మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: జిల్లాలో మూడవ విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి మూడో విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో ర్యాండమైజేషన్‌ను విజయవంతమైనట్లు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఏకగ్రీవాలు అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, ఈడీఎం శివ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


