వణుకుతోన్న సంక్షేమం
ప్రభుత్వ వసతిగృహాల్లో చన్నీళ్లే దిక్కు
● జిల్లాలో అధికమైన చలి తీవ్రత
● ఉదయాన్నే స్నానం చేసేందుకు విద్యార్థుల అవస్థలు
● కొన్ని హాస్టళ్లకు కిటికీలు, డోర్లు కూడా సరిగా లేని వైనం
రోజు శుభ్రంగా స్నానం చేసి పాఠశాలకు వెళ్లడం మంచి అలవాటు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే శీతాకాలం భానుడు 9 గంటల వరకు కూడా మబ్బులను దాటుకొని రావడం లేదు. దీంతో మంచుదుప్పటి పరిచినట్లుగా ఉంటుంది. దీంతో విద్యార్థులు చన్నీటితో స్నానం చేసేందుకు జంకుతున్నారు. కొందరు విద్యార్థులు ఉదయం స్నానం చేయకుండానే వెళ్లి, సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఉదయం చలికి తట్టుకోలేకపోతున్నామనే సమాధానం చెబుతున్నారు. ఇక రోజు చన్నీటితో ఉదయం, సాయంత్రం స్నానాలు చేయడం వల్ల ఆయాసం, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థతి కాస్త ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.
వారం రోజులుగా మరీ తీవ్రం..
రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటోంది. జిల్లా అంతటా మబ్బులు ప ట్టింది. వారం రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తుంది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు చాలా ఇబ్బందుల తో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఊడిన కిటకీ తలుపులు..
జిల్లాలోని 30 వసతిగృహాల్లో 3,881 మంది విద్యార్థులు ఉన్నారు. అనేక వసతిగృహాల్లో విద్యార్థులకు సరైన గదులు, వెచ్చదనాన్నిచ్చే దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. కొన్ని గదులకు కిటికీ తలపులు ఊడిపోయాయి. చలి తీవ్రత భరించలేక కొన్ని చోట్ల విద్యార్థులు అట్టలు, చెక్కలను అడ్డుపెట్టారు. చల్లటి బండలపై పలచని దుప్పట్లను వేసుకుని వణుకుతూ పడుకుంటున్నారు. ఇప్పటి వరకు కళాశాల విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉదయం 9:40 గంటలకే పాఠశాల ప్రారంభమవుతుంది. వేకువజామున 6 గంటలకే కాలకృత్యాలు తీర్చుకొని జావ తాగాలి. అనంతరం స్టడీ అవర్స్‌కు హాజరుకావాలి. ఆ తర్వాత స్నానాలు చేసి.. ఆల్పాహారం ఆరగించి బడికి బయలుదేరివెళ్లాలి. ఇదీ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. ఇవన్నీ క్రమం తప్పకుండా జరగాలంటే విద్యార్థులు రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేవాలి. అప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాఠశాలకు చేరుకుంటారు. ఇది బాగానే ఉన్నప్పటికీ.. చలికాలం విద్యార్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలిపులి విజృంభిస్తుండటంతో ఉదయం నిద్రలేవాలంటేనే జంకుతున్నారు. ఇక కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో నెలకొంది. మంగళవారం పలు వసతిగృహాలను ‘సాక్షి’ పరిశీలన చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – గద్వాలటౌన్/అయిజ/మానవపాడు/ఉండవెల్లి
విద్యార్థులు
120 మంది
ఎస్టీ వసతిగృహాలు
1
గత వారం నుంచి
నమోదైన ఉష్ణోగత్రలు
జిల్లా కేంద్రంలోని బాలుర బీసీ కళాశాల వసతిగృహాంలో వణుకుతూ పడుకున్న విద్యార్థులు


