విపత్తు సమయాల్లో సమర్థవంతమైన సేవలు
గద్వాల: విపత్తు సమయాల్లో ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గుర్రంగడ్డ గ్రామం చుట్టూ కృష్ణానదికి వరద ఎక్కువగా వచ్చే సమయంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్తులకు ముందస్తుగానే మాట్లాడి అప్రమత్తం చేసి వారికి అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌వో స్వామికుమార్, ఆర్‌అండ్‌బి ఈఈ ప్రగతి, డీఎంహెచ్‌వో డాక్టర్ సంధ్యా, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎస్‌ఈ శ్రీనివాస్, పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వర్, వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


