‘తుది’ పోరుకు సై..
● 563 సర్పంచ్..
5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు
● ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్
● 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
● ఉదయం 7 గంటలకు
ఓటింగ్ ప్రారంభం
ఉండవెల్లి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న
ఎన్నికల
సిబ్బంది
నేడు చివరి విడత సం‘గ్రామం’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు.
ఇటిక్యాల నుంచి
ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది
‘తుది’ పోరుకు సై..
‘తుది’ పోరుకు సై..


