలకు సంబంధించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ మొత్తం మౌలిక అంశాలపై ఎన్నికల సంస్కరణలు జరగాలన్నది మా డిమాండ్. ఇప్పుడున్న విధానంలో తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు పొందుతున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ సీట్లు వస్తున్నాయి. ఈవీఎంల, వీవీ ప్యాట్ నిర్వహణపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఆధారంగా నడిచే వీవీ ప్యాట్లను బయట నుంచి నియంత్రించే అవకాశం ఉంది. ప్రింట్ అయిన స్లిప్‌లకు, ఈవీఎంలో పోలైన ఓట్లకు సరిపోవాలి. కానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ తేడాలు వచ్చాయి’ అని చెప్పారు. -
ఆయన వసూలు చేయరు... మాకు ఇవ్వరు... మరెందుకు..!?
సాక్షి, అమరావతి: ‘ఆయన పరిశ్రమలు, వ్యాపార సంస్థలను బెదిరించరు.. తనిఖీల పేరుతో వేధించరు.. మూటలు తేరు.. కింది అధికారులను వసూలు చేయనివ్వరు.. మాకు కమీషన్లు ఇవ్వరు.. మేము చెప్పినవారికి కాంట్రాక్టులు ఇవ్వరు.. ఇంకెందుకు నాకీ పదవి?.. ఆయన ఉంటే మేము ఏ పనులూ చేసుకోలేం’.. ఇదీ అగ్నిమాపక శాఖలో ఉన్నతాధికారిపై ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఆగ్రహం. ఆయన్ని వెంటనే బదిలీ చేసి, తాను సూచించిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆ నేత కోరగానే ప్రభుత్వం ఓకే అనేసింది. అంటే మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఇదిగో ఇలా ఉంది..సంస్కరణలకే ఉన్నతాధికారి మొగ్గు.. కీలక నేత కినుకరాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార, విద్య, ఇతర సంస్థలకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. కొత్తగా సంస్థలను ప్రారంభించేటప్పుడు అనుమతులు ఇవ్వడంతోపాటు నిర్ణీత వ్యవధిలో లైసెన్సులను రెన్యువల్ చేయాలి. ఈ అనుమతుల పేరిట భారీగా జరుగుతున్న అవినీతిని అడ్డుకునేందుకు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి ఇటీవల సంస్కరణలు తీసుకువచ్చారు. లైసెన్సులు, రెన్యువల్స్ జారీ విధానంలో సమూల మార్పులు చేశారు. దాంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను తనిఖీల పేరిట వేధింపులు, వారి నుంచి భారీ వసూళ్లు తగ్గాయి. ఈ పరిణామం ప్రభుత్వంలో ఓ కీలక నేతకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే కిందిస్థాయి అధికారులను పిలిపించి మాట్లాడారు. నూతన సంస్కరణలతో తాము వసూళ్లకు పాల్పడటం సాధ్యం కావడంలేదని వారు ఆ నేతకు వివరించారు. మాకే రాకపోతే మీకు వాటాలు ఎలా ఇవ్వగలమని వారు కుండబద్దలు కొట్టారు. దాంతో అగ్ని మాపక శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి నూతన సంస్కరణలను ఆ నేత వ్యతిరేకించారు. కానీ ఉన్నతాధికారి మాత్రం తాను ప్రవేశపెట్టిన సంస్కరణల అమలుకే కట్టుబడ్డారు. దాంతో కీలక నేత భంగపాటుకు గురయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఇక ఏం కమీషన్లు వస్తాయని మండిపడ్డారు.అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ససేమిరాఅగ్నిమాపక శాఖ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.252 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో 17 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, 125 వాహనాలు, రక్షణ పరికరాలు కొనాలి. ఆ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థలకు ఇవ్వాలని ఆ నేత భావించారు. అందుకోసం త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టి తాను సూచించిన సంస్థలకే కేటాయించాలని ఒత్తిడి చేశారు. కాగా, కాలంచెల్లిన సాంకేతికతతో కూడిన అగ్నిమాపక వాహనాలు ఇప్పుడు ఉపయోగపడవని ఆ ఉన్నతాధికారి భావించారు. జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో అనుసరిస్తున్న ఆధునికమైన వాటి కోసం ప్రణాళిక రూపొందించారు. కేవలం నీళ్ల ట్యాంకర్లు కాకుండా కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు కొనాలని ప్రతిపాదించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లడం ద్వారా మంటలను త్వరగా అదుపు చేసే ఆధునిక సాంకేతికతను రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టాలని ఆయన భావించారు. అందుకు అనుగుణంగానే 17 కొత్త అగ్ని మాపక కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఆధునిక యంత్రాల ప్రతిపాదనలు కీలక నేతకు ఆగ్రహం కలిగించాయి. ఎందుకంటే ఆ నేత అస్మదీయ సంస్థలకు కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసే ట్యాంకర్లు సరఫరా చేసే సామర్థ్యం లేదు. అందుకు అనుగుణంగా ఆధునిక రీతిలో అగ్ని మాపక కేంద్రాలు నిర్మించే నైపుణ్యం లేదు. ఉన్నతాధికారి ప్రతిపాదనలను ఆమోదిస్తే తమ అస్మదీయ సంస్థలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం సాధ్యం కాదు. దాంతో ఆ ఉన్నతాధికారి ఉంటే తమ అవినీతి వ్యవహారాలు సాగవనే నిర్ణయానికి వచ్చారు. అస్మదీయ అధికారి నియామకానికి పట్టు.. సరేనన్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని వెంటనే బదిలీ చేయాలని కీలక నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ, తన మాట ఎందులోనూ చెల్లుబాటు కావడం లేదని ఆ నేత అసంతృప్తితో ఉన్నారు. పైగా, తన పరిధిలోని అన్ని విభాగాలు చిన బాబు గుప్పిట్లోనే ఉన్నాయి. కనీసం అగ్ని మాపక శాఖ వంటి చిన్న విభాగంలో అయినా తన మాట చెల్లుబాటు కావాలని పట్టుబట్టారు. దీంతో అగ్ని మాపక శాఖ ఉన్నతాధికారిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆయన స్థానంలో తన మాట వినే జూనియర్ స్థాయి అధికారిని నియమించాలని కూడా కీలక నేత సిఫార్సు చేశారు. ఆ ఐజీ స్థాయి అధికారి ద్వారా అడ్డగోలుగా పనులు చేయించుకోవాలన్నది అసలు లక్ష్యం. ఆ నేత సిఫార్సు మేరకు ఐజీ స్థాయి అధికారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఐపీఎస్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. చంద్రబాబు ప్రభుత్వంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అవమానకరంగా వేటు వేయడానికి సర్వం సిద్ధమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌తో రక్తమోడుతోన్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
కొనేది లేదు..! మామిడి ‘కోతలే’!
సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగుతోంది. ప్రాసెసింగ్ కంపెనీలతో కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేయిస్తున్నామని.. కిలోకు రూ.4 వంతున ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తున్నామంటూ బుకాయిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ సీజన్లో 5.61 లక్షల టన్నుల నాణ్యమైన మామిడి దిగుబడులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి సర్కారు నిర్వాకంతో తోతాపురి మామిడి కిలో రూపాయికి కూడా కొనే నాథుడు లేకుండా పోయారు. దీంతో దిక్కుతోచక రైతన్నలు వేలాది టన్నుల మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూపాయికి అర్ధ రూపాయికి అడుగుతుండడంతో కూలి ఖర్చులు కూడా రావన్న ఆవేదనతో లక్షలాది ఎకరాల్లో పక్వానికి వచ్చిన మామిడిని కోయకుండా వదిలేస్తున్నారు. కళ్లెదుటే కుళ్లిపోయి రాలిపోతుండడంతో కుమిలిపోతున్నారు. వాస్తవాలకు ముసుగేసి మామిడి రైతులను తామేదో ఉద్ధరిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నమ్మబలుకుతుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.కదిలించిన కుమారస్వామి..చేతులెత్తేసిన చంద్రబాబు.. ఏపీలో మాదిరిగానే కర్నాటకలో కూడా ధరలు లేక మామిడి రైతులు నష్టపోతున్నారు. దీనిపై స్పందించిన కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి కుమారస్వామి రైతులను ఆదుకోవాలంటూ గత నెల 24వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. తమ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవాలని, కేంద్రం కిలో రూ.16 చొప్పున కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా క్వింటా రూ.1,616 (కిలో రూ.16) చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. కుమారస్వామి కోరిన విధంగా ఏకంగా 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు.కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రాణవాయువు అందిస్తున్నా...టీడీపీ, జనసేన మాదిరిగానే కర్నాటకలో జేడీఎస్ కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. టీడీపీ – జనసేన రైతులను ఆదుకోవడంలో విఫలం కాగా జేడీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క లేఖతో కదిలించింది. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జనసేన అండదండలతోనే మనుగడ సాగిస్తున్నా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర సాధించిన పాపాన పోలేదు. మొన్న మిర్చి.. నేడు మామిడి రైతుల పట్ల అదే రీతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మద్దతు ధరల విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపిన దాఖలాలు లేవు. కేంద్రంలో తమకున్న పలుకుబడిని స్వప్రయోజనాలకు, స్వలాభాలకు మినహా రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు వినియోగించిన దాఖలాలు లేవు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేవలేక.. చేతకాక మామిడి రైతులను నట్టేట ముంచేసింది. మొన్నటికి మొన్న మిర్చి రైతుల విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించింది. కేంద్రానికి లేఖ రాశామని, క్వింటా రూ.11,781 చొప్పున రైతుల వద్ద ఉన్న మిర్చినంతటిని కేంద్రమే కొనుగోలు చేస్తుందంటూ ప్రకటించారు. తీరా కేంద్రం కొనలేదు.. రాష్ట్ర ప్రభుత్వమూ కొనలేదు. 2023–24 సీజన్లో క్వింటా రూ.21–27 వేలు పలికిన మిర్చిని కూటమి సర్కారు అసమర్థతతో రూ.6–8 వేలకు తెగనమ్ముకొని రైతులు నష్టాలపాలయ్యారు.కంపెనీల గోడు పట్టదు.. రైతులను మభ్యపెడుతూ..ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో తమవద్ద పేరుకుపోయిన దాదాపు 1.50 లక్షల టన్నుల పల్ప్ నిల్వలను అమ్ముకునేందుకు ప్రభుత్వం చేయూతనివ్వకుంటే ఈ ఏడాది రైతుల నుంచి తోతాపురి మామిడిని కొనుగోలు చేయలేమని కంపెనీలు మొరపెట్టుకున్నాయి. అయితే ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పల్ప్ ఉత్పత్తులపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలు అభ్యర్థిస్తే.. కేంద్రానికి లేఖ రాశామంటూ పాతపాటే పాడింది. కంపెనీలు కిలో రూ.8 చొప్పున మామిడిని కొనుగోలు చేస్తాయని, మిగిలిన రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ తీరా కిలో రూ.2–4 మించి కొనేవారు లేక మామిడి రైతులు అల్లాడుతున్నారు. ర్యాంపుల వద్ద అయితే కిలో రూ.1–2కి మించి ఇవ్వని దుస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అయినా జమ చేసిందా అంటే ఏ ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆదుకోవాలన్న తపన లేదురాష్ట్రంలో రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, తపన కూటమి ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అప్పుల పాలై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చేష్టలుడిగి చూస్తుందే గానీ ఆదుకోవాలన్న తపన ఏ కోశానా లేదు. –జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంటన్నుల కొద్దీ పారబోస్తున్నారు..మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే రైతులకు ఎంతోకొంత ఉపయోగం జరుగుతుంది. కిలో రూ.12 చొప్పున ప్రకటించినప్పటికీ ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలో రూ.8 కూడా ఇవ్వడం లేదు. మొదటిసారిగా టన్నుల కొద్దీ మామిడి రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి రైతులను కాపాడి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ అగ్రి మిషన్ మాజీ వైస్ చైర్మన్రూ.7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన జగన్ సర్కార్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుఅన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విత్తనాల నుంచి పంట విక్రయాల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా నిలిచింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అందించింది. ఉచిత పంటల బీమాను అమలు చేసి రైతులపై భారం లేకుండా చేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే వ్యవసాయదారుల అన్ని అవసరాలను తీర్చింది. ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సాగుదారులకు భరోసా కల్పించింది. ధరలు పడిపోయిన ప్రతి సందర్భంలోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల పంట ఉత్పత్తులను (ధాన్యం కాకుండా ఇతర పంటలు) కొనుగోలు చేయడం గమనార్హం. -
రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/OGj2nFysZT— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
అల్లూరి జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజుకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తించుకునేలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేసి, ఆయన్ని గౌరవించుకున్నాం. నేడు ఆ మహావీరుడి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు… pic.twitter.com/3VtISU9UwL— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో పలువురిని అరెస్ట్ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు. -
ఇది చాలా దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పీటీ వారెంట్లు జారీ చేస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలాగే ఉంది. ఇది చాలా దురదృష్టకరం (సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్)’ అని హైకోర్టు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాణి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పిటిషన్లు దాఖలు చేసిన కాకాణి అక్రమ మైనింగ్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేశారంటూ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గోవర్ధన్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లున్నా కూడా 41ఏ వర్తిందన్నారు ఈ సందర్భంగా కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకాణిపై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడేవేన్నారు. అయినా కూడా మేజిస్ట్రేట్ సెక్షన్ 41ఏ వర్తించదన్నారని తెలిపారు. అంతేకాక సహేతుక కారణాలు తెలియచేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ల తీరుపై వ్యాఖ్యానించారు. అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ కేసులో కాకాణిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలిపారు. అందువల్ల కాకాణి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యరి్థంచారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్లీ ‘సెర్చ్’..!
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల (వీసీ) ఎంపిక పెద్ద ప్రహసనంగా సాగుతోంది. పూర్తిస్థాయి ఉప కులపతులను నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాదికి పైగా వీసీల పేర్లు వెతుకులాటలోనే గడిపేసింది. సెర్చ్ కమిటీలు కూలంకషంగా విశ్లేషించి వర్సిటీల వారీగా ఇచ్చిన జాబితాలను తమకు నచ్చకుంటే బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ మరింత సాగదీతకు దిగుతోంది. – సాక్షి, అమరావతిరాజకీయాలకు అతీతంగా ఉంచాల్సిన వర్సిటీలపై కూటమి సర్కారు కన్నేసింది. గత ప్రభుత్వ హయాంలోని వీసీల మెడపై కత్తిపెట్టినట్టు బెదిరించి బలవంతపు రాజీనామాలు తీసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ వర్సిటీ వీసీలందరూ మూకుమ్మడిగా వైదొలగడం చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వీసీల ఊసే ఎత్తకుండా ఇన్చార్జిల పాలనకు వదిలేసింది. చివరికి ఫిబ్రవరిలో 9 వర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ఎంపికైన హైదరాబాద్ వర్సిటీ (సెంట్రల్ వర్సిటీ) ప్రొఫెసర్ పి.ప్రకాశ్‌బాబు మరో సెంట్రల్ వర్సిటీలో అవకాశం రావడంతో వెళ్లిపోయారు.ఇంకా సెర్చ్ కమిటీ ఎందుకు?కూటమి ప్రభుత్వం వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ నివేదికకు విలువ లేకుండా చేస్తోంది. ఆచార్య నాగార్జున, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్టీయూ గురజాడ వర్సిటీలకు గతంలో సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లలోని వ్యక్తులు వీసీలుగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, మిగిలినవారి పేర్లు ప్రభుత్వానికి నచ్చకపోవడంతో పక్కనపెట్టింది. వాస్తవానికి వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ, యూజీసీ నుంచి వ్యక్తులు నామినీలుగా ఉంటారు. అలాంటి కమిటీ వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిభావంతులకే పెద్దపీట వేస్తుంది. కానీ, కూటమి ప్రభుత్వం తమ అనుయాయులకే వీసీల పదవులు కట్టబెట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన పేర్లు నచ్చనప్పుడు ప్రభుత్వమే తనకు నచ్చిన పేర్లు ఇచ్చి జాబితాలో రాయించుకోవచ్చు కదా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.కొత్తగా 4 వర్సిటీలకు సెర్చ్ కమిటీలుఆచార్య నాగార్జున, ద్రవిడియన్, జేఎన్టీయూ గురజాడ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 17 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించగా కొన్నింటి సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యంగా జరిగాయి. ద్రవిడియన్ వర్సిటీ వీసీ ఎంపికలో యూజీసీ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎకే సారిన్‌ను సెర్చ్ కమిటీలో నియమించారు. ఆయనపై తాము చెప్పిన పేర్లనే ప్రతిపాదించాలని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటినుంచి మళ్లీ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో ఆయన పేరును తొలగించి మద్రాస్ వర్సిటీ మాజీ వీసీ ఎస్.గౌరిని తీసుకొచి్చంది.శ్రీకృష్ణదేవరాయలో యూజీసీ నామినీగా ఉన్న ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సరితకుమార్దాస్ స్థానంలో లక్నో వర్సిటీ ప్రొఫెసర్ అలోక్ కుమార్‌రాయ్, జేఎన్టీయూ గురజాడ వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ అవినాశ్‌కుమార్ అగర్వాల్ బదులు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధిని, ఆచార్య నాగార్జున వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీగా జమ్మూ సెంట్రల్ వర్సిటీ వీసీ సంజీవ్ జైన్ స్థానంలో తమిళనాడులోని డీమ్డ్ వర్సిటీ వీసీ ఎన్.పంచనాథంను నియమిస్తూ కొత్తగా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఉర్దూ, ఆంధ్రకేసరి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్సిటీలకు వీసీల పేర్లను సెర్చ్ కమిటీలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. వీటిని కూడా ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు శ్రీవెంకటేశ్వర వర్సిటీకి సైతం త్వరలో కొత్త సెర్చ్ కమిటీని వేయనున్నారు. యోగి వేమన వర్సిటీ వీసీ పోస్టుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించగా సెర్చ్ కమిటీని వేయాల్సి ఉంది. -
హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రముఖ న్యాయవాది గేదెల తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు తీర్మానించింది. తుహిన్ కుమార్ పేరుకు కేంద్రం ఆమోదం తెలిపాక అది ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత తుహిన్ కుమార్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులతో కలుపుకుని మొత్తం 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్ నియామకంతో ఆ సంఖ్య 29కి చేరుకుంటుంది. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. తుహిన్ నియామకం పూర్తయితే 8 ఖాళీలు ఉంటాయి. త్వరలో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు కొలీజియం సిఫారసుకు ఆమోదముద్ర వేసింది. తుహిన్ నేపథ్యం ఇది.. తుహిన్ కుమార్.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్మీడియెట్, విశాఖపట్నం ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
కూటమి పాలనపై జనసేన నేత తిరుగుబాటు
తిరువూరు: కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ కన్వినర్ మనుబోలు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో ధ్వజమెత్తారు. తిరువూరు నియోజకవర్గంలో కొందరు తనను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏమి చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషిచేసిన వారిని అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.తనపై భౌతికదాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు సొంత అజెండా రూపొందించుకోవడాన్ని ఖండించారు.నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లలో కూటమి భాగస్వామ్య పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్టు పనులు చేసుకుంటే పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులే పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూళ్ళు వసూలు, జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి వసూళ్ళ పర్వం, విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్టు కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టడంగా గుర్తించినది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మనుబోలు చెప్పారు. ఏ కొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమ క్వారీ నిర్వహణపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘వరదే’ కృష్ణరూపిణీ..
సాక్షి, నరసరావుపేట/శ్రీశైలం ప్రాజెక్టు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ఫలితంగా నదీమతల్లి రాష్ట్రంలోని జలాశయాల వైపు పరుగులు తీస్తోంది. వరద నీటితో ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ డ్యాంలు దాదాపుగా నిండాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను తెరవడంతో రాష్ట్రంలోని శ్రీశైలానికి వరదనీరు వస్తోంది. గతేడాది తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పాడవడం, డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నిలపరాదన్న నిర్ణయంతో శ్రీశైలానికి వేగంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం ఉదయం 8 గంటలకు 875.6 అడుగులుగా నమోదైంది.డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.89 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం ఉదయం 68,169 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రారంభించాయి. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ వైపు 63,150 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 12.649 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.357 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. సాగర్‌లో 147.82 టీఎంసీలకు చేరిక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. గురువారం ఉదయం 8 గంటలకు సాగర్‌లో నీటి మట్టం 519.2 అడుగులు వద్ద నమోదైంది. 147.82 టీఎంసీలు నిల్వ ఉంది. ఎగువన శ్రీశైలం నుంచి 50,771 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండటానికి మరో 164.23 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నారు. ఇప్పటికే క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈనెల చివరివారంలోగా ఆయకట్టుకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం 20 గేట్ల ఎత్తివేత సాక్షి,బళ్లారి/హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నం 33 క్రస్ట్‌గేట్లలో 20 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి దాదాపు 59 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. డ్యాం క్రస్ట్‌గేట్లు బలహీనంగా ఉండటంతో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు. డ్యాం చరిత్రలో జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇన్‌ఫ్లో 28,932 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 62,766 క్యూసెక్యులుగా నమోదైంది. 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో ప్రస్తుతం 1625.46 అడుగులతో 78.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ సారి దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద ఖరీఫ్‌కు మాత్రమే సాగు నీరివ్వనున్నారు. కాలువకు 10న నీటిని విడుదల చేసి నవంబర్ 30న నిలిపి వేయనున్నారు. అయితే కర్ణాటక రైతు సంçఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
జనాలు నలిగిపోతాన్రు!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు! బడ్డీ కొట్టు పెట్టుకున్నోళ్లకి డబ్బులిచ్చోడు.. ఒక్కడికీ లేదని పించలేదు. సంవత్సరానికి మాకు అన్ని పథకాలూ కలిపి డెబ్బై వేలదాకా వొచ్చేది. చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు. జనాలు నలిగిపోతాన్రు. చెప్పుకోకూడదు కానీ టీ సుక్కకి కూడా డబ్బులాడతం లేదు! – మంగలి సత్యం, నాయీ బ్రాహ్మణుడు, తామరాపల్లి, విజయనగరం జిల్లా ‘ఏటి సేసినారు..? రైతు భరోసా పెంచి ఇత్తామన్నారు.. అది అసలే నేదు..! చదువుకున్న కుర్రోళ్లకి డబ్బులేసేటోళ్లు..! వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలన్నీ ఒచ్చియి.. అవి ఇప్పుడున్నాయేటి..? ఏయీ నేవు...! గుండికాయల మీద సెయ్యేసి తెలుసుకుంటే.. ఈడు సేసిందేముంది..? ఆడు సేసిందేముంది..? అని తెలుసుకుంతారు! ఒక తల్లికి పిల్లనేదు.. పిల్లకి తల్లీనేదు! ఎవరి చేతిలోనూ డబ్బుల్లేక నకనకనాడిపోతున్రు...! ఇప్పుడే పనీనేదు.. పేదాసాదా అంతా ఉసూరుమని ఏడుత్తాండ్రు! రెండొందలు మూడొందలు వొచ్చీ కరెంటు బిల్లు ఇప్పుడు డబలైపోనాది. కొట్టుమీద కిరాణా సామాన్లు పెరిగాయి.. నూని డబ్బా పెరిగింది.. ఇప్పుడింక బాగైనా బరాయించాల..! చెడ్డయినా బరాయించాల..! మళ్లీ మన టైమొచ్చీదాకా..! మరింకేటి సేత్తాం..!. – జట్టి మంగ, కండేపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లానేను పక్కా టీడీపీ అయినా జగన్ పథకాలు టంచనుగా అందాయి ‘కరోనా టైమ్‌లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. అయ్యన్నపాలెంలో ఒక కుటుంబానికి ఏటా రూ.లక్ష దాకా వచ్చేది. అప్పుడు జనాలకు సొమ్మాడటంతో కొత్త బట్టలని, ఇంట్లో ఏదైనా సామాన్లని కొనుక్కునేవారు. ఇప్పుడు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నేను పక్కా టీడీపీ. అయినా జగన్ పథకాలు మాకు టంచనుగా అందాయి..’ – సోమేశ్వరరావు, టైలర్ షాపు, అయ్యన్నపాలెం, నర్సీపట్నంశివరామకృష్ణ మిర్తిపాటి – ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏడాది పాలన గుండె చప్పుడు ఇది! నిజాలను భరించగలిగే శక్తి ఉంటే పేదల ఆక్రందన అర్థం అవుతుంది! గ్రామాల్లో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏరికోరి కష్టాల పాలయ్యామనే ఆక్రోశం ఎవరిని కదిలించినా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలిపివేయడం.. సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో పేదలు నలిగిపోతున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. గిట్టుబాటు ధరలు లభించక అల్లాడుతున్నారు. పిల్లల చదువులు మళ్లీ గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న మహిళలు విసిగిపోతున్నారు. ఏడాది క్రితం దాకా కళకళలాడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో కకావికలమవుతోంది. ఏడాదికే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో!ఏం ప్రభుత్వమండీ ఇది! వాహనమిత్ర పథకం అందకపోవడంతో గ్రామాల్లో ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. రోజుకు ఐదారొందలు వస్తే పోలీసులు రూ.మూడు నాలుగొందలు కట్టాలని కేసు రాసేస్తున్నారని ఇక తాము ఎలా బతుకుతామంటూ విజయనగరం జిల్లా తామరాపల్లి జంక్షన్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 8 వారాల నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని విజయనగరం జిల్లా పెద్ద బోరబండ గ్రామానికి చెంది ఉపాధి హామీ కార్మి కులు చెబుతున్నారు. ఆఖరికి మూగజీవాల గోడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘గొర్రెలకు కూడా మందులిచ్చేటోడు జగన్! ఇప్పుడేవీ లేవు. మట్టి పనుల డబ్బులు 4 నెలలుగా పడలేదు.రైతు భరోసా ఆగిపోయింది. ఎవరికీ ఏవీ లేక జనాలు మండిపోతున్నారు’ అని పురోహితినివలసకు చెందిన నీలబోణి లచ్చుము వాపోయాడు. ‘జగన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా అనుకున్న టైమ్‌కి అందరికీ అన్ని పథకాలూ వచ్చేవి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదు. పథకాలూ రాక, జనాల చేతిలో డబ్బులాడక మా వ్యాపారం సాగడం లేదు’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో రోడ్డు పక్కన బెల్లం, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్న మాధవి నిర్వేదంగా చెప్పింది! ‘ఏం ప్రభుత్వమండీ ఇది! మాకు ఇంతకుముందు అన్ని పథకాలు వచ్చియి. మా మనవరాలికి అమ్మ ఒడి, మాయావిడికి రూ.18,500 వచ్చియి. ఇప్పుదేదీ లేదు’ అంటూ కోటవురట్లలో చిన్న కిళ్లీ బడ్డీ నడుపుకుంటున్న దాకారపు రవణ దిగాలుగా నిట్టూర్చాడు.అభివృద్ధి.. అప్పుల్లోనే!! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, నాడు–నేడుతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడంతో నిత్యం అభివృద్ధి పనులు జరిగేవి. జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో గ్రామాలలో ఉపాధి లభించేది. కోవిడ్‌లోనూ ఈ పనులు నిరాటంకంగా సాగడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసింది.నవరత్నాల సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ అమలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనేందుకు నిదర్శనం. ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ ‘జగనున్నప్పుడు రైతు భరోసా ఏసీవోడు! చంద్రబాబు వచ్చిన కాడ నుంచి ఏవీ రావడం లేదు. ఏదో సొంత పొలం వదిలేయలేక తిండి గింజలు పండిస్తున్నాం. అదీనేకపోతే కూడు కోసుపోయి ఉండటమే! చోడవరం పందార ఫ్యాక్టరీకి చెరుకు తోలి ఐదు నెలలైంది ఇప్పటికొచ్చి రూపాయివ్వలేదు. మరి ఏటి తింటారు? మా ఆయన ఉపాధి హామీ మట్టి పనికెళ్లి రెండు నెలలైంది. ఒక్క రూపాయి పడలేదు. మార్చి నుంచి చేసినోళ్లకే లేదు. ఇంక మాకేం పడతాయి? చంద్రబాబుది అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ అంటూ అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన అచ్చయ్య గోడు వెళ్లబోసుకుంది. 70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు, మామిడి పళ్లు, కొబ్బరిబొండాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది! ఈ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..! ‘పండిన పంటకు గిట్టుబాటు లేదు. ఒక రైతు భరోసా లేదు. క్రితం ఏడాది నువ్వులు క్వింటా రూ.12 వేలు ఉంది. ఇప్పుడు రూ.8 వేలే. కష్టం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏ పథకాలూ లేవు. జగనున్నప్పుడు అమ్మ ఒడి అనో, 45 ఏళ్లు దాటిన ఆడోళ్లకి రూ.18,500 అనో ఏదో డబ్బులు పడేయి. ఇప్పుడు ఏవీ రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!’ విజయనగరం జిల్లా తెర్లాంలో నువ్వులు నూరి్పడి చేస్తున్న రైతు దంపతులు శ్రీరాములు, లక్ష్మి ఆవేదన ఇదీ!! -
గురుకులాల్లో నిలిచిన టెండర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లాలో గురుకుల విద్యాలయాలకు సరుకులు సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో దిగజారుడు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో 11 జ్యోతిరావు పూలే గురుకులాలు, రెండు ఏపీ రెసిడెన్షియల్ , 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు గాను కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ వంటి సరుకులను సరఫరా చేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 40 మంది టెండర్లు దాఖలు చేశారు.కానీ ఆ టెండర్ల వ్యవహారంలో అధికార కూటమి నేత జోక్యం టెండర్ ప్రక్రియకు గ్రహణం పట్టినట్లయింది.ఇంతకీ ఏం జరిగిందంటేజూన్ 28న జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తొలుత శ్రీకాకుళం డివిజన్లో ఐదు గురుకులాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుండగా డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ రంగంలోకి దిగారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన గురుకులాల టెండర్లు డీసీఎంఎస్‌కే కావాలని, తాను డీసీఎంఎస్ అధ్యక్షునిగా ఉన్నందున ఇంకెవరికి ఇవ్వరాదని అధికారులకు తేల్చిచెప్పారు. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి టెండర్ నిలిపి వేయించినట్లు తెలుస్తోంది.కొటేషన్లోనూ ఎక్కువే..వాస్తవానికి ప్రైవేటు టెండరుదారులు ఓ సరుకుకు రూ.330 కోట్ చేయగా, అదే సరుకుకు డీసీఎంఎస్ ద్వారా రూ.805 కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ కోట్ చేసిన వారికి టెండరు ఖరారు చేయకూడదు. ఆ లెక్కన డీసీఎంఎస్ అనర్హత సాధించినట్లే. అయితే ఓవైపు నిబంధనలు, మరోవైపు మంత్రి స్థాయి నుంచి ఒత్తిళ్లు వెరసి ఏం చేయాలో తోచక అధికారులు టెండర్‌ను వాయిదా వేశారు. దీంతో తక్కువ ధరకు కోట్ చేసిన టెండరుదారులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
కాంట్రాక్టులన్నీ స్వీప్!
ఈ ఫొటోలో ఉన్న స్వీపింగ్ యంత్రాలు నెల్లూరు మున్సిపాలిటీలోనివి. గతంలో టీడీపీ పాలనలో సరఫరా చేసిన ఏడేళ్లకే ఈ వాహనాలు మూలకు చేరాయి. వాస్తవానికి.. వాహనాల కాలపరిమితి రవాణాశాఖ లెక్క ప్రకారం 15 ఏళ్లు. అయితే, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలు మూణ్ణాలకే మూలకు చేరాయి.ఏపీ27టీజెడ్ 2131 రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన ఈ స్వీపింగ్ యంత్రాన్ని నెల్లూరు మున్సిపాలిటీకి 2017లో సరఫరా చేశారు. అయితే, ఇది కాస్తా 2018లో మరమ్మతులకు గురికావడంతో అప్పటి నుంచి ఈ స్వీపింగ్ యంత్రం శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గోడౌన్లోనే మూలుగుతోంది. దీనిపై నెల్లూరు మున్సిపల్ అధికారులు అడిగేందుకూ సాహసించడంలేదు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంఇప్పుడీ స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు (ఓ అండ్ ఎం) పేరుతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. మంత్రి పేరుతో అన్ని మున్సిపాలిటీల్లోని అధికారులు, టీడీపీ కూటమి నేతలను ఈ సంస్థ ప్రతినిధులు కలుస్తూ తమకే కాంట్రాక్టు వచ్చేలా నిబంధనలు రూపొందించుకుంటున్నారనే విమర్శలున్నాయి. వాస్తవానికి.. సదరు సంస్థ సరఫరా చేసిన 125 వాహనాల్లో ఇప్పటికీ 61 వాహనాలు మున్సిపాలిటీల పేరిట ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు.అయినప్పటికీ సదరు సంస్థ యంత్రాల కొనుగోలు సమయంలో టెండరు దాఖలు చేసినప్పుడు ఉంచిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కూడా చెల్లించేందుకు ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. మరోవైపు.. సదరు సంస్థ సరిగ్గా వాహనాలను నిర్వహించడంలేదని.. వాటికి మరమ్మతులు చేయడంలేదని పేర్కొంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంస్థను 2023లో టెర్మినేట్ చేసింది. సాధారణంగా టర్మినెట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకూడదు. కానీ, గుంటూరులో శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ర్పైజెస్ దాఖలు చేసిన సింగిల్ టెండర్‌కే పనులు అప్పగించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఓ మంత్రి పేరుతో ఓ అండ్ ఎం కాంట్రాక్టులను ఊడ్చేసేందుకు రంగం సిద్ధమైంది.రిజిస్ట్రేషన్ చేయకుండానే..వాస్తవానికి.. రూ.41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగు వాహనాలను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 2017లో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఆ సంస్థ సరఫరా చేసింది. అయితే, ఇందులో 62 వాహనాలకు ఇప్పటివరకు ఆయా మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బిల్లులు చెల్లించింది. అయితే, ఈ వాహనాలను ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకొస్తే.. చేయిస్తానని సదరు సంస్థ ఇప్పుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకు కూడా సంసిద్ధత తెలిపి.. ఆ భారాన్ని మున్సిపాలిటీలపై వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, మొత్తం 125 వాహనాల్లో సగానికి పైగా వాహనాలకు ఇంజన్లు లేవు. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖాధికారులు అంగీకరించే అవకాశంలేదని మున్సిపల్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇక నెల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.8 కోట్లతో టీపీఎస్ సంస్థ ద్వారా ఐదు కొత్త స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు.వీటికి రానున్న ఐదేళ్ల పాటు రాజరాజేశ్వరి సంస్థకు ఓ అండ్ ఎం బాధ్యతలను సింగిల్ టెండర్లో అప్పగించడం గమనార్హం. ఇదే తరహాలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు తదితర మున్సిపాలిటీల్లో కూడా కొత్త స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు పనులను మళ్లీ ఈ సంస్థకే అప్పగించేందుకు అధికారులను మంత్రి పేరుతో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకదాని పరికరాలు మరో దానికి..ఇక సాధారణంగా ఏదైనా వాహనంలో ఒక పరికరం పాడైతే మరో పరికరాన్ని అమర్చి బాగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక వాహనానికి చెందిన పరికరాన్ని మరోదానికి అమర్చడం పరిపాటిగా మారింది. ఇలా మొత్తం వాహనాలను డొల్లకింద మార్చేశారు. ఫలితంగా.. అనేక వాహనాల్లో ఏకంగా ఇంజిన్లు, బ్లోయర్లు, రేడియేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలు మాయమై మూలకు చేరాయి.తిరుపతి, నెల్లూరు, గుంటూరులో మాత్రం ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో మరమ్మతులు చేయించి తిప్పుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి రానున్న ఐదేళ్లపాటు కూడా ఇదే సంస్థకు ఓ అండ్ ఎం అప్పగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే గుంటూరు మున్సిపాలిటీలో సింగిల్ టెండర్ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించగా.. తిరుపతి, విశాఖ, కర్నూలు, నెల్లూరులోనూ ఇదే తరహా మంత్రాంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది. -
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందంటూ చురకలంటించారు. సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ నమోదైన కేసులో ప్రధాన నిందితులైన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో సీబీఐ సిట్ నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్లు నాలుగున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే దర్యాప్తు మొత్తం పూర్తయిందని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించారని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారని, అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అందచేశారని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్లు సాక్షులను బెదిరించారన్న సీబీఐ ఆరోపణలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం నిందారోపణలే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం..ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగయ్య మృతి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేసేందుకు కూటమి మద్దతు ట్రోలర్లకు అవకాశంగా మారింది. -
మన్నవ సర్పంచ్‌పై హత్యాయత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్‌లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
రోప్ పార్టీకి దిక్కులేదు.. జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నారంట!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఆయన పర్యటనల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చునన్నారు. ఓ వ్యక్తి భద్రత విషయంలో రోప్ పార్టీది కీలకపాత్ర అని ఆయన వివరించారు. భారీ సంఖ్యలో వచ్చే జనాలను రోప్ పార్టీ నియంత్రిస్తుందని, తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. జగన్‌కు అన్నిరకాల భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటుచేయడం లేదో చెప్పడం లేదన్నారు.రోప్ పార్టీ విషయంలో ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందో అర్థంకావడంలేదన్నారు. అది లేకుంటే జగన్ భద్రతకు ముప్పు ఉన్నట్లేనని శ్రీరామ్ స్పష్టంచేశారు. జగన్ పర్యటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్‌కు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కనీస స్థాయిలో కూడా పాటించడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారిలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటునకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్రజాప్యం చేశారన్నారు. అడుగు కూడా వేయలేని ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చారని, ఈ ప్రాంతంలో చెట్లు, పొదలు తొలగించడానికే మూడ్రోజులు పడుతుందని శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో జగన్ తన నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్‌కు రోప్ పార్టీతో సహా అన్నీ రకాలుగా భద్రత కల్పించే విషయాన్ని కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రమే కాకుండా, ఆయన చేసే ప్రతీ పర్యటనకు సైతం వర్తింపజేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. జగన్‌కు సేఫ్ ట్రావెల్, సేఫ్ ల్యాండింగ్, సేఫ్ మూవ్మెంట్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే జగన్ భద్రత కోసం ప్రభుత్వ నిర్లక్ష్యంపై రెండు పిటిషన్లు దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, జగన్ పర్యటన వాయిదా నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకమైందన్నారు. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామన్నారు. జడ్ ప్లస్ వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పిటిషనర్లు అనుబంధ పిటిషన్ వేశారని, దీనికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఆ రోజుకి కౌంటర్ దాఖలు చేయాలని, ఆ రోజునే వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయ్‌భాస్కర్‌రెడ్డి
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన చిట్యాల విజయ భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విజయ భాస్కర్ రెడ్డి బెంగళూరులో 2010వ సంవత్సరంలో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం స్థాపించారు. ఈ ఫోరం ఆధ్వర్యంలో బెంగళూరు, పూణే నగరాల్లో ఐటి ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పలు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించారు.ప్రతిష్టాత్మక పులివెందుల, కడప ఉపఎన్నికల్లో ఫోరం టీం సభ్యులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ పెట్టక ముందు వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుంచి తాను తన ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ తాను ఎంతగానో ఆదర్శంగా తీసుకుని ప్రేరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్‌తో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలను అందిస్తూ వస్తున్నారు.అలానే ఇటీవల తన తాత పేరు మీద ఒక ట్రస్ట్ నెలకొల్పి పలువురు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తన మండల పరిధిలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో తాను ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు గాను ఇటీవల ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా సిఎస్ఆర్ అవార్డు అందుకున్నారు. చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి, వృత్తిపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన కీలకమైన రాష్ట్ర ఐటి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా చిట్యాల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంతగానో అభిమానించే పార్టీ అధినాయకులు జగన్ అన్న నాయకత్వంలో కీలకంగా పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను రాష్ట్ర విభాగ అధ్యక్షులు, అన్ని స్థాయిలలోని కమిటీ సభ్యులతో కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పూణే లాంటి వివిధ నగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐటి, ఇతర నిపుణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతికి తన వంతుగా శక్తి వంచనలేకుండా అంకిత భావంతో కృషి చేస్తానని తెలియజేశారు. వైఎస్సార్ స్ఫూర్తిని, ఆశయాలను అనుసరిస్తూ ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. -
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్‌పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్‌లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్‌పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్‌పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
ట్రోలింగ్స్.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్‌ను అనుమతించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్’’ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారుఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్‌కు బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలన్నారు. -
చినబాబు దర్శనానికి రూ.40 లక్షలు..!
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్మెంట్ ఇప్పించారని సమాచారం.ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది. -
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్‌కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు. -
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్.. ఏపీ పోలీస్ బిగ్ బాస్ ఎంట్రీ!
సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) సిద్ధార్థ్ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరుగుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్ బిగ్ బాస్‌ను రంగంలోకి దించారు.కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్ బిగ్ బాస్ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్ కౌశల్ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్ఎస్: సిద్ధార్థ్ కౌశల్ సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్ కౌశల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు చేరికలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా అన్ని యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. -
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు. -
కూటమి ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్.. రెండేళ్ల తర్వాత కేసా?
ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదం. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మలుస్తారా? ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేస్తారా? ఇదేమి తీరు? సరైన పద్ధతి కాదు. – రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుప్రీం విస్మయం అక్రమ కేసులమీద అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను జైలు పాల్జేయడమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసుపై కూటమి సర్కారును నిలదీసింది. తప్పుడు కేసులతో 140 రోజులు జైల్లో ఉంచిన వంశీని బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలకు సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. – సాక్షి, అమరావతి⇒ ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదుదారు వెనుకుండి వంశీ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి చీవాట్లు పెట్టింది. వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ గన్నవరం మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే వంశీని అనేక కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రభుత్వానికి గుర్తుచేసింది. గన్నవరం మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ వాల్యుయేషన్ నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.2022–23లో ఘటన.. 2025లో కేసా?వల్లభనేని వంశీ, తదితరులు తమ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటున్నారంటూ సుంకర సీతామహాలక్ష్మి 2025లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మే 9న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. 2022–23లో ఘటన జరిగితే 2025లో కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదమని, దీనిని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారంటూ పోలీసుల తీరును ఎండగట్టింది. వంశీ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీతామహాలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరంతోపాటు విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి మే 15న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి పలు షరతులతో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్రమ మైనింగ్‌తో రూ.195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. 700 పేజీల నివేదిక ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ దశలో బెయిల్ రద్దు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్‌కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్‌తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగా!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ‘ఉన్నత విద్య’ అగమ్యగోచరంగా తయారైంది. విద్యా సంవత్సరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. వివిధ కోర్సుల ప్రవేశాల నిర్వహణలో తీవ్ర జాప్యంచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం ఉన్నత విద్యాశాఖకు శాపంగా మారింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఈసెట్ ప్రవేశాలను బీటెక్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయడం సర్కారు చేతగానితనానికి అద్దంపడుతోంది.అభాసుపాలవుతున్న మంత్రి..టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా మంత్రికి పట్టడంలేదు. అసలు ఉన్నత విద్యాశాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఆయనున్నారు. ఫలితంగా విద్యా వ్యవస్థలోని కీలక అంశాలు మరుగునపడుతున్నాయి. పగలంతా సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకుని సాయంత్రం వేళల్లో సమీక్షల పేరుతో అధికారులతో టీ, బిస్కెట్ల మీటింగ్ పెట్టి మమ అనిపిస్తున్నారు. ఏడాది కాలంగా మంత్రి లోకేశ్ సమీక్షల్లో ప్రతిపాదించిన అంశాల్లో ఏ ఒక్కదానిలో పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య మంత్రి లోకేశ్ ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తట్టుకోలేక అభాసుపాలవుతున్నారు. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్ విషయంలోనూ మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడం ద్వారా ఆయన అవగాహన రాహిత్యం బయటపెట్టింది.సెకండియర్ క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగ్..ఇక ఏటా ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. ఇందులో డిగ్రీ, ఇంజనీరంగ్, బీఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు, తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీల వంటి అంశాలను సమగ్రంగా పొందుపరుస్తుంది. ఈ క్రమంలోనే బీటెక్ రెండో ఏడాది తరగతులను జూన్ 30 నుంచి ప్రారంభించాలని పేర్కొంది. కానీ, బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరే ఈసెట్ విద్యార్థులను మాత్రం విస్మరించింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదలైతే.. నెలన్నర తర్వాత జూలై 4 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చింది. వాస్తవానికి.. ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించకుండానే బీటెక్ రెండో ఏడాది తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించడంతో విద్యార్థులను ఆందోళనలో పడేసింది. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్‌కు జూలై 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, 7 నుంచి ఆప్షన్ల ఎంపిక అనంతరం 14లోగా సీట్ల భర్తీని పూర్తిచేసేందుకు షెడ్యూల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది తొలిదశ కౌన్సెలింగ్ కాగా.. ఆ తర్వాత మరోదశ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి జూలై ముగిసిపోతుంది. ఫలితంగా విద్యార్థులకు ఒకనెల తరగతులు కోల్పోవాల్సి వస్తోంది. అసలు ఇంజినీరింగ్ సెకండియర్ తరగతులు మొదలయ్యే తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశాలను పూర్తిచేయాల్సి ఉండగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తూ విమర్శలపాలవుతోంది. -
వివిధ సంస్థలకు ఐదు జిల్లాల్లో భూములు కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు ఐదు జిల్లాల్లో ప్రభుత్వ భూములను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురంలో 12.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి కోసం దీన్ని ఉపయోగించాలని సూచించింది. అలాగే వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో 50 ఎకరాల భూమిని టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది. గండికోట సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ విల్లా రిసార్టు నిర్మించడానికి ఈ భూమిని అప్పగించింది. అందులో 11.50 ఎకరాల భూమి మైలవరం రిజర్వాయర్ బఫర్ జోన్లో ఉండడంతో అక్కడ నీటి వనరులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేళటూరు గ్రామంలో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.1.13 కోట్లకు సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విద్యుత్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం జిల్లా గండిగుండం గ్రామంలో వెన్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థకు 0.265 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో ఆ సంస్థ రహదారి నిర్మించి.. స్థానిక పాలనా సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా గుదెంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్)కు 1.70 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ రూ.1.10 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే భూమిని అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ భూముల్లో నీటి వనరులను సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ.. మూడేళ్లలో పనులు ప్రారంభించకపోతే భూమిని తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. -
శ్రీశైలం జలాశయానికి జలకళ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా, బుధవారం నుంచి తుంగభద్రకు వరద పోటెత్తడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నీటిలో సగభాగం విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్ట్ నుంచి 98,552 క్యూసెక్కులు వచ్చి చేరింది. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 49,575 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 8.722 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.892 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 1.60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం సాయంత్రానికి జలాశయంలో 166.3148 టీఎంసీల నీరునిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 875.60 అడుగులకు చేరుకుంది.తుంగభద్ర జలాశయ 6 గేట్లు ఎత్తివేతసాక్షి, బళ్లారి/హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని నదిలోకి వదిలారు. ఎగువన శివమొగ్గ జిల్లా, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడంతో నది ప్రవాహం తుంగభద్ర జలాశయానికి పోటెత్తింది. జలాశయం ప్రస్తుత పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. కొత్త గేట్ల ఏర్పాటు దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీలకు కుదించారు. జలాశయానికి అమర్చిన 33 క్రస్ట్ గేట్లు దెబ్బతిని వరద ఉద్ధృతికి తట్టుకోలేని స్థితిలో ఉండడంతో వాటి స్థానంలో రూ.41.56 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేసేందుకు 80 టీఎంసీల వరకే నిల్వ ఉంచుతూ మిగిలిన నీటిని దిగువకు వదలనున్నారు. దీంతో బుధవారం ఆ మట్టానికి నీరు చేరువవడంతో 6 గేట్లను ఎత్తి 9,400 క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతోపాటు రివర్ ఔట్ ఫ్లో స్లూయీస్ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, 701 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 32,787, ఔట్‌ఫ్లో 11,101 క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు. -
టైగర్‌పై సిండికేట్ పంజా..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి తోడు సిండ్‌కేట్‌గా మారిన కంపెనీల దెబ్బకు ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వెనామీ రొయ్య ధరలు దిగజారిపోగా, తాజాగా టైగర్ (నీలకంఠ) రొయ్యల ధరలు తగ్గించేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారిగా కౌంట్‌కు రూ.80 తగ్గించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వైట్‌స్పాట్, వెబ్రియా వంటి వైరస్‌లకు తోడు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల సాకుతో ధరలు తగ్గి, తీవ్ర నష్టాల పాలైన వెనామీ రైతులకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. వెనామీ తరహాలోనే ఎప్సీఎఫ్ టైగర్ బ్రూడర్స్ అందుబాటులోకి రావడంతో వెనామీకి ప్రత్యామ్నాయంగా 2021 నుంచి రాష్ట్రంలో టైగర్ రొయ్యల సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 50 నుంచి 60 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతుంది. వ్యాధుల బారిన పడకుండా రోజూ 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల ఎదుగుదలతో కేవలం 120 రోజుల్లోనే 20 కౌంట్ వద్ద పంట చేతికి కొస్తుంది. టైగర్ రొయ్య వెనామీకి దీటుగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో వీటిని సాగు చేసే రైతులు నాలుగైదేళ్లుగా మంచి లాభాలే చవిచూస్తున్నారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార పన్ను సాకుతో రొయ్యల కంపెనీలు, ఎగుమతిదారులు రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేసారు. వెనామీ రొయ్యల ధరలు కౌంట్‌కు రూ.20 నుంచి రూ.50 మేర పతనమైనప్పటికీ టైగర్ రొయ్యల ధరలు కాస్త మెరుగ్గానే కొనసాగాయి. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో కంపెనీలు సిండికేట్ అయిపోయి ఉన్నట్టుండి కౌంట్‌కు రూ.80 మేర తగ్గించేయడం టైగర్ రొయ్య రైతులకు శాపంగా మారింది. సాధారణంగా టైగర్ రొయ్యలు 20–40 కౌంట్ వద్దే పట్టుబడి పడుతుంటారు. మొన్నటి వరకు 20 కౌంట్ వద్ద పట్టుబడి పడితే రూ.650, 30 కౌంట్‌కు రూ.580, 40 కౌంట్‌కు రూ.480 చొప్పున ధర లభించింది. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అధికంగా పట్టుబడి పట్టే 30 కౌంట్ ధరను రూ.500కు, 40 కౌంట్ ధరను రూ.400కు తగ్గించేశారు. కంపెనీలను నియంత్రించి, రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు.వెనామీతో పోల్చుకుంటే టైగర్ రొయ్యల సాగుకు పెట్టుబడి అధికం. వెనామీ పిల్ల 30–32 పైసల మధ్య లభిస్తుండగా, టైగర్ రొయ్య పిల్ల ధర రూపాయి పైమాటే. పైగా మేత ధర కూడా వెనామితో పోల్చుకుంటే కిలోకు రూ.10–15 అధికంగా పెట్టాలి. ఎకరాకు 5.50 లక్షలు ఖర్చవుతుంది. 20 కౌంట్‌కు పడితే 2 టన్నులు, 30 కౌంట్‌కు పడితే టన్నున్నర, 40 కౌంట్ అయితే టన్నుకు మించి రాదు. అలాంటిది కిలోకు రూ.80 తగ్గించడంతో టన్నుకు రూ.80 వేల మేర రైతులు నష్టపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంపెనీల మాయాజాలంఅంతర్జాతీయ మార్కెట్లో ఎలాంటి ఒడిదొడుకులు లేవు. టైగర్ రొయ్యలు ఎగుమతి అయ్యే దేశాల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తలేదు. పైగా ఆ దేశాల్లో వీటికి ఎనలేని డిమాండ్ ఉంది. ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయినా కంపెనీలు సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో కౌంట్‌కు రూ.80కుపైగా తగ్గించడం దారుణం. ప్రభుత్వమూ పట్టించుకోవడంలేదు. – దుగ్గినేని గోపీనాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం, ప్రకాశం జిల్లా -
కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్‌కు తొలగిన ప్రధాన అడ్డంకి
సాక్షి, అమరావతి: 40 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. రైల్వే లైన్ భూ సేకరణ, రీ అలైన్మెంట్ సర్వే విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ఎత్తేసింది. అలైన్మెంట్ సర్వే కొనసాగించవచ్చని రైల్వే అధికారులను ఆదేశించింది. అలైన్మెంట్ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఫలానా మార్గంలోనే అలైన్మెంట్ వెళ్లాలని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులకు స్పష్టం చేసింది. రీ అలైన్మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రయోజనం పొందుతున్నారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలైన్మెంట్ మార్చడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తరఫున సీవీఆర్ రుద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి వాదనలు వినిపించారు.విజయవాడ వరదల ప్రాణ నష్టానికిబాధ్యత ఎవరిది?బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలిరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంసాక్షి, అమరావతి: గత ఏడాది సంభవించిన విజయవాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదరదని తేల్చి చెప్పింది. తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని, తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల గురించి ముందే తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్ఎంసీ (NMC) గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..@ncbn గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ (NMC) గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్(FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్… pic.twitter.com/GKBsMr7e9J— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2025‘‘పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు
సాక్షి, తాడేపల్లి: ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఎవ్వరికీ భరోసా లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకుని, ఈ ప్రభుత్వ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వక ఇబ్బందిపడుతున్న విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర, పలువురు యువ వైద్యులు ఉన్నారు. గత రాత్రి పోలీసుల దాడి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. తమ ఆందోళనకు కారణాలను వైఎస్ జగన్‌కు విద్యార్థులు వివరించారు.ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని, తాము కూడా కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ అన్ని చేసినా తమకు పీఆర్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎఫ్ఎంజీ చేసిన మరి కొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకురన్నారని తెలిపారు. చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరో వైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చి, మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా చర్యలు తీసుకున్నామని, ఐదు కాలేజీలు కూడా ప్రారంభించామని, కాని ఈ ప్రభుత్వం మిగిలిన వాటిని అడ్డుకుని, పైగా కేంద్రం ఇచ్చిన సీట్లను కూడా తిప్పిపంపిందన్నారు. మెడికల్ సీట్లు ఇస్తే, వద్దని తిప్పి పంపిన దేశంలో ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలపై మాజీ సీఎం ఆవేదన వ్యక్తంచేస్తూ వారి పోరాటాలకు సంఘీభావాన్ని వ్యక్తంచేశారు. ప్రభుత్వం దృష్టిపెట్టి, ఈ సమస్యలను పరిష్కరించేంతవరకూ అండగా ఉంటామన్నారు. -
జులై 9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులకు ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆరుకాలం కష్టపడి పండించిన మామిడి పంటను కొనేవారు కరువవడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. బరువెక్కిన హృదయంతో వెనుదిరిగి వెళుతున్న రైతులు ఈ ప్రభుత్వంలో బతకలేమని మామిడి చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జులై 9న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తురు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించనున్నారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించనున్నట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించేందుకు వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఇంకా వారేమన్నారంటే..98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు టీడీపీకి చెందిన వారివే : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతంలో అనేక పల్ప్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్ల వద్ద ఎక్కడ చూసినా మామిడి పంటతో కూడిన లారీలు, ట్రాక్టర్లే బారులు తీరి కనిపిస్తున్నాయి. రైతుల నుంచి పల్ప్ కొనుగోలు చేయాల్సిన ఫ్యాక్టరీలు గత ఏడాది ఉత్పత్తి చేసిన పల్ప్ నిల్వలే అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది మళ్ళీ పల్ప్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నాయి. దీనిలో అధికశాతం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు నిలిపివేశాయి. ఫలితంగా మార్కెట్లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ రైతులు ఇంత దారుణంగా నష్టపోలేదు. గతంలో మామిడికి రేటు పడిపోయినప్పుడు కోల్డ్ స్టోరేజీలను నిర్మించి, పల్ఫ్‌ను స్టోరేజీ చేసేందుకు సదుపాయాలు కల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. పైగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉందని పథకం ప్రకారం ఒక తప్పుడు ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రారంభించారు. ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వారివే. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక, ప్రతిదానికీ వైఎస్సార్సీపీపై నెపాన్ని నెట్టేయడం, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. సమస్యను పరిష్కరించలేక, దానిపై ఎదురుదాడి చేయడం చంద్రబాబుకు అలవాటు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు, వారి పక్షనా పోరాడేందుకు జగన్ ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్‌ను సందర్శించి, రైతులతో మాట్లాడనున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.దద్దమ్మ ప్రభుత్వమిది : భూమన కరుణాకర్రెడ్డికూటమి ఏడాది పాలన సందర్భంగా అబద్దాలతో పండుగలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కన్నీరు, వారి కష్టాలు కనిపించడం లేదు. మార్కెట్లో కేజీ రూ.2 లకు కూడా ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మద్దతుధరను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిబడింది వైఎస్సార్, వైఎస్ జగన్.చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో మామిడి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం తోటల్లోని మామిడిని కోయడం కూడా నష్టదాయకమేనంటూ రైతులు చెట్లమీదనే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు నిత్యం భజన చేసే ఈనాడు పత్రిక, టీవీ5 మీడియాల ద్వారా మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమంటూ దిగజారుడు ప్రచారం చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరో కూడా వారికి తెలియదా? పల్ప్ ఫ్యాక్టరీలు గత ఏడాది నిల్వలను చూపి, కొత్తగా మామిడి కొనుగోళ్ళు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా తెలియకుండా పాలన చేస్తున్నారా? తూతూ మంత్రంగా జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం మద్దతుధర ఇస్తుంది, ఫ్యాక్టరీలు కేజీ రూ.4 కి కొనుగోలు చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకానీ ఫ్యాక్టరీలను ఒత్తిడి చేసి, పంటను కొనుగోలు చేయించడం లేదు. ఈ దారుణమైన పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా రైతులు మామిడి తోటలను నరికేస్తున్నారు. గిట్టుబాటుధర కల్పించలేని దద్దమ ప్రభుత్వం చంద్రబాబుది. స్వయంగా మామిడి రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌కు రానున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
యువ వైద్యులకు అండగా ఉంటాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్‌లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై శాంతి యుతంగా నిరసనకు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్టర్స్ డే' అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవమానించింది.పేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యనభ్యసించడంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకండా వేధించడానికి ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్లపాటు చేయాలనే నిబంధన పెట్టి వేధిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ చేసిన వారిని రిలీవ్ చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టడమో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడమో లేదా పీజీలు రాసుకుంటున్నారు.కానీ ఒక్క ఏపీలో మాత్రమే ఇంటర్న్‌షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను తెలియపర్చడానికి హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిస్తే ఆయన వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువ వైద్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ని కలిశారు. వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యంరాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంబీబీయస్ డాక్టర్లు, పీజీ డాక్టర్లను నియమించుకోకుండా ఎలా వైద్యం అందించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో వైద్యారోగ్యశాఖలో ఐదేళ్లలో 54 వేలమంది నియామకం జరిగితే అందులో డాక్టర్లే 3800 మంది ఉన్నారు.మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాకరిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఆయుష్మాన్ భారత్‌లో కలిపే పేరుతో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్లు జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో యూజర్ చార్జీల పేరిట రోగులను దోచుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కోపేమెంట్ల పేరుతో వసూలు చేసి ఆస్పత్రులను నడిపించుకోవాల్సిన పరిస్థితి ఆస్పత్రి యాజమాన్యాలది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్‌పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్‌షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్‌కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ప్రతీసారి వాళ్లది 80 శాతం. ఇంకొకళ్లది 15 శాతం. మనది 5 శాతమే అంటున్నారు. ఏందయ్యా 5 శాతం. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి. పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం, గుర్తింపు రెండూ లేవు. ఇప్పటివరకు ఎన్ని నామినేటెడ్ లిస్టులు ఇచ్చినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏడాదిలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లే ఇస్తామంటే కుదరదు. మా వాటా మాకు ఇవ్వాల్సిందే..’ అంటూ టీడీపీ తీరును పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైనట్లు ప్రకటించే కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించారు. పీవీఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్ అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. తొలుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ‘కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎన్నిలిస్టులు వచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లడుతూ ‘బీజేపీకి ఉన్నది ఐదు శాతమే అంటున్నారు. ఏందయ్యా ఐదు శాతం. రెడిక్యూలెస్’ అంటూ తీవ్రంగా స్పందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లు ఇస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. కూటమితో కలిసి ఉండాలని, అయితే, బీజేపీ వాటాను తప్పకుండా పొందాల్సిందేనని చెప్పారు. బీజేపీలో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు 15 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారికి న్యాయం చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. ‘బీజేపీ కనుక కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉండేవో తెలుసుకోవాలి..’ అంటూ పరోక్షంగా టీడీపీ నేతలను హెచ్చరించారు. ఒకచేతిలో బీజేపీ జెండా... ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా: మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలను సమన్వయం చేసుకుంటూ ‘ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా’ అన్నట్టు ముందుకు సాగుతానని చెప్పారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గౌరవం దక్కేలా, గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సమయంలో తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రం సహకారంతోనే రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా నా తండ్రి పని చేశారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదన్నట్లు మా తండ్రి వ్యవహరించారు. మా అక్కల పేర్లు కూడా ముఖర్జీ, ఉపాధ్యాయ అని వచ్చేలా పెట్టారు. తొలి పుస్తెను పార్టీకి కట్టాను. ఆ తర్వాత నీకు కట్టాను అని మా నాన్న అమ్మకు చెప్పారంట. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాపై నమ్మకంతో పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తా’ అని మాధవ్ చెప్పారు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల తన పదవీకాలంలో ప్రోత్సహించిన, విభేదించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదలు అని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ మాధవ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఈడ్చి పడేశారు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): జాతీయ వైద్యుల దినోత్సవం రోజునే యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విదేశాల్లో వైద్య విద్య చదివిన తమకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ, తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నారని యువ వైద్యులు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు. కాగా 36 గంటల అనంతరం మంగళవారం వీరి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తున్న తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలకు సేవ చేయడం కోసం రాష్ట్రంలో సీట్ దక్కక కష్టపడి విదేశాల్లో వైద్య విద్య చదివామన్నారు. వైద్యుల దినోత్సవం అని కూడా చూడకుండా అదే రోజున తమను పోలీసు వాహనాల్లోకి ఈడ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైద్య శాఖమంత్రి సత్యకుమార్యాదవ్తో పాటు, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. వైద్య విద్యార్థుల అరెస్టును ఖండిస్తున్నాం.. వైద్య విద్యార్థులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థులకు పర్మినెంట్ రిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? రూ.కోట్లు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్లుగా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిస్ట్రేషన్ చేయాలంటూ వారు డిమాండ్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం తప్పా? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి వార్నింగ్ ఇవ్వడమేంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
సుపరిపాలన కాదు..‘సూపర్’ మోసపు పాలన
చంద్రబాబు సర్కారు ఏడాది పాలన అంతా కక్షపూరిత చర్యలు, సూపర్ సిక్స్ సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది.. హామీలిచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను వంచించారు.. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. పిల్లలకు ఫీజులు లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు భృతి లేదు.. ఇదా సుపరిపాలన?ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు... ఇది సుపరిపాలనా?ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతోపాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు.. పేదలు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అందక అప్పుల పాలవుతున్నారు.. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు..పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు... ఇదా సుపరిపాలన?గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, వలంటీర్ వ్యవస్థలు కూటమి సర్కారు కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి.. ఇది సుపరిపాలనా?సాక్షి, అమరావతిరాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగా, కుట్రలతోనే సాగిందని.. కూటమి ఎమ్మెల్యేలు ఏ మొఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. మద్యం దుకాణాలను పచ్చ ముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ డైవర్షన్ నాటకం మొదలుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయకపోగా అధఃపాతాళానికి వేల అడుగులు వేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.‘సూపర్’ మోసాలు.. హామీలు బుట్టదాఖలుఅధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్ సిక్స్ హామీలంటూ నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కింద రూ.15 వేలను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూమంత్రంగా విదిలించి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సిలిండర్ ఇచ్చి సూపర్ సిక్స్‌ను సమాధి చేశారు. ‘సంపద సృష్టించాక సంక్షేమం అమలు చేస్తాం’’ అని ఒకసారి.. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి...’ అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా మౌనముద్ర దాల్చారు. నిర్వీర్యమైన విద్య, వైద్యం, వ్యవసాయంవైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి తొలి ఏడాది ఐదు చోట్ల 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేటీకరణ పేరుతో తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు అడుగులు వేస్తోంది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను ఎగరగొట్టి అన్నదాతలను నడిరోడ్డు మీద నిలబెట్టింది. రెండు నెలలుగా కనీసం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఈ సర్కారుపై మండిపడుతూ రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యువతకు వెన్నుపోటు..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి 6.38 లక్షల ఉద్యోగాలను, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్–2 పోస్టులను గ్రూప్–1లో కలపడం, డీఎస్సీలో 50 శాతం అర్హత మార్కుల నిబంధనతో 3 లక్షల మంది అభ్యర్థులకు అవకాశాలను దూరం చేశారు. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు.రెడ్ బుక్‌తో టెర్రర్.. దిగజారిన శాంతి భద్రతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్ష పూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుల్లో సరికొత్త రికార్డు..ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా మారుస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్ పరిధిలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తేగా బడ్జెట్ బయట రూ.50 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు.మాఫియా ముఠాలతో సహజ వనరుల లూటీవైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శక ఇసుక విధానం ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం జమ చేయగా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల జేబులు నింపుతూ రూ.వేల కోట్ల ఇసుకను దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్ సహా అన్ని గనులను వ్యవస్థీకృతంగా దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని లులూ సంస్థకు, రూ.3 వేల కోట్ల భూమిని ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఈ సంస్థలు చంద్రబాబు సన్నిహితులవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీతో రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.డైవర్షన్ పాలిటిక్స్... మభ్యపెట్టే కుతంత్రంచంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదం, ప్రకాశం బ్యారేజ్‌పై కుట్ర, తిరుమల లడ్డూ వివాదం లాంటి అంశాలతో వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సీజ్ ది షిప్ నాటకాలతో ఈ డైవర్షన్‌కు ఊతమిస్తున్నారు.రద్దుల రాజ్యం... కమీషన్ల పర్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు 2.60 లక్షల మందిని రోడ్డున పడేసింది. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పి మొత్తంగా ఆ వ్యవస్థనే ఎత్తివేసింది. ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,280 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోయారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థలను రద్దు చేసి టెండర్లను సన్నిహితులకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానంతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది. -
నా భారత్.. బంగారం..!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద విలువ అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం భారతీయుల వద్ద దాదాపు రూ.204 లక్షల కోట్ల (2.4 ట్రిలియన్ డాలర్లు) విలువైన బంగారం ఉందని స్విస్ ఆర్థిక సేవల సంస్థ– యూబీఎస్ అంచనా వేసింది. ఆది నుంచి బంగారంపై విపరీతమైన మక్కువ కలిగిన భారతీయుల వద్ద 25,000 టన్నులకుపైగా (దేవాలయాలతో కలిపి) ఉన్నట్లు యూబీఎస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో 2020 నుంచి బంగారం విలువ రెండు రెట్లు పైగా పెరిగితే ఒక్క 2025 సంవత్సరంలోనే 25 శాతం పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ భారీగా పెరిగిందని, ఇది దేశ జీడీపీలో 56 శాతానికి సమానమని పేర్కొంది. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ (2.4 ట్రిలియన్ డాలర్లు), కెనడా (2.33 ట్రిలియన్ డాలర్ల) జీడీపీకి సమానంగా భారతీయులు బంగారాన్ని కలిగి ఉన్నారని తెలిపింది. అదే మన పక్క దేశం పాకిస్థాన్ జీడీపీ కంటే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారంలో అత్యధికంగా 14 శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉందని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని అంశాలు...తాకట్టుకూ ఇష్టపడటం లేదు...భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారంతో విడదీయరాని ఆధ్యాతి్మక అనుబంధం కూడా ఉంది. దీనితో వాటిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. భారతీయులు తమ వద్ద ఉన్న బంగారంలో రెండు శాతం మాత్రమే తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన గోల్డ్ మోనటైజేషన్ స్కీం, సావరిన్ గోల్డ్ బాండ్ పథకాలు కూడా విఫలమయ్యాయి. భౌతిక కొనుగోళ్లనే ఇష్టపడ్డం, పసిడి విక్రయాలకు ససేమిరా అనడం దీనికి ప్రధాన కారణం.» అంతర్జాతీయంగా యుద్ధభయాలు , ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భారతీయుల సంపద మరింత పెరగనుంది.» బంగారంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.» బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా, భారతీయులకు బంగారంపై మక్కువ తీరడం లేదు. కొనుగోళ్లకు వెనుకడుగు వేయడం లేదు.» 2025లో 782 టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని అంచనా. అయితే ఇప్పుడు ఆభరణాల కంటే పెట్టుబడుల రూపంలో అంటే నాణేలు, బంగారు కడ్డీల రూపంలో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లలో స్వల్ప క్షీణత నమోదవుతున్నప్పటికీ, నాణేలు, బంగారు కడ్డీల కొనుగోళ్లలో వార్షికంగా 25 శాతం పెరుగుదల నమోదవుతోంది.» గతేడాది కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారంలో పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది.» వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ అమలు చేయనుండటంతో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అంచనా. -
జీవితాన్ని ‘షార్ట్’ చేసుకోవద్దు.!
సాక్షి, అమరావతి: వెలుగులను పంచే విద్యుత్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్ర విషాదాన్ని మిగుల్చుతుంది. ఇంటా బయట షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలతో వందల మంది ప్రాణాలు కరెంటు హరిస్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ ఉపకరణాలను తయారు చేస్తున్నప్పటికీ వాటిని వినియోగించడం తెలియక అనర్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ‘స్మార్ట్ ఎనర్జీ సేఫ్ నేషన్’ నినాదంతో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు దేశ వ్యాప్తంగా గత నెల 26 నుంచి జూలై 2 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లో పాటించాల్సిన భద్రత ప్రమాణాలు, సౌరఫలకాల నిర్మాణంలో పాటించాల్సిన జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు: ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ఓవర్‌లోడ్ నుండి ప్రత్యేక రక్షణ ఉండాలి. సాకెట్ అవుట్లెట్లు భూమి మీద నుంచి, కనీసం 800 మిమీ ఎత్తులో ఉండాలి. కార్డ్ ఎక్స్ టెన్షన్ సెట్, రెండవ సరఫరా లీడ్లను ఉపయోగించకూడదు. వాహన కనెక్టర్‌ను వాహన ఇన్లెట్కు కనెక్ట్ చేయడానికి ఎటువంటి అడాప్టర్‌ను వాడకూడదు. ఛార్జింగ్ పాయింట్, కనెక్షన్ ఇన్లెట్ మధ్య దూరం 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. పోర్టబుల్ సాకెట్ అవుట్లెట్లను ఉపయోగించకూడదు. ఛార్జింగ్ స్టేషన్లకు ఉరుములు మెరుపుల నుంచి రక్షణ కల్పించాలి. ఛార్జింగ్ కోసం నాలుగు కోర్ కేబుల్‌ను వాడాలి. కేబుల్స్ వాడకూడదు. అన్ని ఛార్జింగ్ స్టేషన్లలో ఎర్త్ కంటిన్యుటీ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.సౌరఫలకాల నిర్మాణంలో పాటించ వలసిన విద్యుత్ భద్రతా ప్రమాణాలు: సోలార్ ఫోటోవోల్టాయిక్ కోసం ఇన్వర్టర్ యూనిట్లను భవనం అంచున, సోలార్ ప్యానెల్ దగ్గరగా ఏర్పాటు చేయాలి. వ్యవస్థను గ్రిడ్ నుంచి వేరుచేయడానికి మాన్యువల్ డిస్కనెక్షన్ స్విచ్ ఉండాలి. సాధారణంగా ప్యానెల్స్ విక్రేతలు ఈ రక్షణను అందించరు. వినియోగదారులే అడిగి తీసుకోవాలి. ఓవర్ లోడ్, సర్డ్ కరెంట్, సర్జ్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్, అధిక ఉష్ణోగ్రత, ఓవర్ వోల్టేజ్, అండర్ వోల్టేజ్, ఓవర్ ఫ్రీక్వెన్సీ, అండర్ ఫ్రీక్వెన్సీ, రివర్స్ పోలారిటీ వంటి వాటి నుంచి రక్షణ ఏర్పాటు చేయాలి. ఫోటోవోల్టాయిక్ శ్రేణులు, ఇన్వర్టర్లకు ఎర్త్ ఫాల్ట్ రక్షణ, ఇన్సులేషన్ పర్యవేక్షణ అందించాలి. విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు: ఎల్లప్పుడూ ఎలక్ట్రికెట్ కేబుల్స్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఐఎస్ఐ గుర్తు ఉన్న పరికరాలు, స్టార్ రేటెడ్‌తో వాణ్యతగలవి కొనాలి. ప్లగ్ సాకెట్ చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. స్టాండర్డ్ ఎర్తింగ్ ప్రాక్టీస్ ప్రకారం ఎలక్ట్రికల్ ఇన్ స్టాలేషను ఎఫెక్టివ్ ఎర్త్ మేయండి. ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ చేతనే ఎలక్ట్రికల్ వర్క్స్ వేయంచండి. ధృవీకరించిన ఎలక్ట్రిషియన్‌తోనే మరమ్మత్తులు చేయించండి. ఎలక్ట్రికల్ పరికరాలపై పనిచేసేటప్పుడు రబ్బరు చేతి తొడుగులు ఉపయోగించాలి. అండర్ గ్రౌండ్ కేబుల్స్, గార్డెన్ లైటింగ్ గట్ రైటింగ్ కేబుల్స్‌ను బహిరంగంగా వేయవద్దు. విరిగిన స్విచ్‌లు ప్లగ్ లను ఉపయోగించకూడదు. నీటి పైపులు, విద్యుత్ వైర్లను ఒక దానికి ఒకటి సమీపంలో తీసుకురావద్దు. ఎర్త్ కనక్షన్ లేకుండా వాటర్ హీటర్లు, ఎలక్ట్రిక్ ఐరన్ మొదలైన వాటిని తడి చేతితో తాకవద్దు. గ్రైండర్, ఎ.సి, రిఫ్రిజరేటర్లో అసాధారణ శబ్దాలు వచ్చినప్పుడు ఆశ్రద్ధ చేయకుండా వెంటనే మెకానిక్ చేత పరీక్షించాలి. ఇళ్లలో వినియోగించే ఇన్వర్టర్లకు గాలి, వెలుతురు ప్రవరించే విధంగా ఉంచాలి.ప్రమాదవశాత్తు విద్యుత్ సాకు గురియైన వ్యక్తిని చేతులతో తాకకుండా ఎండు కర్రలతో విద్యుత్ తీగలను ప్రమాదానికి గురియైన వ్యక్తి నుండి వేరు చేయాలి. వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినా, వాహనంలో నుంచి బయట పడేందుకు పోపింగ్ (గెంతుట లేదా దుముకుట) విధానం అనుసరించాలి. టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరణానికి బాధ్యులుగా చేస్తూ... కారులో ప్రయాణిస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనల సందర్భంగా కౌంటర్ దాఖలుకు తాము సమయం కోరుతుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యతిరేకించారు. తమ వాదనలను పూర్తిగా వినిపించలేదని, అలాంటప్పుడు స్టే ఇవ్వడం సరికాదంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీంతో క్వాష్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.సింగయ్య మృతికి సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేవరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మంగళవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి మరోసారి విచారణ జరిపారు.సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతున్నారు..వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సింగయ్య గుర్తుతెలియని వాహనం కిందపడి మృతి చెందారని తొలుత మీడియాకు చెప్పిన జిల్లా ఎస్పీ, తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు. అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 106ను సెక్షన్ 105కు మార్చారని తెలిపారు. కోర్టు తమకు రక్షణ కల్పించిన మాట వాస్తవమేనని, అయితే తప్పుడు ఉద్దేశాలతో పెట్టిన కేసు నిలవడానికి ఎంతమాత్రం వీల్లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కిందపడే సింగయ్య మృతి చెందారంటూ ఆ కారును సీజ్ చేశారన్నారు.ఆయనను అవమానించడానికే ఇలా చేశారని.. పోలీసుల అత్యుత్సాహానికి, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనడానికి, రాజకీయ కక్షకు ఇదో పరాకాష్ఠ అని తెలిపారు. కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాలంటూ దానిని చదివి వినిపించారు. సింగయ్యే ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారని తెలిపారు. ఈ మేరకు వీడియోలు ఉన్నాయన్నారు. అతడు కారు కిందపడిన వెంటనే పార్టీ కార్యకర్తలు పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, 40 నిమిషాలు బతికే ఉన్నారని వివరించారు.సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినట్లు దర్యాప్తు అధికారే చెబుతున్నారు..సింగయ్యపైకి కారు ఎక్కించినట్లు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సెక్షన్‌ను జత చేశారని సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ మొదట కేసు పెట్టి, దానిని మార్చి కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టారన్నారు. సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతుంటే, పోలీసులు మాత్రం కారులో ఉన్న వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టారని.. ఈ సెక్షన్ కింద కేసు ఎంతమాత్రం చెల్లదని వివరించారు. ఘటనాస్థలంలో లేనివారిని కూడా సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.విశ్వసనీయ సమాచారం అంటూ పోలీసులు వాస్తవాలను మరుగున పెడుతున్నారన్నారు. ఇది రాజకీయ దురుద్దేశాలను స్పష్టం చేస్తోందన్నారు. సింగయ్య కారు కింద పడిన వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి చెబుతున్నారని, ఈ రోజుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఏ వీడియోనైనా సృష్టించడం చాలా తేలిక అని వివరించారు. వైఎస్ జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌ను తొందర పెట్టారంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందిన్యాయమూర్తి స్పందిస్తూ... కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు రక్షణ కల్పించింది కదా? అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలుకు గడువు కోరుతున్నారని గుర్తుచేశారు. దీనికి శ్రీరామ్ ప్రతిస్పందిస్తూ, వైఎస్ జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగా భద్రతను పట్టించుకోవడం లేదని, దీంతో ఆయన పర్యటనల సందర్భంగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయన్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, లేదంటే సింగయ్య కారు కింద పడేవారు కాదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు.అత్యవసర విచారణ అవసరం లేదువిచారణ మొదలుకాగానే ఏజీ స్పందిస్తూ, మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని, లేకపోతే వారం అయినా గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని, అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లు వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మరోసారి రాజధానికి భూ సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.రైతులకు ఆశ చూపుతున్న వివీ..» భూములిచ్చిన రైతులకు తొలి ఏడాది మెట్ట భూమికి ఎకరానికి రూ.30 వేలు, మాగాణి భూమికి ఎకరానికి రూ.50 వేలు కౌలు ఇస్తారు. ఏటా కౌలు ఎకరానికి మెట్టకు రూ.3 వేలు, మాగాణికి రూ.5 వేల చొప్పున పెంచుతారు.» నిమ్మ, సపోటా, జామ తదితర ఉద్యానపంటల రైతులకు అదనంగా రూ.లక్ష ఇస్తారు.» పదేళ్లపాటు రైతు కూలీలకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్‌గా ఇస్తారు.» ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తారు.» పూలింగ్ కింద భూమి ఇచ్చే రైతులకు..పట్టా భూమి, మెట్ట భూమి ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఇంటి స్థలం, 250 గజాల వాణిజ్య స్థలాలను ప్లాట్లుగా ఇస్తారు. మాగాణి భూమికైతే ఎకరానికిగానూ అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఇంటి స్ధలం, 450 గజాల వాణిజ్య స్థలాలను ప్లాట్లుగా ఇస్తారు. అసైన్డ్ భూమికి కూడా ఇదే తరహాలో ప్రయోజనాలు కల్పిస్తారు. -
అండగా నిలబడాలి: వైఎస్ జగన్
పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘‘రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకం.. అది తొలి అడుగు.. ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలి...’ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం.. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలను పార్టీలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని.. అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు.‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అయితే మీరు ఆ మూడు లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో మీరు అది సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది కదిలి రావాలి..’ అని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం..పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి నాయకులపై దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. మూడు లక్షణాలు అలవర్చుకోవాలి..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరఫున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.అదే మీ లక్ష్యం కావాలి..నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లకు చెబుతున్నా. ఈరోజు నుంచి మీరు పని మొదలు పెట్టండి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి. ఇది నియోజకవర్గం ఇన్ఛార్జ్లకు ఇస్తున్న టార్గెట్. అలా లేకపోతే ఆ దిశగా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావడం. ఎదగడం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పై మూడు గుణాలు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో దాన్ని సాధించాలి. కార్యాచరణ ఇలా ఉండాలి..దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్ధంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటితంగా ఉన్నవారిని సంఘటితం చేయాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకుని నడిపించండి. తద్వారా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే ఐదు వేలు కాదు.. 20 వేల మంది కదిలి వస్తారు. ఇక పార్టీ జోన్ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్థాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్‌తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే పది వేలు కాదు.. ఏకంగా 40 వేల మంది వస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్..ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్ తెలిసిన వారు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా, తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్ అభ్యర్థులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.ఆ విభాగాలు బలంగా ఉండాలి..పార్టీలో సంస్థాగతంగా యువజన, మహిళ, విద్యార్థి, రైతు విభాగాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఎస్సీ, బీసీ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా అన్ని వ్యవస్థలు దృఢంగా ఏర్పడితే పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎదుగుతుంది. మీ ఫోన్.. మీ ఆయుధంఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్ ఒక గన్ లాంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. సోషల్ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్ పోస్టులు.. ఇలా అన్ని మాధ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్థాయి వరకు భాగస్వామ్యం కావాలి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ ఈ మెసేజ్ వెళ్లాలి. ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్. ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట2011లో మన పార్టీని స్థాపించాం. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇద్దరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం. మా ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్ అంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలిచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పా. ఎందుకంటే.. అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఢీ కొడుతున్నా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ వాటి విషయంలో రాజీ పడలేదు.ఒంటరిగా మొదలై ఎదిగాం..ఆ సమయంలో కాంగ్రెస్‌ను వీడి 18 మంది నాతో వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమని కోరా. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా వస్తానంటే తననూ రాజీనామా చేయమన్నా. అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్‌రెడ్డి అందరం ఉప ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు నాకు 14వ లోక్‌సభలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంట్లో అందరూ మనవైపే చూశారు. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో... నాపై కక్ష కట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఎం.రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది విజయం సాధించారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.కాంగ్రెస్ – టీడీపీ కుమ్మక్కు...నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచితే ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.టీడీపీకి దేవుడు మొట్టికాయ..రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. అయితే వారిలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది? 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టికాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కున్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. -
మంగళ వారం.. అప్పు వారం
తొలి అడుగు’’ అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో తొలి అడుగు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ... 6.80 శాతం నుంచి 7 శాతం వడ్డీకి ఈ మొత్తం రుణం సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,20,102 కోట్లకు చేరాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే ఏ ప్రభుత్వమూ చేయనన్ని అప్పులు తెచ్చి చరిత్రలోకి ఎక్కింది. రికార్డులు సృష్టించింది. తాజా రుణంతో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులు రూ.1,70,512 కోట్లకు చేరాయి. -సాక్షి, అమరావతి» బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.19,410 కోట్లు తెచ్చారు. మరోపక్క రాజధాని అమరావతి పేరిట ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజ«దాని అప్పులకు చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.» ఇంత పెద్దఎత్తున అప్పు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై భారం మోపారు తప్ప... ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు, ఇతర హామీలను మాత్రం అమలు చేయలేదు. ఆస్తుల కల్పనకు గాని సంక్షేమానికి గాని పైసా వ్యయం చేయలేదు. » సంపద సృష్టించడం దేవుడెరుగు...! అదనంగా ప్రజలపై అప్పులు మోపుతున్నారు. ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందీ అంటే భారీగా అప్పులు తప్ప ఏమీ లేవని స్పష్టమవుతోంది. » ఏపీఎండీసీకి చెందిన 436 గనుల లీజు విలువను రూ.1.91 లక్షల కోట్లుగా చూపించి ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా రూ.9 వేల కోట్లు అప్పు చేసింది. ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు పెట్టి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడింది.» గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టారు. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం సాగించారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలను తెలియజేయడం లేదు. -
రాష్ట్రంలో 2 లక్షలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ డిగ్రీ సీట్లు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఇంజినీరింగ్ కోర్సుల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత నెల 30 నాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో కోర్సుల సీట్ల అనుమతులు ప్రక్రియను పూర్తి చేసింది. మంగళవారం ఏపీ సాంకేతిక విద్యామండలి (2025–26 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతించిన సీట్ల వివరాలను) వెల్లడించింది. వీటిలో 243 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,85,734 సీట్లు అందుబాటులో ఉండగా.. ఒక్క కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోనే 1,02,614 సీట్లు ఉండటం విశేషం. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో 32,330 సీట్లు ఉన్నాయి. ఇక 11 గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో 13 వేల సీట్లు, డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే రెండు ప్రభుత్వ కళాశాలలు పెరగ్గా.. ఐదు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు తగ్గాయి. మొత్తం 2024–25లో 245 కళాశాలలు ఉంటే ఇప్పుడు 243 కళాశాలలు మాత్రం ఇంజినీరింగ్ కోర్సులను అందించనున్నాయి. కన్వీనర్ కోటాలో 70 శాతం భర్తీ1,85,734 సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. గ్రీన్, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం, 35శాతం ప్రాతిపదికన సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఆచార్య నాగార్జున వర్సిటీలో కొత్తగా సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున 180 సీట్లు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో వీఎల్ఎస్ఐ ఇంజినీరింగ్, క్వాంటం కంప్యూటింగ్‌లో 60 సీట్ల చొప్పున 120 సీట్లు, కృష్ణా యూనివర్సిటీలో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో 60 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా రెండు కళాశాలలు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు అనుమతులు పొందాయి. ఇందులో ప్రకాశం జిల్లాలోని ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిణి ఇంజినీరింగ్ కాలేజీలో 360 సీట్లు, కృష్ణా జిల్లాలోని అక్కినేని నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో 240 సీట్లు కొత్తగా చేరాయి. మొత్తంగా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో 360 సీట్లు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 19,974 సీట్లు పెరిగాయి. -
వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వం తిలోదకాలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. నిర్దేశిత విధి విధానాలు వేటినీ పోలీసులు పాటించడం లేదని పేర్కొన్నారు. ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా అవాంఛనీయ ఘటనలకు ప్రభుత్వం, పోలీసులే ఆస్కారం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3న వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తున్నారని, అక్కడ తగిన భద్రత ఏర్పాట్లు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. హెలిప్యాడ్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వివరించారు. కాగా, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... నెల్లూరు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు కల్పించనున్న భద్రతకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ ఈ నెల 3న నెల్లూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ల కోసం రెండు స్థలాలను సూచిస్తూ జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) యతీంద్రదేవ్ వాదనలు వినిపిస్తూ, నెల్లూరు జిల్లా జైలు సమీపంలో హెలిప్యాడ్ సిద్ధం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని పిటిషనర్లకు చెప్పామన్నారు. వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీ ఏర్పాటు చేస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా రోప్ పార్టీని తాను చూశానని తెలిపారు. యతీంద్రదేవ్ స్పందిస్తూ, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. -
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులనూ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగివేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టంది. డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవి శంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. -
బాబు సర్కార్ మళ్లీ వెనుకబాటే.. జూన్‌లోనూ ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా
సాక్షి, విజయవాడ: జూన్‌లోను ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా నమోదైంది. జీఎస్టీ ఆదాయంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వెనుకపడింది. గత ఏడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్ నెలలో ఆదాయం పెరగలేదు. గత ఏడాది జూన్ కంటే రూ.16 కోట్లు జీఎస్టీ ఆదాయం తగ్గింది. 2024 జూన్‌లో రూ.3,651 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా.. ఈ ఏడాది జూన్‌లో 3,634 కోట్లకు మాత్రమే జీఎస్టీ ఆదాయం పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలోనూ నెగటివ్ గ్రోత్ నమోదైంది. ఇప్పుడు జూన్ నెలలోనూ జీఎస్టీ వృద్ధి సున్నా.. చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి అత్యధిక నెలలు జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.కాగా, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా రోజురోజుకీ క్షీణిస్తోంది. ప్రజల వద్ద డబ్బుల్లేక వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు నేలచూపులు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే.. మన రాష్ట్రంలో ఏ నెలకానెల క్షీణిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం మే నెలలోనూ జీఎస్టీ వసూళ్లు 2 శాతానికి పైగా క్షీణించాయి.2024–25 ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.3,890 కోట్లు (ఎస్జీఎస్టీ సెటిల్మెంట్కు ముందు) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మే నెలలో 2.23 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు 13.166 శాతం పెరిగి.. రూ.1.31 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి.ఏపీ జీఎస్టీ వసూళ్లు క్షీణిస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. సంక్షేమ పథకాలు ఆపేయడం, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అనేక కారణాలు రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మందగించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వైఎస్సార్సీపీ యువజన విభాగంతో ఇవాళ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై గొంతెత్తాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వైఎస్సార్సీపీ యువజన విభాగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వైఎస్ జగన్‌ని సీఎం చేసే దాకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యేలా చూస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఆయన సీఎం కావాలి. ప్రభుత్వం కుట్రలు చేయడం మాని ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిదివైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఏడాది పూర్తయినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, 2024 లోనూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే గత ఏడాది వారందరికీ ఒక్కొక్కరికి రూ. 36 వేలు చొప్పున చంద్రబాబు బకాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం బకాయిపడింది.కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపుకూటమి మేనిఫెస్టోలో ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్కో వ్యవస్థనూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు.వలంటీర్ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన ఈ కూటమి పెద్దలు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 33 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రేషనలైజేషన్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువని తేల్చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగులను తొలగించారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే దాదాపు 400 మంది ఉద్యోగులను, ఉద్యోగుల జీతాన్ని దళారులు దోచుకోకుండా కోతల్లేకుండా శాశ్వత ఉద్యోగులకు దక్కే అన్ని సౌకర్యాలు కల్పించిన ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ పాలనలో 6.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలువైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలను ఇంటికే అందించారు.ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఐదేళ్లలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులో పొందుపర్చడం జరిగింది. -
బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ హిప్నాటిస్టు, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు.అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై ప్రభావం చూపారన్నారు. పట్టాభిరామ్ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. పట్టాభిరామ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.‘‘బీవీ పట్టాభిరామ్ మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్ గారి మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతున్ని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/uK4lk2KBUL— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2025 -
రెంటపాళ్ల కేసు.. వైఎస్ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే
రెంటళ్లపాళ్ల కేసులో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సాక్షి, అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ జగన్‌ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా?.. ఏజీతో హైకోర్టు బెంచ్వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి: జడ్జితో జగన్ లాయర్ వాదనలు వినాల్సిన అవసరం లేదు: జడ్జితో అడ్వొకేట్ జనరల్ సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు: : జగన్ లాయర్ సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేశామని ఎస్ఐ చెప్పారు: జగన్ లాయర్ ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా: జగన్ లాయర్ కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి: జడ్జితో అడ్వొకేట్ జనరల్ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి?: జగన్ లాయర్పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్సీపీ నేతలూ క్వాష్ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైఎస్ జగన్ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో జగన్ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం. -
రండి.. చదువుకోండి
భారతీయ విద్యార్థుల ఆకర్షణే లక్ష్యంగా జర్మనీ పని చేస్తోంది. విద్యార్థుల ప్రవేశాలకు వీలైనంత సౌలభ్యాన్ని కల్పిస్తామంటూ హామీ ఇస్తోంది. విద్యార్థుల సామాజిక మాధ్యమాలతో పనిలేదంటూ, వారి ఖాతాలు తనిఖీ చేయబోమంటూ వెసులుబాటు కల్పిస్తోంది. తమ దేశంలో చదువుకోవాలంటూ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం జర్మనీకి వెళ్లి చదువుకోవాలనుకునే యువతకు ఉపశమనాన్ని కలిగించింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో వీసా అడ్డంకులు పెరుగుతున్నందున సురక్షిత గమ్యస్థానంగా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే గడిచిన రెండు నెలల్లో 35 శాతం మేర ప్రవేశాల దరఖాస్తులు పెరిగినట్టు ప్రకటించింది.చదువు తర్వాత వెసులుబాటు..⇒ వాస్తవానికి జర్మనీ అనేక రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. భారత్, జర్మనీ మధ్య విద్యా, పరిశోధనల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు నడుస్తున్నాయి. భారత్ నుంచి ప్రతిభావంతులైన మానవ వనరులు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది.⇒ ప్రస్తుతం 2,300 కంటే ఎక్కువ ఇంగ్లిష్–బోధన కార్యక్రమాలను ఆ దేశం అందిస్తోంది.⇒ చదువు పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణ కోసం 18 నెలల స్టే–బ్యాక్ పీరియడ్ –ఉపాధి లభించిన తర్వాత నివాస అనుమతి పొడిగింపు విద్యార్థులకు కలిసొచ్చే అంశాలు.జీవన వ్యయం, ఫీజులు తక్కువే! గత దశాబ్దంలో భారతీయ విద్యార్థులకు అగ్ర గమ్యస్థానాల్లో జర్మనీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 2025లో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.ఇందుకు పలు కారణాలున్నాయి1. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు ఉండటం 2. తక్కువ ట్యూషన్ ఫీజు 3. ఉన్నత విద్య, పరిశోధన–ఆవిష్కరణలపై ప్రాధాన్యత కల్పించడం 4. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) రంగాలతో పాటు ఆంగ్లంలో అందించే అనేక కార్యక్రమాలు 5. జీవన వ్యయం తక్కువ 6. సమృద్ధిగా స్కాలర్షిప్లు 7. మేటి ఉద్యోగావకాశాలు ఏటా విద్యా వీసాలు పెరుగుదల.. జర్మనీలో దాదాపు 425 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 305 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,భారత్ విద్యార్థుల ఉన్నత చదువులకు గమ్యస్థానంగా జర్మనీ నిలుస్తోంది. మరోవైపు వీసాల జారీలోనూ నిబంధనలను జర్మనీ సరళతరం చేస్తోంది. వాటి సంఖ్య ఏటా పెంచుకుంటూ వస్తోంది. జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వీసాల జారీ చూస్తే.. సంవత్సరం వీసాల సంఖ్య 2021 63,000 2024 90,0008 మందిలో ఒకరు మనోళ్లే న్యూఢిల్లీలోని జర్మన్ అకడమిక్ ఎక్సే్ఛంజ్ సర్విస్ (డీఏఏడీ) నివేదిక ప్రకారం జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4.05 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం. ప్రస్తుతం 50 వేల మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు భారత్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు. -
అడ్డొస్తే కాల్చేస్తా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల అండతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంతింటికి రాగా.. పోలీసులు ఆదివారం ఆయన్ని బలవంతంగా అనంతపురానికి తరలించిన సంగతి తెలిసిందే.సీఐ సాయిప్రసాద్ పోలీస్ వాహనంలో పెద్దారెడ్డిని తరలిస్తుండగా.. ఆయన అనుచరులు అనుసరించారు. దీంతో సీఐ తన రివాల్వర్ తీసి.. ‘కాల్చేస్తా’ అన్నట్లుగా వారిని బెదిరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
జేసీ కాళ్లపై పడి క్షమాపణ చెప్పు.. లేకుంటే చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వద్దకు వెళ్లిన వారందరినీ ‘రప్పా రప్పాలాడిస్తాం’ అంటూ బెదిరించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఆ మాటలను నిజం చేస్తూ తాడిపత్రిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారని తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లారు. పాతకోటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త క్రిష్ణయ్య కూడా అందులో ఉన్నారు.జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు సుబ్బుతో పాటు మరో ఆరుగురు సోమవారం పట్టపగలు క్రిష్ణయ్య జనరల్ స్టోర్‌పై దాడి చేశారు. ఆ సమయంలో క్రిష్ణయ్య స్టోర్‌లో లేకపోవడంతో.. అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు జగదీష్, శ్రీనాథ్‌లను బెదిరించారు. ‘వాడొచి్చ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. లేకుంటే చంపేస్తాం’ అంటూ షాపులోని వస్తువులను, ఫ్రిజ్‌లను ధ్వంసం చేసి బయట పడేశారు. ఈ ఘటనపై బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రెడ్డి.. క్రిష్ణయ్య జనరల్ స్టోర్‌ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
సచివాలయ ఉద్యోగుల బదిలీల
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగిసినా ఎవరిని ఏ సచివాలయానికి బదిలీ చేశారన్న ఉత్తర్వులు ఏ జిల్లాలోనూ విడుదల కాలేదని సమాచారం. ఒకటీ అరా జిల్లాల్లో మత్స్య శాఖ సహాయకుల వంటి ఒకట్రెండు విభాగాల ఉద్యోగులకు సంబంధించి మూకుమ్మడి ఆదేశాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు జారీ చేశారు. ఒకే సచివాలయంలో ఐదేళ్ల పాటు పని చేస్తున్న దాదాపు 72 వేల మంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ విడత బదిలీ కాకతప్పని పరిస్థితి.మొత్తం 13 శాఖల పరిధిలో ఒక్కో జిల్లాలో ఆయా విభాగాధిపతుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 169 జిల్లా శాఖ విభాగాధిపతులు సచివాలయాల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే, దాదాపు 50 జిల్లా శాఖాధిపతులు బదిలీల ఆఖరి రోజు అయిన సోమవారం కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ జరిగిందని తెలిపారు. ఏ జిల్లాలోనూ వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందలేదని ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు. గడువు ముగియడంతో వచ్చే ఒకట్రెండు రోజులు పాత తేదీలతో బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.80 శాతం బదిలీలు ఎమ్మెల్యేలు చెప్పినట్టే సచివాలయాల ఉద్యోగ బదిలీల ప్రక్రియలో అధికారులు ఎక్కడా నిబంధనలు పాటించలేదని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు 80 శాతం బదిలీలు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా (ఎక్సెల్ షీట్లు) ప్రకారమే జరిగాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌తో ఒక్కో సచివాలయంలో అంతకుముందు ఉన్న పోస్టులు దీర్ఘకాలం కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10–11 మంది ఉద్యోగులు ఉండేవారు.రేషనలైజేషన్ పేరుతో కూటమి సర్కారు సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6–8 మంది చొప్పున ఉద్యోగులను దీర్ఘకాలం కొనసాగించేలా నిర్ణయించింది. ప్రస్తుత బదిలీలలో ఒక్కో సచివాలయంలో శాశ్వతంగా కొనసాగింపునకు నిర్ధారించిన పోస్టులను తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు. అప్పటికీ ఉద్యోగులు మిగిలితే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేదాక ఏదో ఒక సచివాలయంలో సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. కచి్చతంగా బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య కన్నా రేషనలైజేషన్‌తో శాశ్వతంగా కొనసాగింపునకు నిర్ధారించిన పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం, ఆ పోస్టులకు పోటీ.. మరోపక్క ఎమ్మెల్యేల పైరవీలతో ప్రస్తుత బదిలీల్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రిలోని సర్వే నంబర్ 639, 640, 641లలో 577.55 చదరపు గజాల స్థలంలో తాము నిర్మించుకున్న ఇంటిని కాల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు యత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కామిరెడ్డి నవీన్‌కుమార్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్ ఇంటిని నిర్మించారని నవీన్ తెలిపారు. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని తెలిపారు. జూన్ 21న అధికారులు సర్వే నిమిత్తం నోటీసులు జారీ చేసి, 28న సర్వేకు హాజరుకావాలని చెప్పారన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. సర్వే కోసం పిటిషనర్ భర్త తాడిపత్రి వెళ్లారని, అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకుని వెనక్కి పంపారని తెలిపారు.అధికారులు 28న ఇంటికి వచ్చి మార్కింగ్ చేసి ఇంటి కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిందన్నారు. పురపాలకశాఖ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని, ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని, పిటిషనర్ ఇంటిని కూల్చొద్దని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో మంగళవారం సమావేశం కానున్నారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. -
టార్గెట్ జీపీఎస్
జీపీఎస్ జామింగ్... జీపీఎస్ స్నూపింగ్...! ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న రెండు పదాలు ఇవి...! గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పనిచేయకుండా అడ్డుకోవడం, తప్పుదారి పట్టించడమే జామింగ్, స్నూపింగ్. విమానయాన రంగంతో పాటు టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్తు తదితర కీలక రంగాలు పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా విమానయాన రంగం హడలెత్తిపోతోంది. దాంతో జీపీఎస్‌కు ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పరిశోధనలు వేగిరం చేశాయి.సాక్షి, అమరావతి: విమానయాన రంగం పూర్తిగా ఆధారపడుతున్న జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్ బెడద హడలెత్తిస్తోంది. ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా దేశాల్లో తరచూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది తీవ్ర ఆందోళనకర అంశంగా మారింది.తూర్పు యూరప్‌లోని నాటో దేశాల విమానాల్లో జీపీఎస్ వ్యవస్థ కొంతకాలంగా తరచూ జామింగ్, స్నూపింగ్‌కు గురవుతోంది. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2024 మార్చిలో అమెరికా రక్షణ మంత్రి ప్రయాణిస్తున్న విమానంలోని జీపీఎస్ కాసేపు సిగ్నల్స్ కోల్పోయింది.ఇది రష్యా భూభాగానికి సమీపంలోనే జరగడం గమనార్హం. ఇక పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో భారత పౌర, వాయుసేన విమానాల జీపీఎస్‌లో సమస్య తలెత్తుతోంది. ఈ తరహా ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడేళ్లుగా తరచూ సంభవిస్తున్నాయి. అయితే, ఇదేమీ కాకతాళీయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు తాము లక్ష్యంగా చేసుకున్న విమానాల జీపీఎస్‌ను జామింగ్/సూ్నపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేల్చిచెబుతున్నారు. ఇది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుందని, కూలిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమిటీ జామింగ్?విమానాల గమనాన్ని నిర్దేశించే జీపీఎస్‌ను జామింగ్ చేసి సిగ్నల్స్ అందకుండా చేసే వ్యవస్థ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. జీపీఎస్‌లో ఉండే ఆటోమేటిక్ క్లాక్స్‌ను కొన్ని క్షణాల పాటు పనిచేయకుండా అడ్డుకోవడమే జామింగ్. ఇక తప్పుడు సిగ్నల్స్‌ను పంపి జీపీఎస్‌ను దారిమళి్లంచడమే స్నూపింగ్. సాధారణంగా దేశాల సైనిక టెక్నాలజీ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉండే జామింగ్, స్నూపింగ్ క్రమంగా ఉగ్రవాద సంస్థలకు కూడా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే అతి తక్కువ ధర కలిగిన ఉపకరణాలతో కూడా జీపీఎస్‌ను జామింగ్, స్నూపింగ్ చేస్తుండడం ప్రమాద ఘంటికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.⇒ సైనిక అవసరాల కోసం 1970లో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్) తర్వాతి కాలంలో అత్యంత కీలక సాంకేతిక వ్యవస్థగా మారింది.⇒ ప్రధానంగా విమానయాన రంగంలో అత్యంత కీలకమైంది. అంతేకాదు టెలీ కమ్యూనికేషన్లు, విద్యుత్ గ్రిడ్లు తదితర రంగాలన్నీ కూడా డేటా బదిలీకి జీపీఎస్‌పైనే ఆధారపడుతున్నాయి. ⇒ ఉపగ్రహ ఆధారితంగా అత్యంత కచ్చితత్వ (హై యాక్యురేట్) ఆటోమేటిక్ క్లాక్స్ కలిగి భూమిపైకి బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ అందించడంలో జీపీఎస్ అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. భూమిపై ఉండే రిసీవర్ ఆ సిగ్నల్స్‌ను గ్రహించి తమ కచ్చితమైన గమ్యస్థానం, చేరుకునే సమయాన్ని గుర్తిస్తాయి. ఇదంతా మెరుపు వేగంతో అంటే సెకనులో వందకోట్ల వంతు వేగంతో సాగిపోతుంది. ఈ సిగ్నల్స్ భూమిపైకి చేరడంలో అంతరాయం కలిగిస్తే ఆటోమేటిక్ క్లాక్స్ సింక్రనైజేషన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా జీపీఎస్ కచ్చితత్వం దెబ్బతింటుంది.ప్రత్యామ్నాయ వ్యవస్థ అత్యవసరంప్రపంచ దేశాలు జీపీఎస్‌పై పూర్తిగా ఆధారపడడం అత్యంత ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు కూడా జామింగ్/సూ్నపింగ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ ప్రత్యామ్నాయ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉపగ్రహ ఆధారితంగా పనిచేసే జీపీఎస్‌కు పోర్టబుల్ ఆటోమేటిక్ క్లాక్స్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇవి భూమిపైన, విమానాలు, ఇతర వ్యవస్థల నావిగేషన్ సిస్టంలోనే అంతర్భాగంగా ఏర్పాటు చేయాలని.. దీంతో ఉపగ్రహ ఆధారిత టైమ్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని సలహా ఇస్తున్నారు. తద్వారా కచ్చితమైన వేగం, ప్రయాణ దిశ, నావిగేషన్‌ను గుర్తించగలమని చెబుతున్నారు.బయటినుంచి వచ్చే సిగ్నల్స్‌పైనే ఆధారపడాల్సిన అనివార్యత తప్పుతుందని వివరిస్తున్నారు. ఈ దిశగా యూకేకు చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) కార్యాచరణకు ఉపక్రమించింది. క్వాంటమ్ టైమింగ్ పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తోంది. జీపీఎస్ ఆధారపడే ఉపగ్రహ ఆధారిత మైక్రోవేవ్ సేసియమ్ క్లాక్స్ కంటే లేజర్ కిరణాలతో ఆప్లికల్ క్లాక్స్ వ్యవస్థను రూపొందించే దిశగా పరిశోధనలు వేగవంతం చేసింది. ఈ క్లాక్స్ జీపీఎస్ కంటే వందరెట్లు కచ్చితత్వాన్ని అందిస్తాయని ఎన్పీఎల్ పరిశోధకులు చెబుతున్నారు. జాతీయ భద్రత, విమానయాన, విద్యుత్, టెలీకమ్యూనికేషన్ల రంగాల్లో విస్తృతంగా ఉపయోగించేలా 2030 నాటికి అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ⇒ అమెరికా కూడా ‘టిక్వెర్’ అనే పేరుతో ఆటోమేటిక్ క్లాక్ వ్యవస్థ దిశగా పరిశోధనలు చేస్తోంది. నాసా సహకారంతో అమెరికా జియోలాజికల్ సర్వే ప్రత్యేకంగా గ్రావిటీ మ్యాపింగ్ ప్రాజెక్టును కూడా చేపట్టింది.⇒ ఆస్ట్రేలియా ‘క్యూ–సీటీఆర్ఎల్’ పేరుతో పరిశోధన ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ⇒ భారత్ ఇప్పటికే జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ‘నావిక్’ అనే వ్యవస్థను రూపొందించి పరీక్షిస్తోంది. మరింత విస్తృతపరిచే దిశగా పరిశోధనలు వేగిరం చేసింది.ఆగితే భారీ మూల్యం చెల్లించాల్సిందేజీపీఎస్కు అంతరాయం కలిగితే ప్రపంచ దేశాల విమానయాన, టెలీ కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క రోజు జీపీఎస్ పనిచేయకపోతే బిలియన్ డాలర్లు నష్టపోతామని అమెరికా ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్–టెక్నాలజీ’ నివేదిక వెల్లడించింది. బ్రిటన్ అయితే ఏకంగా 2.14 బిలియన్ పౌండ్లు నష్టపోతుందని చెప్పింది. జీపీఎస్ పనిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. -
ధాన్యం రైతుకు దగా.. రొక్కం లేదు.. దుఃఖమే!
సాక్షి, అమరావతి: పొలం పనుల సీజన్ మొదలైంది..! కూలీలతో కలసి కోలాహలంగా పంట చేలో తిరగాల్సిన రైతన్న.. కాడి, మేడి వదిలేసి కుమిలిపోతున్నాడు! విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటికోసం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవడం దేవుడెరుగు.. తన కష్టార్జితాన్ని సైతం ఈ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని రగిలిపోతున్నాడు! ధాన్యం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తామన్న డబ్బులకు రెండు నెలలుగా దిక్కు లేకుండా పోయిందని.. దళారీల పాలు చేసి దగా చేసిందని ఆక్రోశిస్తున్నాడు! పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. దళారీలు, మిల్లర్లను అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అడ్డంగా దోచేస్తోంది! నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా వేధిస్తోంది. ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. రెండు నెలలకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కు తోచని పరిస్థితిలో కూరుకుపోయారు. రెండో ఏడాదీ అన్నదాతా సుఖీభవ ఇంతవరకు అందకపోవడంతో ‘సాగు కాడి’ని మోయలేకపోతున్నారు. ‘మద్దతు’.. ఓ మోసం!కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగా లేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.300 – రూ.450కి పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా రూ.6 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయింది. దళారీ చెబితేనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దుస్థితి నెలకొంది. నేరుగా ధాన్యం సేకరించాలని అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే.. ఆ ధాన్యం ఇక కళ్లాల వద్ద, రాశుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ ఇదే తీరు! ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం సెంటర్లో ఇటీవల అధికారులకు దండం పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్) రెండు నెలలుగా పడిగాపులు..ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. తాము ఘనంగా చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రచారం చేసుకున్నారు. కానీ రెండు నెలలుగా వేలాది మంది ధాన్యం రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రేటే లేదు..నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర కంటే తక్కువ పలకడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 75 కిలోల బస్తా రూ.2 వేలకుపైగా పలుకగా ఈసారి రూ.1,400 లోపే ఆగిపోవడం గమనార్హం. తెలంగాణలో సన్న రకాలకు రూ.500 బోనస్ ఇవ్వడంతో రైతులు అధికంగా సాగు చేశారు. ఫలితంగా ఏపీకి వచ్చి కొనేవారు తగ్గిపోయారు. పైగా ఎక్కడికక్కడ దళారులు, మిల్లర్లు తమ పరిధిలోకి వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకుని స్థానిక రైతులను నిలువునా దోచేశారు. మరోవైపు కాకినాడలో ‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్ హడావుడితో బియ్యం వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా మార్కెట్లో పోటీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ‘కౌలు’కోలేని దెబ్బ..కౌలు రైతులను కూటమి సర్కార్ కోలుకోలేని దెబ్బతీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. ఆరబెట్టినా, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ అదనపు ఖర్చులు మినహా.. మంచి రేటు వస్తుందన్న నమ్మకం లేక పంటలను దళారీలకే అప్పగించేశారు.నాడు రైతన్న ఖాతాకు ‘జీఎల్టీ’ డబ్బులు..నేడు ట్రాన్స్పోర్ట్ టెండర్లకూ దిక్కులేదుధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు రవాణా, హమాలీలు, గోనె సంచులు సమకూర్చింది. రైతులే ఈ సదుపాయాలను సమకూర్చుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలను వారి ఖాతాల్లో జమ చేసేది. ఇలా రైతులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు దళారీలు ఇస్తేనే గోనె సంచులు వస్తాయి..! హమాలీలు లోడ్ చేస్తారు.. లారీ కదులుతుంది! ఇక జీఎల్టీ మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. ఒకవేళ రైతే ఇవన్నీ భరిస్తే రూపాయి కూడా వారి ఖాతాల్లో జమకావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎక్కడా ట్రాన్స్పోర్ట్ టెండర్లు పిలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. -
‘పోలవరం బనకచర్ల’ ప్రతిపాదన వెనక్కి..
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు(పీబీఎల్పీ) ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్సపర్ట్ అప్రైజల్ కమిటీ) ఏపీ ప్రభుత్వానికి వెనక్కి పంపింది. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనలు (టీవోఆర్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది.గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫార్సు చేసింది. అంత్రరాష్ట్ర సమస్యలను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి తీసుకున్న తర్వాతే ఈఐఏపై అధ్యయనం చేసేందుకు టీవోఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 17న ఈఏసీ 33వ సమావేశంలో చర్చించిన అంశాల మినిట్స్‌ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సోమవారం విడుదల చేసింది. ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘన అంటూ ఫిర్యాదులు పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయాల్సి ఉంది.. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయాలంటే తొలుత ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తూ నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రూపకల్పనకు నియమ, నిబంధనలను ఈఏసీ ఖరారు చేస్తుంది. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక రూపకల్పనకు నియమ, నిబంధనల కోసం గత నెల 5న ఏపీ జలవనరుల శాఖ ఈఏసీకి దరఖాస్తు చేసింది.దీనిపై జూన్ 17న ఈఏసీ 33వ సమావేశంలో సమగ్రంగా చర్చించింది. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు–1980ని ఉల్లంఘిస్తూ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపిస్తూ ఈ–మెయిల్ల ద్వారా అనేక ఫిర్యాదులు వచ్చాయని ఈఏసీ పేర్కొంది. తొలుత గోదావరిలో వరద జలాల లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి లభ్యత లెక్క తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలపై సీడబ్ల్యూసీతో చర్చించి అనుమతి తీసుకోవాలని ఈఏసీ స్పష్టం చేసింది. -
తృణమే ఘనం
సాక్షి, అమరావతి: అటు దేశవ్యాప్తంగానూ, ఇటు రాష్ట్రంలోనూ తీసుకుంటున్న ఆహార సమూహంలో తృణ ధాన్యాల వాటానే అధికం. అలాగే పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల ఆహార సమూహంలోనూ తృణ ధాన్యాలదే పెద్దపీట. దేశంతోపాటు, ప్రధాన రాష్ట్రాల్లో తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం లాంటి ఐదు ఆహార సమూహాల్లో ఏమేర ప్రోటీన్లు తీసుకుంటున్నారు అనే అంశంపై విభజిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వినియోగంలో జార్ఖండ్ తొలి స్థానంలో నిలవగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే 37.2 శాతం వినియోగంతో 14వస్థానంలో ఉంది. అటు పట్టణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వాడకంలోనూ ఈ రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వరుసగా నిలిచాయి.ఇక ఏపీ లో చూస్తే 34.6 శాతంతో 13 వస్థానంలో ఉంది. ఆహారంలో అత్యధికంగా గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో చూస్తే కేరళ అగ్రగామిగా ఉంది. ఈ రాష్ట్రంలో తృణ ధాన్యాల వినియోగం వాటా మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ. గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో రాజస్థాన్ చిట్ట చివర ఉంది. ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం ఉండగా, పట్టణాల్లో 2.5 గా నమోదైంది. రాష్ట్రంలో పెరిగిన వినియోగం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..2022–23 కంటే 2023–24లో ఆహారంలో గుడ్లు, చేపలు, మాంసం వాటా పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2022–23లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి వాటా 19.1 శాతం ఉండగా, 2023–24లో 19.3 శాతానికి పెరిగింది. అటు పట్టణాల్లో చూస్తే 2022–23 లో 18 శాతం ఉండగా 2023–24లో 19.1 శాతానికి పెరిగింది. -
పంచాయతీరాజ్‌ను బలహీనపరిస్తే సహించం
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరిస్తే సహించేది లేదని, కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం హెచ్చరించింది. వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఆందోళన కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత బలహీన పరచిన ప్రభుత్వాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.కూలీలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులను సైతం టీడీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ నిధులను కూడా దారి మళ్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి వారి పిల్లలకు చెందాల్సిన తల్లికి వందనం పథకంలో కోత విధించడం దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్‌లు ఇచ్చి జీతాలు జమ చేయాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాం«దీ, తిరుపతి జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్సీ మేరుగ మురళీ నాయకత్వం వహించారు. -
ధాన్యం డబ్బుల సంగతేంటి?
సాక్షి, అమరావతి: ధాన్యం డబ్బుల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ధాన్యం విక్రయించిన తాము నిండా అప్పుల్లో మునిగిపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. రూ.వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలతో కలిసి అన్నదాతలు విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ భవనం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సాగుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి అనేక ఖర్చులను సమన్వయం చేసుకోలేకపోతున్నామని వాపోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేకపోయామని, దీనివల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందడానికి అవకాశం లేకుండాపోయిందని మండిపడ్డారు. కౌలు చెల్లించకపోవడంతో భూ యజమానులు భూములను వెనక్కి తీసేసుకుంటున్నారని వాపోయారు. గత ఖరీఫ్‌లో అతివృష్టి, బుడమేరు వరదలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని.. రబీ ధాన్యం బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయామని రైతులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.24 గంటల్లో ఇస్తామని.. రెండు నెలలైనా ఎందుకివ్వలేదుఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టడం దారుణమన్నారు. 24 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లిడి యలమందరావు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంటే రైతులు ఎలా వ్యవసాయం చేస్తారని నిలదీశారు.రైతు ప్రభుత్వమని చాటింపు వేసుకోవడం మినహా చేతల్లో మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం నాయకుడు బుడ్డి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. ఈవెంట్లు, యోగాలకు ఖర్చు చేసేందుకు రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులకు మాత్రం అన్యాయం చేస్తోందన్నారు. తక్షణమై రైతులకు బకాయిపడిన సొమ్ములను చెల్లించాలని కోరుతూ పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ మనజీరు జిలానీకి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా శాఖ నాయకుడు నిమ్మగడ్డ వాసు, రైతు నేతలు గరిమెళ్ల కుటుంబరావు, పి.నాగరాజు, పెయ్యల భోగేశ్వరరావు, పి.మురళి పాల్గొన్నారు.నిండా అప్పుల్లో మునిగిపోయాం!ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే దానికి పొంతన ఉండట్లేదు. ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కౌలు రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలుకు భూమిచ్చిన రైతులు మమ్మల్ని నమ్మట్లేదు. దాళ్వాలో 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. అమ్మిన పంటకు రూ.3.50 లక్షలు రావాలి. కౌలు కట్టలేదని పొలం తీసేసుకున్నారు. పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేని దుస్థితి. మే 2, 3 తేదీల్లో పంట అమ్మితే ఇంత వరకు దిక్కులేదు. బుడమేరు వరదల్లో సార్వా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాళ్వాలో ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో నిండా అప్పుల్లో ముగినిపోయాం. – కొండ శివాజి, కౌలు రైతు, కౌలూరు, జి.కొండూరు మండలం -
పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరణ
విజయవాడ: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీ వెనక్కి పంపింది. దీనికి సంబంధించి సీడబ్యూసీ అనుమతి తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బనకచర్లకు ఆమోదం సాధించడంలో చంద్రబాబు సర్కారు ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కూటమి భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం అనుమతి మాత్రం సాధించలేకపోయింది. కాగా, ‘పోలవరం - బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణల కమిటీకి వివరాలు అందించారు. అయితే సీడబ్యూసీ అనుమతి తీసుకోకుండానే ప్రతిపాదన పంపించారు. ఫలితంగా ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించి దానిని వెనక్కి పంపించింది. ఇది బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల విజయం: హరీష్రావుపోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నేత హరీష్‌రావు స్పందించారు. బనకచర్లపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల విజయంగా ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించే కుట్రకు ఇది చెంపపెట్టన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపే వరకూ పోరాడతామన్నారు హరీష్.