నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీయోగా నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు తిరుప్పావై పఠనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు, విష్ణు సహస్త్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న శ్రీ భూనీలా సమేత యోగా నరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
టీ–20 క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక
గద్వాలన్యూటౌన్: హెచ్‌సీఏ ఆద్వర్యంలో నిర్వహించే జి. వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నీ పాల్గొనే జిల్లా జట్టును మంగళవారం స్థానిక స్టేడియంలో ఎండీసీఏ, జీసీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల జట్లతో జిల్లా జట్టు ఆడనుంది. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మ డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జీసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రకుమార్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశ్, ఖలీమ్ పాల్గొన్నారు.
విద్యార్థిని కొట్టాడని..
● హెచ్‌ఎంతో గ్రామస్తుల వాగ్వాదం
అయిజ: మండలంలోని ఎక్లాస్‌పురం ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం బాబు ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు హెచ్‌ఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని పాఠశాల హెచ్‌ఎం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా.. హెచ్‌ఎం బాబుకు షోకాజు నోటీసు జారీ చేస్తామని, సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.7,978
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 318 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 7,978, కనిష్టంగా రూ. 4,576, సరాసరి రూ. 5,670 ధరలు లభించాయి. అదే విధంగా 19 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,960, కనిష్టంగా రూ. 5,730, సరాసరి రూ. 5810 ధరలు వచ్చాయి. 507 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,769, కనిష్టంగా రూ. 1,802, సరాసరి ధర రూ. 2,769 పలికింది. 30 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,673, కనిష్టంగా రూ. 6,129, సరాసరి రూ. 6,129 ధరలు లభించాయి.
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు ని ర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్‌చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యా యామ ఉపాధ్యాయులు సాదత్‌ఖాన్, బాల్‌రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్‌అలీ, ఎండీ ఉస్మాన్ పాల్గొన్నారు.
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు


