విధి నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
● ఉప సర్పంచ్ పవర్ ఫుల్ ● డిపాజిట్ కోల్పోవడమంటే? ● ‘సోషల్’ ప్రచారం! ● అమెరికా నుంచి వచ్చి నామినేషన్
● ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలి
● కలెక్టర్ బీఎం సంతోష్
● ఒక అభ్యర్థి..
రెండు కుల
ధ్రువీకరణ పత్రాలు
● ఏకగ్రీవాల
జోరు
– వివరాలు 8లో u
గద్వాల: ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని.. సాధారణ పంచాయతీ ఎన్నికలను నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఫేస్–2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. అధికారులు సూచనల పుస్తకంపై పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, వెబ్‌కాస్టింగ్, ఇతర సౌకర్యాలపై అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధమని.. ఓటర్లకు అవసరమైన సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 1గంటకు ముగుస్తుందన్నారు. ఆ సమయానికి ముందు క్యూలో నిల్చున్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ పీపీటీ ఆధారంగా సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీపీఓ శ్రీకాంత్, ఎన్నికల ట్రెయినింగ్ నోడల్ అధికారి రమేశ్‌బాబు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు


