
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట్ మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ లభించింది. దీంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసున్న కూకట్‌పల్లి పోలీసులు.. బాలుడిని విచారిస్తున్నారు.
నిన్న రాత్రి(అక్టోబర్ 18, శనివారం) మెట్రోలో ప్రయాణించేందుకు బాలుడు మూసాపేటలోని స్టేషన్‌కు రాగా.. మెట్రో భద్రతా సిబ్బంది ఆ బాలుడిని తనిఖీ చేశారు. ఆ బాలుడి వద్ద ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ సౌండ్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాలుడి వద్ద 9 ఎంఎం బుల్లెట్‌ను గుర్తించారు. బుల్లెట్ ఎలా వచ్చిందంటూ ఆ బాలుడిని మెట్రో సిబ్బంది ప్రశ్నించారు.
సరైన సమాధానం చెప్పకపోవడంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ బుల్లెట్‌పై ఆరా తీశారు. పలు కోణాల్లో ఆ బాలుడిని విచారిస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.