ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు | - | Sakshi
Sakshi News home page

ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు

Dec 16 2025 7:27 AM | Updated on Dec 16 2025 7:27 AM

ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు

ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు

అలంపూర్‌: దక్షిణ కాశీ అలంపూర్‌ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement