ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్– 8, 10, 12, 14, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. పరుగు పందెంతో పాటు లాంగ్‌జంప్, హైజంప్ విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. పోటీల ప్రారంభమనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ జనవరి 15వ తేదీ నుంచి అదిలాబాద్ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బషీర్, నర్సింహరాజు, ప్రణిత, శాంతి, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు.


