కుష్టు సర్వే పక్కాగా నిర్వహించాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కుష్టు వ్యాధిగ్రస్తులు, అనుమానితుల సర్వే పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనా భాను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కుష్టు అనుమానితుల సర్వే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని, వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చినా, ఒంటిపై మచ్చలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు వాడి నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇంటి వద్దకు ఆశా కార్యకర్తలు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇల్లూ తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మండల ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. ప్రవీణ్, డీపీఎంఓలు కృష్ణ, సంజీవ్, సూపర్‌వైజర్ విజయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనాభాను


