గ్రామాలు పోటెత్తాయి..!
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్
● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్
● అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 84 శాతం..
మేకలసోంపల్లిలో సర్పంచ్ జయరాములతో కలిసి నాయకుల సంబరాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్‌లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు.
84 శాతం.. ఆపైనే..
ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్‌నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది.
గ్రామాలు పోటెత్తాయి..!


