ఓటరు తీర్పు నేడే..
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘటం మొదలైంది. పల్లె ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. గ్రామాభివృద్ధికి పాటుపడే సరైన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవడానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. హోరాహోరీగా సాగిన పల్లె పోరులో అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రంతో తేలనుంది. సర్పంచ్‌గా పగ్గాలు చేపట్టేదెవరో ఓటరు తన తీర్పుతో నిర్ణయించనున్నాడు. జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం అనంతరం తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సర్పంచ్ ఫలితం తేలాక, అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 2,634 మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ క్రతువులో పాల్గొననున్నారు.
ఏకగ్రీవమైన వార్డులు 361
తొలి విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధం
నాలుగు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
సాయంత్రానికి ఫలితాలు.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక
91 సర్పంచ్ పదవులకు 321 మంది పోటీ
ఓటరు తీర్పు నేడే..
ఓటరు తీర్పు నేడే..


