ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఇటిక్యాల: ప్రజాస్వామ్య వ్యవస్ధలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియాగించుకోవాలని శిక్షణ కలెక్టర్లు మనోజ్‌కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ అన్నారు. సోమవారం స్ధానిక మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడో విడత ఎన్నికల విధులకు హాజరయ్యే వివిధ శాఖల ఉద్యోగులకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వసతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు సర్పంచ్‌కు 37 ఓట్లు, వార్డ్ మెంబర్లకు 31 ఓట్లను వినియోగించుకున్నట్లు ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ తెలిపారు.


