పంటకు నీరు ఇవ్వాలి..
ఆర్డీఎస్ ప్రాజెక్టు గేట్లు రిపేరు చేయాలనే పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి నీళ్లు వదలకుండా భూములను బీళ్లుగా మార్చడం అన్యాయం. అధికారులు ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలి.
– భాను రైతు, శాంతినగర్
త్వరగా
పూర్తిచేయాలి..
ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీలు ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి రిపేర్లు చేసింది లేదు. కేవలం సర్వేలు చేస్తూ అధికారులు తిరిగి పోతున్నారు. నాలుగేళ్లుగా రిజర్వాయర్ కింద యాసంగిలో నీటిని నిలిపివేశారు. దీంతో ఒక్క పంటనే వేసుకుంటున్నాం. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే రిపేర్లు పూర్తిచేసి రెండు పంటలకు నీటిని విడుదల చేయాలి.
– వెంకట్రామిరెడ్డి, రైతు ర్యాలంపాడు
మరమ్మతు
చేపడుతాం..
తుంగభద్ర డ్యాం గేట్లకు మరమ్మతు చేయాల్సి ఉండడంతో ఆర్డీఎస్ పరిధిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ర్యాలంపాడు రిజరా్వాయర్ రిపేర్లకు సంబంధించి నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్,
ఎస్‌ఈ జిల్లా ఇరిగేషన్ శాఖ
●
● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాలలో పలుచోట్ల, తూము నిర్మాణాల వద్ద లీకేజీలు ఏర్పడడంతో జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి గత నాలుగేళ్లుగా ఏటా ఖరీఫ్ పంటకే నీళ్లు వదులుతున్నారు.
పంటకు నీరు ఇవ్వాలి..


