దళితుల అభ్యున్నతికి కృషి
గద్వాలటౌన్: దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని ఎన్టీయే ప్రభు త్వం పని చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ మహా విద్యా వేత్త అని, విద్యను ప్రచారం చేయడం కోసం ఎంతో కృషి చేశారన్నారు.
● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నర్సింహ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ వర్థంతి వేడుకలలో పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,224
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 213 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8,224, కనిష్టం రూ.4,700, సరాసరి రూ.6789 ధరలు లభించాయి. అలాగే, 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5907, కనిష్టం రూ.5250, సరాసరి రూ.5907 ధరలు పలికాయి.


