‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
గద్వాలటౌన్/అలంపూర్ : ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షతో తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక విజయంగా నిలిచిన డిసెంబర్ 9వ చరిత్రలో నిలిచిపోయిందని.. ప్రజల ఆకాంక్ష సాకారానికి తొలి అడుగు అదేనని ఎమ్మెల్యే విజయుడు, బీఆర్‌ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం గద్వాల, అలంపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు విజయ్ దివస్ చేపట్టారు. ముందుగా అలంపూర్‌లో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలతో అభిషేకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. రాష్ట్ర సాధనే ధ్యైయంగా 11 రోజులు అమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజుగా కొనియాడారు. కేసీఆర్ కఠోర దీక్షతో కదిలిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేస్తు రాష్ట్ర సాధనకు ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అందుకే ఈ రోజు రాష్ట్ర సాధనలో చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కిషోర్, రఘు రెడ్డి, దేవన్న, భాస్కర్ రెడ్డి, లోకారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళాలర్పించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిండని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కొండంత రాగం తీసిన సీఎం.. బీఆర్‌ఎస్ హయాంలో అమలు చేసిన 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఊడగొట్టారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, యూసుఫ్, మోనేష్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్‌నాయుడు, మధు, జనార్థన్‌రెడ్డి, రాజు, పల్లయ్య, ప్రేమలత, శ్రీరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి


