
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ-2025కు గిల్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించిన అనంతరం గిల్‌ను నార్త్ జోన్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నహాకాల్లో భాగంగా ఈ పంజాబ్ బ్యాటర్ దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. ఆసియాకప్-2025కు గిల్ ఎంపికైనప్పటికి దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఆడనున్నాడని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆ ఒక్క మ్యాచ్‌కు కూడా గిల్ దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ప్రస్తుతం కాస్త అనారోగ్యంతో బాధపడతున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఫిజియోలు, వైద్య బృందం శుబ్‌మన్ బ్లడ్ టెస్టు రిపోర్ట్స్‌ను బోర్డుకు సమర్పించి, అతడిని దులీప్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించాలని సూచించినట్లు దైనిక్ జాగరన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
నార్త్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అంకిత్ కుమార్ గిల్ స్ధానంలో జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నప్పటికి.. ఆసియాకప్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
కాగా దులీప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్‌జోన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఈస్ట్‌జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 28 నుంచి 31 వరకు జరగనుంది.
ఇక గిల్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనపరంగా అందరిని ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు.
దులిప్ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్ జట్టు ఇదే
శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ ( కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.
చదవండి: ఆసియాకప్-2025కు హాంకాంగ్ జట్టు ప్రకటన..