సమష్టి కృషితోనే విజయం
అలంపూర్: మూడో విడతలో బీఆర్‌ఎస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌లు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని గురువారం కలిశారు. కర్నూల్‌లోని ఆయన నివాసంలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌లు, నాయకులు మద్దతుదారులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ నూతన సర్పంచ్‌లను సన్మానించారు. క్షేత్ర స్థాయిలో అందరి సమష్టి కృషితోనే బీఆర్‌ఎస్ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసిన ఓటర్లు తమ ఓటుతో సర్పంచ్‌లను గెలిపించి మద్దతుగా నిలిచారన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీన కలిసిన వారిలో ఆయా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు.


