కూల్‌గా దోపిడీ..!
మద్యం షాపులే టార్గెట్‌గా అ(న)ధికార దందా
రూ.2 వేల నుంచి రూ.4 వేలు..
వైన్స్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలలో నిబంధనల ప్రకారం మద్యం ప్రియులు నిల్చొనే మందు తాగి వెళ్లాలి. ఇలా అయితే తగిన ఆదాయం సమకూరదని పర్మిట్ రూంలలో సిట్టింగ్‌లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏటేటా జిల్లాలకు మద్యం అమ్మకాల లక్ష్యం పెంచుతున్న క్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పర్మిట్ రూంల పక్కనే కూల్ పాయింట్లు (స్నాక్స్, నీళ్లు, గ్లాసులు, కూల్ డ్రింక్‌లు అమ్మేవి) తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కూల్ పాయింట్లను కొన్ని చోట్ల మద్యం షాపుల యజమానులే నడిపిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పలువురికి అప్పగించి నడిపిస్తున్నారు. ఇతరులు నడిపిస్తున్న వాటికి సంబంధించి ప్రాంతం, గిరాకీని బట్టి కూల్ పాయింట్ల నిర్వాహకులు రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలను మద్యం దుకాణాల యజమానులకు చెల్లిస్తున్నారు.
వాటిపై కన్ను.. వెంటాడి దారికి..
మద్యం షాపులకు దీటుగా కూల్ పాయింట్ల వ్యాపారం నడుస్తుండడంతో పలువురు రాజకీయ నేతల కన్ను వాటిపై పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల యజమానులతో పలువురు నాయకులు వేర్వేరుగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూల్ పాయింట్లను తమ అనుచరులు, ముఖ్య నాయకులకు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమా చారం. ఈ క్రమంలో మాట వినని వారిపై పరోక్షంగా వేధింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
కొందరు అలా.. మరి కొందరు ఇలా..
కూల్ పాయింట్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఐదారుగురు ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నట్లు సమాచారం. తమ ముఖ్య అనుచరులకు ఇవ్వాలని కోరిన పలువురు నేతలు.. రోజు వారీగా చెల్లించే దానిలో గతం కంటే కొంత తక్కువగా ఇస్తారని.. రెండు, మూడు నెలల తర్వాత వారు కరెక్ట్‌గా ఇస్తేనే ఉంచుకోవాలని సూచించారు. కరెక్ట్‌గా ఇవ్వకున్నా, సరిగ్గా నడవకున్నా.. వారిని తీసేయొచ్చని చెప్పారు. ఇలాంటి చోట్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరైతే కూల్‌పాయింట్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వరు అని చెప్పడం.. మాట వినని మద్యం షాపుల యజమానులపై ఒత్తిళ్లు పెంచడంతో వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలు సైతం ఆ నాయకులకే మద్దతు పలకడంతో మద్యం షాపుల యజమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
చిచ్చు.. దుమారం..
మరో వైపు కూల్ పాయింట్ల వ్యవహారం పలు ప్రాంతాల్లో ‘అధికార’ నాయకుల మధ్య చిచ్చు రాజేసినట్లు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తమకు అవకాశం ఇవ్వకుండా కొందరికే అప్పగించేలా నేతలు చొరవ చూపడం వారిని నొప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అన్ని సర్దుకోగా.. కూలింగ్ పాయింట్లను దక్కించుకున్న వారు వేరే వారికి నెలకు కొంత మొత్తం చొప్పున చెల్లించేలా వారితో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా దుమారం చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే వేధింపులపై ఒకరిద్దరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా.. ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కూలింగ్ పాయింట్లపైపలువురు నాయకుల నజర్
తమ ముఖ్య అనుచరులకు ఇచ్చేలా పావులు
కొన్ని చోట్ల రోజు వారీ చెల్లింపులు ఎగవేసేలా యత్నాలు?
ఒత్తిళ్లతో వైన్స్ దుకాణాల ఓనర్లలో ఆందోళన
పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులపై ఆగ్రహం
కూల్‌గా దోపిడీ..!
కూల్‌గా దోపిడీ..!


