సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు బుధవారం (జనవరి 28) కలిశారు. మంగళగిరి నియోజకవర్గం చినకాకాని ప్రాంతంలో అంజుమన్ ఇస్లామియా సంస్ధకు చెందిన సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో డీ-నోటిఫై చేశారని, దీనిని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
సానుకూలంగా స్సందించిన వైఎస్ జగన్, రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని, ముస్లిం, మైనారిటీ వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దిన్, జనరల్ సెక్రటరీ సర్ధార్ ఖాన్, ట్రెజరర్ అబ్ధుల్ కలాం, ప్రతినిధులు ఆసిఫ్, మౌలా బేగ్, అబ్ధుల్ అజీజ్, ఇబ్రహీం, హుస్సేన్, సద్దాం ఖాన్, సర్తాజ్, నసీమా, మునావర్ ఉన్నారు.


