హోంగార్డుల సేవలు కీలకం
గద్వాల క్రైం: పోలీసుశాఖలో హాంగార్డుల సేవలు ఎంతో కీలకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సేవా స్ఫూర్తితో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ విభాగలైన ట్రాఫిక్, పెట్రోలింగ్, డ్రైవింగ్ సేవలు చేస్తు పోలీసుశాఖకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. హోంగార్డు సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ తదితరులు ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి
ఎర్రవల్లి: హోంగార్డ్స్ భవిష్యత్తులో తమ నైపుణ్యం పెంపొందించుకొని శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం బీచుపల్లి పదో బెటాలియన్‌లో హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించగా కమాండెంట్ హాజరై సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ చూపుతున్న సేవలు, వినమ్రత క్రమశిక్షణ నిబద్దతకు నిదర్శనమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో, పండుగలు, ప్రజాకార్యక్రమాలు, ప్రమాదాలు, రక్షణ చర్యలు, మొదలైన కీలక సమయాల్లో ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న హోంగార్డ్స్, పోలీస్‌శాఖకు బలమైన తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. అనంతరం బెటాలియన్‌లో వివిద విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన హోంగార్డ్స్ శ్రీకాంత్, ధనుంజయ్, అశోక్ లకు అభినందించి వారికి కమాండెంట్ జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, రిజర్వ్ ఇన్సె ్ఫక్టర్లు ధర్మారావు, నర్సింహారాజు, ఆర్పీసింగ్, రాజేశం, సిబ్బంది ఉన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో
జడ్జి పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించగా, అర్చకులు, చైర్మన్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను అందజేశారు. వారి వెంట పట్వారి అరవిందరావు, మధుసూధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు సిబ్బంది తదితరులు ఉన్నారు.
హోంగార్డుల సేవలు కీలకం


