యేసు జననం.. గొప్ప సందేశం
గద్వాలటౌన్: పరిశుద్ధాత్మ కుమారుడిగా యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిందని.. ఆ కరుణామయుడి జన్మదినం అందరికీ శుభదినమని పలువురు సందేశకులు అన్నారు. క్రిస్మస్ పర్వదనాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో ప్రదర్శించిన ‘క్రీస్తు జననం’ నాటిక ఆకట్టుకుంది. స్వాగత నృత్యంతో పాటు వైవిధ్య ఆహార్యం, అభినయంతో పండగ ప్రత్యేకతను సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శన ద్వారా చాటి చెప్పారు. అనంతరం స్కిట్‌ల ప్రదర్శన సుమారు గంటపాటు సాగింది. ఈ సందర్భంగా చర్చి కమిటీ చైర్మన్ ప్రభుదాస్, పాస్టర్ చార్లెస్ శాంతిరాజ్, కార్యదర్శి సైమన్ సుధాకర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యేసు చూపిన బాటలో నడుచుకొని సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.


