ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి | Sexual assault on an eight year old girl: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి

Mar 15 2026 5:48 AM | Updated on Mar 15 2026 5:48 AM

Sexual assault on an eight year old girl: Andhra pradesh

మలికిపురం: రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ చిన్నారులు, మహి­­ళ­లపై అత్యాచారాలు, లైంగిక దా­డులు జరుగుతూనే ఉన్నా­యి. తా­జాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో మూడో తరగతి చదువుతు­న్న ఎనిమిదేళ్ల బాలికపై మేడిద రాంబాబు(45) లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్‌ఐ పి.వి.వి సురేష్‌ శనివారం తెలిపారు.

బాలిక తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాలిక ఇంటి వద్దకు తర­చూ వచ్చే రాంబాబు శుక్రవారం కూ­డా ఇంటికి వచ్చాడు. రాంబాబు బా­లికను ఇంటి పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా బాలి­క నానమ్మ చూసి కేకలు వేసింది. దీంతో రాంబాబు పరారయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement