
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్‌కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్‌లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్‌లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..
మాటల తుపాను
మొదటగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.
పేడ రుద్దుకోమనగానే..
తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్‌కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్‌కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.
అబ్బాయిలే గ్రేట్
19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్‌కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్‌గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).
బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కి
అనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్‌తో నెక్స్ట్ లెవల్‌కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్‌లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.