ప్రశాంతంగా రెండోవిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ బీఎం సంతోష్ ఉదయం 7గంటలకు వెబ్‌కాస్ట్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. రెండో విడతలో భాగంగా మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో మొత్తం 57 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరిగింది. మొత్తం 567 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాయు. మొత్తం 1,12,807 మంది ఓటర్లకుగాను 57,094 మహిళలు, 55,710 పురుషులు ఉన్నారు. వీరిలో 49,145 మహిళాళ ఓటర్లు, 49,086 మంది పురుష ఓటర్లు, ముగ్గురు థర్డ్‌జెండర్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 87.08శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అవాంచనీయ ఘటనలు
చోటుచేసుకోకుండా చర్యలు
రాజోళి/మల్దకల్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రాజోళి, వడ్డేపల్లి, మల్దకల్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బీఎం సంతోష్‌తోపాటు ఎస్పీ పరిశీలించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలులోనే ఉందని తెలిపారు. అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉందని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోట చేసుకున్నా, వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై డేగ కన్ను ఉంచినటు తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు.


