ఎన్నికల సిబ్బంది.. సౌకర్యాల్లేక అవస్థలు
గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేటీదొడ్డికి మధ్యాహ్నానికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో రాగా.. వారికి సరిపడా భోజనం అందకపోవడంతో ఆకలితో ఎదురుచూశారు. అయితే, 800 మంది సిబ్బందికి భోజనాలు చేయగా 1000 మంది వచ్చారని, మరోసారి భోజనం వండి అందించినట్లు ఎంపీడీఓ రమణరావు తెలిపారు. ఇక గట్టు మండలంలో సరిపడా టెంట్లు లేకపోవడంతో సిబ్బంది ఎండలోనే సామగ్రిని సరిచూసుకున్నారు. మహి ళ లు చీర కొంగును తలపై కప్పుకోగా.. మరికొందరు అట్టా పెట్టలను ఎండ నుంచి అడ్డుపెట్టుకోవడం కనిపించింది. – కేటీదొడ్డి/గట్టు
ఎన్నికల సిబ్బంది.. సౌకర్యాల్లేక అవస్థలు


