పల్లీకి డిమాండ్..
● మార్కెట్‌యార్డులో 15 రోజులుగా మంచి ధరలు
● క్వింటాకు అత్యధికంగా రూ.7500 ధర పలుకుతున్న వైనం
మంచి ధరలు
బోర్లు, బావులు, అందుబాటులో ఉన్న నీటివనరుల కింద వేరుశనగను సాగు చేశారు. అయితే దిగుబడులు ఎక్కవగా రాకున్నా గింజ గట్టిగా, లావుగా ఉంది. కాగా చేతికి వచ్చిన వేరుశనగను విక్రయానికి రైతులు గడిచిన రెండు నెలల నుంచి గద్వాల మార్కెట్‌యార్డుకు తీసుకువస్తున్నారు. బాగా ఆరబెట్టి, మట్టిపెల్లలు, దుమ్మూదూళి లేకుండా రైతులు వేరుశనగను తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో వేరుశనగ యార్డులకు రావడం లేదు. దీంతో ఇక్కడ వేరుశనగకు మంచిఽ ధరలు వస్తున్నాయి. గడిచిన రెండు నెలల నుంచి ప్రతిరోజు 800 నుంచి 1100 క్వింటాళ్ల దాక వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. సరుకు నాణ్యతగా ఉంటుండటంతో వ్యాపారస్తులు మంచి ధరలు కోడ్ చేస్తున్నారు. క్వింటాకు అత్యధికంగా రూ.7వేల నుంచి రూ.7,550 దాకా వస్తోంది. సరాసరి ధరలు కూడా రూ.5400 నుంచి రూ. 6300 వరకు వస్తున్నాయి. అక్టోబర్, నవంబర్‌తో పోల్చితే డిసెంబర్‌లో మంచి ధరలు రైతులకు లభిస్తున్నాయి. కాగా ముందస్తు యాసంగి సీజన్‌లో భాగంగా సాగు చేసిన వేరుశనగ డిసెంబర్ వరకు యార్డుకు విక్రయానికి రానుంది. మరో 20వేల నుంచి 30వేల క్వింటాళ్ల వరకు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని యార్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్‌లో ప్రస్తుతం వస్తున్న ధరల కన్నా ఇంకా కాస్త ఎక్కువ వస్తాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
గద్వాల వ్యవసాయం: పల్లీకి డిమాండ్ బాగా వస్తోంది. నడిగడ్డలోని రైతులు యాసంగి సీజన్‌కు ముందుగా వేరుశనగ వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన 50 రోజుల నుంచి గద్వాల మార్కెట్‌యార్డుకు తీసుకువస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు యార్డులో మంచి ధరలు లభిస్తున్నాయి.
50 రోజులుగా యార్డుకు ధాన్యం..
సాధారణంగా వంటనూనెలకు మార్కెట్‌లో ఽమంచి ఽడిమాండ్ ఉండటంతో పాటు ధరలు స్థిరంగా ఉంటాయి. ఇలా ధరలు బాగా ఉండటంతో పాటు గద్వాల ప్రాంతం నుంచి చైన్నె, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఏటా వేరుశనగ ఎగుమతి అవుతుంది. వ్యాపారస్తులు ఇక్కడ వేరుశనగను కొనుగోలు చేసి ఇక్కడే విక్రయించడంతో పాటు ఎగుమతి చేస్తుంటారు. నడిగడ్డలో వేరుశనగ పంటను ఇక్కడి రైతులు ఏటా మూడుసార్లు సాగు చేస్తారు. బోర్లు, బావులతో పాటు ఇతర నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగను మూడు సార్లు వేస్తున్నారు. వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్‌లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే బాగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెస్టెంబర్‌లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో భాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట గడిచిన యాభై రోజులుగా యార్డుకు వస్తోంది.
నాణ్యతగా తీసుకురావాలి
గద్వాల ప్రాంతంలో వేరుశనగను ఏటా మూడు సార్లు సాగు చేస్తారు. ప్రస్తుతం యార్డుకు వస్తున్న వేరుశనగ నాణ్యతతో వస్తోంది. దీనివల్ల వ్యాపారస్తులు మంచి ధరలు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతులు వేరుశనగను బాగా ఆరబెట్టి, మట్టి పెళ్లలు లేకుండా తీసుకొస్తే ధరలు బాగా వస్తాయి.
– నర్సింహ్మ, గద్వాల మార్కెట్ యార్డ్ కార్యదర్శి
●
వేరుశనగ కాంటా వేస్తున్న హమాలీలు
జిల్లాలో వేరుశనగ ధరల వివరాలిలా..
పల్లీకి డిమాండ్..


