భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటేత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులు దాసంగాలు సిద్ధం చేసి స్వామివారికి సమర్పించగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, అరవిందరావు, నాయకులు మధుసూధన్‌రెడ్డి, నరేందర్ , వీరారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిరీష, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసు, చంద్రశేఖర్‌రావు భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం


