సర్పంచ్‌కు 82, వార్డులకు 290 నామినేషన్లు
అలంపూర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజైన గురువారం జోరుగా సాగింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 82మంది, వార్డులకు 290 మంది నామినేషన్లు వేశారు. అలంపూర్ మండలంలో సర్పంచ్‌కు 82 మంది, ఇటిక్యాల మండలంలో సర్పంచ్‌కు 11 మంది, వార్డులకు 56, ఉండవెల్లిలో సర్పంచ్‌కు 18, వార్డులకు 57 మంది, మానవపాడులో సర్పంచ్‌కు 10 మంది, వార్డులకు 43 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎర్రవల్లిలో సర్పంచ్ స్థానానికి 16 మంది వార్డుల స్థానాలకు 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.


