‘స్వగ్రామాలే’ సవాల్..!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు
● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం
● స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు
● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
–8లో u
జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్‌ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు.
..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్‌గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
తూడుకుర్తి: నువ్వా.. నేనా..
ప్రభావిత వర్గాలు..
బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి
మహిళలు 2,706
పురుషులు 2,658
మొత్తం ఓటర్లు 5,364
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి స్వగ్రామం తూడికుర్తి. నాగర్‌కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్‌ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ


