
న్యూఢిల్లీ: భారతదేశం అంతరిక్ష రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నదని, 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటవుతుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు. నేడు(ఆగస్ట్ 23) జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా ఉంటుందని నారాయణన్ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ, దార్శనికతల ఆధారంగా చంద్రయాన్-4 మిషన్ మనకు సాకారమయ్యింది. వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్ కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు.
#WATCH | Delhi: ISRO Chairman V. Narayanan says, "... Based on his direction and vision, we are going to have a Chandrayaan-4 mission. We are going to have a Venus Orbiter Mission. We are going to have a space station called BAS (Bharatiya Antriksh Station) by 2035, and the first… pic.twitter.com/1RNQOJyng0
— ANI (@ANI) August 23, 2025