మరమ్మతుకు గ్రహణం.. పంటలకు శాపం
నడిగడ్డ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు 3.35 లక్షల ఎకరాలు
● ఈసారికి 49 వేల ఎకరాలకే సాగునీటి విడుదల
● ప్రస్తుత యాసంగిలో ఆర్డీఎస్, ర్యాలంపాడు కింద క్రాప్ హాలిడే ప్రకటన
● జూరాల, తుంగభద్రలో గేట్లు, ర్యాలంపాడులో లీజీకేల పరంపర
● వరుసగా
ఈసారి కూడా సాగునీటి నిలిపివేత.. ఆందోళనలో అన్నదాతలు
ర్యాలంపాడు జలాశయం
గద్వాల: నడిగడ్డలోని ప్రాజెక్టులకు మరమ్మతు గ్రహణం వెంటాడుతుంది. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.42 లక్షలు, ఆర్డీఎస్ కింద 83 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఆయకట్టును స్థిరీకరించారు. కానీ, ఈ ప్రాజెక్టులు మరమ్మతుకు నోచుకోకపోవడంతో స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోయింది. ఫలితంగా ఏటా రెండు పంటలతో కళకళలాడాల్సిన భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. యాసంగిలో కేవలం 49 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే ఆయా ప్రాజెక్టుల దుస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. తుగభద్ర నది పరిధిలోని రాజోలి బండ డైవర్షన్ పథకం కింద యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అలాగే కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో పలుచోట్ల లీకేజీలు ఏర్పడడంతో యాసంగిలో పూర్తిగా క్రాప్‌హాలిడే ఇస్తున్నారు. అదేవిధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోవడంతో మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా కేవలం 49 వేల ఎకరాలకు సాగునీరు పారుతుండడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు పూర్తిచేయడంలో ఇటు పాలకులు, అటు అధికారుల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నడిగడ్డ ప్రాజెక్టుల కింద
ఆయకట్టు వివరాలు ఇలా..


