పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి.
– రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్


