పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి ఎన్.ప్రేమలత అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ కేసులు, రాజీ అయ్యే కేసుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 21న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌లో రాజీ కాదగిన కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సివిల్, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, చెక్‌బౌన్స్ తదితర కేసుల వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు లక్ష్మి, ఎన్‌వీహెచ్ పూజిత, ఉదయ్‌నాయక్, ఏఎస్పీ శంకర్ ఉన్నారు.


