అర్ధరాత్రి వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియ
అలంపూర్: నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మూడో రోజు కావడంతో అటు సర్పంచ్, ఇటు వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వేచి ఉండగా.. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఏఏ కేంద్రాల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయనే విషయం ఒకటిరెండు చోట్ల తప్ప మిగిలిన కేంద్రాల వద్ద అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అందించేందుకు సాధ్యపడలేదు.
చివరి రోజు కావడంతో
భారీగా దాఖలు
అర్ధరాత్రి వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియ


