పొత్తుల రాజకీయం!
జోగుళాంబ గద్వాల
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మహబూబ్‌నగర్: బీఆర్‌ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్
● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్‌పల్లి, మన్సూర్‌పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు చెందిన వారు సర్పంచ్‌లుగా ఏకగ్రీవమయ్యారు.
● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తోంది. కంచన్‌పల్లిలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్‌లో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
పల్లె పోరులో చిత్రవిచిత్రాలు
గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’
కొన్ని జీపీల్లో బీఆర్‌ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి..
పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్..
మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ?
వీపనగండ్లలో బీఆర్‌ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం..
పొత్తుల రాజకీయం!


