breaking news
Jogulamba
-
వీధివ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
గద్వాల న్యూటౌన్: వీధి వ్యాపారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో స్వానిధి మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వీధి వ్యాపారాలు కనీస పెట్టుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహించుకోవడంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జానకిరాం సాగర్ మాట్లాడుతూ 2019లో కరోనా వ్యాధి సమయంలో చిరు, వీధి వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, వారికి ఆర్థికపరమైన చేయూతను అందించేందుకు అప్పుడు ప్రభుత్వం భారత్ ఆత్మ నిర్భర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా మూడు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు రుణాలు అందించామని గుర్తుచేశారు. ఈ రుణ మొత్తాలను ఇటీవల కొంత పెంచారని, వీధి వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రైవేట్‌గా అప్పులు తీసుకోకుండా, వీధి వ్యాపారిగా నమోదై బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉత్తమ వీధి వ్యాపారులుగా ఎంపికై న వారిని చైర్పర్సన్, కమిషనర్ శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్, వస్తువుల స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, సీఓలు నిజాముద్దీన్, మహాలక్ష్మి, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికే ప్రజాపాలన
గద్వాల: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ దక్కేలా, అన్నిరకాల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేకాధికారి శృతిఓజా అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం 10 థీములతో షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. వివిధ శాఖల్లో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా మరుగుదొడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు, గట్టు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్‌కు ఎంపిక కావడం, నిర్దేశిత పారామీటర్స్‌లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. బాల్యవివాహాలు అరికట్టేలా కృషి చేశామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ వారోత్సవాలు నిర్వహించి రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిష్యత్‌కు ఏటీసీ బలమైన పునాది
రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్‌కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. 730 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ యార్డుకు గురువారం 730 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,341, సరాసరిగా రూ.6,520 ధరలు లభించాయి. రీ–టెండర్ నిర్వహించాలి గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ షాపులకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని తిరిగి రీ–టెండర్ నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 38 షాపులకు టెండర్ నిర్వహించగా, ఇందులో 15 షాపులను ఎస్సీ, ఎస్టీలకు, మరో 23 షాపులకు జనరల్‌కు కేటాయించారన్నారు. ఇందుకు సంబంధించి 118 దరఖాస్తులు రాగా.. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వివిధ కారణాలు చూపెడుతూ మొత్తం 59 దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే వేలం జరిగి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడిందని, అలాగే షాపు నంబర్లు 1, 30లకు వేలం నిర్వహించలేదని విమర్శించారు. ఈ షాపులకు ఎప్పుడు వేలం నిర్వహిస్తారో స్పష్టం చేయలేదని, వేలం నిర్వహించి ఆరు రోజులు గడిచినా ఏయే షాపులు ఎంతెంత వేలం పోయాయి.. ఎవరికి కేటాయించారు.. అనే వివరాలు చెప్పలేదన్నారు. ఇంకా ఎన్నో సందేహాలు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు తిరిగి షాపులకు రీటెండర్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, హన్మంతు, వెంకటేష్, రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ ప్రాజెక్టులు ఆపాలి గద్వాల: తుంగభద్ర నదిపై ఆర్డీఎస్కు తూట్లు పొడుస్తూ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లి్ఫ్ట్ ఇరిగేషన్‌ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని ఎన్నడూ వినియోగించుకోలేదన్నారు. కేవలం 25 వేల ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, ఆర్డీఎస్ రావాల్సిన నీటి వాటాను పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ డీసీగా విజయ్‌భాస్కర్‌రెడ్డి మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కా రీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్‌భాస్కర్‌రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్‌గా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా వచ్చారు. నాగర్‌కర్నూల్ ఈఎస్‌గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్‌కర్నూల్ ఈఎస్‌గా వి.వేణుగోపాల్‌రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చా రు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్‌గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్‌గా ఉన్న పి.కరమ్‌చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్‌గా వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏఈఎస్‌గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్‌గా వెళ్లారు. -
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
గద్వాల: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోదక దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్‌కు పునాది అని, యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే వారి వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా భవిష్యత్, కుటుంబం మొత్తం నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా సమాజానికి సైతం నష్టం కలిగిస్తుందన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, లక్ష్మణస్వామి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో..
కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్‌సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. -
సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
విజయవంతం చేయాలి.. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలో 217, 218 పోలింగ్ వద్ద సర్‌లో భాగంగా ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్ఓల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజల సహకారంతోనే సమగ్ర విశ్వసనీయ ఓటరు జాబితా రూపకల్పన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గద్వాల: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. సర్‌పై ఓటర్లకు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణిచౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్‌ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. మరణించిన వారు, అనర్హుల ఓట్లు తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రయ దోహదపడుతుందన్నారు. ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సం పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్‌రెడ్డి, శిక్షణ డీసీలు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
గద్వాల (మల్దకల్): పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జగ్గునాయక్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఏఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు కంపెనీ గుర్తింపు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, నానో యూరియా, నానోడీ డీఏపీల వాడకం పెంచాలని వివరించారు. ముఖ్యంగా జీవ ఎరువుల ప్రాముఖ్యత, జీవామృతం, వర్మీ కంపోస్టు, బయో ఫర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి.. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితేనే మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు శిరీష, ఏఈఓ సుధారాణి, రైతులు పాల్గొన్నారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ రిజర్వాయర్ పెంపు సర్వే పనులు చేస్తున్న అధికారులు (ఫైల్) 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
‘చెత్త’స్టాండ్..!
‘మొత్తం 18 ప్లాట్‌ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్‌నగర్ కొత్త బస్టాండ్ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోచవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్‌హెచ్–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముందుకు కదలని మురుగు.. వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలమూరు బస్టాండులోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.. ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం కంపుకొడుతున్న బహిరంగ మూత్రశాలలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పెద్దనాలా పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు -
త్వరలో పనులు పూర్తి చేస్తాం
అనేక కారణాల వల్ల ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, బెంచీలు ఏర్పాటు చేయాలి. అలుగును కాంక్రీట్ చేయాలి. ఫీడర్ చానల్‌ను అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం. – నాగరాజు, ఇరిగేషన్ డీఈ సగం కూడా పూర్తికాలే.. ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లవుతోంది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు చొరువ తీసుకొని పనుల్లో వేగం పెంచాలి. – జగన్నాథరెడ్డి, అయిజ ఆధునిక హంగులతో నిర్మించాలి మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడడంతో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ వంటివి సమకూర్చితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేసుకునే అవకాశం ఉంటుంది. – గోవిందు, అయిజ ● -
సర్.. వస్తున్నారు!
అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్‌లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. బీఎల్ఓల పాత్ర కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవచ్చు.. ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్‌కర్నూల్ నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ఇప్పటికే బూత్‌లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ -
పోటీల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ధరూరు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు పునాది రాయి లాంటిదని తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ సరిత అన్నారు. మండలంలోని గార్లపాడులో పోలమ్మ అవ్వ పండుగను పురస్కరించుకొని మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సరిత పోలమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. విజేతగా నిలిచిన మూలమళ్ల జట్టుకు ప్రథమ బహుమతి రూ.30,116 నగదును మాజీ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి దంపతులు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబద్ జట్టుకు సర్పంచు పరిమళ శివరాజ్ రూ.20,016 నగదు అందజేశారు. మూడో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టుకు రూ.15,016 నగదును శివకుమార్‌రెడ్డి అందజేశారు. అలాగే నాల్గోవ స్థానంలో నిలిచిన గార్లపాడు జట్టుకు రంగస్వామి నగదు ఆందజేశారు. ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు.. గార్లపాడులో నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు షీల్డులను సర్పంచు పరిమళ శివరాజ్ అందజేశారు. -
శుభ్రం చేయిస్తున్నాం..
ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్‌కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్‌కుమార్, డీఎం, మహబూబ్‌నగర్ అపరిశుభ్ర వాతావరణమే.. నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్‌ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్‌నగర్ ● -
డ్రగ్స్.. వ్యక్తికే కాదు కుటుంబానికి ముప్పు
గద్వాల క్రైం: మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్ ద్వారా పునరావాస కార్యాక్రమాలను అందజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‘మన డ్రగ్స్ డీ అడిక్షన్ – రిహాబిటేషన్ సెంటర్’ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తులను మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నా రు. వ్యసనాలకు బానిసైలన వారికి సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్, యోగా, ధ్యానం వంటి శిక్షణ ఇవ్వాలన్నారు. సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, సదుపాయాలను సొసైటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈగల్ ఫోర్స్ ద్వారా జిల్లాకు వచ్చిన క్యారమ్, చెస్, పెయింటింగ్ బోర్డు, సృజనాత్మక కార్యకాలపాలకు ఉపయోగపడే సామగ్రిని అందజేశారు. కార్యక్రమాంలో సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్‌కుమార్, సెంటర్ నిర్వాహకులు కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలి ఉండవెల్లి: మండలంలోని 11 పంచాయతీల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల్లో భాగంగా జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా 31 పనుల్లో 28 పనులను కేంద్ర నోడల్ అధికారి సత్యమూర్తి, జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్ విద్యాధర్, ఏపీడీ శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాములు, బోరు బావులు, రూప్‌టాప్ హర్వెస్టింగ్ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతన్న, ఏపీఓ సౌజన్య, టీఏలు రామచంద్రుడు, విజయ్ పాల్గొన్నారు. లంపిస్కిన్ నివారణ టీకాలు వేయించండి గద్వాల వ్యవసాయం: గోజాతి పశువులైన ఎద్దు లు, ఆవులు, కోడెలు లంపిస్కిన్ (ముద్ద చర్మం) వ్యాధి బారిన పడకుండా ముందుస్తుగా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో పాడి రైతులకు సూ చించారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైందన్నారు. జూలై 8 వరకు ఆయా గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని పేర్కొన్నారు. 2 నుంచి 3 నెలల దూడలు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దోమలు, ఈగ లు, రక్తం పీల్చే కీటకాల ద్వార, వ్యాధి సోకిన పశువుల నీరు, మేత ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. అధిక జ్వరం, కళ్లు, ముక్కు నుంచి నీరుకారడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. -
128వ రోజుకు చేరిన నిరసన దీక్షలు
గట్టు: మండల పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భారత్‌మాల రోడ్డుకు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డును మూసివేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 128వ రోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న గట్టు మండలంలో భారత్‌మాల రోడ్డు నిర్మాణం ఈ ప్రాంతవాసులకు కొత్త ఆశలను చిగురింపజేసినట్లు తెలిపారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తుండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. దీంతో మండల ప్రజలు నిరసన దీక్షలకు పూనుకున్నారని చెప్పారు. భారత్‌మాల రోడ్డుకు గట్టు మండలానికి కనెక్టివిటీ ఇచ్చే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ దగ్గరున్న డబుల్ రోడ్డును మూసివేసి.. రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డు మార్గంలో వంతెనను తక్కువ ఎత్తులో నిర్మించడం ద్వారా భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనికి తోడు రోడ్డు మలుపు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్, కేంద్ర ప్రభుత్వం స్పందించి గట్టు మండలానికి కనెక్టివిటీ ఇవ్వడంతోపాటు నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలెకర్రెప్ప, జనార్దన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ఎర్రవల్లిలోని పదవ బెటాలియన్ పోలీస్ సెమినార్ హాల్లో మంగళవారం జ్ఞానదీప్తి పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు నిర్వహించిన పాఠశాలల ప్రారంభ మార్గదర్శక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన 32 పారా మీటర్స్‌లో మన జిల్లా మంచి ర్యాంకింగ్ సాధించేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. యూడైస్ అప్డేట్ పక్కాగా ఉండాలని, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇటీవలే విద్యా శాఖాధికారులతో కలిసి ఆయన ఫిన్లాండ్ దేశంలో పర్యటించి, అక్కడి విద్యా వ్యవస్థను అద్యయనం చేయడం జరిగిందని, కొన్ని అంశాలను మన వద్ద కూడా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతినెలా 15లోగా సందర్శించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లీవ్ లెటర్ ఇవ్వకుండా పాఠశాలలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. పోషణ్ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పునశ్చరణ తరగతుల ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థులు మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీపీటీ ద్వారా మాస్టర్ ట్రైనర్ అగస్టీన్ వివిధ అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, డీఈఓ విజయలక్ష్మి, కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పాణి,సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
భయం వేసింది..
ఉదయం ఆరుబయట నిలబడి ఉన్నాను. అయితే ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా ఎగబడి దాడి చేసింది. ఈ ఘటనలో మెడ, చేయి, కాలు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. తప్పించునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యుల వచ్చి కుక్కను తరిమేయడంతో బటయ పడ్డాను. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా చనిపోతానేమోననే భయం వేసింది. వీధికుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. – ఈశ్వర్, కుక్కకాటు బాధితుడు, జమ్మిచేడ్కాలనీ, గద్వాల ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.. నల్లకుంట, రాజీవ్మా ర్గ్ కాలనీల్లోని రహదారులపై వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమయ్యా యి. రహదారుల వెంట పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కుక్కలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. బైక్‌లపై వెళ్లే వారిని వెంబడించి కరుస్తున్నాయి. కుక్కలు పట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. కాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటి బెడద నుంచి కాపాడాలి. – నందకిషోర్, నల్లకుంట కాలనీ, గద్వాల మూడు శాఖల ఆధ్వర్యంలో.. పట్టణంలో వీధికుక్కల నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. వివి ధ వార్డులలో తిరుగుతున్న 60 కుక్కలను పట్టుకుని పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకునేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా వాటిని కట్టడి చేస్తాం. గాయపడిన వారికి యాంటీ రేబిస్ టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య, పశు సంవర్ధక, మున్సిపల్ శాఖల సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాం. – జానకిరాంసాగర్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ
గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని అనంపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. యువత, చిన్నారులు, పెద్దలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ఈ అలవాటు కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిత్య, సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. గద్వాల జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా పని చేసిన కల్యాణ్ చక్రవర్తి జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పని చేసి గద్వాలకు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత హాజరై సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి నర్సింహారెడ్డి, వెంకటయ్య, చంద్ర మౌలి, అనంతరెడ్డి, అనిల్‌కుమార్, ఎన్పీ వెంకటేష్, స్వదేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్‌స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 612 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 612 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,819, కని ష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.5,700 ధరలు లభించాయి. అలాగే 5 క్వింటాళ్ల వరి (సోన) క్వింటాల్ రూ.2,567ధర పలికింది. జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి. -
వరుసబెట్టి.. కరిచేస్తున్నాయి
● జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు కేసులు ● గడిచిన మూడు నెలల్లో 429 మందిపై దాడి ● తాజాగా జమ్మిచేడ్లో 10 మందిపై దాడి ● ఆరుబయటకు రావాలంటేనే జంకుతున్న జనం ● పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్న అధికారుల కట్టడి చర్యలు గద్వాల క్రైం: జిల్లాలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. ఆరుబయట కనబడిన వారిపైనల్లా అమాంతం ఎగబడి దాడులు చేస్తున్నాయి. ఇంటి ఆవరణ.. రోడ్డు మార్గంలో.. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద తప్పడం లేదు. జిల్లాలో గత కొన్ని రోజులుగా కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విచక్షణారహితంగా కరిచే కుక్క కాటుతో వచ్చే (రేబిస్ వ్యాధితో మరణం) ప్రమాదాన్ని గుర్తెరిగి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జమ్మిచేడ్ కాలనీలో ఓ పిచ్చి కుక్క కనిపించిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో 10 మందికిపైగా తీవ్ర రక్తగాయాల పాలైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో 429 మందికిపైగా కుక్కలు దాడులు చేశాయి. మరోవైపు గద్వాల మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి 60 కుక్కలను కట్టడి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
‘మిగులు’తో సర్దుబాటు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్‌లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్‌లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్‌లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్‌లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్‌కర్నూల్ 0 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు.. ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్‌పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
వేల సంఖ్యలో సంచారం..
జిల్లాకేంద్రంలోని కాలనీలు, రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మనుషులపై వీధికుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివారు ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంట తిరుగుతున్న 60 వీధికుక్కలను గుర్తించి వాటిని పశు సంవర్ధకశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జిల్లాకేంద్రంలో వేల సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వేల సంఖ్యలో కుక్కలు ఉండగా.. నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. -
తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి
రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో టీజీ ఎండీసీ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ మూక దౌర్జన్యానికి తెగబడింది. సైట్ ఇన్చార్జిపై దాడి చేసింది. కింద పడేసి పిడి గుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నడమే కాకుండా చంపేస్తామంటూ దుండగులు బెదిరించారు. ‘సోమవారం మధ్యాహ్నం రెండు కార్లలో వచ్చిన ఆరుగురు దుండగులు..సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం. ఇదే మా ఠాగూర్ అన్న ఆర్డర్ అంటూ అక్కడ ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లారు. ఆ బ్యాగులో ఇసుక రీచ్ స్టాక్ బుక్కులతో పాటు, రూ.4 లక్షల నగదు ఉంది..’ అని దాడికి గురైన సైట్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. దాడి చేసిన వారిలో గుంటూరుకు చెందిన అడుసుమిల్లి శ్రీధర్ అనే వ్యక్తిని తాము గుర్తు పట్టామని చెప్పారు. వ్యాపార సంబంధమైన గొడవలతో..? తుమ్మిళ్ల ఇసుక రీచ్ ద్వారా ఆన్లైన్లో స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. ఏపీకే చెందిన ప్రసాద్ అనే కాంట్రాక్టర్ దీన్ని నిర్వహిస్తున్నాడు. కాగా ఠాగూర్ అనే వ్యక్తితో ప్రసాద్‌కున్న వ్యాపార సంబంధమైన గొడవలే దాడికి కారణమని తెలిసింది. ఈ దాడిపై రాజోళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. అడుసుమిల్లి శ్రీధర్ ఏపీలో స్థానిక టీడీపీ నాయకుడని చెప్పారు. కాగా ఠాగూర్ హస్తంతోనే తనపై దాడి జరిగినట్లు లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఠాగూర్ ఏపీలోని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడని అంటున్నారు. ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివసిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో కలకలం సోమవారం జరిగిన ఈ దాడి జిల్లాలో కలకలం సృష్టించింది. కొద్దిరోజుల కిందట కర్నూలుకు చెందిన నాయకులు వారి వెనక వాహనాల్లో వందలమంది అనుచరులను తీసుకొచ్చి, నదిలో ఇసుక తీయొద్దని, ప్రభుత్వ అధికారులకే వార్నింగ్ ఇచ్చారని, ప్రస్తుతం గుంటూరుకు చెందిన కొందరు ఇలా వచ్చి దాడికి తెగబడ్డారని చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని రాజోళి ఎస్ఐ గోకారి తెలిపారు. అయితే ఇసుక రీచ్‌లోని తన సిబ్బందిపై దాడి ఘటనపై కేసు నమోదు చేయకపోతే మంగళవారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తానని కాంట్రాక్టర్ ప్రసాద్ తెలిపారు. -
కసరత్తు చేపట్టాం..
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ వినూత్న చర్యలు తీసుకుంది. పట్టణ పోలీసు స్టేషన్లో ముగ్గురు ఎస్ఐలు విధులు నిర్వహిస్తుండగా.. వారికి ఒక్కో సెక్టార్‌ను కేటాయించాం. వారు నిరంతరం ఆయా సెక్టార్లపై నిఘా ఉంచి, బాధితులకు సత్వర న్యాయం చేసేలా కృషి చేస్తారు. వీరిని ఎస్హెచ్ఓ మానిటరింగ్ చేస్తూ.. అవసరమైన సలహాలు ఇస్తుంటారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల -
కొనసాగుతున్న నిరసన దీక్షలు
గట్టు: రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, భారత్‌మాల రోడ్డు నుంచి గట్టు మండలానికి కనెక్టివటీ ఇచ్చే అఫ్రోచ్ రోడ్డు నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు ఆది వారం నాటికి 126వ రోజుకు చేరుకున్నాయి. రా యాపురం స్టేజీ వద్ద డబుల్ రోడ్డు మూసివేసి, రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తు లో వంతెన నిర్మాణం సాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భారీ వాహానాలు ఈ వంతెన ద్వారా రాకపోకలను సాగించే అవకాశం లేదన్నారు. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న గట్టు మండలంలో ఆరు వరుసల జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలె కర్రెప్ప, జనార్దన్, సుధాకర్ పాల్గొన్నారు. రాయాపురం స్టేజీ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజలు -
జూరాలకు నిలిచిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్‌కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం ఇబ్బందులు వాస్తవమే.. జిల్లాలో చేపల విక్రయానికి ఇబ్బందులున్నది వాస్తవమే. మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వాటి నిర్మాణం పూర్తయ్యాక చేపల మార్కెట్‌కు కొంత భాగం కేటాయిస్తారు. భూత్పూర్ మున్సిపాలిటీలో చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. సరైన స్థలం లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచాయి. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి -
వాటాదారులకు మెరుగైన సేవలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పా రు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమా వేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కలకొండ సూర్యనారాయణ, డైరెక్టర్లు పుల్లా శ్రీనివాసులు, గుండా వెంకటేశ్వర్లు, రాగిరి తిరుపతయ్య, ఎదిర తమ్మయ్య, కల్వ కన్నయ్యశెట్టి, నీల సంగమేశ్వర్, హకీమ్ విశ్వప్రసాద్, దామరగిద్ద జ్యోతి, బ్యాంక్ మేనేజర్ జనుంపల్లి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్యం గాడి తప్పుతోంది!
నేరాలకు ఒడిగడుతున్న మైనర్లు –8లో uగద్వాల క్రైం: తెలిసి తెలియని యుక్త వయస్సు.. స్మార్ట్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, డ్రగ్స్‌కు బానిసలై కొందరు మైనర్లు దారి తప్పుతున్నారు. బాల్యంలోనే దురలవాట్లు, దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడి బాల నేరస్తులుగా పోలీసుల రికార్డులోకి ఎక్కుతున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న చిన్నారులు జోగుళాంబ గద్వాల జిల్లాలో మద్యం, గంజాయి, అత్యాచారాలు, పొగ తాగడం వంటి జల్సాలకు అలవాటు పడుతున్నారు. ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడిన మైనర్ బాలుడిని పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చేజారి పోతున్నారు.. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు మైనర్లు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కొందరు మద్యానికి మరి కొందరు పొగతాగడం, గంజాయి పీలుస్తున్నారు. వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లకు బానిసలై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశ్లీల వీడియోలను చూస్తూ విచక్షణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న మహిళల్ని వేధిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. కాలనీల్లోని ఇతర మైనర్లతో దురుసుగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉన్నాయి. పిల్లల నడవడిక విషయంలో తల్లిదండ్రులు నిత్యం గమనించాలి. స్నేహితుల్లో చెడు వ్యసనాలు కలిగిన ఒక్కరున్నా వారి ప్రభావం ఇతర చిన్నారులపై పడుతుంది. గంజాయి కేసులు సైతం నమోదయ్యాయి. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెడు వ్యసనాల నుంచి విముక్తి కల్పించేలా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు కొన్నాళ్లకు మళ్లీ అదే దారిలోకి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల కోసం దొంగతనాలు అత్యాచార కేసుల్లోనూ నిందితులుగా.. గంజాయి, డ్రగ్స్ కోరల్లో చిక్కుతున్న వైనం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం ఓ కారణమే.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నూతన గృహా నిర్మాణాలకు యజమానులు తెచ్చిన విలువైన విద్యుత్ వైర్లను అపహరించి వాటిని బయటి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో 2025 లో దొంగతనం చేస్తూ కాలనీవాసులకు పట్టుబడగా.. వారు పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించిన క్రమంలో మైనర్ బాలుడు తండ్రి ఓ పోలీసు కావడంతో మందలించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇతడితో పాటు మరికొంత మంది మైనర్లు ఉండడం కొసమెరుపు. జూన్ 10, 2026లో చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా.. అందులో ఒకరు మైనర్‌గా ఉన్నాడు. దీంతో పోలీసులు బాల నేరస్తుడిని జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. అతడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలుడు పట్టణ శివారుల్లోని చిరు దుకాణంలో చోరీలకు పాల్పడ్డాడు. కాలనీవాసులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. 2025లో జిల్లా కేంద్రానికి చెందిన కొందరు గుర్తుతెలియని యువకులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ద్విచక్ర వాహనలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు ముమ్మరంగా గాలించిన పోలీసులు చోరీలకు పాల్పడిన 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. మరి కొందరు గంజాయికి అలవాటు పడ్డారు. నెల క్రితం ఓ మైనర్ బాలుడు అత్యాచార కేసులో పోలీసులకు పట్టుబడగా.. పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఏడాది కాలంగా జిల్లాలో 20 మందికి పైగా మైనర్లు వివిధ కేసుల్లో పాలుపంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
తల్లిదండ్రుల నిర్లక్ష్యమే..
పిల్లలు యుక్త వయస్సుకు వచ్చే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎక్కవ సమయం గడుపుతూ.. మంచి, చెడు విషయాల గురించి చర్చించాలి. చదువుకుంటే సమాజంలో వారికుండే గౌరవం, భవిష్యత్ గురించి వివరించాలి. చదువు పేరుతో వారిపై ఒత్తిడి చేయకుండా స్నేహపూర్వకంగా మెలిగి సరైన సూచనలు ఇవ్వాలి. తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన పిల్లలే ఎక్కువగా నేరాల బాట పడుతున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పులు ఎవరూ చేసినా పోలీస్ శాఖ కఠినంగానే వ్యవహరిస్తుంది. మైనర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
గద్వాల క్రైం: మానసిక ఒత్తిడి.. నిలకడ లేని ఆలోచనల నుంచి విజయం సాధించాలంటే యోగాతో నే సాధ్యమవుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నా రు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తీవ్రమైన వేదన, చిరా కు, ఒత్తిళ్లు, ఆందోళనతో కుంగిపోతున్నారన్నారు. స్థిరత్వం లేని ఆలోచనలు, క్షణికావేశంతో చేస్తున్న పొరపాట్లతో ఇబ్బందులకు గురవతున్నారని పేర్కొన్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు యోగా చేసేందుకు కొద్ది సమయం కేటాయించాలని సూచించారు. దీంతో మానసిక ప్రశాంతత, ఆనందం, సమయానుకూలంగా తీసు కోవాల్సిన నిర్ణయాలు, చేస్తున్న పనుల్లో సంతోషం ఉంటుందన్నారు. యోగా చేసేందుకు ఎలాంటి వ యో పరిమితి లేదని, ఎవరైనా సాధన చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, సిబ్బంది ఉన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
మల్దకల్/కేటీదొడ్డి: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని నీలిపల్లి, కేటీదొడ్డి మండలంలోని ఈర్లబండ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిర మ్మ గృహ ప్రవేశాలకు ముఖ్య అతి థిగా హాజరై ప్రారంభించారు. ఇల్లు ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు కాగా.. 2 వేల ఇళ్లు వివిధ ద శల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వర లో వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హు లందరికీ కేటాయిస్తామన్నారు. మల్దకల్ మండలంలోని దాసరపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ దేవత అయిన సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, చక్రధర్‌రెడ్డి, విష్ణు, ప్రవీణ్, ఆంజనేయులు, ఏలేష్, శేఖర్‌రెడ్డి, మధురెడ్డి, పరశురాముడు, భరత్‌రెడ్డి, అమరేష్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో బోధన మెరుగుపర్చాలి
మల్దకల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి విద్యాభివృద్ధికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మల్దకల్‌లోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు పనిచేయండి అయిజ: వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మండలంలోని వేణిసోంపురంలో ఈజీఎస్ పనులను పరిశీలించారు. ఈజీఎస్ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కూరగాయల విత్తనాలను సాగుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 7,046 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: లోక్ అదాలత్‌లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సుప్రీంకోర్టు అదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించామని న్యాయమూర్తి తెలిపారు. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుత సాంకేతిక విప్లవంలోనూ కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులు తమ విలువైన భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి పొందే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో 7,046 కేసులు పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులలో ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చినట్లు వెల్లడించారు. -
భూములు అమ్మి చదివించారు
‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. తండ్రి గంగన్నతో నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్ ఐఏఎస్ ఎంపికై ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్‌నాయక్, ఐఏఎస్ నాపై ఎంతో నమ్మకంతో ఉన్నత చదువులు చదివించారు. నా ఆశయ సాధనకు ఎంతో కృషి చేశారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం. -
ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ప్రధాన కూడళ్లలో నిత్యం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నారని, ఇలాంటి వారిని ట్రాఫిక్ సిబ్బంది కట్టడి చేయాలన్నారు. జరిమానాలు విధించడంతోపాటు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన క్రమంలో వారి తల్లిదండ్రులకు తెలియజేసి కౌన్సిలింగ్‌తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలచంద్రుడు ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 993 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 993 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,599, కనిష్టంగా రూ.3,266, సరాసరిగా రూ.5,499 ధరలు లభించాయి. అలాగే క్వింటా ఆముదాలు రాగా రూ.5,819 ఒకే ధర పలికింది. జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు చెప్పారు. శనివారం ప్రాజెక్టుకు కేవలం 547 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 554 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.316 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● సుంకేసుల డ్యాం నుంచి ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శనివారం ఎగువ నుంచి 1,500 క్యూపెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటను 30 మీటర్ల మేర ఎత్తి 1,140 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్‌కు 1,290 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పడాలి గద్వాల న్యూటౌన్: జిల్లాలోని చేనేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కౌన్సిలర్ రామలింగేశ్వర్ కాంళ్లే, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హ్యండ్లూమ్ ఏడీ ఇందిరను కోరారు. పలువురు చేనేత కార్మికులతో కలిసి శనివారం ఆమెను కార్యాలయంలో కలిశారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముద్ర రుణాలు అందించాలని విన్నవించారు. అలాగే నూతనంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునే వారికి జియో ట్యాగ్ నంబర్లు సకాలంలో అందించాలని, గద్వాల హ్యాండ్లూమ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. అంతకు ముందు ఏడీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు వెంకటేష్, జగన్, వీరేష్, రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
పాలమూరు: ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించడమే గగణమైన ఆ రోజుల్లో మా నాన్న.. భవిష్యత్‌లో పిల్లలకు చదువు ఎంత అవసరమో ముందే గ్రహించాడు. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే మా ముగ్గురిని కష్టపడి చదివించారని చెబుతోంది మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి. మాది నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం. దిగువ మధ్య తరగతి కుటుంబం కాగా.. నాన్న పాండు, అమ్మ ఉషకు మేం ముగ్గురం సంతానం (ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి). మా చిన్నతనం నుంచి నాన్న ఒక్కరే కష్టపడేవారు. మాకు ఊళ్లో కనీసం సెంటు భూమి కూడా లేకపోవడంతో నాన్న వ్యవసాయం కాకుండా కోదాడలో చికెన్ సెంటర్ నడిపేవారు. దీని ద్వారా వచ్చిన అరకొర ఆదాయంతో కొంత అద్దె చెల్లించడంతోపాటు మిగిలిన దాంట్లో సర్దుబాటు చేస్తూ ప్రణాళిక ప్రకారం కుటుంబాన్ని పోషిస్తూ మమల్ని చదివించారు. చిన్ననాటి నుంచి నాన్నకు ఒక విజన్ ఉండేది.. ఉన్నత చదువు వల్ల పిల్లల జీవితాలు బాగుంటాయని పదే పదే మాకు చెబుతూ బాగా చదవాలని ప్రోత్సహించారు. ఆయన మార్గదర్శకంలోనే నేను ఈ ఉద్యోగం సాధించగలిగాను. మా చెల్లి వైద్యురాలిగా స్థిరపడింది. మా అన్నయ్య ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా కుటుంబంలో ఉన్న ముగ్గురం ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక మా తండ్రి కష్టం ఎంతో దాగి ఉంది. ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026 -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి
కందనూలు: రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు, నియోజకవర్గాల వారీగా భూ సేకరణ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు, ఎంత భూమి ప్రాథమిక నోటిఫికేషన్ దశలో ఉంది, ఎంత భూమి పీఎం స్థాయిలో ఉంది, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకెన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే ప్రాజెక్టులు పూర్తవుతాయని, అందుకే రైతుల విశ్వాసాన్ని పొందేలా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ● నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్‌బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 15లోగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష -
యూనివర్సిటీకే రావాలి..
యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్‌ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్ సెమినార్‌ను హైదరాబాద్ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి. – రవికిషోర్, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ ● -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీఏఓ వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండలం కుచినెర్లలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తన నిల్వల రికార్డులతో పాటు స్టాక్ బోర్డులో పొందుపరిచ్చిన వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని.. నకిలీ విత్తనాలు అంటగట్టి మోసంచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నానో ఎరువుల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. ప్రస్తుత కాలంలో రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీఏఓ వెంట ఏఓ రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు. -
163 సెక్షన్ అమలు: ఎస్పీ
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగే నీట్ నేపథ్యంలో 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాలుగు కేంద్రాల్లో నీట్ కొనసాగుతుందని.. పరీక్ష ముగిసే వరకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. గుంపులు గుంపులుగా ఎవరైనా తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పల్లీ క్వింటా రూ.7,659 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 1,448 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,659, కనిష్టంగా రూ. 2,449, సరాసరి రూ. 6,399 ధరలుపలికాయి. జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,708, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2086, కనిష్టంగా రూ.1,710 చొప్పున పలికాయి. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి గద్వాలన్యూటౌన్: 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపుతో సేవా రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ వర్తింపజేయడంతో దశాబ్దాలుగా సేవ చేస్తున్న లక్షలాది ఉపాధ్యాయుల భవిష్యత్ అభద్రతలో పడిందన్నారు. 2010 కంటే ముందు చేరిన ఉపా ధ్యాయులందరికీ టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వడంతో పాటు సర్వీస్ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేసి.. రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్ నాయకులు మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శంకర్, మహేందర్, మల్లిఖార్జున్, శివప్రసాద్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మార్పు ఎందుకో..?
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్‌ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్‌స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్‌స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్‌గా, రిజిస్ట్రార్ రమేష్‌బాబు కన్వీనర్‌గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం మొదట్లో యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్‌కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి భూసేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణలో జాప్యంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన సూచించారు. ● ఓటరు జాబితాలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలు, బీఎల్ఏలకు ఈ నెల 24వ తేదీలోగా శిక్షణ పూర్తిచేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం 25 నుంచి బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలన్నారు. అక్టోబర్ 1 నాటికి తుది ఓటరు జాబితా ప్రకటించే వరకు షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. ● ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల సమగ్ర డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పది అంశాలపై నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పూర్తి వివరాలు, మంచి ఫొటోలతో కూడిన బుక్లెట్ సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశాల్లో ఎస్డీసీ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, ఏఓ భూపాల్‌రెడ్డి ఉన్నారు. -
‘ఉపాధిహామీ’కి తూట్లు పొడుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దుకు స్వస్తి పలికి పాత చట్టాన్నే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రేమద్దులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 శాతం పేదల పొట్ట నింపే ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్‌ను తగ్గించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనుందని.. దీంతో సామాన్య కూలీలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. గతంలో ఉన్న పాత చట్టాన్నే కొనసాగిస్తూ పనిదినాలు 200 రోజులకు పెంచాలని, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి ఉపాధి కూలి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, కోదండరాములు, పార్టీ గ్రామ కార్యదర్శి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్.. ఉన్నారా.. లేరా?
అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని సెక్షన్ 21 ప్రకారం 2026 అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్‌కర్నూల్ అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్‌తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్‌తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్‌లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నెల 12 నాటికి ఓట ర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సై తం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనుమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు -
క్రాప్‌హాలిడే ప్రకటించాం..
నేను ఐదేళ్లుగా కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సీడ్‌పత్తిని సాగు చేసుకుంటూ వచ్చా. గతేడాది పండించిన సీడ్‌పత్తి గింజల డబ్బులు ఇంకా చేతికందలేదు. ఈసారి సీడ్‌పత్తి గింజలను ఆర్గనైజర్ ఇవ్వకపోవడంతో సాగు నిలిపివేశా. చాలా మంది క్రాప్‌హాలిడే ప్రకటించారు. – తిమ్మప్ప, రైతు, సల్కాపురం, గట్టు మండలం పదేళ్లుగా సీడ్ పత్తి సాగుచేస్తున్నా. గతేడాది ఎకరన్నర విస్తీర్ణంలో సీడ్ పత్తి పండించా. ఈసారి పెట్టుబడితో పాటు సీడ్ పత్తి గింజలను ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక సాగును నిలిపివేశాం. సీడ్ పత్తి పంటకు బదులు టమాటా సాగు చేద్దామని పొలాన్ని సిద్ధం చేసుకున్నా. వర్షం కురిస్తే టమాటా నారు నాటుకుంటా. – నర్సింహులు, రైతు, రాయాపురం, గట్టు మండలం సీడ్ కంపెనీలు రైతులకు అందజేసే విత్తనాలను తగ్గించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాబావ పరిస్థితులు ఉండొచ్చనే ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో సాగుపై ప్రభావం పడింది. రైతులు సీడ్‌పత్తి సాగుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సీడ్ పత్తి సాగుపై ఈ నెలాఖరు వరకు ఓ అంచనాకు రావొచ్చు. – వీరప్ప, డీఏఓ ● -
విత్తన విపత్తి!
నడిగడ్డలో 70శాతం తగ్గిన సీడ్ పత్తి సాగు గట్టు: రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే సీడ్‌పత్తి సాగు ఈసారి సంకట స్థితిని ఎదుర్కొంటోంది. రెండు, మూడేళ్లుగా పండించిన పత్తి విత్తనాలు కంపెనీల వద్ద పేరుకుపోవడానికి తోడు ఆర్గనైజర్ల కొర్రీల కారణంగా నడిగడ్డ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలోనే పేరెన్నిక గల పత్తి విత్తనాలను అందిస్తూ వస్తున్న ఇక్కడి రైతులు చాలామంది పత్తి విత్తనోత్పత్తికి దూరమయ్యారు. గతేడాది సీడ్ పత్తిని 22,783 ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి కేవలం 30శాతం మేర మాత్రమే సాగైందని అధికారు ల అంచనా. కమర్షియల్ పత్తి మాత్రం 1,05,101 ఎకరా ల్లో సాగు అవుతోంది. నడిగడ్డ నేలలు అనుకూలం.. జిల్లాలోని ఎత్తు పల్లాలు కలిగిన మెట్ట భూములు సీడ్ పత్తి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జూన్ ప్రారంభంలో సీడ్ పత్తిని సాగు మొదలుపెడతారు. జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పోడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే వారు. జిల్లాలో సీడ్ పత్తి సాగు విస్తీర్ణం పడిపోవడంతో కూలీలకు పనుల కొరత నెలకొంది. ఆరు మాసాల్లో చేతికొచ్చే ఎకరా పంట సాగుకు రైతులు రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. విత్తనాల నాణ్యత మేరకు రైతులకు రూ. 2.5లక్షల నుంచి రూ. 4లక్షల వరకు ధర వస్తుంది. ముందస్తు హెచ్చరికలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచి సీడ్‌పత్తి రైతులను ఆర్గనైజర్లు హెచ్చరిస్తూ వచ్చారు. ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటు పెట్టుబడి కోసం కొంత డబ్బులను అందజేసిన ఆర్గనైజర్లు.. 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం 150 నుంచి 200 పాకెట్లు మాత్రమే కొంటామని.. అంతకన్నా ఎక్కువ తాము కొనలేమని తేల్చిచెప్పారు. సీడ్ పత్తి పంట ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని ఆర్గనేజర్లు రైతులను హెచ్చరిస్తూ వచ్చారు. పెట్టుబడులను సైతం ఇవ్వడం నిలిపివేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కంపెనీల వద్ద పేరుకుపోయిన నిల్వలు బకాయిపడిన రైతులకే విత్తనాల సరఫరా ఈసారి గణనీయంగా పడిపోయిన సాగు విస్తీర్ణం ధర సైతం తగ్గింపు.. పత్తి విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో గతేడాది జరిగి న ముందస్తు ఒప్పందం మేరకు కేజీ విత్తనాల పాకెట్ ధర రూ.600 ఇవ్వగా.. ఈసారి రూ.500కే కొంటామని చెబుతున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా ధరలను పెంచాల్సిందిపోయి.. తగ్గిస్తుండడంతో కొందరు రైతులు సాగుకు ముందుకు రావడంలే దు. మరోవైపు విత్తన కంపెనీలు సీడ్ సాగు పెట్టుబడుల కోసం ఆర్గనైజర్లకు ఇచ్చే డబ్బులను చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఆర్గనైజర్ల వద్ద గతేడాది బకాయిపడిన రైతులకు మాత్రమే కంపెనీల ద్వారా విత్తనాలను అందజేస్తున్నట్లు తె లుస్తోంది. ఈ ఏడాది పండించిన పంటకు సంబంధించిన డబ్బులను రెండేళ్ల తర్వాత తీసుకునేలా అంగీకరిస్తేనే విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఆర్గనైజర్ల కొర్రీలతో రైతులు ఈసారి సీడ్‌పత్తి సాగును 70శాతం మేర తగ్గించేశారు. సీడ్ పత్తి స్థానంలో కమర్షియల్ పత్తితో పాటు ఇతర పంటలపై రైతులు దృష్టిసారించారు. -
కేసుల నమోదులో అలసత్వం వహించొద్దు
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వ చ్చే బాధితులపై సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటూనే.. నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎ స్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తులో పురోగతిని తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి, బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని అన్ని కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్‌ను ము మ్మరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీ లు, సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు, దాడులు, మిస్సింగ్ కేసుల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి.. నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేసి, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. వారి వెంట సీఐ శ్రీను, ఎస్ఐలు కళ్యాణ్‌కుమార్, జహంగీర్, కుమార్ ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,239 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 1022 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,239, కనిష్టంగా రూ. 3,066,సరాసరి రూ. 6,199 ధరలు పలికాయి. ఆర్టీసీ డీఎంగా బాధ్యతల స్వీకరణ గద్వాల క్రైం: జిల్లాకేంద్రమైన గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శ్రీధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని.. బస్టాండ్‌లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. అనంతరం పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు డీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మహాసభలకు తరలిరండి గద్వాల క్రైం: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు కర్షక, కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.వెంటకస్వామి కోరారు. గురువారం గద్వాల మండలం గోనుపాడులో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపాందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కర్షక, కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీవీ నర్సింహ, ఉప్పేరు నర్సింహ పాల్గొన్నారు. జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు 1,473 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన లిఫ్టు –1 గూడ్డెందొడ్డి పంప్‌హౌజ్ మోటార్ల ద్వారా రిజర్వాయర్లకు నీటి పంపింగ్ చేస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిప్టు–1కు 1,192 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,735 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.682 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే విక్రయించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాలన్యూటౌన్: రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో గురువారం ఆయన ఆకిస్మక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తన పాకెట్లు, రశీదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798, జై శ్రీరామ్, హెచ్ఎంటీ (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈఏడాది బోనస్ చెల్లిస్తుందన్నారు. వ్యవసాయశాఖ సూచించిన వంగడాలను మాత్రమే రైతులు సాగుచేయాల్సి ఉందన్నారు. విత్తన డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అదే విధంగా నానో యూరియా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి పెస్టిసైడ్, సీడ్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేసి, అందులో సమగ్రంగా వివరాలు పొందుపర్చాలని సూచించారు. కాగా, రైతులకు ఇచ్చే రశీదులను డీలర్లు ఇష్టానుసారం సొంతంగా ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సంబందిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కాగా, స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్.. అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ప్రకటనల బోర్డులను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్‌కు సూచించారు. ఆయన వెంట డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్‌కుమార్, టెక్నికల్ ఏఓలు చంద్రశేఖర్, భవాని ఉన్నారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గద్వాల మండలం గోనుపాడు వద్ద ఉన్న పాల్టెక్నిక్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన ల్యాబ్‌లను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలని.. సెమినార్లు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈఏడాది నూతనంగా సైబర్ ఫిజికల్ సిస్టం సెక్యూరిటీ కోర్సు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఇప్పటికే వివిద కోర్సుల్లో చేరిన విద్యార్థులు కొత్త కోర్సులోకి మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. వడ్డేపల్లి ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం సమీపంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. సిబ్బంది హాజరు, కొత్త విద్యార్థినుల అడ్మిషన్లపై ఆరా తీశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు రోజులైనా విద్యార్థినులు పూర్తిస్థాయిలో రాకపోవడమేమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి జ్యోతి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్, ఎస్ఓ గోపిలత పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గట్టు/ధరూరు: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం ముసంపల్లి రిజర్వు ఫారెస్టులో డీఆర్డీఓ ముషాహిదా బేగం, ఫారెస్టు రేంజర్ ఫర్వేజ్ అహ్మద్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో వనమహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ డవులు పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురిసి అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధి గా మొక్కలు నాటి పెంచాలని కోరారు. అదే విధంగా ధరూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల పరిసరాలతో పాటు మధ్యాహ్న భోజనం, వంట గది, మరుగుదొడ్లు, వసతి సౌకర్యం, తరగతి గదు లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్ఓ గోమతి, డీఆర్వో జాకిరుద్దీన్, సుమలత, ఎఫ్ఎస్ఓ ప్రసూన మన్యమయ్య, ఎఫ్బీఓ శ్వేత, ఎంపీడీఓ చెన్నయ్య, సర్పంచ్ సాకే డేవిడ్, ఉపసర్పంచ్ బాసు గోపాల్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఐపీ పెట్టిన ఘనులు..
జిల్లాలో ముగ్గురు వ్యాపారులు నల్లన్న, కురుమన్న, శ్రీనివాస్‌రెడ్డి వడ్డీ వ్యాపారం పేరుతో సామాన్య ప్రజలు, రైతులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెట్టుబడులు తీసుకున్నారు. వారి మాటలు నమ్మి సుమారు 377 మంది సభ్యులు డబ్బులను పొదుపు చేసుకున్నారు. ఇలా మొత్తం రూ. 50కోట్లు వసూలుచేసి.. పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి డబ్బులు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. చెల్లించిన వారి నుంచి ఒత్తిడి, దాడులు, బెదిరింపులు ఇతరత్రా వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఐపీ పెట్టారు. క్రిమినల్ కేసులు నమోదు.. జిల్లాలోని పలువురు వ్యక్తులు వడ్డీ వ్యాపారం, చిట్‌ఫండ్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసి, మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి వ్యాపారంచేసే వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టొద్దు. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే చివరకు మోసపోవడానికి దారి తీస్తుంది. అనుమతి లేకుండా ఎక్కడైనా వడ్డీ వ్యాపారం, చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలి. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
ఉండవెల్లి: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం వంద పడకల ఆస్పత్రిలో డీసీహెచ్ఓ రమేశ్చంద్ర అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో పాటు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలని ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించగా.. ఆరోగ్యశ్రీ పథకం నిధుల నుంచి రూ. 38లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో ఎన్టీ మెషన్, ఎండోస్కోపీ, మైక్రోస్కోప్ బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, ఆస్పత్రి ప్రహారి నిర్మాణం, ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీటి సౌకర్యం, ఇన్వర్టర్లు తదితర వాటిని ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని.. ఇక్కడే మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. వంద పకడల ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి శుభ్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆస్పత్రి గదులను పరిశీలించడంతో పాటు ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ జయరాములు, ఆస్పత్రి డీఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ తిరుపతన్న, సర్పంచ్ సునీత, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి ఉన్నారు. -
ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు
ఎర్రవల్లి: ఉచిత హామీల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ విమర్శించారు. బుధవారం ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన ఆ పార్టీ ఉమ్మడి ఇటిక్యాల మండలస్థాయి సమావేశానికి ఆయన హాజరై మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. దేశంలో విద్యారంగ అభివృద్ధికి కృషిచేసిన మహాత్మా పూలే దంపతుల త్యాగాన్ని, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డా.బీఆర్ అంబేడ్కర్ భావాజాలాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఓటు చైతన్యంతో ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకొచ్చి, పార్టీని బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాంబాబు, నగే శ్, శాంతిరాజు, జీవన్, బొజ్జన్న, సురేశ్, రామకృష్ణ, హుస్సేన్, యువరాజు ఉన్నారు. -
రైతన్న సంక్షేమానికి పెద్దపీట
గట్టు: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండలం చాగదోన గ్రామంలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఉపాధిహామీ పథకం నిధులు రూ. 30లక్షలతో వ్యవసాయ గోదాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చన్నారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఐదుగురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు వీరేశ్, దేవేందర్, ఉపసర్పంచ్ రంగన్న, కార్యదర్శి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శంకరన్న, శివప్ప, హరిశ్చంద్రగౌడ్, నర్సింహులు, వడ్డే హుస్సేని, మునిస్వామి పాల్గొన్నారు. -
జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ● సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్ మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది. ఆర్ఎన్ఆర్ @ రూ.2,756 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,756, కనిష్టంగా రూ.1,706 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,056, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి. నేడు లక్కీ డ్రా కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు గాను గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఉదయం 10 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని ఆయన సూచించారు. -
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. మానవపాడు శ్రీగంగు వెంకటకృష్ణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం 15 నుంచి 25శాతం అడ్మిషన్లు పెరిగేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల హాజరు 80, 95శాతం ఉండేలా చూడాలన్నారు. తరగతి గదిలో ఫోన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. మెరిట్ విద్యార్థులకు ఎన్ఈఈటీ, ఐఐటీ, సీఎల్ఏటీ, సీఏ ఫౌండేషన్ వంటి జాతీయస్థాయి పోటి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని.. పరీక్షల్లో ప్రతిభకనబరిచిన వారిని మరింత ప్రోత్సహించాలన్నారు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే కేర్ టేకర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని.. గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు వెంటనే చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు ఉన్నారు. -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్‌లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్‌లోనే.. ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్‌నగర్‌కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్‌గా మారింది. దీంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్‌నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్‌కర్నూల్ -
మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా
అలంపూర్ రూరల్: మద్యం అమ్మకాలు చేపట్టడానికి వేలం పాటలు నిర్వహించే ప్రస్తుత పరిస్థితుల్లో.. మండలంలోని గొందిమల్ల గ్రామస్తులు మాత్రం మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం చేశారు. గొందిమల్లలో మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం తీర్మానం చేసినట్లు పంచాయతీ కార్యదర్శి జరీనా తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ.. బెల్ట్‌షాపులు లేకుండా పంచాయతీ పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
పట్టించుకోవడం లేదు..
ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్ ● -
ఆ మాట వింటే.. ‘ఫీజులు’ ఎగరాల్సిందే!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్‌ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. ఐఐటీ, నీట్‌కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్‌కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు.. స్కూల్‌స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,షూ పేరుతో నిలువుదోపిడి పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు -
డైవర్షన్లోనే రాజోళి బండ
గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్‌వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్‌ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్‌వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్‌లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్‌వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని చైర్మన్‌కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్‌వర్క్స్ నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా అయిజ, రాజోళి, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్‌వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఫలితంగా మన రైతులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకో చేయడంతోపాటు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఏకంగా మారణాయుధాలతో పెద్దఎత్తున ఘర్షణకు సైతం దిగారు. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. ఇదంతా ఉమ్మడి ఏపీలో జరిగిన ఘట్టం. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేలలోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ఏళ్లతరబడిగా తేలని నడిగడ్డ రైతుల నీటివాటా తాజాగా హెడ్‌వర్క్స్‌ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి -
గ్రామాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలి
హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం వనపర్తి: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం అన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా, మానవీయ దక్పథంతో వ్యవహరించడంతో పోలీసు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయనతో పాటు జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తనిఖీ చేసి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ సునీతారెడ్డి వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ చేపడుతున్న చర్యలపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
గద్వాల: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గద్వాల రూరల్, అర్బన్ బీఎల్ఓలు బీఎల్ఏలు, సూపర్వైజర్లకు ఓటరు జబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికృష్ణ, బీఎల్ఓలు, బీఎల్ఏలు సూపర్వైజర్లు పాల్గొన్నారు. నెట్టెంపాడుకు నీటి పంపింగ్ ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం వరకు 3,052 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దివ్యాంగులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు కొల్లాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో రిజర్వేషన్ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు హరీష్‌కుమార్, రాజేందర్, ఆశన్న, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
రాజోళి: ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం ఆయన రాజోళితోపాటు తుమ్మిళ్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా రాజోళి పీహెచ్‌సీని తనిఖీ చేసి.. మందులు, రిజిష్ట్రర్ను పరిశీలించారు. రోగుల సంఖ్య తక్కువగా ఉందని, వైద్య సిబ్బంది ఇంతకు సేవలు అందిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. రిజిష్ట్రర్ నమోదుపై అసహనం వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది రంజిత్‌కుమార్, కిష్టమ్మకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలకు అందించకపోతే ఎలా అని నిలదీశారు. నెలరోజుల్లోగా పనితీరు మార్చుకుని, మెరుగైన సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా విద్యార్థులు రాకపోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించాలని సూచించారు. పాఠశాల భవనంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలోగా డ్రెయినేజీ, ఇతర వసతుల పనులు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్పై అధికారులతో మాట్లాడి, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, బీఎల్ఓలకు ప్రత్యేకంగా సూచనలు అందించాలని తెలిపారు. మండలంలోని తుమ్మిళ్లలో టీజీఎండీసీ ద్వారా నడుస్తున్న ఇసుక తోడివేతను పరిశీలించారు. నిబంధనల మేరకు ఇసుక రవాణా చేయాలని, అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ దగ్గర సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షణ చేయాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం చంద్రమౌళి, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ సయ్యద్ ఖాన్, ఎస్ఐ గోకారి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ముందంజ గద్వాల: జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడంతోపాటు వందశాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచామని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. తనతోపాటు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికార యంత్రాంగం ఆయా కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా 76 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. రూ.121.18 కోట్ల విలువైన 50,725 మె.ట., ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. -
భూ సేకరణలో చలనం
ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. నెట్టెంపాడులో ఇలా.. నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గట్టు ఎత్తిపోతలు.. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడ మ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.పాలమూరు– రంగారెడ్డిఎత్తిపోతలు.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతోపాటు, ఇక్కడ కూడా భూ సేకరణ సంబంధించిన పనులు అడ్డంకిగా మారింది. కేఎల్ఐ.. సాగుతోంది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా రెండు దశాబ్దాలుగా పనులు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. ఫలితంగా ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. భీమా.. అదే దారి దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ఆర్‌అండ్‌ఆర్‌లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు -
ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలాముని నల్లారెడ్డిస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయాల ఆవరణలో భక్తులకు అన్నదానం చేయడంతోపాటు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు సీతరామిరెడ్డి, చంద్రశేఖర్‌రావు, వీరారెడ్డి, రాముడు తదితరులు పాల్గొన్నారు. సుంకేసులకు 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సోమవారం ఎగువ నుంచి వచ్చిన నీటితో డ్యాం అధికారులు, సామర్థ్యం మేర నీరు ఉంచుకుని మిగతా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును మీటరు మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం లింగాల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. సోమవారం లింగాల సమీపంలో కొల్లాపూర్ వెళ్లే మార్గంలో నూతనంగా ప్రారంభించిన సోలార్ ప్లాంట్‌ను ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. మారుమూల ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంత వినియోగదారులకు ఇక విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఈ ప్లాంట్‌ను మండలంలోని మగ్తూంపూర్, అంబట్పల్లి సబ్స్టేషన్లకు అనుసంధానం చేయడం జరిగిందని డైరెక్టర్ తెలిపారు. సాంకేతిక లోపాలు ఏర్పడితే తప్పా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణ తదితర వివరాలను ఆయన తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్ నర్సింహారెడ్డి, డీఈ ఆపరేషన్ శ్రీధర్‌శెట్టి, డీఈ రవి, ఎస్ఏఓ పార్థసారథి, ఆంజనేయులు, ఏఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం
● కొడంగల్ ప్రజలకై నా వందశాతం హామీలు అమలు చేయాలి ● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గి రూరల్: పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.5,000 కోట్ల నిధులను కేటాయిస్తే కొడంగల్ నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు సాధించవచ్చని, అలా చేయుకండా కమీషన్ల కోసమే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కోస్గిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, దళితబంధు రూ.12 లక్షలు, రైతు భరోసా రూ.15 వేలు, వందశాతం రుణమాఫీలను కనీసం ఓటేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకై న వందశాతం పూర్తి చేసి చూపించాలన్నారు. జూరాల ప్రాజెక్టులో నీరు లేదనే క్రాప్ హలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే జూరాల నుంచి కొడంగల్ ప్రజలకు సాగునీరు అందిస్తానని చెప్పి ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2034 వరకు సీఎం నేనే అంటూ ప్రగల్బాలు పలకడం మానుకోవాలని, రాబోయే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగల్ డిపాజిట్ రాదని, సీఎంగా రేవంత్ దిగిపోవడం ఖాయమన్నారు. కోస్గి మున్సిపాలిటీలో అండర్ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పనులలో జాప్యం చేస్తున్నారని అన్నారు. నాయకులు వెంకట్‌నర్సిములు, జనార్దన్‌రెడ్డి, నీలప్ప, సాయిలు, నరేందర్‌రెడ్డి, వెంకట్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
ఎర్రవల్లి: విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని తిమ్మాపురం, పదో బెటాలియన్, ఎర్రవల్లి, కొండేరు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్య, పరిపాలన, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాలలు, ఆహార నిల్వలు, వంట సామగ్రి, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందజేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి విద్యా కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సౌకర్యాలను సకాలంలో విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు పూర్తిస్థాయిలో పంపిణీ చేసి, ప్రతి విద్యార్థి విద్యాభ్యాసానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాల మెరుగుదలపై నిరంతరం దృష్టిసారించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ అమీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బడిబాట
అలంపూర్: వేసవి ఆటలకు సెలవు పలికిన చిన్నారులు.. పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టారు. జిల్లాలో నూతన 2026– 27 విద్యా సంవత్సరం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థులు వేసవి ముచ్చట్లతో కాలక్షేపం చేశారు. చాలారోజుల తర్వాత విద్యార్థుల ఆటవిడుపులతో పాఠశాలల ప్రాంగణాలు పులకించిపోయాయి. ఒకవైపు విద్యార్థుల సందడి.. మరోవైపు ఉపాధ్యాయులు, అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో మొదట చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్వహించారు. అలంపూర్ ఎంఈఓ అశోక్‌కుమార్ పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచిత పుస్తకాలే అందజేశారు. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో తొలిరోజు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 469, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు 178 కలిపి మొత్తం 647 విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 42,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మొదటిరోజు పాఠశాలలకు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు జిల్లాలో తొలిరోజు 12 వేల మంది విద్యార్థుల హాజరు చిన్నారులకు పాఠ్య, నోట్ పుస్తకాల అందజేత -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని ఆయా శాఖల అధికారులకు పంపినట్లు వివరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ను పంపాలని సూచించారు. అదేవిధంగా మండల స్థాయిలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులూ.. స్పందించండి!
● 60 రోజులుగా కేంద్రంలోనే వరి ధాన్యం ● మొలకెత్తినా పట్టించుకోని అధికారులు పాన్‌గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రానికి తెల్లరాళ్లపల్లితండాకు చెందిన గిరిజన రైతులు లక్ష్మి, గోరి, పట్టెమ్మ, తొలియానాయక్, నర్సింహానాయక్ వరి ధాన్యం తీసుకొచ్చి 60 రోజులు కావస్తుంది. నేటికీ ధాన్యం తూకం చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసి మొలకెత్తింది. సోమవారం కేంద్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం కాంటా చేయడం లేదనే విషయాన్ని మండలస్థాయి అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. కేంద్రంలోనే రోజుల తరబడి పడిగాపులు పడుతూ ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం తూకం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. హమాలీల కొరతతో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని, వారి సంఖ్య పెంచి తూకం చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశా రు. ప్రతి గ్రామంలో బూత్‌ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలు చుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
టెట్ వాయిదా వేయాలి
అయిజ: రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించే టెట్‌ను వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని టెట్‌ను వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు భగత్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, భీమన్న ఉన్నారు. -
మురిపిస్తున్న తొలకరి
అలంపూర్: తొలకరి వర్షం అన్నదాతలను మురిపిస్తోంది. ఇప్పటికే పంటల సాగులో నిమగ్నమైన రైతాంగానికి ఊరట కలిగిస్తోంది. వేసవి ఎండతో నెర్రెలుబారిన పంట పొలాలు వర్షపు నీటిలో ఓళలాడుతున్నాయి. బక్కచిక్కిని వాగులు వరద ప్రవాహంతో పారుతున్నాయి. వర్షానికి తోడు భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకుపడినా.. గాలి వీచినా విద్యుత్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా.. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సైతం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో అత్యధికంగా 82.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వడ్డేపల్లి మండలంలో అత్యల్పంగా 6.8 మి.మీ. వర్షం కురిసింది. అయిజలో 44.5 మి.మీ., మానవపాడులో 18.5 మి.మీ., ఇటిక్యాలలో 11.8 మి.మీ., రాజోళిలో 25.5 మి.మీ., ఉండవెల్లిలో 15.2 మి.మీ., అలంపూర్ మండలంలో 9.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరులో 43.9 మి.మీ., గద్వాలలో 11.3 మి.మీ., మల్దకల్లో 9.6 మి.మీ., గట్టులో 39 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి అక్కడక్కడ వాగులు, వంకలు పారుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అత్యధికంగా కేటీదొడ్డిలో 82.8 మి.మీ. అత్యల్పంగా వడ్డేపల్లిలో 6.8 మి.మీ. తడిసిన పంట పొలాలు.. సాగు పనుల్లో రైతన్నలు -
సమస్యల బడి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడని వసతులు ● నేటి నుంచి బడుల పునఃప్రారంభం ● తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కరువు ● జిల్లాలో 460 పాఠశాలలు.. 71,780 మంది విద్యార్థులు శిథిలావస్థలోతరగతి గదులు.. అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడిన ఘటనలు లేకపోలేదు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఉన్న చోట సైతం కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. తాగునీటి వసతి సైతం అంతంత మాత్రంగానే ఉంది. ప్రహరీలు లేని పాఠశాలలు, తరగతి గదుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరముంది. పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులను ప్రత్యేకంగా ఆకర్షించేలా గోడలపై విద్యా సంబంధిత చిత్రాలు, సూక్తులు, రంగురంగుల పెయింటింగ్ వేయించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీకి సైతం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలంపూర్/కేటీదొడ్డి/ఇటిక్యాల: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఉన్నత విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దాదాపు నెలన్నర రోజులపాటు కొనసాగిన వేసవి సెలవులకు స్వస్తి పలికి.. ఆట–పాటల మధుర స్మృతులతో పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటిలాగే అరకొర వసతుల మధ్యే తమ విద్యాభ్యాసం కొనసాగించనున్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో దృష్టిసారించకపోవడంతో చదవుకునేందుకు వచ్చే కొత్త, పాత విద్యార్థులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ.. సమస్యలు మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. అసంపూర్తిగా పనులు.. గతేడాది మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి 142 బడులను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన అనేక పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు మౌలిక వసతులకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. -
శ్రీశైలం దారిలో..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ● రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ● తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి ● కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు ● మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి
ఎర్రవల్లి: ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం మండలంలోని పుటాన్‌దొడ్డిలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గ్రామ పంచాయతీల సమగ్ర ప్రగతి ద్వారానే రాష్ట్రం, దేశాబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూత నంగా అందుబాటులోకి వచ్చిన పంచాయతీ భవనాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో మౌలిక సదు పాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ హనుమంతురెడ్డి, సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పరమేశ్వర్రె డ్డి, మహేశ్వర్‌రెడ్డి, పరందామిరెడ్డి, రాముడు, మద్దిలేటి, బీసన్న పాల్గొన్నారు. పాలమూరు రెడ్‌క్రాస్‌కు మొదటి బహుమతి పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్ ఇండియన్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్‌రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. -
భారీ వర్షం.. రైతన్న హర్షం
● వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు ధరూరు/ అయిజ/ రాజోళి/ ఉండవెల్లి/ అలంపూర్ రూరల్/ మానవపాడు: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ధరూరు మండలంలో శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటల సాగుకు అనువుగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు పత్తి, ఇతర విత్తనాలు నాటుకునేందుకు ఈ వర్షం అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. అలాగే మానవపాడు మండలంలో శనివారం 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే అలంపూర్ మండల పరిధిలో 41.2 మి.మీ., వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ప్రభకర్ వెల్లడించారు. ఉండవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. దీంతో శనివారం రైతులు పంట పొలాల్లో పత్తి విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధిలో జాతీయ రహదారిపై అడ్డుగా పడిన చెట్లను ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు తొలగించారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లోనూ శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం చినుకులతో మొదలైన వర్షం అక్కడక్కడా మోస్తరుగా కురవడంతో రైతులు సంబరపడ్డారు. అయిజ మండలంలో అత్యల్పంగా 2.4 మి.మీ., వర్షపాతం నమోదయ్యింది. -
ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గద్వాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, చైర్మన్ జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను బహూకరించారు. వారి వెంట అర్చకులు ధీరేంద్రదాసు, మధుసూదనాచారి, శశాంక్, చంద్రశేఖర్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు. జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్‌లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
రైతు మురిసేలా.. సాగు మారాల
గద్వాల వ్యవసాయం: సంప్రదాయ పంటలకు స్వస్తిచెబుతూ.. సాగులో వినూత్న ఒరవడిని సృష్టిస్తేనే రైతులకు మేలు జరిగి లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ క్ర మంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంట మార్పిడిలు చేయాలని, నానో యూరియా వినియోగించాలని, సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవ సాయ శాఖ గడిచిన నెల రోజుల నుంచి విస్తృతంగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. ఈసారి రైతులు సాగులో కొంతైనా మార్పులు వస్తాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. అయితే ప్రస్తుత వానాకాలం సీజన్లో 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరి ఈసారి జిల్లాలో పంటల మార్పు ఏ మేరకు జరుగుతుందో వేచిచూడాలి. పలు అంశాలపై అవగాహన.. రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం క్షీణిస్తోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు పలుమార్లు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు మే నెలలో రైతులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో అమలు చేయించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సేద్యం చేయించి పంటలు పండించనున్నారు. ఇందుకోసం ఐదు నెలల క్రితమే జిల్లాలోని ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు క్లస్టర్ల నుంచి, ఒక్కో క్లస్టర్‌కు 125 ఎకరాల చొప్పున మొత్తం 20 వ్యవసాయ క్లస్టర్ల నుంచి 2500 ఎకరాల భూములు, రైతులను ఎంపిక చేశారు. అయితే ప్రకృతి వ్యవసాయ విధాన పద్దతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను కృషి సఖిలుగా నియామకం చేశారు. వీరికి సెంటర్ ఫర్ సస్స్టెనబుల్ అగ్రికల్చర్ అనే ఎన్జీఓ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతోపాటు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ అందించారు. కృషి సఖిలు ఎంపిక చేసిన పొలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వారితో వ్యవసాయం చేయించనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయడం వల్ల దిగుబడులు రావని, పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే యూరియా ఇబ్బందులను అధిగమించేందుకు నానో యూరియా వినియోగించాలని సూచించారు. దీనివల్ల పంట ఎదుగుదల మెరుగుపడటమే కాకుండా.. దిగుబడి సైతం పెరుగుతుందని వివరిస్తున్నారు. పంట ప్రణాళిక ఖరారు.. వానాకాలం సీజన్‌కు సంబంధించి పంట ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లాలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,35,252 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. ప్రస్తుతానికి జిల్లాలో మోస్తరుగా రెండుసార్లు మాత్రమే వర్షాలు వచ్చాయి. దీంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాలోని బోర్లు, బావులు ఉన్న రైతులు అక్కడక్కడ సాగు పనులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 27,074 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వ్యవసాయంలో మార్పులుతీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు పంటల మార్పిడి, నానో యూరియాపై అన్నదాతలకు అవగాహన సేంద్రియ పద్ధతులపై అధికారుల విస్తృత ప్రచారం ఈసారి 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి చర్యలు జిల్లాలో ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటల సాగు అంచనా సలహాలు, సూచనలు పాటించాలి ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సేంద్రియ ఎరువులు, నానో యూరియా ఇలా పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించాం. వాటిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. – వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో సాగైన పంటలు ఇలా.. పంట అంచనా ఇప్పటి వరకు సాగైనవి పత్తి 2,09,144 26,584 వరి 1,21,941 – కంది 23,739 450 మొక్కజొన్న 22,982 – వేరుశనగ 6,396 – ఇతర పంటలు 8,680 – ఉద్యానపంటలు 42,370 40 -
ఎన్నటికో..?!
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్‌లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో పార్కుకు సమీపంలోనే అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.50 కోట్ల నిధులను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించారు. ఈ పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టారు. రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్‌కు వెళ్లే రోడ్డు కోతలకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్‌కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వరకు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్‌ఫిల్మ్ షూటింగ్‌లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలుతిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
జాతీయ రహదారికి కనెక్టివిటీ కల్పించాలి
గట్టు: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు, రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 116వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నిర్మించే జాతీయ రహదారి విషయంలో అధికారులు అవసరమున్న చోట కాకుండా అవసరం లేని చోట వంతెన నిర్మాణం చేపట్డడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. డబుల్ రోడ్డు ఉన్న చోటే వంతెన నిర్మాణం చేపట్టాలని, కొత్త రోడ్డుపైకి గట్టు మండల ప్రాంత ప్రజలు చేరుకునేలా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రిలే దీక్షలను కొనసాగిస్తున్న వారు మహాబూబ్‌నగర్‌లోని జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారి భన్సల్కుమార్ను కలిసి విన్నవించారు. అధికారుల బృందం పరిశీలన.. గట్టు మండలంలో ఆందోళన కొనసాగుతున్న ప్రాంతాన్ని జాతీయ రహదారి నిర్మాణ సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ మహబూబ్‌నగర్ అధికారి భన్సల్కుమార్, టెక్నికల్ మేనేజర్ తోటబాబు, మెగా ప్రాజెక్టు మేనేజర్ వినోద్‌కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అసదుల్లా పరిశీలించారు. రాయాపురం స్టేజీతోపాటు పాత ఆలూరు దారిలో నిర్మించిన వంతెనను అధికారులు పరిశీలించి వెళ్లారు. వంతెన ప్రతిపాదన విషయంలో ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు చెప్పారు. -
సరళాసాగర్‌లో ఇలా..
సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్‌పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్‌లైన్‌ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్‌లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘సర్’ పై అప్రమత్తంగాఉండండి
కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్‌పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే బస్సు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన -
సలహాలతో సాగు.. లాభాలు బాగు
● ప్రశ్న: ఎనిమిదేళ్ల నుంచి పత్తి పంట వేస్తున్నాం. దిగుబడులు ఎందుకు ఎక్కువగా రావడం లేదు.? – శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ (గద్వాల), రాజు, తిమ్మన్న (ధరూర్) ● డీఏఓ : ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయరాదు. దీని వల్ల దిగుబడులు ఎక్కువగా రావు. పంట మార్పిడి చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. ● ప్రశ్న: విత్తనాలు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? – రాజేష్, వెంకట్‌రెడ్డి (గద్వాల), రాముడు, గోవిందు (అయిజ), గోపాల్, భీమేష్నాయుడు, ఆంజనేయులు (మానవపాడు) ● డీఏఓ : లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్ర మే విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ ఉన్న పాకెట్‌ను తీసుకోవాలి. ఎక్స్పైరీ తేదీ గమనించాలి. రశీదు తప్పక తీసుకొని, పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచుకోవాలి. గద్వాల వ్యవసాయం: ‘జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా సాధారణ వర్షపాతమే నమోదు కాలేదు. తొందరపడి విత్తనాలు వేయొద్దు. జూలై 15 వరకు వేయడానికి అవకాశం ఉంటుంద’ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల ఎంపిక, వాడకం, విత్తనశుద్ధి, దుక్కులు సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన పని, ఏయే భూముల్లో ఏ రకమైన పంటలు వేయాలి.. తదితర అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. రైతులు అధికారుల సలహాలు తీసుకొని పంటలు సాగు చేస్తే.. మంచి దిగుబడులతో లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ● ప్రశ్న: విత్తనాలు వేయక ముందు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి.? – వెంకటేష్, రంగన్న (గట్టు), రామకృష్ణ, మధుబాబు (మల్దకల్), నర్సింహులు, రాజు (కేటీదొడ్డి) ● డీఏఓ : పాత పంటను పూర్తిగా తొలగించాలి. లోతు దుక్కులు వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల పురుగుల అవశేషాలు చనిపోతాయి. పురుగుల బెడద తగ్గుతుంది. ఆ తర్వాత ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువును వేయాలి. వరి పంటకు అయితే పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర వేయాలి. ● ప్రశ్న: ఏ నేలలో.. ఏ రకమైన పంటలు వేయాలి.? – హన్మంతు, సురేష్ (గట్టు), శ్రీరాములు, నర్సింహ (గద్వాల) ● డీఏఓ : నల్లరేగడి భూముల్లో పత్తి, మిరప, నూనె గింజలు వేయాలి. కందిపంట వేసి అంతర పంటగా పెసర వేయవచ్చు. ఎర్రటి నేలల్లో సాగునీరు అందుబాటులో ఉంటే పత్తి, ఉల్లి, నూనె గింజలు, కంది సాగు చేయవచ్చు. ఇసుక నేల ల్లో పత్తి, మిరప, పప్పు దినుసులు పండించవచ్చు. ● ప్రశ్న: జిల్లాలో అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల రకాలు.? – నర్సింహారెడ్డి, పాండురెడ్డి (గద్వాల), త్రివిక్రమ్, గోపాల్‌రెడ్డి (అయిజ), దేవదాసు,ఆంజనేయులు (శాంతినగర్) ● డీఏఓ : సదానంద, మైకో, యూఎస్, ఆద్య తదితర వాటితోపాటు పలు రకాల పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ● ప్రశ్న: నాలుగేళ్ల నుంచి ఏ పంట వేసినా ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. ఎందుకు? – కృష్ణవర్ధన్‌రెడ్డి, మనోహర్ (గద్వాల), రామకృష్ణ, కోటేష్ (ఇటిక్యాల) ● డీఏఓ : మీరు నాలుగేళ్లుగా వేసిన పంటల వివరాలు, వాడిన ఎరువులు, మందుల వివరాలు ఏఈఓల దృష్టికి తీసుకెళ్లండి. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ● ప్రశ్న: పంట పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి.. తగ్గించడానికి గల మార్గాలు తెలియజేయండి..? – రాకేష్, (గద్వాల) ● డీఏఓ : పంట పెట్టుబడుల్లో ప్రధానంగా ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఖర్చు చేస్తున్నారు. వీటికి బదులుగా సేంద్రియ ఎరువులు వినియోగించాలి. అదేవిధంగా పాత పద్ధతులు కాకుండా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి. పంటలకు ఏ మందులు వేయాలన్నా విస్తరణాధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. టీజీ టీ–20 లీగ్‌లో మనోళ్లు ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్‌కు ఉమ్మడి పాలమూరుకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. –8లో uసకాలంలో వర్షాలు రాకపోతే ఆరుతడి పంటలు వేయాలి జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు లైసెన్స్డ్ డీలర్లతోనే విత్తనాలుకొనుగోలు చేయాలి యూరియాకు బదులుగా నానో యూరియా వినియోగించండి ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ప్రశ్న: ప్రస్తుత వానాకాలం సీజన్లో ఏ సమయం వరకు విత్తనాలు వేసుకోవచ్చు.? – రాధాకృష్ణ, తిమ్మోతి (ధరూర్), వాసు, కృష్ణ, అంజి (వడ్డేపల్లి), రాజనర్సింహ, గోపాల్ (ఉండవెల్లి) డీఏఓ : వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భూమి పదును కాలేదు. రైతులు తొందరపడరాదు. జూలై 15 వరకు విత్తనాలు వేయవచ్చు. జూలై 15 వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే ఏయే రకమైన పంటలు వేయాలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతారు. వారి సలహాల ప్రకారం పంటలు వేయండి. ప్రశ్న: జిల్లాలో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా.? – రాధాకృష్ణ, మాధవ్ (మల్దకల్), గోపాల్, భీంసేన్‌రెడ్డి (ఎర్రవల్లి) డీఏఓ : జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్లో 1,11,922 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 50,318 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకుంటాం. నానో యూరియాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. యూరియాకు బదులుగా నానో యూరియాను వాడండి. -
అత్యవసర పరిస్థితుల్లో స్పందించాలి : ఎస్పీ
అలంపూర్: అత్యవసర పరిస్థితుల్లో డైలీ వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి.. స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్ సెక్షన్, టెక్ టీం, ఎస్హెచ్ఓ కార్యాలయం, లాకప్, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం నిర్వహణతోపాటు జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, ఉన్నతాధికారుల సందర్శన రికార్డులు తదితర పత్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో సమావేశమై పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలు, బీట్ వ్యవస్థ, పెట్రోల్ వాహనాల విధుల గురించి తెలుసుకున్నారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజా ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలన్నారు. సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గద్వాల న్యూటౌన్: న్యాయబద్ధంగా, నోటిఫికేషన్ ప్రకారం నియామకమైన ఉపాధ్యాయులకు 1 ఏప్రిల్ 2010 పూర్వం టెట్ ప్రస్తావన లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ అర్హత ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. 1 ఏప్రిల్ 2010 ఆర్టీఈ రూల్స్‌కు అనుగుణంగా ఎన్సీటీఈ టెట్ నిబంధనను చేర్చిందన్నారు. ఈ నిబంధనల ఆధారంగానే 2028 ఆగస్టు 31లోపు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇది దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశం అన్నారు. 1 ఏప్రిల్ 2010 కన్నా ముందు వేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 523 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 523 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,611, కనిష్టంగా రూ. 3,599, సరాసరిగా రూ.6,399 ధరలు లభించాయి. అలాగే 33 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.1,659, కనిష్టంగా రూ. 1,300, సరాసరిగా ధర రూ.1,659 పలికింది. -
కనువిందు చేసే అందాలు..
కొల్లాపూర్‌లోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు ఆగస్టు నుంచి మార్చి నెల వరకు పర్యాటకులు వస్తుంటారు. సోమశిలకు వెళ్లే మార్గంలో కొల్లాపూర్ పట్టణానికి దగ్గరలోనే ఉన్న ఎకో పార్కు, నల్లమల వ్యూ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. వ్యూ పాయింట్ వద్ద నుంచి చూస్తే సోమశిల గ్రామం, సమీపంలోని కృష్ణానది, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలు, నల్లమల అభయారణ్యం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పక్షులు, జంతువుల కదలికలు కూడా పర్యాటకులను ఆహ్లాదపర్చనున్నాయి. వ్యూ పాయింట్ ఇదే.. -
నేల బతికితేనే పంట పండుతుంది
మానవపాడు: రైతుల పంటలు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఏటీఎంఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జగ్గు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షకు 3 సూత్రలు పాటించాలని సూచించారు. సమతుల్యత ఎరువుల వినియోగం నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు పెంచాలని, రసాయనికి ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వాడొద్దని, అధిక వాడకం వల్ల నేల చనిపోయి దిగుబడి నాణ్యత తగ్గిపోతుందన్నారు. నానో ఎరువులు వాడితే తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం వచ్చి.. నేల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఎరువుల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా అరికట్టేందుకు పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో ‘ఫర్టిలైజర్ నిఘా సమితులు’ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, పీఏసీఎస్ సిబ్బంది సభ్యులుగా ఉంటారని వివరించారు. దీంతో రైతులకు ఎరువులు సకాలంలో సరైన ధరకు అందుతాయన్నారు. కార్యక్రమంలో బీటీఎం శ్రీధర్‌రెడ్డి, ఏఓ ప్రదీప్‌కుమార్, ఇన్పుట్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ ● -
వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి
గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిషలు కృషిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం గడిచిన పన్నెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. పన్నెండేళ్ల సేవా ప్రస్థానంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. 58.15 కోట్ల జనధన్ ఖాతాలు, 44 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15.7 కోట్ల కుటుంబాలకు నూతనంగా నల్లానీటి కనెక్షన్లు, 1.46 లక్షల కిలోమీటర్ల రోడ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, 2.9 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, కోట్లాది మందికి ఉచిత రేషన్ బియ్యం సరఫరా, జనధన్ ఖాతాలో రూ.3 లక్షల కోట్లకుపైగా డిపాజిట్లు, 9 కోట్లకు పైగా అటల్ పెన్షన్ యోజన సభ్యులు, 58 కోట్లకు పైగా బీమా పథకాల లబ్ధిదారులు వంటి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు అందించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, నక్సల్స్ విముక్తి, కోవిడ్ సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ వంటివి ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్ధారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, దాస్, శాలన్న తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి చేరిన ధాన్యం పంచాయితీ
రైస్‌మిల్లులపై వరుస టాస్క్‌ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్‌ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్‌ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్‌కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
ప్రయాణం.. ప్రాణసంకటం
జిల్లాలో నిత్యకృత్యమైన రోడ్డు ప్రమాదాలు ● మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే అనర్థాలు ● గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి ● అవగాహన కల్పిస్తున్నా మారని కొందరు డ్రైవర్లు ● నివారణ చర్యలపై పోలీస్ శాఖ కసరత్తు గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తే చాలనుకునే స్వరం వినిపిస్తోంది. మరోవైపు అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను వాయువేగంతో నడుపుతూ ప్రమాదాల కారకులవుతున్నారు. జాతీయ, రాష్ట్ర, పట్టణ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అలంపూర్, అయిజ మండలాల్లో ఇటీవల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి చెందగా.. 70మందికి పైగా గాయాలపాలయ్యారంటే.. ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏటా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు, పోలీసు శాఖ అరైవ్– అలైవ్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువచ్చినప్పటికీ కొందరు డ్రైవర్లు, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు వైఖరితోనే.. వాహనాలు నడపడం ఎంత సరదానో.. అంతకంటే మనిషి ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని కొందరు డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని రోడ్డుపై ఎంత స్పీడ్‌గా వెళ్లాలి.. ఎటు నుంచి వాహనాలను ఓవర్‌టెక్ చేయాలి.. ఎదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఎలా బయట పడాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన పెంచుకోవడం లేదు. కొందరు యువ డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా వచ్చే వాహనాలను ప్రమాదాలకు గురిచేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 13.04.2026న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు గోవా నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలోని వీరాపురం గ్రామ శివారులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడు నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 12.05.2026న గద్వాల పట్టణానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై కర్నూలు వైపు వెళ్తుండగా.. ఇటిక్యాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. 06.6.2026న కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం ఓ గూడ్స్ వాహనంలో గద్వాలకు వస్తుండగా.. గోనుపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే 54 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖ అధికారులచే లైసెన్స్ తీసుకోవాలి. రాత్రివేళలో హెడ్ ల్యాంపు, ఇండిగేటర్లు వేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు ముందుగా సంకేతాలు ఇవ్వాలి. కానీ, కొందరు వాహనాలు ఎంత త్వరగా వెళ్తే.. అంత గొప్ప డ్రైవర్‌గా ఊహించుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. అయితే వివిధ వాహనాలు నడపాలంటే లైసెన్స్ ఉండాలి. కానీ, కొంతమంది డ్రైవింగ్ రాకున్నా రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్‌లు పొందడం కొసమెరుపు. ముందుగా ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంత వరకై నా ప్రమాదాలు నివారించవచ్చు. -
చర్యలు తీసుకుంటాం..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాలలో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. అయితే కొందరు ప్రజలను గూడ్స్ వాహనాలపై ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి. మద్యం, నిద్రలేమి, అవగాహన, సామర్థ్యం లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
మార్పు గమనించాలి
నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్‌రాజ్, మానసిక వైద్య నిపుణుడు -
జనగణనలో భాగస్వాములు కావాలి
● అదనపు కలెక్టర్ నర్సింగ్రావుగద్వాల(మల్దకల్): దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు కోరారు. బుధవారం మల్దకల్ మండలం నేతువానిపల్లిలో సర్పంచ్ పద్మమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. జనగణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల లెక్కింపు చేపట్టడం జరిగిందని.. ప్రతి కుటుంబం తమ వివరాలను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా రైతులకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. వారి విద్యాభివృద్ధికి కృషి చేయా లని కోరారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఉపసర్పంచ్ మునినాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ‘అరైవ్ అలైవ్’
● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎర్రవల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం అక్కడ ఉన్న వారితో డీఐజీ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫోర్ వీలర్ డ్రైవింగ్‌చేసే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలన్నారు. పరిమిత వేగంతోనే ప్రయాణం చేయాలని.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ● పదో పటాలం కమాండెంట్ జయరాజు మాట్లాడుతూ.. జీవితంలో కోల్పోయిన అన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చని, ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఎంతో మంది తెలిసి కూడా రాంగ్‌రూట్, మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీటిఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్ఐ రవిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత తీసుకోవాలి..
చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు -
రసాయన ఎరువుల వాడకం తగ్గించండి
అయిజ: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూ నాయక్ సూచించారు. బుధవారం అయిజ మండలం ఈడుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై.. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా పంట పొలం సహజ లక్షణం కోల్పోయి నిస్సారంగా మారుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవ్చన్నారు. రైతులు నానో డీఏపీ, యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఉపసర్పంచ్ గోవిందమ్మ, ఏఓ జనార్దన్, ఏఈఓ అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి గద్వాలన్యూటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం బీజేపీ నాయకులు స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పరిపాలించిన ప్రధానిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. 12 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, డిజిటల్ విప్లవం, జాతీయ భద్రత బలోపేతం, ఆర్థిక రంగంలో సంస్కరణల ద్వారా దేశం సరికొత్త దిశగా పయనిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎక్బోటే రవి, శ్యామ్‌రావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్, శాలన్న, నాయకులు శ్రీమన్నారాయణ, సమత, కృష్ణ, పాండు, నర్సింహ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,279 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 500 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,360, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 6,279 ధరలు లభించాయి. 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 1,875 ధర పలికింది. ముందు ప్రభుత్వంలో విలీనం చేయండి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: టీజీఎస్ఆర్టీసీని ముందుగా ప్రభుత్వంలో విలీనం చేసి, ‘అపాయింటెడ్ డే’ ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కార్మిక సంఘాల ఎన్నికలు జ రపాలని భావించడం సరైన నిర్ణయం కాదన్నా రు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విలీనం జరగాలన్నారు. గత నెలలో సమ్మెకు ముందు కార్మికుల్లో ఏ మాత్రం బలం లేని జేఏసీ నోటీసు ఇవ్వడంతో ఎలాంటి చల నం రాలేదని, దీంతో మెజారిటీ ఉన్న టీఎంయూ ఆధ్వర్యంలో 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లామన్నారు. సమ్మె ఉద్ధృతమైన క్రమంలో రెండోరోజే డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం దురదృష్టకరమన్నా రు. చివరకు టీఎంయూ కార్మికుల బలంతోనే సమ్మె విజయవంతమైందని, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఇది భరించలేని జేఏసీ నాయకులు ‘ముందే విలీనం వద్దు.. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి..’ అని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎస్ రెడ్డి, రీజియన్ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వీసీఎస్ రెడ్డి, రవి, బీవీ రెడ్డి, నారాయణ, నాయకులు శ్రీనివాసులు, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా అడ్హాక్ కమిటీ చైర్మన్‌గా సంజీవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చంద్రయ్య, అధ్యక్షుడిగా వి.ఎస్.నారాయణ, రీజినల్ కార్యదర్శిగా మధుసూదన్, అదనపు కార్యదర్శిగా బి.శ్రీనివాసులును ఎన్నుకున్నారు. -
అధిక ధరలకు హద్దులేకుండా పోయింది
గద్వాలన్యూటౌన్: బీజేపీ పాలనలో ధరల పెంపునకు హద్దులేకుండా పోయిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను నిరసిస్తూ.. బుధవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా పీజేపీ క్యాంపు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు ధరల భారాలతో నలిగిపోతున్నాడన్నారు. ధరలను విపరీతంగా పెంచుతూ.. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నోరు మెదపడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. నిరుద్యోగుల నడ్డి విరిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్‌కు కొమ్ము కాస్తున్నారన్నారు. కార్పొరేటర్ల డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. దేశంలో రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టించుకోకుండా సాకులు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమై బీజేపీని గద్దె దించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రంగన్న, ఊశన్న, నాగార్జున, రవి, ప్రతాప్, ఈశ్వర్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
మరిన్ని యూనిట్లు ఇవ్వాలి..
ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తున్న యూనిట్లను పెంచాలి. ముఖ్యంగా కోల్డ్‌రూం స్టాగింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరిన్ని నెలకొల్పాలి. రైతులకు సకాలంలో రాయితీ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నర్సింహారెడ్డి, రైతు, అయిజ రాయితీ శాతం పెంచాలి.. రైతులు పండ్ల తోటలను పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను మరింతగా పెంచాలి. రైతుల్లో ఎక్కవ శాతం పేదలు ఉన్నారు. రాయితీ శాతం పెంచితే గాని కోల్డ్ స్టోరేజ్, కోల్డ్‌రూం స్టాగింగ్లను ఏర్పాటు చేసుకోలేరు. రాయితీపై ఇస్తున్న యూనిట్ల సంఖ్యను కూడా పెంచితే మరికొందరు రైతులు పండ్ల తోటలను సాగుచేస్తారు. – దర్శెల్లి, రైతు, అయిజ ● -
నకిలీపై చర్యలేవి..?
రాజోళి: కొన్నేళ్లుగా గట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల దందాను కొన్ని నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ పత్రాలతో మోసపోయిన బాధితులు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ నకిలీగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యధోరణి కారణంగానే దొంగచాటుగా చేసే ఫేక్ సర్టిఫికెట్ల దందా.. ప్రస్తుతం యథేచ్ఛగా దుకాణాల్లోనే నిర్వహించే దాక వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. రాజోళి మండలం మాన్‌దొడ్డి కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అయిజలోని పలు ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఒకరి ఇంటిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సాక్షుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై బాధితుడు గతేడాది జూన్‌లో అధికారులకు పిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫేక్ సర్టిఫికెట్లు తయారీ చేసిన వ్యక్తి.. అది చేసింది తానేనని మాట్లాడిన ఫోన్ సంభాషణ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఇంటి రుణాలు ఇప్పిస్తే వచ్చే కమీషన్ కోసం, సాధారణ నిరక్ష్యరాసులను లక్ష్యంగా చేసుకొని రుణాల మాయలో పడేస్తున్నారు. సర్టిఫికెట్లు లేని వారి వద్ద కావాల్సినంత డబ్బు దండుకొని నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర తతంగం ముగిస్తున్నట్లు తెలిసింది. ఇతర మండలాల్లో సైతం.. మాన్‌దొడ్డిలో మొదటి నుంచి ఓ వ్యక్తి ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా.. ఆయన ద్వారా మరికొందరు లింకులు కలుపుకొని పచ్చర్ల, రాజోళి, తుమ్మిళ్ల, శాంతిగనర్, మానవపాడు తదితర గ్రామాలతో పాటు, గట్టు మండలం వరకు ఫేక్ మేకర్లు తయారయ్యారు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారనేది అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, అదే సర్టిఫికెట్లతోనే ప్రక్రియను ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా గ్రామ పంచాయతీ నుంచి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గతంలో ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కాని అదే ఓనర్షిప్ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి.. వందల రిజిస్ట్రేషన్లు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఓనర్షిప్ సర్టిఫికెట్లను తాము ఇవ్వలేదని గ్రామ పంచాయతీ అధికారులే చెబుతున్నా.. అందుకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా రాసి ఇచ్చినా కూడా కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ప్రాణం ఖరీదు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి రూ.9.50 లక్షల పరిహారం చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.–8లో uసంతకాలు ఫోర్జరీ.. గతేడాది పచ్చర్లకు చెందిన వ్యక్తి ఇంటిని ఫేక్ సర్టిఫికెట్లతో మరొకరికి అమ్మారని తెలుసుకున్న బాధితుడు.. ఆధారాలతో సహా జిల్లా అధికారులకు తెలిపారు. ఈ మేరకు మండల అధికారులు విచారణ జరపగా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయ్యింది. ఫోర్జరీలు చేసిన వ్యక్తులు కూడా ఇతరులు చేయమంటేనే చేశామని చెప్పా రు. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇలా గ్రామస్థాయి నుంచే ఫేక్ మేకర్లు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్ల దందా బాధితులు ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు ఇతర గ్రామాలకు పాకుతున్న ఫేక్ మేకర్లు యథేచ్ఛగా నకిలీ ధ్రువపత్రాల తయారీ -
జూరాలకు 2,815 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● నెట్టెంపాడుకు కొనసాగుతున్న నీటి పంపింగ్ గద్వాల (ధరూరు): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,815 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టెంపాడుకు 1,500 క్యూ సెక్కులు, ఆవిరి రూపంలో 42 క్యూసెక్కులతో కలి పి మొత్తం 1,542 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.372 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. -
నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
గద్వాల(గద్వాల క్రైం): నేరస్తుల విషయంలో పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడా రు. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించి పూర్తిస్థాయిలో విచారించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచడంతో పాటు చెక్‌పోస్టుల వద్ద ప్రతి గూడ్స్ వాహనం, కంటెయినర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని గుర్తించి కట్టడి చేయాలని ఎస్పీ ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అదే విధంగా భరోసా సెంటర్లో బాధితుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్, ఎస్ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, నాగశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
45 రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి
● ఆర్అండ్ఆర్ కమిషనర్శివకుమార్నాయుడు గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకంలో 462 ఎకరాలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 534 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో కోర్టు కేసులు, సమస్యలు లేని 220 ఎకరాలకు ఈ నెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే పెండింగ్ పనులు వేగవంతమవుతాయని ఆయన గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించి ఒప్పించాలన్నారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ రహీముద్దీన్, సర్వే ఏడీ నూకరాజు, ఏఓ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్లు ఉన్నారు. -
‘చేనేత’ ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరగగా.. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని మొత్తం 16 పర్యాయాలు పొడిగించింది. చివరిసారి 2026, మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పదవీ కాలం పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. మొదటి దశలో 10 సంఘాలకు... చేనేత సహకార సంఘాల ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 50 ఓట్ల కంటే తక్కువ ఉన్న సంఘాలకు ఈ నెల 12న నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండనుంది. నారాయణపేటలోని చేనేత సంఘం, మార్కండేయ మహిళా సంఘం, శ్రీలక్ష్మి సిల్క్స్ సంఘం, ఆదర్శ చేనేత సంఘాలతో పాటు చిన్నజట్రం, కోటకొండ, మద్దూరులోని శ్రీబాలాజీ, పోతిరెడ్డిపల్లిలోని టసర్ ఖాదీ సిల్క్ బోర్డు, గద్వాల జిల్లాలో అనంతపురం పవర్లూమ్ సంఘం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి సంఘాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంఘాలు పనిచేస్తుండగా.. మరికొన్ని అప్పుడప్పుడు పని చేస్తున్నాయని, కొన్ని సంఘాలు మూతబడ్డాయని చేనేత, జౌళిశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్‌కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కృష్ణ నాగర్‌కర్నూల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్‌ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్‌ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్‌కర్నూల్‌కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు
అయిజ: పట్టణంలో గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) అధికారులు వినయ్, యశ్వంత్ తెలిపారు. మంగళవారం జిల్లా సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహేశ్‌కుమార్‌తో కలిసి పట్టణ సమీపంలో స్థానిక పీఏసీఎస్‌కు కేటాయించిన రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న అన్నిరకాల పంటల కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పంటల నిల్వకు గోదాంల కొరత తీవ్రంగా ఉందన్నారు. అయిజ పీఏసీఎస్‌కు కేటాయించిన స్థలంలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు గోదాంలు నిర్మించవచ్చని అన్నారు. రూ. 3కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ గోదాంలు ఎఫ్‌సీఐ, గిడ్డంగుల అభివృద్ధి రెగ్యులేటరీ అథారిటీ ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆరు నెలల్లో గోదాంల నిర్మాణం పూర్తిచేసి.. సొసైటీకి అందించే విధంగా కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సీఈఓ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణే టీఆర్ఎస్ లక్ష్యం గద్వాలన్యూటౌన్: సామాజిక తెలంగాణనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్వీఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత బస్డాండ్ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి గొంగళ్ల రంజిత్కుమార్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ సమస్యలపై పోరాడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, విష్ణు, బలరాం నాయుడు, వెంకట్రాములు, కృష్ణ, గుండన్న, గోపాల్, కిష్టన్న, ఆశన్న పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్‌గా ఉన్న చేనేత సహకార సంఘా ల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల జిల్లా ● -
పంటల సాగులో తొందరపాటు వద్దు
ఎర్రవల్లి: ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులు పంటల సాగులో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోవద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని తెలిపారు. సబ్సిడీపై అందించే జిప్సం, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ పొలాల్లో పంటల అవశేషాలను కాల్చవద్దని తెలిపారు. పంటల అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వర్షాకాలం వస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, ఏఓ సురేశ్‌గౌడ్, ఆర్ఐ శ్రీను, కార్యదర్శి నాగరాజు, ఏఈఓ వేదావతి తదితరులు ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల/మానవపాడు: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో జిల్లా వెనకబడిందని.. ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయం చేసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసిన వెంటనే రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్డీసీ కృష్ణ, సర్వే ఏడీ నూకరాజు, ఇరిగేషన్ ఽఅధికారి సంజీవ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ఫిట్‌లెస్ బస్సులు.. రోడ్డెక్కితే ముప్పే!
స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలపై యాజమాన్యాల నిర్లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో 1,574 బస్సులకు గాను 885కు మాత్రమే పరీక్షలు ● కాలం చెల్లిన, సామర్థ్యంలేని వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం ● విద్యార్థుల భద్రత పట్టని అధికారులు మహబూబ్‌నగర్ క్రైం: పాఠశాలల పునఃప్రారంభ సమయం ఆసన్నమవుతోంది. పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్‌బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కాలం చెల్లినవి, సామర్థ్యంలేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఈ నెల 15న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నిబంధనలకు విరుద్ధంగా.. చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నాయి. ముఖ్యంగా అటెండెంట్ లేకుండానే డ్రైవర్లతో బస్సులను తిప్పడం.. ఒక రూట్లో వెళ్లే బస్సును మరో రూట్లో నడపడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ధ్రువపత్రాల జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 1,574 విద్యాసంస్థల బస్సులు ఉండగా జూన్ 8వ తేదీ వరకు 885 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షకు వచ్చాయి. మరో 689 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేయించలేదు. ఈ బస్సులకు ఫిట్నెస్ లేకుండా రోడ్లు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 469 స్కూల్ బస్సులు ఉండగా.. 50 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సులన్నింటికీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా ఆర్టీఓ వద్ద ఫిట్నెస్ పరీక్షలు జరిపి.. అనుమతి పత్రాలు పొందాల్సి ఉంది. అదే విధంగా బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణాశాాఖకు హామీపత్రం సమర్పించాలి. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. మరమ్మతు, ఇతర కారణాలతో పూర్తిస్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదని తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు స్కూల్ బస్సులకు గడవులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్, బస్సు బ్రేక్, కండీషన్ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్ పంపిస్తున్నాం. కనీసం లైట్ లేకపోయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్‌నగర్ నిబంధనలు ఏం చెబుతున్నాయి ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్ (ఎఫ్) తర్వాత క్లాజ్ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్, సెల్ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన డ్రైవర్‌ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. బస్సు డ్రైవర్‌ను నియమించే సమయంలో అతడి లైసెన్స్‌ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి. బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి.. ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్ ఉండాలి. బస్సులో తప్పకుండా ఒక అటెండర్‌ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్‌కు వారు కనిపించే విధంగా మిర్రర్ ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి. బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఉండాలి. బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు ప్రతి బస్సుకు హ్యాండ్‌బ్రేక్, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేయాలి. నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇలా.. జిల్లా బస్సులు ఫిట్నెస్ ఉన్నవి లేనివి మహబూబ్‌నగర్ 482 317 165 నాగర్‌కర్నూల్ 305 194 111 వనపర్తి 253 144 109 జోగుళాంబ గద్వాల 277 166 111 నారాయణపేట 257 64 193 -
రుణ లక్ష్యం.. నిర్దేశం
● జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.272.99 కోట్ల రుణాలు ● గ్రామీణ ప్రాంతాల్లో 7,222 ఎస్‌జీహెచ్‌లకు రూ.212.65 కోట్లు ● పట్టణ ప్రాంతాల్లో 504 సంఘాలకు రూ.64.34 కోట్లు ● ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు అధికారుల ప్రణాళిక –8లో uగద్వాలన్యూటౌన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2026–27 ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ద్వారా అందించే రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్ లింకేజీ కింద ఇచ్చే రుణ లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం నెరవేరింది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించేందుకు అధికారులు నెలవారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా మహిళాశక్తితో యూనిట్ల ఏర్పాటు.. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. మహిళా సంఘాల వారు నిర్వహించుకునే వ్యాపారాలను సూచిస్తూ.. బ్యాంకు లింకేజీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అర్హులైన సంఘాలకు రూ. 2లక్షల నుంచి రూ. 20లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. అయితే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2025–26లో మహిళాశక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, కిరాణాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్లు, పాడి, చీరలు, స్వీట్, పచ్చళ్ల దుకాణాలు, అగర్బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. 2026–27లో సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇందిరా మహిళాశక్తి కింద వివిధ వ్యాపార యూనిట్లను మహిళలు నెలకొల్పుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతేడాది లక్ష్యానికి మించి.. డీఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు అందించేందుకు గాను రెండు శాఖల అధికారులు అర్హత గల సంఘాల వివరాలను తీసుకున్నారు. ఎంత మొత్తంలో వారికి రుణాలు అందించాలనే దానిపై లెక్కలు వేసి.. ప్రభుత్వానికి నివేదించారు. అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7,222 స్వయం సహాయక సంఘాలకు రూ. 212.65కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 504 సంఘాలకు రూ. 64.34కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలతో ఇందిరా మహిళాశక్తి కింద చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యానికి మించి అందించారు. ఈ ఏడాది సైతం రుణ లక్ష్యం సాధించేందుకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టిసారించారు. సద్వినియోగం చేసుకోవాలి.. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. రుణాలతో వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా అభివృద్ది సాధించాలి. 206–27 రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – ముషాహిదాబేగం, డీఆర్డీఓ -
అసమగ్ర ఐటీడీఏ
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పు డు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హె ల్త్ సెంటర్‌తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి.నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవ సాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తు ల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూ పుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. ఒకే ఒక్కడు.. చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజె క్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతో పాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్‌ను నియమించా రు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నా రు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్ఓ, మేనేజర్, సీఎస్ఓ, హెచ్ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్‌లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఎం జన్మన్కే పరిమితం.. అత్యంత దర్భర జీవితం గడుపుతున్న చెంచులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్‌ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌళిక సదుపాయాలు ప్రతి చెంచుకు అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఇవీ మినహా గిరిజనుల కోసం చేపట్టే మిగతా ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్‌ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పు డు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూ నిటీ హెల్త్ సెంటర్‌తోపాటు 11 ప్రాథమిక ఆరో గ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. జిల్లాలు : నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి చెంచు కుటుంబాలు 4,041 గిరిజన జనాభా 14,436 గ్రామాలు 173 మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20 ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19 పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన ఇన్చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు మన్ననూర్ ఐటీడీఏ స్వరూపం.. గిరిజనులకు సంబంధించి విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పన, నీటి పారుదల, వ్యవసాయం, రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ, ట్రైకార్ రుణాలు, మత్స్యశాఖ పరిధిలో చేపపిల్లల పెంపకం వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదు. ఇందుకు ఏటా నిధులు కేటాయిచడం లేదని చెంచులు వాపోతున్నారు. చెంచు మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు గిరిపోషణ పథకం కింద రూ.కోటి నిధులు మంజూరైనా రూ.20 లక్షలకు మించి ఖర్చు కావడం లేదని తెలుస్తోంది. గిరివికాసం కింద గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఇవ్వాల్సి ఉండగా చాలామందికి ఈ పథకం అందడం లేదు. పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు, మేకలు, పశువులు సబ్సిడీపై అందించేది. కానీ, ఆ శాఖ అధికారులు లేకపోవడంతో పూర్తిగా మరుగున పడింది. ప్రభుత్వం ఇప్పటికై నా రెగ్యులర్ పీఓతోపాటు మిగతా పోస్టులు భర్తీ చేస్తేనే చెంచులకు ప్రాజెక్టు సేవలు అందుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలాలు 25 -
జోగుళాంబ గద్వాల
వైద్యో నారాయణో.. ప్రాణాలు ‘హరీ’!జిల్లా ఆస్పత్రిలో తరచుగా వికటిస్తున్న వైద్యం సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026గద్వాల క్రైం: వైద్యో నారాయణో హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎవరికి ఎలాంటి జ బ్బు చేసినా ఆస్పత్రిని ఆశ్రయించి.. తగిన చికిత్సతో నయం చేయాలని వైద్యులను వేడుకుంటాం. అయితే కొందరు వైద్యులు వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాల గాలిలో దీపంలా మారుతున్నాయి. అందులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తోంది. వైద్యం కోసం వస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని బాధిత కుటుంబాలు గుండెలు బాదుకుంటున్నాయి. నడిగడ్డ వైద్యులంటేనే వామ్మో అంటున్నారు. జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే శిశువు లేదా తల్లి మృతిచెందడం.. కడుపునొప్పి భరించలేక యవతి వస్తే అపెండిక్స్‌గా గుర్తించి.. చికిత్స అందించినా మృతిచెందడం వంటి ఘటనలతో వైద్యులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనుభవం లేని వైద్యులతో తప్పిదాలు.. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వివిధ చికిత్సలు చేయాల్సిన తరుణంలో అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణ కరువైందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వైద్యుడు మేజర్ చికిత్సలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టు పద్ధతిన కొలువు చేపట్టిన వైద్యుడు మేజర్ చికిత్సలు చేయడంతోనే పలు తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వైద్యులు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ఆస్పత్రి ఉండటం.. ప్రాక్టిస్ వైద్యులతో చికిత్సలు చేయించడం కూడా సమస్యగా మారిందని తెలుస్తోంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యులు విధుల్లో అలసత్వంగా వ్యవహరించడం.. పైగా వారిపై ఫిర్యాదు లు చేసినా చర్యలు లేకపోవడం కొసమెరుపు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి గాలిలో దీపంలా మారుతున్న రోగుల ప్రాణాలు నడిగడ్డ వైద్యులంటేనే హడలెత్తుతున్న జనం తాజాగా శస్త్రచికిత్స వికటించి బాలిక మృత్యువాత గత మార్చి 10న అయిజ మండలం మేడికొండకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మే 27న మానవపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి రాగా.. వైద్యులు పరీక్షించి కాన్పు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ప్రసవం తర్వాత శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు వైద్యులతో గొడవకు దిగారు. తాజాగా రెండు రోజుల క్రితం ఎర్రవల్లికి చెందిన ఇందు (17)కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి.. బాలికకు అపెండిక్స్‌గా గుర్తించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు వివరించి.. మరుసటి రోజు మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స అనంతరం బాలిక మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి.. హుటాహుటినా అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. జిల్లా ఆస్పత్రిలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. -
బాధిత కుటుంబీకుల ఆందోళన..
తాజాగా ఇందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లిదండ్రులు గోపాల్, మద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఆదివారం జిల్లా ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి (ఫ్లైఓవర్ బ్రిడ్జి) వద్ద బైఠాయించి ధర్నా చేపట్టగా.. బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించి.. మెడికల్ కౌన్సిల్లో లైసెన్స్ రద్దు చేయడంతో పాటు మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. 2గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో పోలీసులు ముందుగా మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులను అతికష్టం మీద అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి బాధిత కుటుంబ సభ్యులతో ఆర్డీఓ చర్చలు జరిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన నాయకులను ధరూర్ స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఆందోళనకారులను అరెస్టుచేసే సమయంలో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ చేతికి రక్తగాయమైంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు మల్లేష్, శ్రీహరి, నందికర్, శ్రీనివాస్‌గౌడ్, కుమార్‌తో పాటు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు -
కార్పొరేట్‌కు దీటుగా..!
నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సత్ఫలితాలతో ముందుకు.. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది. ప్రవేశాలు ఇలా.. వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. పక్కాగా పాఠ్య ప్రణాళిక.. పూర్తిగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్‌తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే అల్పాహారం సైతం అదనంగా ఇస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్ రైడ్ ప్రొడక్షన్ పాలసీని పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ప్రతిరోజు పర్యవేక్షించాలి. పిల్లల పురోగతిని సమీక్షించడానికి క్రమం తప్పకుండా పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, ఆరోగ్యశాఖ విభాగ అధికారుల ఉమ్మడి తనిఖీలతో కలిసి ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ పాఠశాలల మంజూరు ఇలా.. జిల్లా పాఠశాలలు మహబూబ్‌నగర్ 85 నాగర్‌కర్నూల్ 74 నారాయణపేట 44 వనపర్తి 48 జోగుళాంబ గద్వాల 41 ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, నారాయణపేట ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పైమరీ తరగతుల నిర్వహణ ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 292 పాఠశాలలు ఎంపిక తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు -
అవధుల్లేని ‘అమ్మ ప్రేమ’
నైతిక విలువలకు మనదేశంలో ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి. అందుకే మన దేశం నుంచి అనాథ చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడడంతో పాటు వారిపై ప్రేమాభిమానం కనబరచడం ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఆయా దేశాలకు చెందిన పలువురు దంపతులు 32 మంది అనాథ చిన్నారులను చేరదీశారు. రూ.కోట్లు ఆస్తులు కలిగిన దంపతుల చేతిలో ఇక్కడి అనాథ పిల్లలు పెరగడం విశేషం. 2014 సంవత్సరం నుంచి విదేశీ దంపతులు ఇక్కడికి తరచూ రావడం.. చిన్నారులను దత్తత తీసుకోవడం అధికారికంగా తమ దేశాలకు వెళ్లి పిల్లలను పెంచుకోవడం విశేషం. మాతృత్వం కోసం పరితపిస్తున్న తల్లిదండ్రులు తమ ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. తల్లి మాధుర్యం కోసం పరితపిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సంతానం కోసం ఆస్పత్రులు.. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దంపతులు కోకొల్లలు. వీరి మాతృత్వం అనుభూతిని తీర్చడానికి జిల్లాకేంద్రంలోని శిశుగృహ కేంద్రం ఎంతో కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. అమెరికాకు 17 మంది, స్పెయిన్‌కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, స్వీడన్‌కు ముగ్గురు, మాల్టాకు ఇద్దరు, ఫిన్లాండ్, కెనడాకు ఒక్కొక్కరు చొప్పున దత్తత ఇచ్చారు. అమ్మ అనే పదంలోని తీయదనం.. అభిమానం వెల కట్టలేనిది.. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మకు ఉన్న గొప్పతనం అటువంటిది. అయితే ఏ కారణం ఏదైనప్పటికీ.. అమ్మ ప్రేమకు దూరమైన శిశువుల దుస్థితిపై అంచనా వేయడం అసాధ్యం. అయితే తల్లిదండ్రుల ఆలనాపాలనా కరువైన శిశువులకు మేమున్నామంటూ ప్రభుత్వం ముందుకొచ్చి శిశు సంరక్షణ బాధ్యత నిర్వహిస్తుంది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లోని ఐసీడీఎస్ శిశుగృహ అనాథ శిశువులను అక్కున చేర్చుకుంటూ.. అండగా నిలుస్తోంది. దీంతోపాటు సంతానానికి నోచుకోని దంపతులకు ఆ చిన్నారులను దత్తత ఇస్తూ వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. – మహబూబ్‌నగర్ రూరల్ మహబూబ్‌నగర్‌లోని శిశుగృహలో చిన్నారులు (ఫైల్) అనాథ బాలలను అక్కున చేర్చుకుంటున్న ఐసీడీఎస్ శిశుగృహ పాలమూరు శిశువులను దత్తత తీసుకున్న విదేశీయులు గడిచిన 16 ఏళ్లలో 32 మందిని చేరదీసిన విదేశీ దంపతులు సులువైన పద్ధతులు ఉండటంతో ఆసక్తి చూపుతున్న వైనం -
రైతులకు అవగాహన కరువు..
జిల్లాలోని ప్రతి క్లస్టర్లో రైతువేదికలు ఉన్నాయి. వ్యవసాయ, విస్తరణ అధికారులు సమయానికి రైతులకు అందుబాటులో లేక రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. గ్రామీణ రైతులు పంటలను ఏ సమయంలో వేయాలి.. ఏయే పంటలు వేయాలో అడిగే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం అధికారులందరూ ప్రతి సమావేశంలోనూ ఆయిల్‌పాం పంటను అధికంగా సాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నల్లరేగడి పొలాల్లో బోర్లు లేని పరిస్థితుల్లో డిమాండ్లు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌పాం సాగుకు మాత్రమే అవగాహన కల్పిస్తే.. మిగతా పంటల పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అధికంగా పత్తి 2.20 లక్షల ఎకరాల్లో, వరి లక్ష ఎకరాల్లో, మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో, వివిధ పంటలు కూడా సాగవుతుండగా.. వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులకు ఎలాంటి సూచనలు అందడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంట సాగు, ఎరువుల వాడకం తదితర వాటిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఉండవెల్లి: తొలకరి జల్లులు కురవగానే రైతులు విత్తనాలు నాటడంలో నిమగ్నమవుతారు. అయితే ఈసారి వానాకాలంలో ‘ఎల్‌నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ముందస్తుగా విత్తనాలు నాటితే ఆ తర్వాత వర్షాలు కురవక రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీనిపై పెద్దగా అవగాహన లేని రైతులు ఇప్పటికే కురిసిన వర్షాలకు అక్కడక్కడ విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రైతులకు అవగాహన కల్పించడంలోనూ జిల్లా వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వ్యవసాయమే జీవనాధారం.. నడిగడ్డ అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. 90 శాతానికిపైగా రైతులకు జీవనాధారం. ఈ ఖరీఫ్ సీజన్లో 3.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది మే 26న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా.. ఈసారి కాస్త ఆలస్యంగా ఈ నెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కురవాల్సిన సమయంలో కాకుండా.. ఒకేసారి భారీ వర్షం కురిసి.. పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిధిగా వరిసాగు, పత్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్ 202.1 198.5 ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు నాటుతున్న రైతాంగం రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణుల సూచన జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా -
జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. గ్రామసభలతో సమగ్రాభివృద్ధి ఇటిక్యాల: గ్రామసభలతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమని డివిజినల్ పంచాయతీ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని చాగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రంలో సుపరిపాలన పరిమితులు నామినేషన్లో చాగాపురం గ్రామ పంచాయతీ ఉందని రాష్ట్ర బృందం ప్రత్యేకంగా సందర్శించి క్షేత్రస్థాయిలో మునుపటి పరిస్థితి, ఇప్పటి మార్పులకు గల తేడాలను పరిశీలించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్‌ఆఫీస్‌లోని ఏటీఎం కార్గో ఇన్చార్జి డీఎన్ రాజన్‌ను కేటాయించారు. అలాగే షాద్‌నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్‌నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్‌గౌడ్‌ను ఐటీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. 218 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,489, కనిష్టంగా రూ. 5,169, సరాసరిగా రూ.5,469 ధరలు లభించాయి. అలాగే 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. సరాసరిగా రూ.2,426 ఒకే ధర పలికింది. -
పాదయాత్ర అంటే ప్రభుత్వం ఉలిక్కిపడింది
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ తలపెట్టిన పాదయాత్ర ప్రకటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లయినా పాలమూరు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వానికి చలనం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేస్తామని ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి పర్యటనలు, సమీక్షలు, మంత్రుల పర్యటన ప్రారంభించారన్నారు. ప్రభుత్వం అనుకున్న రీతిలో పనులు చేయకుంటే పాదయాత్ర చేపడుతామన్నా రు. మేము ప్రాజెక్టు పూర్తిచేస్తే తుది మెరుగులు దిద్దే ందుకు ఏడాది పడుతది అంటున్నారన్నారు. ప్రాజె క్టు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. ● పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వం భయపడి సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించి 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పనులు మూడునెలల్లో పూర్తి చేయాలని లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ీసీఎం రెండురోజుల పర్యటనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని, ఏదైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని విమర్శించారు. నిలిచిన పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్పై విమర్శించడానికే ప్రాజెక్టుల సందర్శన పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు’ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. జూరాల పరిధిలో చెక్ డ్యామ్ కట్టేందుకు ఏరియల్ సర్వే రేవంత్‌రెడ్డి చేశారని, కర్ణాటక వైపు వెళ్లిండు అక్కడ పనులు చెక్ డ్యామ్‌లు చూసిండని దాంతో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేవలం కేసీఆర్‌ను తిట్టడానికి ప్రజాధనం ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్ట్‌ల వారీగా ఎంత పని అయింది, మిగిలిన పనులు ఎప్పుడు చేస్తారో జిల్లా పర్యటనలో చెప్పలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలోనే పంట ఎక్కువ పెరిగిందన్నారు. కేసీఆర్ సాగునీరు ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎంతవరకు పూర్తిచేశారో వివరిచే చిత్రాలను విడుదల చేశారు. -
‘నీట్’కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
గద్వాల న్యూటౌన్: నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలంగాణ ఇన్చార్జి అభిషేక్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. శనివారం వారు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉందన్నారు. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్ష నిర్వహణలో గోప్యత, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పశ్నపత్రాలు భద్రపరిచే ప్రక్రియ, పరీక్ష కేంద్రాల నిర్వహణ తదితర అంశాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణరావు మాట్లాడుతూ రబీ వరి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ స్పందిస్తూ జిల్లాలో నీట్‌ను సజావుగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 9న మహిళా సంఘాలకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే బస్సుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా నుంచి బయలుదేరే సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య తరపున ఎలక్ట్రికల్ స్కూటీలు, ఆటో, సైకిళ్లు కొనుగోలు చేసి గట్టు మండలంలోని మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, డీఆర్డీఓ ముషాహిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, డీఏఓ వీరప్ప, పౌరసరఫరాల శాఖాధికారి స్వామికుమార్, నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరునెలలకోసారి పర్యవేక్షణ
శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్‌ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌లోని తదతర రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్‌లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్‌లకే ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్‌లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్‌కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు వెళ్లారు. పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్‌లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముగిసిన ప్రాజెక్ట్‌ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్‌రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. -
గాలిమోటార్లో తిరుగుతూ గాలి మాటలు
పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా బాల కేంద్రంలో సుమారు నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం–విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఇందులో శిక్షణ పొందిన చిన్నారులు చివరిరోజు రాత్రి స్థానిక బా దం రామస్వామి గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో ప్రదర్శలిచ్చారు. ముఖ్యంగా వీరి సంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాల కేంద్రం ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజేష్‌ఖన్నా, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ● రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు ● ఎంపీ డీకే అరుణ -
అన్నదాతలకు ఊరట
పంటల మద్దతు ధరలు పెంచిన ప్రభుత్వం ● అత్యధికంగా పత్తిపై రూ.557.. అత్యల్పంగా మొక్కజొన్నపై రూ.10 పెంపు.. ● సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల వేడుకోలు పంట రకం 2025– 26 2026– 27 వరి(సాధారణం) 2,369 2,441 వరి (ఏ–గ్రేడ్) 2,389 2,461 జొన్న (హైబ్రీడ్) 3,699 4,023 జొన్న (ఎం–35) 3,749 4,073 కంది 8,000 8,450 వేరుశనగ 7,263 7,517 మొక్కజొన్న 2,400 2,410 పత్తి (24.5– 7,710 8,267 25.5 మి.మీ.,) పత్తి (29.5– 8,110 8,667 30.5 మి.మీ.,) గద్వాల వ్యవసాయం: అన్నదాతలకు కాసింత ఊరట లభించింది. కేంద్రం ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వివిధ రకాల పంటల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి పెంచిన మద్దతు ధరలు అమలు చేయాలని ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. అయితే మద్దతు ధర లు పెంచిన ప్రభుత్వం.. ఏటా సకాలంలో కొనుగోలు కేంద్రాలు కూడా సకాలంలో ప్రారంభించి.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా.. ప్రభుత్వానికి అమ్మి లాభపడతారని అభిప్రాయపడుతున్నారు. దళారులకు విక్రయించి నష్టాలు.. ఏటా పంట మద్దతు ధరలు కొంత పెరుగుతున్నప్పటికీ.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదు. దీంతో చాలామంది రైతులు తక్కువ ధరలకు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా కంది పంటను జూన్‌లో మొదలు పెడతారు. డిసెంబర్ చివరి వారం నాటికి పంట చేతికి వస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాలు ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025– 26లో కంది మద్దతు ధర రూ.8 వేలు ఉండగా.. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో వేలాది మంది రైతులు రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే విక్రయించి నష్టపోయారు. మొక్కజొన్న రైతులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా.. చాలామంది రూ.1,700 నుంచి రూ.1,800లకు దళారులకు విక్రయించారు. పత్తి రైతులు సైతం రూ.8,110 మద్దతు ధర ఉండగా.. రూ.7200 నుంచి రూ.7500కే విక్రయించారు. ఇవన్నీ కూడా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్లే జరిగాయి. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తేనే రైతులకు కాస్త ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ● జొన్న పంట సాగు తక్కువగా ఉంటుందని ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ డం లేదు. వేరుశనగ సాగు ఎక్కువగా ఉంటున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. చేసేది లేక మార్కెట్ యార్డుల లో వ్యాపారులు ఇచ్చే ధరలనే రైతులు పొందుతున్నారు. మద్దతు ధరలు ఉండే ప్రతి పంటకు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. గట్టు శివారులో పత్తి విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న రైతు పెంచిన మద్దతు ధరలు ఇలా.. (క్వింటాకు.. రూ.లలో..) ఏటా పెంపుతో మేలు.. వ్యవసాయం చేయడం అంటే ఏటా రైతులకు కత్తి మీద సామె. ఏటేటా పంటల పెట్టుబడులు పెరుగుతుండటంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అందిన కాడ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వాతావరణం సైతం అనుకూలించి.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధరలు లభించడం లేదు. కష్టించి పండించిన పంటలకు సరైన ధరలు రాక రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏటా పంటల మద్దతు ధరలు పెంచుతుండటం కొంతమేలు చేస్తోంది. 2026– 27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంట మద్దతు ధరలను పెంచింది. గతేడాదితో పోల్చితే క్వింటా వరిపై రూ.72, జొన్న రూ.324, కంది రూ.450, వేరుశనగ రూ.254, మొక్కజొన్న రూ.10, పత్తిపై రూ.557 పెంచింది. ప్రస్తుతం పెంచిన ధరలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. -
కాలుష్య నివారణకు కృషి చేద్దాం
గద్వాల క్రైం: ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషిచేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ మనుగడుకు జీవనధారం, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి పరమైన మొక్కల నుంచే అందుతాయన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషిత వాతావరణమే కనిపిస్తుందన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలన్నారు. కాలుష్య నివారణ, నియంత్రణ, సకాలంలో వర్షాలు కురవాలంటే మొక్కలే ఆధారమన్నారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మి, వెంకటేష్ దుర్వా, కోర్టు సిబ్బంది శోభ, న్యాయవాదులు వరలక్ష్మి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గట్టు: పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ ప్రతిఏటా మొక్కలు నాటి, వాటిని సంరరక్షించుకోవాలని గద్వాల ఫారెస్టు రేంజ్ అధికారి ఫర్వేజ్ అహ్మద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ముసలంపల్లి రిజర్వు ఫారెస్టులో అటవీ శాఖ అధికారులు, ఉపాధి సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలన్నారు. ఇంటి పరిసరాలు, పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచాలని, తద్వారా వాతవరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ఫలితంగా పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు. అటవీ భూముల్లో మొక్కలను పెంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుమలత, బీట్ ఆధికారి కీర్తి, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ స్వామి, బల్గెర సర్పంచు డేవిడ్, ఉపసర్పంచు గోపాల్, పంచాయతీ కార్యదర్శి సురేష్, వాచర్లు వీరారెడ్డి, భీమయ్య పాల్గొన్నారు. 217 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 217 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,641, కనిష్టంగా రూ.2,519, సరాసరిగా రూ.7,641 ధరలు లభించాయి. అలాగే 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,520, కనిష్టంగా రూ.2,316, సరాసరిగా రూ.2,520 చొప్పున పలికాయి. -
బీఆర్ఎస్లో దుమారం..!
● సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ● గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం ● అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ● ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్‌ను కలవడంపై అనుమానాలు ● ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా రాజకీయ పరిణామాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్‌ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్‌లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్‌టాపిక్‌గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్‌తో జూన్‌లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. కాగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎంను కలవడంపై కొందరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందులో ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన అనుచరులు కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వడివడిగా..
పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదలశాఖ మంత్రి బోసురాజు తో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌లో బెంగళూ రు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్‌లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనా ల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్త ల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్‌కు వెళ్లి కోయిల్‌సాగర్‌తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధి లోని జూరాల డ్యామ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్‌కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్‌కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్‌లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు జడ్చర్లలో బహిరంగ సభ.. గురువారం ప్రాజెక్ట్‌ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్‌లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్‌ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. పలువురి గృహనిర్బంధం.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు తెల్లవారుజామునే బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పుంగనూరు గ్రామానికి చెందిన రాఘవేందర్‌తో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. గద్వాల జిల్లా అయిజలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతోపాటు బీజేపీ అనుబంధ ఏబీ వీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్‌రావు తదితరులను గృహనిర్బంధం చేశారు. కాట్రేవుపల్లికి చెందిన పలువురు రైతులు కొడంగల్ ఎత్తిపోతల పథకంలో తాము భూములు కోల్పోయామని, తమకు భూపరిహారం ఇంకా అందలేదని ముఖ్యమంత్రితో విన్నవించుకునేందుకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన కొడంగల్–నారాయణపేట– మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్‌సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం -
సొంతంగా తవ్వుకుంటున్నాం..
కాల్వ పనులు పూర్తికాకపోవడంతో రైతులమే సొంతంగా కాల్వలు ఏర్పాటు చేసుకొని పంటలకు నీరు పారించకుంటున్నాం. కాల్వలకు దూరంగా ఉన్న వారికి అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఫీటు కాల్వలు ఏర్పాటు చేస్తేనే రైతులందరికీ మేలు జరుగుతుంది. – దావూద్, రైతు, అయిజ ఫీటు కాల్వ పనులు చేపట్టేందుకు అనేక ఆటంకాలు ఉన్నాయి. ముఖ్యంగా భూ సేకరణ చేయలేదు. దీనికి సంబంధించి భూములు కోల్పోతు న్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించ నందున కొంతమంది రైతులు అడ్డుపడుతున్నా రు. ప్రాజెక్ట్ రూపొందించిన సమయంలో కాల్వలకు లైనింగ్ ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వే యకపోవడంతో ఆ పనులు చేపట్టడం లేదు. దీ నికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – ఇమ్మానుయల్, డీఈ, నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన కాల్వ పను లు నత్తనడకన సాగుతున్నా యి. దీంతో డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకొని సాగునీ రు పారించుకుంటున్నాం. ఇందుకోసం రూ.వేలల్లో ఖర్చవుతుంది. కాల్వ పనులు వెంటనే పూర్తిచేసి సాగునీటి ఇబ్బందు లు తీర్చాలి. – సత్యారెడ్డి, రైతు, అయిజ ● -
ఫీటు కాల్వలకు.. పాట్లు
అయిజ: నెట్టెంపాడు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా మల్దకల్ మండలంలోని నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన 106 ప్యాకేజీ పనులు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు సాగునీరందని దుస్థితి నెలకొంది. నిధుల కొరతతో ఫీటు కాల్వ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోయింది. అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నెట్టెంపాడు ప్రాజెక్ట్ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 108 ప్యాకేజీ కింద మల్దకల్ మండలంలో రూ.18 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. వీటి ద్వారా అయిజ మండలంలోని పంటలకు సాగునీరందించాలనేది ప్రధాన ఉద్దేశం. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నాగర్‌దొడ్డి శివారులో 1,380 ఎకరాల రైతుల భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం కింద సుమారు రూ.15 కోట్లు చెల్లించింది. అయిజ మండలంలోని 6 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించగా.. రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ముళ్లపొదలు.. జమ్ముగడ్డి నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోని 106 ప్యాకేజీలో మెయిన్ కెనాల్ పూర్తయినా లైనింగ్ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో కాల్వల్లో ముళ్ల పొదలు, జమ్ముగడ్డి దట్టంగా వ్యాపించాయి. నల్లరేగడి భూముల్లో ప్రధాన కాల్వలు తవ్వడంతో నీరు పారుతున్నప్పుడు మట్టి కరిగిపోయి ప్రతి సంవత్సరం కాల్వల వెడల్పు పెరిగిపోతుండగా.. కాల్వలో మట్టి జారిపడి లోతు ప్రతిఏటా తగ్గిపోతుంది. చాలామంది రైతుల పంట పొలాల్లో ఇంత వరకు ఫీటు కాల్వలు (చిన్నవి) ఏర్పాటు చేయలేదు. ఫీటు కాల్వలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదనే కారణంతో రైతులు తమ పొలాల్లో కాల్వలు తవ్వేందుకు అంగీకరించడం లేదు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన ఫీటు కాల్వలను రైతులు పూడ్చివేశారు. దీంతోపాటు ఇతరత్రా కారణాలతో 106 ప్యాకేజీలోని ఆయకట్టులో సగం పొలాలకు కూడా సాగునీరు రావడం లేదు. దీంతో రైతన్నలు కేవలం వర్షాధారంగా పంటలు సాగుచేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాగునీరు.. వాగుపాలు జూరాల మిగులు జలాలు వృథాపోకుండా నెట్టెంపాడు ద్వారా రైతుల పంటలకు పారించాలని రిజర్వాయర్లు నిర్మిస్తే కాల్వల నిర్మాణం పనులు పూర్తికాకపోవడంతో నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీరు ఆయకట్టు భూములకు అందకుండా వాగుల ద్వారా వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు పంటలకు నీరు పారించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులు సొంత ఖర్చులతో యంత్రాలతో తాత్కాలికంగా కాల్వలు నిర్మించుకొని డీజిల్ ఇంజిన్లతో పైపుల ద్వారా నీరు పారించుకుంటున్నారు. వానాకాలంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీళ్లు నింపుకొని యాసంగి పంటల సాగుకు ఆ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. రూ.18 కోట్లతో నాగర్‌దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు దశాబ్దాలుగా పూర్తికాని పంట కెనాళ్ల నిర్మాణం చిన్నపాటి కాల్వల దుస్థితితో ఆయకట్టుపై ప్రభావం నీళ్లున్నా నిరుపయోగంగా మారిన భూములు -
‘గుడ్డెందొడ్డి’ని 15 టీఎంసీలకు పెంచాలి
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 11 లేదా 15 టీఎంసీలకు పెంచా లని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కృష్ణాబేసిన్‌లో తొలి ప్రాజెక్టు జూ రాల అని, వానాకాలంలో వేల టీఎంసీల వర ద వస్తున్నా.. వాటిని ఒడిసిపట్టుకోవడానికి సరిపడా జలాశయాలు లేని కారణంగా అవన్నీ వృథా గా పోతున్నాయన్నారు.జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ద్వారా చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతలలో నిర్మించిన గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంచితే జిల్లాలోని ప్రాజెక్టులకే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులకు సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి గుడ్డెందొడ్డి పంపుహౌస్‌ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చూపించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ప్రాజెక్టుల గురించి సాగునీటి పారుదల శాఖ అధికారులు క్షుణ్ణంగా వివరించారు.ఇందులో ప్రధానంగా జూ రాల ప్రాజెక్టు, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతుల గురించి దృశ్యరూపంలో అవగాహన కల్పించారు. అలాగే ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియపై అధికారులు వివరాలు తెలియజేశారు. పటిష్ట బందోబస్తు.. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెలీప్యాడ్ నుంచి గు డ్డెందొడ్డి పంపుహౌస్ వరకు అడుగడుగునా పోలీ సు బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో గుడ్డెందొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అక్క డే ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమం అనంత రం తిరిగి వెళ్లే సమయంలో మీడియా ప్రతినిధులను పలకరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మంత్రి బోసురాజు, కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పంపుహౌస్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఫొటో ఎగ్జిబిషన్, పీపీటీ ప్రజెంటేషన్ గంటపాటు ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్న సీఎం సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం 4.49 గంటలకు గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, కార్పొరేషన్ చైర్మన్లు గట్టు తిమ్మప్ప, సరిత తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డెందొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వివరాలను ఎమ్మెల్యే బండ్ల, సాగునీటి పారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. -
పల్లీ @ రూ.7,239
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా..గరిష్టంగారూ. 7,239,కనిష్టంగా రూ.3,699, సరాసరిగా రూ.6,154 ధర లు లభించాయి. ప్రస్తుతం అన్నిరకాల సీజన్లు ముగియడంతో వేరుశనగా మాత్రమే విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అరకొరగా డిగ్రీ సీట్ల భర్తీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం దోస్తు వెబ్సైట్ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రెండు దశల్లో ప్రక్రియ ముగిసింది. సీటు అలాట్మెంట్ అనంతరం విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు శుక్రవారం అవకాశం కల్పించింది. పీయూ పరిధిలో 65 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా వీటిలో 27,720 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని కళాశాలల్లో కలిపి 2,487 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ క్రమంలో మొదటి దశలో 3,292 మంది విద్యార్థులకు సీటు అలాట్మెంట్ చేయగా, ఇందులో 2,157 మంది కళాశాలల్లో రిపోర్టు చేశారు. రెండో దశలో 3,315 మందికి సీటు అలాట్మెంట్ చేయగా.. ఇందులో 330 మంది మాత్రమే గురువారం సాయంత్ర వరకు రిపోర్టు చేశారు. భర్తీ అయిన సీట్లలో అత్యధికంగా 4 ప్రభుత్వ అటానమస్ కళాశాలలో మొదటి దశలో 1,020, రెండో దశలో 166 మంది చేరారు. 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో మొదటి దశలో 744, రెండో దశలో 127 మంది చేరారు. ఇక 34 ప్రైవేటు డిగ్రీ కళాశాలలలో రెండు దశల్లో కలిపి కేవలం 406 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. సీట్ల భర్తీ లేక ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వెలవెల బోతున్నాయి. మరో దశ మాత్రమే ఉండగా.. 25వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. వనరులను భవిష్యత్ తరాలకు అందించాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించాని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో వ్యర్థాల ఉత్పత్తి పెరుగుతుందని, వ్యర్థాల నిర్వహణ రీయూజ్, రికవరీ, రీసైకిల్ విధానంలో జరగాలన్నారు. అవసరానికి మంచి వస్తువులను వినియోగించవద్దని, వస్తువులను తిరిగి వినియోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుదన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. కంపోస్టు ఎరువు చెట్ల వ్యర్థాలు ద్వారా కూడా తయారు చేసేందుకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పర్యావరణ పరంగా చైతన్యవంతులు కావాలని సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఇంజినీర్ మహ్మద్ సమీర్, రాజశేఖర్, కోఆర్డినేటర్ ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కృష్ణయ్య, ఈశ్వర్‌కుమార్, రవికుమార్ పాల్గొన్నారు. -
అర్హులకు ఓటుహక్కు కల్పించడమే సర్ లక్ష్యం
ఇటిక్యాల: అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్ (ఎస్ఐఆర్) లక్ష్యమని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని చాగాపురం గ్రామ రైతువేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాల్వల అభివృద్ధి, సాగునీటి పురోగతిపై గ్రామస్తులతో చర్చించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో చెత్తను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామంలోని రైతులకు కూరగాయల విత్తనాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సునంద, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చొద్దు
మానవపాడు: పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని గుంతలలో వేసి కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా వినియోగించాలని డీఆర్డీఓ ముషాయిదాబేగం, జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప అన్నారు. గురువారం మండలంలోని పెద్దపోతులపాడులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6, 8, 10 తేదీల్లో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా నేలలోని సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గుతుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పొలాల్లో వ్యర్థాలను కాల్చడం చట్టరీత్యా నేరం అని, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్‌కుమార్, సర్పంచ్ రజాక్, విస్తరణాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
రాజోళి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. బుధవారం రాజోళి మండలం పచ్చర్లలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కమీషన్లకు ఆశపడి రైతులను మోసంచేసే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరగాలని.. అక్రమంగా అమ్మకాలు చేసే వారిపై, సరిహద్దులు దాటి ధాన్యం తెచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమాధానం చెప్పాలి గద్వాలన్యూటౌన్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ముందుకు సాగలేదన్నారు. కాల్వల్లో పెరిగిన ముళ్లపొదలను సైతం తొలగించలేదని విమర్శించారు. సీఎం పర్యటన అభివృద్ధి కోసమే అయితే పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, పటేల్ జనార్దన్‌రెడ్డి, కుర్వ పల్లయ్య, చిత్తారి కిరణ్, మోహన్, రామకృష్ణ, వినయ్, శ్రీనివాసులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,312 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 161 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,312, కనిష్టంగా రూ. 3,080, సరాసరి రూ. 6,510 ధరలు లభించాయి. అదే విధంగా 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 6,149, కనిష్టంగా రూ. 5,961 ధర పలికింది. 4 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,489, కనిష్టం రూ. 6,009 ధర లభించింది. 12 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,497, కనిష్టంగగారూ. 2,380, సరాసరి రూ. 2,497 ధర పలికింది. గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చాటాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. ఎండీసీఏ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ వరకు జరగనున్న ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–14, 16 క్రికెట్ టోర్నీలను బుధవారం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిభ గల క్రీడాకారులతో ఆరు జట్లను ఎంపిక చేశామన్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జట్లు 30 ఓవర్ల మ్యాచ్‌లు ఒక్కో జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడతాయన్నారు. ఈ పోటీలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రతినిధులు సురేష్ కుమార్, వెంకటరామారావు, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, పీడీ రమణ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
గట్టు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండల మహిళా సమాఖ్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడా రు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు. కుటుంబపరంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వినూత్న ఆలోచనలతో పరిష్కరించుకునేందుకు ఉచిత సలహా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని.. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వేసవిలో కిషోర బాలికలకు నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులను అందజేసి అభినందించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటేశ్వరి, ఏపీఎం మారుతి, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు రామకృష్ణారెడ్డి, అలీ, శ్రీనివాస్‌రెడ్డి, రాజప్ప, గద్వాల తిమ్మప్ప, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల పరిహారం
మక్తల్: సంగంబండ, భూత్పూర్, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల నష్ట పరిహా రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ప్రజల దశ, దిశ మానర్చేందుకు సీఎం పర్యటిస్తున్నారని.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాల మైదానానికి చేరుకొని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులపై అధికారులతో సమీక్షిస్తారన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఇరురాష్ట్రాల మంత్రులు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడామని.. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురు, శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ఏరియల్ సర్వే నిర్వహిస్తారని.. కృష్ణా, బీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ గుడ్డెబల్లూర్ నుంచి తండిగి మీదుగా బీమా నదిపై వంతెన నిర్మాణం చేపడితే రాకపోకలు పెరిగి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న భూత్పూర్, నేరెడుగాం ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. భూత్పూర్ రిజర్వాయర్‌లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్ రహీం పటేల్, వాకిటి హన్మంతు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించాలి
గద్వాల: జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్, వర్షపునీటి సంరక్షణ, వానాకాలం పంటల సాగుపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని గ్రామాలు, వార్డుల్లో సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు కలిపి ఓ చోట సభ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఆయిల్‌పాం సాగు, హార్టికల్చర్, ఫార్మర్ రిజిస్ట్రీ, నానో యూరియా అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటనతో ముగుస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా విధులు నిర్వహించే బీఎల్ఓలు ఓటర్ల ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఏఓ వీరప్ప ఉన్నారు. ● ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సెస్సీ, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరేలా సంబంధిత ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, డీఐఈఓ హృదయరాజు తదితరులు ఉన్నారు. సీఎం పర్యటనకుపకడ్బందీ ఏర్పాట్లు ధరూరు: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గూడెందొడ్డి రిజర్వాయర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సీఎం పర్యటనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్ పనులను పర్యవేక్షించారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్‌ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో.. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. -
ఏర్పాట్ల పరిశీలన..
ధరూరు: మండలంలోని గూడెందొడ్డి రిజర్వాయర్‌ను ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ స్థలంతో పాటు పంప్‌హౌజ్‌కు వెళ్లే మార్గాన్ని చూశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి వెంట అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, డీఎస్పీ మొగులయ్య, ఆర్అండ్బీ ఈఈ ప్రగతి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, కృష్ణకుమార్‌రెడ్డి ఉన్నారు. -
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి
● నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ● ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్ర ప్రారంభం అలంపూర్: అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం అలంపూర్‌లో ప్రజాపాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి ఆయన అలంపూర్ ఆలయాలను సందర్శించగా.. ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 30 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీతో పాటు అర్హులందరికీ రూ. 5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా.. ఇప్పుడు పాదయాత్ర చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 4న జూరాల ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారన్నారు. 5న నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన అనంతరం 50వేల మందితో సభ నిర్వహించి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నివేదికను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయం
● తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ముందుకు ● అమరుల త్యాగాల పునాలదులపై ప్రగతి పథం ● 58,113 మంది రైతులకు రూ. 513.99కోట్ల రుణమాఫీ ● రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి గద్వాల: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడావ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాల పునాలదులపై నేటి తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారదర్శక సుపరిపాలన అనే నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మార్చి 6 నుంచి నిర్వహిస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ థీమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసినట్లు వివరించారు. మహిళా సాధికారతకు పెద్దపీట.. మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసి.. అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో 3.275 కోట్ల మంది మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ.117.45 కోట్ల విలువైన ప్రయోజనం కల్పించినట్లు వివరించారు. 8,231 స్వయం సహాయక, వృద్ధుల, దివ్యాంగుల స్నేహ సంఘాల్లో 87,22 మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 2,283 సంఘాలకు రూ. 17కోట్ల బ్యాంకు రుణాలు, 1095 మంది సభ్యులకు స్రీనిధి ద్వారా రూ. 52కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 16,391 మందికి రూ. 46.32కోట్ల వ్యయంతో వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. అధికారులకు ప్రశంసా.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో విశేష కృషి చేసిన వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, విద్య, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, యువజన క్రీడలు, వైద్యారోగ్య, అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలక, పరిశ్రమల, పోలీస్ తదితర శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. 172 స్వయం సహాయక సంఘాలకు రూ. 18.38కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ముఖ్య అతిథులు పరిశీలించారు. అంతకు ముందు కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్మృతివనంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యఅతిథి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాంజలితో నివాళులర్పించారు. అదే విదంగా స్థానిక పాతబస్టాండ్ వద్ద అమరవీరులు పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్పర్సన్ జయ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. 4.50లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతూ.. మొత్తం 4.50లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జిల్లాకు 6,899 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 649 ఇళ్లు పూర్తయి, 388 కుటుంబాలు గృహప్రవేశం చేశాయన్నారు. మరో 4,889 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ.500 గ్యాస్ పథకం ద్వారా 95,736 మందికి రూ. 13.84కోట్ల సబ్సిడీ అందించగా.. గృహజ్యోతి కింద 87,845 కుటుంబాలకు 9.96లక్షల జీరో బిల్లులపై రూ. 25.93కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. అనంతరం బాలభవన్, దివ్య, రెబల్డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వారి ప్రతిభను గుర్తిస్తూ.. ముఖ్య అతిథులు జ్ఞాప్తికలను అందజేసి అభినందించారు. -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరవలేనివని పదో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ పార్ధసాథిరెడ్డి అన్నారు. మంగళవారం బీచుపల్లి పదో పటాలంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొ.జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం వివిద విభాగాల్లో ప్రతిభకనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ, యూనిట్ మెడికల్ అధికారిణి సాయి, వెల్ఫేర్ అధికారి రాజేశం, ఆర్ఐలు రాజు, రాజేశం, నర్సింహరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి ఉత్తమ పోలీస్ సేవా పతకాలు
మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో పని చేస్తున్న అధికారుల, సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా సేవా పతకాలు ప్రకటించింది. అందులో ఆరుగురు ఉత్తమ సేవా పతకాలు పొందారు. వారిలో మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న ఎం.పోశెట్టి, ఇంటలిజెన్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కె.శ్రీనివాస్‌రావు, వనపర్తి వీఆర్ ఎస్ఐ ఎస్.సుబ్బరాజు, గద్వాల జిల్లాలో డీఎస్‌బీలో ఏఎస్ఐ శ్రీనివాసులు, పదో బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ శివరావు, నారాయణపేట జిల్లాలో ఏఆర్‌లో హెడ్‌కానిస్టేబుల్ నర్సిరెడ్డి ఉన్నారు. ● మహబూబ్‌నగర్ జిల్లాలో సేవా పతకం పొందిన వారిలో ఆర్ఐ క్రిష్ణయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ఏఆర్ ఎస్ఐ శ్రీరాములు, దేవరకద్ర హెడ్‌కానిస్టేబుల్స్ రాజశేఖర్, మహ్మద్ గఫర్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్స్ ఆంజనేయులు, శ్రీనివాసులు, శ్రీరాములు, నర్సింహులు, ఏఆర్ కానిస్టేబుల్ సురేందర్‌గౌడ్, ఇంటలిజెన్స్‌లో సీఐ సాయికుమార్, ఏఎస్ఐ ప్రభాకర్‌రావు, కానిస్టేబుల్ పర్వతచారి, టెక్నికల్ విభాగంలో ఐటీ సీఐ ప్రకాష్, ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఏఎస్ఐ రోశన్న, ఏఆర్ ఎస్ఐ జాకీర్ హుస్సెన్, పెద్దమందడి హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మప్పలు ఉన్నారు. ఇక గద్వాల జిల్లాలో గద్వాల సీఐ సీహెచ్ నాగేశ్వర్‌రెడ్డి, కోదాండపూర్ ఏఎస్ఐ శ్రీనివాసులుగౌడ్, మానవపాడు ఏఎస్ఐ మహ్మద్ జమీరుద్దీన్, ఇటిక్యాల ఏఎస్ఐ వెంట్రామిరెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్‌కర్నూల్ డీసీఆర్బీ సీఐ ఉపేందర్‌రావు, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రాజు, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, తెలకపల్లి మహిళ కానిస్టేబుల్ పద్మ ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లాలో కోస్గి సీఐ సైదులు,క్రిష్ణ ఏఎస్ఐ సురేందర్‌బాబు, ఊట్కూర్ ఏఎస్ఐ సాయిబాబ, హెడ్‌కానిస్టేబుల్ బాలరాజు, ధన్వాడ ఏఎస్ఐ ఎండీ ముస్తాక్ అలీ, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్స్ మురళీధర్, వెంకటేశ్వర్లు, ఎండీ లయిక్ అహ్మద్ సేవా పతకాలు అందుకోనున్నారు. -
వేడుకలకు ముస్తాబు
గద్వాల: రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు పోలీసు బందోబస్తును ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు, క్రీడా వ్యవహారాల ఇన్చార్జి ఏపీ జితేందర్‌రెడ్డి హాజరుకానున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
స్వరాష్ట్రంలో మారిన స్వరూపం
పన్నెండేళ్ల కాలంలో అభివృద్ధి పథంలో నడిగడ్డ ప్రాంతం గద్వాల: స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికీ.. పన్నెండేళ్లు అయ్యింది. రాష్ట్ర సాధనతో నడిగడ్డ ప్రాంతంగా ఉన్న గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల స్వరూపం మారింది. రాష్ట్రం సాధించిన రెండేళ్లకు 2016లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న నడిగడ్డ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో గద్వాల జిల్లా కేంద్రంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలను కలుపుతూ జోగుళాంబ గద్వాల జిల్లాగా 2016 అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జిల్లాకు నర్సింగ్ కాలేజీ, జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు పెంచడం, మెడికల్ కాలేజీ, అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మౌళిక సదుపాయాలు, సాగునీటి రంగంలో నూతనంగా గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు వంటి ప్రధానమైన అభివృద్ధితోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడం, జిల్లాకేంద్రం గద్వాలపట్టణం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందడం వంటి వాటితో జిల్లా ముఖచిత్రమే మారింది. ఆర్డీఎస్కు తీరని అన్యాయం.. ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్కు తీరని అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా రాజోళి సమీపంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి నేరుగా కాల్వల్లోకి నీటిని పంపింగ్ చేసి 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల డిజైన్ చేశారు. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ తుమ్మిళ్లను జాతికి అంకితం చేశారు. అలాగే గట్టు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 2018లో గట్టు ఎత్తిపోతలకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో.. జిల్లా ఏర్పాటు అనంతరం నూతనంగా నర్సింగ్ కాలేజీ మంజూరైంది. అలాగే జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతన ఆస్పత్రికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే అలంపూర్ చౌరస్తాలో నూతనంగా వంద పడకల ఆస్పత్రి మంజూరు కాగా ప్రస్తుతం అక్కడ ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. అలాగే చిరకాల స్వప్నంగా ఉన్న మెడికల్ కళాశాల రెండేళ్ల కిందట మంజూరవగా.. ఈ ఏడాది మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మౌళిక సదుపాయాల కల్పన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా అవసరమైన పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం వంటివి అభివృద్ధి చేశారు. అన్నిరంగాల్లో అభివృద్ధి.. జిల్లాకేంద్రమైన గద్వాల పట్టణం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలో వైద్యం, విద్య, ఇతర రంగాల్లో జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గద్వాల పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఫలితంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఒకానొక సమయంలో హైదరాబాద్‌తో పోటీపడింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, ఆస్పత్రులు, వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. పదేళ్ల కిందట జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు.. పెరిగిన సాగు విస్తీర్ణం విద్యారంగంలో మౌలిక వసతులకు పెద్దపీట -
పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం ● 2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే.. ● ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● యాసంగి సాగులోనూ మూడింతల వృద్ధి ● వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కరువుతో అల్లాడిన ప్రాంతం.. ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు.. తాగునీటి కోసం తండ్లాట తప్పని పల్లెలు, పట్టణాలు.. ఉపాధి దొరక్క తట్ట, బుట్ట పట్టుకుని పిల్లాజెల్లలతో సహా వలసలు.. కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు.. విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు ...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం, దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ యాసంగిలోనూ గణనీయంగా.. ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: జిల్లాలోని జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను పరిశీలించేందుకు ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్, ఎస్పీ శ్రీనివాసరావు, వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించి హెలీప్యాడ్ స్థలం పరిశీలన, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు వంటివి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులతో చర్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఈఈలు సంజీవ్, ప్రగతి పాల్గొన్నారు. చిట్టీల పేరుతో టోకరా ● ఉలిగేపల్లి గుడిపూజారి నిర్వాహకం ● రూ.10కోట్లకు పైగా ఘారానామోసం మల్దకల్: అధిక వడ్డీలతో చిట్టీ వ్యాపారం చేస్తూ ఓ వ్యక్తి రూ.10కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించిన ఘటన మండలంలోని బిజ్వారంలో సోమవారం చోటు చేసుకుంది. బిజ్వారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ సమీపంలోని మరో గ్రామంలో ఆంజనేయస్వామి గుడి పూజారిగా ఉంటూ ఇరు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఈక్రమంలో చిట్టీలు వేయించుకుని వారికి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో చిట్టీలు వేసిన లబ్ధిదారులు లబోదిబోమంటూ బిజ్వారంలోని అతని ఇంటి వద్దకు చేరుకుని ఆ వ్యక్తిపై ఆరాతీయగా.. 5 రో జుల నుంచి కనిపించకుండాపోవడంతో బాధి తులు ఆవేదన వ్యక్తం చేశారు. బిజ్వారంతోపాటు ఉలిగేపల్లి, దాసరపల్లి, గద్వాల పట్టణం, ధరూరు మండలంలోని 6 గ్రామాల్లో పరిచయస్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో చిట్టీ లు వేయించుకున్నాడు. చిట్టీలతోపాటు చిట్టీలు వేసిన లబ్ధిదారులతో అధిక వడ్డీల ఆశతో ఒ క్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.30లక్షలకు పైగా వడ్డీలకు తీసుకుని వారి నెలనెలా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. అదే నమ్మకంతో చిట్టీలు వేసిన వారితోపాటు అప్పు లు ఇచ్చినవారిని మోసగించి రాత్రికిరాత్రే కు టుంబ సభ్యులతో ఉడాయించాడు. అప్పులు ఇచ్చినవారు సర్పంచ్‌ను కలిసి తమకు న్యాయ ం చేయాలని విన్నవించారు. తాను చేసేదేమి లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూ చించారు. ఈ విషయమై మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరిని వివరణ కోరగా చిట్టీలతో ఉడాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఎవరూ ఇప్పటి వరకు ఉడాయించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 198 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు సోమవారం 198 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,800, కనిష్టంగా రూ.5,469, సరాసరిగా రూ.6,865 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.5,759 ధర పలికింది. -
రేపు అమరవీరులకు వందన కార్యక్రమం
గద్వాలన్యూటౌన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న జిల్లా కేంద్రంలోని కొట్టం వేణుగోపాల్ పార్కులో 1969 తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు వందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు తెలిపారు. ఆదివారం కొట్టం వేణుగోపాల్ పార్క్‌లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా ఉదయం 9గంటలకు జరిగే వందన కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి కవులు, ఉద్యమకారులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలరాజు, శంకర ప్రభాకర్, వల్లూరు వెంకట్రామారెడ్డి, భీమ్‌సేన్‌రావు, అబ్దుల్ మోమిన్, లక్ష్మణస్వామి, హమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో పుర కమిషనర్ల బదిలీలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.రాజయ్య (గ్రేడ్–2) నారాయణపేట జిల్లాలోని మక్తల్‌కు బదిలీపై వెళ్తున్నారు. ఇంత వరకు వెయిటింగ్ జాబితాలో ఉన్న మహమ్మద్ మునవర్ అలీ (గ్రేడ్–3)ని వనపర్తికి, ఎ.నరేష్కుమార్ (గ్రేడ్–3)ను ఆత్మకూర్‌కు, ఎం.శంకర్ (గ్రేడ్–2)ను నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు బదిలీ చేశారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2)గా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్ మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్కు వస్తున్నారు. కాగా.. ఇటీవల గ్రూప్–1కు ఎంపికై న పి.రాజేష్ అలంపూర్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2)గా, పి.సాయి శ్రీనివాస్‌యాదవ్ మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ)గా బదిలీపై వస్తున్నారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన ఏఎంసీ అజ్మీర రాజన్న గత నెలలో హైదరాబాద్‌లోని సెక్రెటరియట్కు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డిని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ (ఓడీ)గా పంపిస్తున్నారు. అలాగే వనపర్తిలో మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1)గా పనిచేస్తున్న ఎన్.వెంకటేశ్వర్లు జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. మున్సిపాలిటీలో మురుగు తొలగేదెలా? ●రోడ్లపైనే నిలుస్తున్న మురుగు,వర్షపు నీరు


