విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ధరూరు: వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి నుషిత అన్నారు. శనివారం మండలంలోని ఉప్పేరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూం, సరుకులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహార నాణ్యత, షానిటేషన్, బాత్‌రూంల శ్రుభ్రత తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల చదువు ప్రగతి, ట్యూటర్ల బోధనా విధానం, అధ్యయన సమయం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.


