‘కంది’పోయిన రైతు | - | Sakshi
Sakshi News home page

‘కంది’పోయిన రైతు

Dec 25 2025 8:25 AM | Updated on Dec 25 2025 8:25 AM

‘కంది

‘కంది’పోయిన రైతు

తెగుళ్లతో దిగుబడి తగ్గింది

సూచనలు చేశాం

చీడపీడలతో తగ్గనున్న దిగుబడులు

రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయిన

కంది రైతు

–8లో u

గద్వాల వ్యవసాయం: ఈ ఏడాది సైతం కంది పంట రైతులను నిరాశ పర్చింది. 2023–24లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో, 2024–25లో వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది 2025–26 వానాకాలంలో ఇష్టంగా సాగు చేసిన ఈపంటకు పూత, గింజ దశలో చీడపీడలు ఆశించి పంటపై ప్రబావాన్ని చూపడం వల్ల ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలాఉండగా, ఆహార పంట అయిన కంది పప్పుకు మార్కెట్‌లో ఎప్పుడు డిమాండ్‌తో మంచి ధరలు ఉంటాయి. కంది పంటను ఈ ప్రాంత రైతులు చాలా ఇష్టంగా సాగు చేస్తారు. వర్షాలు కొంత మేర వచ్చినా.. చలితో పంట బాగా వస్తుందని సాగు చేస్తుంటారు. కంది పంట సాగు చేయడానికి ఎకరాకు రూ.18వేల నుంచి 20వేల వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలలు పంట కాలం. వాతావరణం సహకరిస్తే నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు, వర్షాదారం కింద అయితే ఎకరాకు 3నుంచి 5 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తుంది.

అనుకూలించని వాతావరణం.. నష్టం

జిల్లాలో 2023–24 వానాకాలం సీజన్‌లో కంది పంటను 22,503 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో వర్షాధారం కింద, నీటి లభ్యత ఉన్న రెండు చోట్ల వేశారు. ఈ సీజన్‌లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలంలో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉండింది. ఇలా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా వర్షాధారం కింద ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, కేవలం రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాతో 2024–25లో 41,235 ఎకరాల్లో కంది సాగు చేశారు. వర్షాలు బాగా కురిశాయి. దీంతో కంది మొక్కలు బాగా ఏపుగా పెరిగాయి. అయితే అక్టోబర్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు, పూత దశలో ముసురు వర్షాలు రావడం వల్ల పూతకు తెగుళ్లు, నల్లి, దోమ ఆశించాయి. దీంతో వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు నీటి లభ్యత ఉన్న చోట 6 నుంచి 7 క్వింటాళ్లు వచ్చాయి. ఇలా గడిచిన రెండు సీజన్‌లలో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోయారు.

ఈ ఏడాది సైతం తగ్గిన దగుబడులు

గడిచిన రెండేళ్ల నష్టాన్ని దిగమింగుకొని ఈఏడాది గంపెడు ఆశతో జిల్లా వ్యాప్తంగా 23,484 ఎకరాల్లో కంది పంట వేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అధిక వర్షాలు కొంత ప్రభావాన్ని చూపాయి. అక్టోబర్‌ నవంబర్‌ నెలల్లో పూత దశలో మోడాలు, వర్షాలకు పూతలు రాలాయి. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఇక గింజ దశలో కాయతొలుచు, పచ్చ పురుగులు ఆశించాయి. రూ.వేలకు వేలు మందులకు ఖర్చు చేసినా పురుగు ఉధృతి కొనసాగింది. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట కోతలు ఆరంభం అయ్యాయి. చాలా చోట్ల వచ్చే నెలలో కోతలు ఉంటాయి. కాగా గింజలను బట్టి పంట దిగుబడులు తగ్గినట్లు అంచనాకు వచ్చామని రైతులు అంటున్నారు. వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందనిఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లు నష్టాలు వచ్చాయని, ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గి ఆర్థికంగా కోలుకోలేకున్నామని వాపోతున్నారు.

ఈ ఏడాది 5ఎకరాల్లో కంది పంట వేశాను. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఆరు సార్లు మందులు కొట్టాను. రూ.వేలకు వేలు ఖర్చు అయ్యింది. కానీ, దిగుబడి మాత్రం తగ్గింది. ఐదు ఎకరాలకు కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.

– సూరి, కంది రైతు,

శెట్టిఆత్మకూర్‌, గద్వాల మండలం

ఈసారి వానాకాలం సీజన్‌లో వేసిన కంది పంట ఆరంభంలో బాగా వచ్చింది. అయితే అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పూత దశలో పురుగు, తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణ కోసం రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశాం. దిగుబడులు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నాం. – సక్రియానాయక్‌, డీఏఓ

‘కంది’పోయిన రైతు 1
1/3

‘కంది’పోయిన రైతు

‘కంది’పోయిన రైతు 2
2/3

‘కంది’పోయిన రైతు

‘కంది’పోయిన రైతు 3
3/3

‘కంది’పోయిన రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement