మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎన్నికల పరిశీలకులు గంగాధర్‌తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల, ధరూరు, గట్టు, కేటి.దొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ సేషన్లు ర్యాండమైజేషన్‌లో భాగమైయ్యాయని, వీటికి సంబంధించిన 1,50,672 మంది ఓటర్ల డాటాను సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో మొత్తం 974పోలింగ్ కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాలకు చెందినందున మిగతా పోలింగ్ స్టేషన్లకు కావాల్సిన సిబ్బంది టీంల కేటాయింపు పూర్తి చేయబడిదని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఇద్దరు సభ్యులతో కూడిన 601టీములు, ముగ్గురు సభ్యులతో కూడిన 238 టీములు మొత్తం 839పోలింగ్ టీములు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిమండలంలోని పోలింగ్ సేష్టన్ల సంఖ్య, గ్రామపంచాయతీల సంఖ్య, ఓటర్ల వివరాలు, అవసమైన పోలింగ్ సిబ్బంది వంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా పోలింగ్ టీములను కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తిగా పారద్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


