మార్మోగిన గోవిందనామస్మరణ
● ఆదిశిలా క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం
● బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
● దాసంగాలతో మొక్కులు
చెల్లించుకున్న భక్తులు
● ఎడ్లబండ్లు, వాహనాలతో కిలోమీటర్ల మేర రద్దీ
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారికి వేదపండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలిరావడంతో భక్తులతో మల్దకల్ గ్రామం జనసంద్రమైంది. మల్దకల్ ఆలయం చుట్టూ కిలోమీటర్ల మేర ఎటు చూసినా తిమ్మప్పస్వామి భక్తులతో రద్దీగా మారింది. ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, ఎద్దులబండ్లపై వచ్చిన భక్తులు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు, సేవా సమితి నిర్వాహకులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జాతరలోకి వాహనాలను అనుమతివ్వకుండా గ్రామశివారులోనే ఎక్కడికక్కడే కట్టడి చేశారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, ఎస్‌ఐ నందికర్, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, మండల నాయకులు మధుసూదన్ రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్ వాల్మీకీలు పాల్గొన్నారు.
ఎస్పీ ప్రత్యేక పూజలు
ఆలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు ఎస్పీకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతర పరిసరాలను పరిశీలించారు. రథోత్సవంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసులకు సూచించారు. అలాగే క్యూలైన్లు, తేరు పరిసరాలను పరిశీలించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐలు టంగుటూరి శ్రీను, టాటా బాబు, ఎస్‌ఐలు నందీకర్, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
మార్మోగిన గోవిందనామస్మరణ
మార్మోగిన గోవిందనామస్మరణ
మార్మోగిన గోవిందనామస్మరణ


