ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
కేటీ దొడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో సిబ్బంది అత్యంతం బాధ్యతతో తమ విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్సులు, కవర్లు, సీళ్లపై సూచనలు చేస్తు మెటీరియల్ వినియోగంపై సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అన్నారు. వారి వెంట ఎంపీడీఓ రమణరావు, జూనియర్ అసిస్టెంట్ గురునాధ్, ఆపరేటర్ ఖయ్యూం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.


