హత్యల పరంపర..
మార్పునకు చర్యలు
తీసుకుంటాం
నడిగడ్డలో 11 నెలల్లో 9 హత్యలు
–8లో u
●
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు.. వ్యాపారుల మధ్య వైరం.. భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు.. ఇలా కారణం ఏదైనా సదరు వ్యక్తులను అడ్డుతొలగించుకునేందుకు వెనకాడడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన సుపారీగ్యాంగ్‌లతో చేతులు కలిపి సొంతవారిని హత్య చేయించే విష సంస్కృతికి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. జిల్లాలో గడచిన 11 నెలల వ్యవధిలో 9 హత్యలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస హత్యలు జిల్లాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి.
ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సమస్య ఏదైనా చర్చించి సామరస్యంగా పరిష్కరించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాడులు, హత్యలకు పాల్పడడం సరికాదని వివరిస్తున్నాం. ప్రజల్లో మార్పునకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో శాంతియుత వాతావారణం కల్పిస్తాం. ఎవరూ అధైరపడొద్దు. విపత్కర కేసుల ఛేదనలో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి ప్రజలు పోలీసు వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో చెదరని ముద్ర వేయాలనే ధృఢ సంకల్పంతో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
– శ్రీనివాసరావు, ఎస్పీ


