పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ.. | - | Sakshi
Sakshi News home page

పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

Dec 14 2025 8:43 AM | Updated on Dec 14 2025 8:43 AM

పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..

పురుషులు 1,071

మహిళలు 1,021

మొత్తం ఓటర్లు 2,092

ప్రభావిత వర్గాలు..

యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి

రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్‌ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపరిచిన ఉడుతల భాస్కర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గొంది నిరంజన్‌ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ యాదవ్‌ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్‌ యాదవ్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement