ఏకగ్రీవమైన పంచాయతీలకు ఎన్నికల సిబ్బంది
గట్టు: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది ఎంపీడీఓ చెన్నయ్యతో వాగ్వాదానికి దిగారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఎన్నికలు నిర్వహించే గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించి, మెటీరియల్‌ను అందజేశారు. అయితే 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఈ గ్రామాలకు కేటాయించిన సుమారు 120 మంది ఎన్నికల సిబ్బంది కూడా వచ్చారు. వీరికి ఎన్నికల విధులను అప్పగించకపోవడంతో పాటుగా ఎన్నికల భత్యం చెల్లించకపోవడంతో సిబ్బంది అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన తర్వాత ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ఉద్యోగులకు వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరుతుందని హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారుల్లో కొంత మందికి భోజనం లభించకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు.


