Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Political Commentes On Vice President Election  1
తెలుగు సెంటిమెంట్‌ పండుతుందా?

మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్‌ఎస్‌ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్‌ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అప్పాయింట్‌మెంట్‌ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్‌ఎస్‌ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్‌ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్‌ఎస్‌ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసిపోయాయన్న కాంగ్రెస్‌ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్‌, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్‌లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్‌కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్‌ఎస్‌కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్‌ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Man who Complained of Mass Burials in Karnataka Arrested2
Dharmasthala Case: మరో ట్విస్ట్‌.. ముసుగు వ్యక్తి అరెస్ట్‌

ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థళకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.లభించని మృతదేహాల ఆనవాళ్లుఇటీవలి కాలంలో ధర్మస్థళ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ధర్మస్థళ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా అధికారులకు తెలిపాడు. ఆ మృతదేహాల్లో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నాయన్నాడు. దీంతో అతను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగిన సిట్‌ అధికారులు అతను చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. అయితే మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అధికారులకు లభించలేదు.మాయమాటలతో వ్యవస్థను నమ్మించి..మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్‌ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి మరోమారు విచారించారు. ఈ నేపధ్యంలో అతను మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి, ఇప్పుడు తనకు ఏమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ నేపద్యంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. నేడు (శనివారం) అతనిని కోర్టుకు హాజరుపరచనున్నారు. దీనికి ముందు భీమా.. తనకు ఒకరు పుర్రె ఇచ్చి, సిట్‌ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో కేసు కూడా వారే చేయించారని చెప్పాడు.సుజాత భట్‌ చెప్పిందీ కట్టుకథే..మరోవైపు సుజాత భట్‌ తాను గతంలో ధర్మస్థళకు వెళ్లినప్పుడు తన కూతురు మిస్‌ అయిందని తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని సిట్‌ అధికారులమందు నిజం వెల్లడించారు. ఓ యూట్యూబ్‌ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. తనకు అసలు అనన్య భట్ అనే కూతురే లేదని.. ధర్మస్థళ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. అనన్య మిస్‌ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా కొత్తగా సృష్టించినవేనన్నారు. విచారణకు రాలేను: యూట్యూబర్‌ సమీర్‌ ధర్మస్థళ గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్‌ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ సమీర్‌కు మంగళూరులో జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్‌కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అరెస్ట్‌ భయంతో యూట్యూబర్‌ ఎండీ.సమీర్‌ బెళ్తంగడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి లేఖ రాస్తున్నానని, తాను ధర్మస్థల స్టేషన్‌కు రావటానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. తనకు ప్రాణ హాని ఉందని భావించి, సెషన్‌ న్యాయస్థానంలో బెయిల్‌కు దరఖాస్తు చేశానని సమీర్‌ తెలిపాడు. ఒకవేళ తాను ధర్మస్థళ పోలీస్‌ స్టేషన్‌కు వస్తే, తనకు భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజులలోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని ఆ లేఖలో సమీర్‌ కోరాడు.

MLC Botsa Satyanarayana Key Comments On Vizag Steel Plant3
స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స

సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్‌కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు.

Telangana Speaker Gaddam Prasad Notices To Party Changed MLAs4
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు.. బీఆర్‌ఎస్‌కు ప్లస్‌?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్‌ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్‌. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది.

Thought Shreyas Iyer was going to be captain: Brad Haddin lams Asia Cup selection5
అదొక వింత నిర్ణ‌యం.. కెప్టెన్ అయ్యే ప్లేయ‌ర్‌ను జ‌ట్టు నుంచి తీసేస్తారా?

ఆసియాక‌ప్‌-2025కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ఎంపికచేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు త‌ప్పుబ‌డుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌, పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ చేరాడు.అయ్య‌ర్‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం సెల‌క్ట‌ర్లు తీసుకున్న ఒక వింత నిర్ణ‌యమ‌ని హాడిన్ మండిప‌డ్డాడు. కాగా అయ్య‌ర్ గ‌త కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అయిన‌ప్ప‌టికి ఆసియాక‌ప్‌కు ఈ ముంబై ఆట‌గాడిని సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు."శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆర్ధం కావ‌డం లేదు. అయ్య‌ర్ ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్‌. అత‌డికి అద్భుత‌మైన నాయ‌క‌త్వ‌ ల‌క్ష‌ణాల‌తో పాటు తీవ్ర‌మైన ఒత్తిడిలో కూడా నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేసే స‌త్తా ఉంది. అత‌డి బ్యాటింగ్ స్టైలే వేరు. మిడిలార్డ‌ర్‌లో అత‌డికి మించిన ఆట‌గాడు మ‌రొక‌రు లేరు.తొలుత అతడి పేరు సెల‌క్ష‌న్ జాబితాలో చూసి గాయపడ్డాడని అనుకున్నాను. కానీ అత‌డిని కావాల‌నే త‌ప్పించార‌ని త‌ర్వాత తెలిసింది. నిజంగా ఇదొక వింత నిర్ణ‌యం. ఎందుకంటే అయ్య‌ర్ ఒక టీమ్ మ్యాన్‌. . నిజానికి అతను కెప్టెన్ అవుతాడని నేను అనుకున్నాను. అటువంటిది ఇప్ప‌డు అత‌డికి జ‌ట్టులోనే చోటు ద‌క్క‌లేద‌ని" విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హ‌డిన్ పేర్కొన్నాడు.అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో భార‌త్‌ తరపున టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2024-25 సీజ‌న్‌కు గాను బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు కోల్పోయిన ఈ ముంబైక‌ర్‌.. ఆ త‌ర్వాత దేశీయ టోర్నమెంట్లలో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు. దీంతో అత‌డు కాంట్రాక్ట్‌తో పాటు వ‌న్డే జ‌ట్టులోకి తిరిగొచ్చాడు.చదవండి: ఆ టోర్నీ నుంచి శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌.. కెప్టెన్‌ ఎవరంటే?

Married Daughters have Equal Rights Under Hindu Succession Act 2005 Amendment6
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?

సాధారణంగా పెళ్లైన కుమార్తెలకు తండ్రి, తల్లి, తాతల ఆస్తిలో వాటా ఉండదనే అభిప్రాయాలుంటాయి. ఎలాగో పెళ్లి అయిపోయింది కదా ఆమె భర్త, మామలకు చెందిన ఆస్తులపైనే తనకు హక్కులుంటాయనే వాదనలున్నాయి. కానీ హిందూ వారసత్వ చట్టం 1956ను 2005లో సవరించకముందు వరకు ఇదే తంతు ఉండేది. కానీ ఇలాంటి అంశాలపై స్పష్టత ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించారు. అయితే ఇప్పటికీ చాలామందిలో దీనికి సంబంధించి అవగాహన ఉండకపోవచ్చు. సవరణ చట్టంలోని కుమార్తె ఆస్తి హక్కుల గురించి కింద తెలియజేశాం.2005లో ఈ చట్టం సవరణకు ముందు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమారులకు మాత్రమే ఉండేది. కుమార్తెలు కుటుంబంలో భాగమైనప్పటికీ సహ-భాగస్వాములుగా(ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉన్న హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన సభ్యులు) గుర్తించబడలేదు. అయితే, హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 వివాహిత కుమార్తెలకు కుమారులతో సమానమైన హక్కులను ఇచ్చింది. అంటే వివాహమైన కుమార్తెలకు వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. ఈ మార్పు సవరణ తర్వాత జన్మించిన ఆడపిల్లలకే కాకుండా 2005కు ముందు జన్మించిన వారికి కూడా రెట్రోస్పెక్టివ్ హక్కులను కల్పిస్తుంది.తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?తల్లి సొంతంగా సంపాదించిన ఆస్తిని కాస్త భిన్నంగా పరిగణిస్తారు. తల్లి అకాల మరణం చెందితే (వీలునామా లేకుండా) ఆమె ఆస్తిని చట్టబద్ధమైన వారసులకు సమానంగా పంచాలి. ఇందులో కుమారులు, కుమార్తెలు పరిస్థితిని బట్టి కొన్నిసార్లు భర్త కూడా ఉంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహిత కుమార్తెలను క్లాస్ 1 వారసులుగా పరిగణిస్తారు. అంటే వారు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందడానికి సమాన హక్కు కలిగి ఉంటారు. కుతురుకు వివాహం అయినా తల్లి ఆస్తిలో కుమారులతో సమానంగా వాటా ఉంటుంది.అపోహలుసాధారణంగా వివాహం తర్వాత కుమార్తెకు తమ పూర్వీకుల ఆస్తిపై హక్కు రద్దు అవుతుందని అనుకుంటారు. కుమార్తెలు తమ తండ్రులు లేదా తాతలు వారసత్వంగా పొందిన ఆస్తిలో వాటాను పొందలేరని భావిస్తారు. అయితే హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ ప్రకారం దీని అమలుకు ముందు వివాహం చేసుకున్నప్పటికీ, పూర్వీకుల ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కు ఉందని స్పష్టం చేస్తుంది.ఆస్తి వివరాల్లో స్పష్టత వచ్చిన తర్వాత దాని హక్కులను, వారసత్వాన్ని క్లెయిమ్ చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. ఇందులోని న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడం, సజావుగా క్లెయిమ్ చేయడం చాలా అవసరం.మ్యుటేషన్ ప్రక్రియఆస్తి హక్కును నిర్ధారించడంలో మొదటి దశ ఆస్తి రికార్డుల మ్యుటేషన్. కొత్త యజమానులను (కుమార్తెలతో సహా) ప్రతిబింబించేలా భూ రికార్డులను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించవచ్చు.వారసత్వ ధ్రువీకరణ పత్రంబ్యాంకు ఖాతాలు లేదా బీమా పాలసీలు వంటి మృతుడి ఆస్తి చరాస్తులుగా ఉన్న సందర్భాల్లో వారసత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చు. మృతుడి ఆస్తిపై వారసుల హక్కు ఉందని పేర్కొంటూ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.సివిల్ కోర్టువివాదం కేసుల్లో లేదా కుటుంబ సభ్యులు కుమార్తె వాటాను అంగీకరించడానికి నిరాకరిస్తే కేసును సివిల్ కోర్టుకు తీసుకెళ్లవచ్చు. ఆస్తిలో న్యాయమైన వాటాను పొందడానికి హిందూ వారసత్వ చట్టం నిబంధనల ప్రకారం చట్టపరమైన దావా వేయవచ్చు.ఇదీ చదవండి: మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక

Kukatpally Sahasra Case more Details7
కూకట్‌పల్లి కేసు.. ప్లాన్‌ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు!

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్‌లో క్రైమ్‌ సీన్స్‌ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్‌ ఇంటెలిజెంట్‌గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్‌ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్‌ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.ఇక, కూకట్‌పల్లి దయార్‌గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్‌ బ్యాట్‌ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్‌పల్లి పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్‌మెంట్‌లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్‌పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్‌పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్‌ను వాషింగ్‌ మెషిన్‌లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్‌లైన్‌లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం.

OTT: Maaman Movie Review in Telugu8
ఎమోషనల్‌ స్టోరీ మామన్‌ మూవీ రివ్యూ

మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్‌తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్‌’. ఓటీటీలో సూపర్‌ హిట్‌ మూవీఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్‌ పాండ్యరాజన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్‌ సూపర్‌ హిట్‌. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్‌ యాక్షన్‌ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్‌ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్‌’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్‌ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్‌’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌.– హరికృష్ణ ఇంటూరు

Cloudburst hits Uttarakhands Chamoli District9
Uttarakhand: ఉత్తరాఖండ్​లో మళ్లీ క్లౌడ్‌ బరస్ట్.. పలువురు గల్లంతు

చమోలీ: ఉత్తరాఖండ్‌ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. #WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఈ విపత్తుపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ‘చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్​బరస్డ్ సంభవించింది. జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. తాను స్థానిక పరిపాలన అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అన్నారు#WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన విపత్తుకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహదారులు మూసుకుపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్‌ బరస్ట్‌ అని అంటారు.

Intermittent fasting (IF) for women crucial to follow chek deets inside 10
ఇంటెర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!

బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్‌ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్‌ గురించే.. ఇంట్రస్టింగ్‌!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్‌ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిసాల్‌ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్‌లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్‌ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్‌ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్‌ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్‌ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్‌ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్‌ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్‌ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్‌ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్‌ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement